మహేశ్‌ సినిమాలో..? | R Madhavan joins SS Rajamouli and Mahesh Babu SSMB29 | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సినిమాలో..?

Jun 8 2025 4:08 AM | Updated on Jun 8 2025 4:08 AM

R Madhavan joins SS Rajamouli and Mahesh Babu SSMB29

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్‌లోకి మాధవన్‌ కూడా చేరినట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్‌.  ఈ మేరకు మాధవన్‌తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.

మరి... ఈ చిత్రంలో మాధవన్‌ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ ఈ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తోపాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో నిర్మిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్‌ ఫిల్మ్‌ అని టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement