కన్నడలో బిగ్‌బాస్ సీజన్ 11 (Kannada Bigg Boss 11) ముగిసింది. మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్‌లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగారు. జనవరి 26న బిగ్‌బాస్ ఫైనల్ ముగిసింది. దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది.
బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హనుమంత(Hanumantha) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు.
సంగీతంతో పరిచయం లేకుండానే 2018 సారిగమప కన్నడ 15వ సీజన్‍లో హనుమంత రన్నరప్‌గా నిలిచాడు. దీంతో చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్‍తోనూ మెప్పించాడు. ఈ గుర్తింపుతో బిగ్‍బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా 21వ రోజున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరకు కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విజేతగా నిలిచాడు.
ప్రైజ్‌మనీ ఎంత..?
ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు. అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా.. రన్నరప్‍గా త్రివిక్రమ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు. విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.
ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!
ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm— Colors Kannada (@ColorsKannada) January 26, 2025
Comments
Please login to add a commentAdd a comment