బిగ్‌ ఫైట్‌.. కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' కూడా ఆ రోజే విడుదల | Kiccha Sudeep Max Movie Release Date Locked, Announcement Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

బిగ్‌ ఫైట్‌.. కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' కూడా ఆ రోజే విడుదల

Published Sat, Nov 30 2024 9:36 AM | Last Updated on Sat, Nov 30 2024 10:21 AM

Kiccha Sudeep Max Movie Release Date Locked

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.

'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు  హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. క్రిస్మస్‌ రేసులు ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్‌ కూడా రానున్నడంతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement