హీరోగా 'ఈగ' విలన్‌ సుదీప్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. | Kiccha Sudeep K3 Kotikokkadu Going To Release Soon | Sakshi
Sakshi News home page

Kiccha Sudeep: హీరోగా 'ఈగ' విలన్‌ సుదీప్‌ టాలీవుడ్‌ ఎంట్రీ..

Published Mon, Jan 31 2022 10:34 AM | Last Updated on Mon, Jan 31 2022 10:42 AM

Kiccha Sudeep K3 Kotikokkadu Going To Release Soon - Sakshi

‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ ‘కే3 కోటికొక్కడు’ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కే3’. శివ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో గుడ్‌ సినిమా గ్రూప్‌పై ‘కే3 కోటికొక్కడు’ పేరుతో శ్రేయాస్‌ శ్రీనివాస్, దేవేంద్ర డీకే ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సుదీప్‌ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్‌–సుదీప్‌ జోడి చూడముచ్చటగా ఉంది. ‘కే3’ చిత్రం కన్నడలో తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్లు వసూలు చేసి సుదీప్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌ చంద్ర, సంగీతం: అర్జున్‌ జెన్యా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement