
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది.