తమిళ సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని 'తమిళగ వెట్రిక్కళగం'లో సభ్యులుగా చేరేందుకు రాష్ట్రంలోని యువకులు పోటీ పడ్డారు. ఆయన పిలుపు ఇచ్చిన 24 గంటల్లోనే 50 లక్షల మందికి పైగా సభ్యులుగా పేర్లను నమోదు చేసుకున్నారు. సభ్యత్వం పొందినవారిలో యాభైశాతానికి పైగా యువతీయువుకులే ఉన్నారని సమాచారం.
ఈ సందర్భంలో, ప్రముఖ నటుడు నాజర్ కుమారుడు 'నూరుల్ హసన్ ఫైజల్' విజయ్ పార్టీలో చేరారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విజయ్ సార్ అంటే ఎనలేని అభిమానంతో పార్టీలో చేరినట్లు ఆయన అమ్మగారు 'కెమిలా' ఈ సందర్బంగా చెప్పారు.
ఈ క్రమంలో విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆమె ఇలా గుర్తుచేసుకున్నారు. 'నా కుమారుడు చిన్నప్పటి నుంచి విజయ్ సార్‌ను అభిమానిస్తాడు. కొన్నాళ్ల క్రితం అతను యాక్సిడెంట్‌కి గురి కావడంతో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం మమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు. కానీ విజయ్ సార్‌ని మాత్రమే ఆ సమయంలో గుర్తుపట్టాడు. ఆ తర్వాత విజయ్ సార్ మా ఇంటికి వచ్చి ఆయన్ను ఓదార్చారు.' అని నాజర్ సతీమణి గుర్తుచేసుకున్నారు.
ఈరోజు తమ కుమారుడు ఇలా ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం విజయ్ అంటూ నాజర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. విజయ్ పార్టీ పెట్టి తన అభిమానులకు పిలుపు ఇవ్వడంతో వెంటనే తమ కుమారుడు ఫైజల్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు ఆయన అన్నారు. విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రస్తుత వాతావరణంలో మార్పు రావాలని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment