బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 రోజులే గడువున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ హీరో కిచ్చ సుదీప్‌తో బీజేపీ జోరుగా ప్రచారం చేయించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అలాగే మరో సీనియర్ హీరో దర్శన్‌తో కూడా ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది. ఇద్దరి హీరోల జనాకర్షణతో మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది.
అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సెటైర్లు వేశారు. వారు బీజేపీలో చేరలేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారని గుర్తు చేశారు. వీరిద్దరి వల్ల కమలం పార్టీకి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని మరోసారి స్పష్టం చేశారు.
కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. తాము మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుండగా.. ఈసారి 150పైగా స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ బలంగా చెబుతోంది.
#WATCH | BJP star campaigner, Actor Kichcha Sudeepa holds a roadshow in Hubli-Dharwad Central Assembly constituency, ahead of the upcoming Karnataka elections on 10th May#KarnatakaElections pic.twitter.com/NspKhG3ilo
— ANI (@ANI) April 28, 2023
చదవండి: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే
Comments
Please login to add a commentAdd a comment