సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ఆపరేషన్ హస్తం చేపట్టి బీజేపీ, జేడీఎస్‌లలోని బలమైన నేతలను చేర్చుకుని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ హస్తం తలుపు తట్టకపోవడంతో కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు అన్ని అవకాశాల్ని వాడుకుంటున్నారు.
శనివారం రాత్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్, రాజుగౌడ, మరికొందరితో చర్చలు జరిపారు. ప్రముఖ నటుడు నటుడు కిచ్చ సుదీప్ ఒక హోటల్లో జరిపిన పుట్టిన రోజు విందు ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు హాజరైన బీజేపీ నాయకులతో డీకే మాటలు కలిపినట్లు సమాచారం.
నేను బీజేపీని వీడను: రాజుగౌడ
ఆపరేషన్ హస్తం చేసేందుకు నాకు క్యాన్సర్ గడ్డ ఏమీ లేదు, నాకు బీజేపీలో సరైన స్థానం ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, అయినా పార్టీనీ వీడను అని రాజుగౌడ చెప్పారు. నియోజకవర్గంలో మంచి పనులు చేపట్టినా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారని డీకే అడిగారు. సుదీప్ పుట్టినరోజు కంటే శివకుమార్‌తో మేము మాట్లాడిందే పెద్ద వార్త అయ్యింది అని చమత్కరించారు.
చదవండి: అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ
Comments
Please login to add a commentAdd a comment