
దొడ్డబళ్లాపురం: కనకపురలో హిస్టరీ రిపీట్ అయ్యింది. ప్రజలు బీజేపీ దిమ్మతిరిగేలా ఫలితాలు ఇచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లక్ష ఓట్ల మెజారిటీతో ఆర్ అశోక్‌పై విజయం సాధించారు. కనకపురలో డీకే శివకుమార్‌కు చెక్ పెట్టాలని భావించిన బీజేపీ ఆర్ అశోక్‌ను పోటీలో దించింది.
అయితే ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. డీకే శివకుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. కనకపుర డీకే బ్రదర్స్‌కు కంచుకోట అని మరోసారి రుజువు చేసారు.