బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 6 ముఖ్య హామీలు
1. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
2. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రూ.2,000
3. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా రూ.10 కేజీల చొప్పున బియ్యం
4. నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల రూ.3,000 నిరుద్యోగ భృతి
5. డిప్లోమా పూర్తి చేసి నిరుద్యోలుగా ఉన్న యువతకు యువ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ.1500. 18-25 ఏళ్ల మధ్య వయస్కులకే ఇది వర్తిస్తుంది.
6. శక్తి పథకం కింద మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆదిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 67, జేడీఎఎస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
చదవండి: కర్ణాటకలో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్..
Comments
Please login to add a commentAdd a comment