Kiccha Sudeep Reacts To Rashmika Mandanna Trolling Over Her Comments On Kantara Movie - Sakshi
Sakshi News home page

Kiccha Sudeep: రష్మికపై విమర్శలు.. టమాటాలు, రాళ్లు కూడా విసురుతారన్న హీరో

Published Wed, Jan 4 2023 3:25 PM | Last Updated on Wed, Jan 4 2023 5:18 PM

Kiccha Sudeep Reacts on Rashmika Mandanna Trolling: There will be Stones Coming at You - Sakshi

రష్మిక మందన్నాను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం కిరిక్‌ పార్టీ. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వరుస అవకాశాలు రావడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదగడం చకచకా జరిగిపోయాయి. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిన రష్మిక ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే! కిరిక్‌ పార్టీ దర్శకుడు రిషబ్‌ శెట్టి నటించిన కాంతార సినిమా చూడలేదని అనడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీకు లైఫ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సినిమా దేశమంతా చూస్తే నువ్వొక్కదానివే చూడలేదని చెబుతున్నావని, నీకు గర్వం తలకెక్కిందని విరుచుకుపడ్డారు.

రష్మిక మందన్నాపై జరిగిన ట్రోలింగ్‌పై కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ స్పందించాడు. కొన్నింటిని మనం మార్చలేం. ఇప్పుడంటే సోషల్‌ మీడియా వచ్చింది. దీనివల్ల ఏ చిన్న విషయమైనా దావానంలా వ్యాపిస్తోంది. కానీ 15-20 ఏళ్ల క్రితం కేవలం టీవీలోనే ఇంటర్వ్యూలు వచ్చేవి. ఇంకా వెనక్కి వెళ్తే దూరదర్శన్‌, వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. అప్పుడూ సెలబ్రిటీల గురించి రాసేవాళ్లు. సెలబ్రిటీలన్నాక ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. మనం వాటిని ఎలా హ్యాండిల్‌ చేయాలన్నది నేర్చుకోవాలి. అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్లిపోవాలి. ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చిందంటే నీకు పూలదండలు వేస్తారు. అదే చేత్తో టమాటలు, గుడ్లు, రాళ్లు కూడా విసురుతారు అని చెప్పుకొచ్చాడు.

చదవండి: బిగ్‌బాస్‌ 6కు దారుణమైన రేటింగ్‌, అన్ని సీజన్ల కంటే తక్కువ
సమంతను కాపాడుకుంటా: రష్మిక ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement