
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్.. తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.
అయితే ఇదంతా చేసింది సుదీప్ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment