Car Driver
-
బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ ఈ కార్ డ్రైవర్
-
నిద్రమత్తు ముగ్గురిని బలిగొంది..
ద్వారకాతిరుమల: కారు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని నాగార్జున హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అతని భార్య భాగ్యశ్రీ (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల ఆరో తేదీన భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులు బొమ్మా నారాయణరావు, కమలాదేవి (57)తో పాటు, తన ఇద్దరు పిల్లలు నాగనితిన్ కుమార్ (4), నాగషణ్ముఖను తీసుకుని కిరాయి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటర్వ్యూ ముగించుకుని ఏడో తేదీ రాత్రి స్వగ్రామానికి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణరావు విజయవాడలో కారు దిగి, భీమవరానికి వెళ్లిపోగా, మిగిలినవారు రాజవోలుకు బయలుదేరారు.అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్ దుర్గా వంశీ నిద్రమత్తులో రోడ్డు పక్కన నిలిపివున్న కంటైనర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో భాగ్యశ్రీ,, ఆమె తల్లి కమలాదేవి, ఆమె చిన్న కుమారుడు నాగనితిన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పెద్ద కుమారుడు నాగషణ్ముఖ, డ్రైవర్ దీవి వంశీకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి ఘటనాస్థలిని పరిశీలించారు. భీమడోలు సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ జి.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
మాజీ డ్రైవరే హంతకుడు
బనశంకరి: బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ (40) హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. చామరాజనగర జిల్లా మహదేశ్వరబెట్టలో దాగిన అతన్ని బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీసులు గాలించి నిర్బంధించారు. ఉద్యోగం నుంచి తీసేశారనే ద్వేషంతో ఆమె మాజీ కారుడ్రైవరు కిరణ్ ఈ హత్యకు పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు. కిరణ్ (32) స్వస్థలం బెంగళూరు కోణనకుంటె. కొన్ని సంవత్సరాలుగా ప్రతిమ ఆఫీస్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల కిందట ఒక యాక్సిడెంట్ చేయడంతో పాటు అక్రమ గనులపై దాడుల సమాచారం ముందుగానే గనుల యజమానులకు లీక్ చేసేవాడు. దీంతో ప్రతిమ అతడిని 10 రోజుల కిందటే ఉద్యోగం నుంచి తీసేయించారు. -
ఆ కక్షతోనే మహిళా అధికారిని డ్రైవర్ హత్య చేశాడా..?
బెంగళూరు: కర్ణాటకా అధికారి కేఎస్ ప్రతిమ(43) హత్య కేసులో అమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పనిలో నుంచి తీసేసిన కక్షతోనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు నేరాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం. నిందితుడు కిరణ్ గత ఐదేళ్లుగా గవర్నమెంట్ కాంటాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారి ప్రతిమ గత పది రోజుల క్రిందటే కిరణ్‌ను విధుల నుంచి తప్పించారని వెల్లడించారు. అతని స్థానంలో మరో ఉద్యోగిని నియమించుకున్నట్లు తెలిపిన పోలీసులు.. ఈ కక్షతోనే నిందితుడు ప్రతిమను హత్య చేశారని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం బెంగళూరు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పారిపోయినట్లు గుర్తించారు. కర్ణాటకాలో గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న కేఎస్ ప్రతిమ(43) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణ హత్య జరిగింది. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కార్యాలయం నుంచి ఇంటికి ప్రతిమను కారులో డ్రైవరు డ్రాప్ చేసి వెళ్లాడు. కాసేపటికే ప్రతిమపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య -
కారుడ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో 9 వేల కోట్లు
సాక్షి, చైన్నె : ఓ ప్రైవేటు బ్యాంకు సిబ్బంది పొరబాటు, సాంకేతిక సమస్యతో ఓ కారు డ్రైవర్ 34 నిమిషాల పాటు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇందులో రూ.21 వేలను తన మిత్రుడి ఖాతాలోకి ఆ డ్రైవర్ బదిలీ కూడా చేశారు. చివరకు పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసుకున్నారు. గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిండుగల్ జిల్లా పళణి సమీపంలోని నైకారన్ పట్టికి చెందిన రాజ్‌కుమార్(28) డిప్లొమో ఇంజినీర్. ప్రస్తుతం చైన్నెలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడంబాక్కంలో బస చేసి ఉన్న రాజ్‌కుమార్‌కు పళణిలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇందులో కేవలం రూ. 105 బ్యాలెన్స్ పెట్టి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం అతడి బ్యాంక్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసినట్టుగా సెల్ నెంబర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్తో షాక్‌కు గురయ్యాడు. ఇది ఫేక్ మెసేజ్‌గా ఉంటుందని భావించి, తన మిత్రుడి దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణం ఈ ఎస్ఎంఎస్ నిజమో కాదో తేల్చుకుందామని తన మిత్రుడి ఖాతాలోకి తన ఖాతా నుంచి తొలుత రూ. 1000, ఆ తర్వాత రూ.20 వేలు బదిలీ చేశాడు. మిత్రుడి ఖాతాలోకి రూ. 21 వేలు బదిలీ కావడంతో రాజ్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. తాను కోటీశ్వరుడైనంత ఆనందంలో మునిగి పోయాడు. ఆనందం ఆవిరి.. ఆనందంలో ఉన్న రాజ్‌కుమార్‌కు ఆ ఎస్ఎంఎస్ వచ్చిన 34వ నిమిషంలో ఖాతాలో ఉన్న నగదు మాయమైంది. తమ పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, రాజ్‌కుమార్ మరో ఖాతాకు బదిలీ చేసిన రూ. 21 వేల రాబట్టే ప్రయత్నం మొదలెట్టారు. పట్టభద్రుడైన రాజ్‌కుమార్ తనకు అన్ని వ్యవహారాలు తెలుసని పేర్కొంటూ ఎదురు తిరిగాడు. తన ప్రమేయం లేకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా తన ఖాతా నుంచి ఎలా నగదు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించడం మొదలెట్టాడు. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో బ్యాంకర్ల కాళ్ల బేరానికి వచ్చి, అతడ్ని బుజ్జగించి చైన్నె టీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి రప్పించారు. తర్వాత అతడి మిత్రుడి ఖాతాలో జమ చేసిన రూ. 21 వేలను బ్యాంకర్లు వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా రాజ్‌కుమార్‌కు సొంతంగా కారు కొనుకున్నేందుకు రుణం ఇస్తామన్న ఆఫర్‌ను అధికారులు ఉంచడం గమనార్హం. ఈ వ్యవహారం తాజాగా మీడియాలో రావడంతో రూ.9 వేల కోట్ల వ్యవహారంపై ఐటీ, ఈడీ వర్గాలు దృష్టి పెట్టేనా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు
నిజాంపేట్: పాత పరిచయం కాస్త..ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం..ఒకే సామాజికవర్గం. అయినా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఎందుకో ప్రియుడికి మనసొప్పలేదు. ప్రియురాలు ఒత్తిడి తేవడంతో మట్టుబెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం నెమలిగుట్టతండాకు చెందిన ప్రమీల (22) ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం బాచుపల్లి ఏరియాకు వచ్చింది. స్థానికంగా ఓ షోరూమ్‌లో పనికి కుదిరింది. భౌరంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో రెడ్డిల్యాబ్‌లో పనిచేసే స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. అదే మండలంలోని సోమరంపేట్ తండాకు చెందిన బాణావత్ తిరుపతి కొండాపూర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రమీలకు తిరుపతితో పాత పరిచయం ఉంది. ఐదారు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి సంబంధాల విషయం తెలుసుకొని.. తిరుపతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. విషయం తెలుసుకున్న ప్రమీల పెళ్లి చేసుకుందామంటూ తిరుపతిపై కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తుండగా, వాయిదా వే స్తూ వస్తున్నాడు. ఇటీవల ప్రమీల తన స్వగ్రామానికి వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి తిరిగివచ్చింది. అయితే ప్రమీల శనివారం రాత్రి 9 గంటల తర్వాత గాయాలతో రూ మ్కు వచ్చిందని ఆమె స్నేహితురాళ్లు చెప్పా రు. అయితే పెళ్లి విషయంలో తిరుపతితో గొడవ జరిగి ఉంటుందని తెలిసింది. మాట్లాడుకుందామని రమ్మంటే.... ప్రమీల ఆదివారం ఉదయం తిరుపతికి ఫోన్ చేసింది. ఎప్పుడూ కలుసుకునే బాచుపల్లి వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు రమ్మని చెప్పింది. ఉదయం పదిన్నర ప్రాంతంలో తిరుపతి అక్కడకు రాగా, ఇద్దరూ గంటన్నరకుపైగా మాట్లాడుకున్నారు. పెళ్లి విషయమై ప్రమీల ఎంత ఒత్తిడి చేసినా తిరుపతి ఒప్పుకోలేదు. నేను వెళుతున్నానంటూ తిరుపతి రోడ్డు దాటేందుకు వెళుతుండగా, ప్రమీల కూడా అతనిని అనుసరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే ఉన్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాచుపల్లి వైపు వస్తున్న ఓ ట్యాంకర్‌ను తిరుపతి గమనించాడు. ట్యాంకర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రమీలను తోసేశాడు. దీంతో ట్యాంకర్ ఢీకొని ప్రమీల అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు 108కు కాల్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. -
ఇంటి యజమానురాలితో డ్రైవర్ వివాహేతర సంబంధం...
గన్నవరం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వేరొకరితో చాటింగ్ చేస్తోందనే సంశయంతో ఆమైపె హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణాజిల్లా ముస్తాబాద శివారులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... బర్రె కిరణ్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అతను విజయవాడ మారుతీనగర్‌లోని ఓ ఇంట్లోని పెంట్ హౌస్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతను15 ఏళ్లుగా ఇంటి యజమానురాలితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఆమె అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో చాటింగ్ చేస్తుండడం, తరుచూ ఫోన్లు మాట్లాడుతుండడం గమనించిన కిరణ్ ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. దీనిలో భాగంగా బ్యాంక్‌లో పని ఉందంటూ ఆమెను నమ్మబలికి తన కారులో విజయవాడ నుంచి నున్న మీదుగా ముస్తాబాద శివారు ప్రాంతానికి తీసుకువచ్చాడు. అతని ప్లాన్‌లో భాగంగా మార్గం మధ్యలో పెట్రోల్ బంక్‌లో క్యాన్‌లో నాలుగు లీటర్ల పెట్రోల్ కూడా కొనుగోలు చేశాడు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెతో కిరణ్ కారులోనే గొడవ పడ్డాడు. ఆగ్రహానికి గురైన కిరణ్ తన వెంట తీసుకువచ్చిన కూరగాయలు కోసే చాకుతో ఆమె మెడపై పొడవబోయాడు. అప్రమత్తమైన ఆమె చేతిని అడ్డుకుని ఆతనితో పెనుగులాడింది. కారు దిగి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఎన్‌హెచ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న టిప్పరు డ్రైవర్లు గమనించారు. వెంటనే వచ్చిన వారు అతని నుంచి ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి పది నిమిషాల వ్యవధిలోని ఘటన స్థలానికి చేరుకుని కిరణ్‌ను అదుపులో తీసుకున్నారు. అప్పటికే మెడపై చాకు గాట్లతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.కనకారావు తెలిపారు. ఘటనపై ఎస్పీ పి. జాషువా సకాలంలో స్పందించి స్టేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. -
డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!
సాక్షి, హైదరాబాద్: మీరు వాహనం నడిపేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? కళ్లు తిరిగినట్లు అనిపిస్తోందా? కారు లేదా లారీ లేదా ఏదైనా వాహనాం నడిపేటప్పుడు ఒక పక్కకు వెళ్లినట్లు అనిపించిందా? మీకు తెలియకుండానే యాక్సిడెంట్ అయిపోయిందా? ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేశారా? అయినా ఏం జరిగిందో మీకు అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటే.. మీ మెదడులోని బ్యాలెన్స్ సిస్టంలో ఏదో లోపం కారణంగానే ఇలా జరుగుతూ ఉండే అవకాశముంది. దీన్నే వైద్య పరిభాషలో మోటరిస్ట్ వెస్టిబులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్ అంటారు. రోడ్డు ప్రమాదాల్లో 50% వరకు బ్రెయిన్ బ్యాలెన్స్ సిస్టంలో సమస్యల వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రైవింగ్ చేయాలంటే మన కళ్ల నుంచి మెదడు వరకు కోఆర్డినేషన్ వ్యవస్థ ఉంటుందని, అది సక్రమంగా పని చేయకపోతే బ్యాలెన్స్ తప్పుతుందని వైద్యులు అంటున్నారు. ఈ బ్యాలెన్స్ సమస్య వల్ల చాలా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయి. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు.. మలుపు తిరిగేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరత్రా కారణాలతో పాటు సాధారణంగా డ్రైవర్ మద్యం తాగి ఉంటాడనుకుంటాం. డ్రైవింగ్ సరిగా రాదని, తగిన అనుభవం లేదని అనుకుంటాం. కానీ ఇలా యాక్సిడెంట్ చేసిన వారిలో చాలా మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి ఉండొచ్చునని, బ్యాలెన్స్ సిస్టంలో సమస్య ఉందని కానీ ఎవరూ అనుకోరు. డ్రైవర్లు కూడా తమకు కళ్లు తిరిగితే నీరసం అనుకుంటారు. సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇలా జరిగిందనుకుంటారు. వాంతుల ఫీలింగ్ ఉంటే గ్యా్రస్టిక్ సమస్య అనుకుంటారు. చాలామందికి తమలో బ్యాలెన్స్ సమస్య ఉందన్న సంగతే తెలియదు. మానసిక సమస్యలు ఉన్నవారు, డిప్రెషన్, భయం ఉన్న వారిలో ఇలాంటి బ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారిలో 66% మందికి అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. 58 శాతం మంది మల్టిపుల్ లేన్స్ ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతారు. కళ్లు తిరుగుతుంటాయి. చదవండి : దత్తపుత్రుడికి ఆస్తి హక్కులుండవ్: హైకోర్టు 58% మందికి టర్నింగ్ (మలుపు తిరిగేటప్పుడు) సమయంలో సమస్య ఉత్పన్నమవుతుంది. 40 % మందికి ఇతర వాహనాన్ని చూసినప్పుడు కంగారు, కళ్లు తిరగడం వంటివి సంభవిస్తాయి. 25% మందికి బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నా, పల్లానికి వెళ్తున్నా కళ్లు తిరుగుతాయి. 29% మందికి ఓవర్టేక్ చేసేప్పుడు కళ్లు తిరుగుతాయి. 12 శాతం మందిలో ఇరుకైన సొరంగాల్లో వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పష్టత (క్లారిటీ) ఉండాలి. దాన్నే స్పేషియల్ కాగ్నెటివ్ ఎబిలిటీ అంటారు. మన కాళ్లు, చేతుల మధ్య కోఆర్డినేషన్ అవసరం. ఇందులో మన బ్రెయిన్, కొన్ని నరాలు కూడా భాగస్వామ్యం అవుతాయి. ఆప్టిక్ నర్వ్ చూడటానికి, ఆక్యులో మోటార్ నర్వ్ కళ్లు అటూ ఇటూ తిప్పి చూడడానికి సహకరిస్తాయి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మన బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ముందుకు వెళ్లాలన్నా, వెనక్కు వెళ్లాలన్నా ఇది నియంత్రిస్తుంది. స్పైనల్ యాక్సెసరీ నర్వ్ మనం మెడ అటూ ఇటూ తిప్పడాన్ని నియంత్రిస్తుంది. ఇవన్నీ కాకుండా బ్రెయిన్లో ఉన్న మోటార్ సెరిబెల్లార్ సిస్టం, ఎక్స్ట్రా పిరమిడల్ సిస్టం కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేయాలి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్ మనం నడవాలన్నా, వెనక్కు ముందుకు జరగాలన్నా.. ఇలా మొత్తం బ్యాలెన్స్‌ను నియంత్రిస్తుంది. ఈ నరంలో సమస్య ఏర్పడితే డ్రైవింగ్ చేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అలా వచ్చే సమస్యలనే మోటరిస్ట్ వెస్టిబిలో సిండ్రోమ్ అంటారు. ఇది స్కిల్డ్ డ్రైవర్లలో వచ్చే సడన్‌గా వచ్చే సమస్య. ట్రక్ డ్రైవర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. లారీ, బస్సు డ్రైవర్లలోనూ ఈ సమస్య ఉంటుంది. 79 శాతం మందిలో డిసోరియెంటేషన్ ఏర్పడుతుంది. సడన్‌గా వారు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో అర్థం కాదు. 55 శాతం మందికి కళ్లు తిరుగుతాయి. వాహనంపైనా నియంత్రణ కోల్పోతారు. 35 శాతం మందికి కారు ఒకవైపు పోతున్నట్లు అనిపిస్తుంది. 25 శాతం మందికి చెమటలు పట్టడం, కాళ్లు చేతులు చల్లగా అయిపోయి గుండె దడదడ కొట్టుకోవడం జరుగుతుంది. 25 శాతం మందికి శరీరం గట్టిగా (స్టిఫ్) అయిపోతుంది. ఇలాంటి సమస్యకు గురైన చాలామంది గుండెపోటు వచి్చందనుకొని భయపడతారు. కానీ ఈసీజీ వంటివి చేస్తే అన్నీ సాధారణంగానే ఉంటాయి. ఏం చేస్తున్నారో అర్ధం కాదు.. డ్రైవర్లకు ఎలా తోలుతున్నారు అన్నదాన్ని చూసే అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు.. కానీ వారి ఆరోగ్య పరిస్థితిని చూడరు. బ్యాలెన్స్ సిస్టంను ఎవరూ చెక్ చేయరు. అయితే మోటరిస్ట్ వెస్టిబులర్ సిండ్రోమ్‌తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడయ్యింది. మా వద్దకు ఇలాంటి వారు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. బ్యాలెన్స్ సమస్య ఉన్నవారిలో 60 శాతం మందికి మైగ్రేన్ (తలనొప్పి) సమస్య ఉన్నట్లు గుర్తించారు. 50 శాతం మందిలో వాంతి వచ్చినట్లు అవడం జరుగుతుంది. ఈ తరహా వాటన్నింటికీ చికిత్స ఉంది. న్యూరో ఆటాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పరీక్ష చేసి, పరిస్థితిని అంచనా వేసి చికిత్స చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్నింటికి మందులు ఉంటాయి. కొన్నింటికి వ్యాయామంతోనే సరిచేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30–45 వయస్సు వారిలో ఎక్కువగా ఇటువంటి సమస్యలుంటాయి. మహిళల్లోనూ ఎక్కువగా చూస్తుంటాం. – డాక్టర్ లాస్య సింధు, ఈఎన్టీ న్యూరో ఆటాలజిస్ట్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ -
కిడ్నాప్ అనుమానంతో డ్రైవర్‌పై కాల్పులు
టెక్సాస్: ఉబర్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్‌కు చెంది ఫోబె కోపాస్ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీతో డ్రైవర్ డేనియల్ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. -
కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతి
నల్గొండ: కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతిచెందిన ఘటన మండలంలోని బొజ్జగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొజ్జగూడెం గ్రామానికి చెందిన భూక్యా కోట్యా కుమార్తె వివాహం సోమవారం జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులు కారులో వెళ్తుండగా వారితో పాటు కారు వెనుక సీటులో బానోతు వెంకటేశ్వర్లు కుమార్తె ఇంద్రజ(9) కూర్చుంది. ఈ క్రమంలో ఇంద్రజ కారు డోరులోంచి తల బయట పెట్టి డ్యాన్స్ చేస్తుండగా డ్రైవర్ శేఖర్ అద్దం పైకి లేపడంతో ఊపిరాడక చనిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. అతని పనేనా?
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్.. తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇదంతా చేసింది సుదీప్ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. -
బండి కాదు మొండి ఇది.. సాయంపట్టండి
సిద్దిపేట: డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే వాహనాలు ఏవిధంగా ఉండాలి.. మంచి ఫిట్నెస్తో ఉండాలి.. కానీ, శుక్రవారం డ్రైవింగ్ స్కూల్ వాహనం అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఎదుటే మొరాయించింది. దీంతో చేసేది ఏమీ లేక ట్రాఫిక్ పోలీసులు వాహనం కొంచెం దూరం వరకు నెట్టి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ఇది చూసిన పలువురు ఆర్టీఏ అధికారులు ఈ వాహనానికి ఎఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారో అంటూ ముక్కున వెళ్లేశారు. -
7 కోట్ల బంగారంతో కార్ డ్రైవర్ పరార్
-
పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్!
సాక్షి, మెదక్/హైదరాబాద్: మెదక్ కారు దహనం కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొన్న విషయం తెలిసిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి సెక్రెటేరియేట్ ఉద్యోగి ధర్మా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. అయితే ధర్మా ఆడిన నాటకంలో డ్రైవర్ బలి పశువుగా మారాడు. పనికి వెళ్తే నాలుగు పైసలు వస్తాయని ఆశించిన వ్యక్తి ఊహించని విధంగా విగతజీవిగా మారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు. చనిపోయింది ఎవరు ? ధర్మానాయక్‌కు రెగ్యులర్ డ్రైవర్ లేడు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రోజువారీ కిరాయి ఇస్తానని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కారులో ఆ డ్రైవర్ మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇదంతా చేశాడని, దీని కోసమే రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. డ్రైవర్‌తో సహా కారును సజీవదహనం చేశాక ధర్మానాయక్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన తర్వాత సమీప అటవీ ప్రాంతం గుండా షాబాద్ తండాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారయ్యాడు. మృతుడి స్వస్థలం బీహార్‌గా భావిస్తున్నారు. నవీన్‌పేటలో స్కెచ్ ధర్మానాయక్ అక్క నిజామాబాద్ జిల్లాలోని నవీన్‌పేటలో ఉంటుంది. అక్క కొడుకుతో కలిసి ఇన్సూరెన్స్ డబ్బు కోసం పథకం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. సహకరిస్తే పెళ్లికి సాయంతోపాటు, కొంతడబ్బు కూడా ముట్టజెప్పుతానని ఆశ చూపినట్టు సమాచారం. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మండిపడుతున్న తండావాసులు డబ్బు కోసం ధర్మానాయక్ ఈ ఘటనకు ఒడిగట్టడంపై తండావాసులు మండిపడుతున్నారు. మంగళవారం మీడియా బృందం తండాకు చేరుకొని ధర్మానాయక్ భార్య నీల, ఇతర కుటుంబసభ్యు లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వా రు నోరు మెదపలేదు. మెదక్ డీఎస్పీ, అల్లాదుర్గం సీఐ, మెదక్ సీఐ, టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలానికి ధర్మా నాయక్‌ను తీసుకొచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం. ధర్మానాయక్ కస్టడీలో ఉన్నా తమకేమీ సమాచారం లేదంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈనెల 9న టేక్మాల్ మండలం వెంకటాపూర్ చెరువు కట్ట సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆ కారు సెక్రెటేరియేట్లో పనిచేసే ధర్మనాయక్‌ది అని, చనిపోయిందని అతనేనని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనేక సందేహాలు రేకెత్తాయి. కారు దహనమైన చోట పెట్రోల్ బాటిల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధర్మానాయక్ కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. డెత్ సర్టిఫికెట్ తీసుకోమంటూ ధర్మానాయక్ చేసిన మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా.. చనిపోయింది ధర్మానాయక్ కాదనే ఓ అంచనాకు వచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పూణే సమీపంలో ధర్మానాయక్ ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం టేక్మాల్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఆపై మెదక్‌కు తరలించారు. -
ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యకేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం దాఖలు చేయాలని స్పష్టీకరించింది. మూడు నెలల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. చదవండి: (నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’) -
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్‌లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు..
సాక్షి, మెదక్: నిర్లక్ష్యపు డ్రైవింగ్ నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబు–నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) అంగన్వాడీ సెంటర్‌కు వెళ్తుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఆడుకుంటూ రోడ్డుదాటే ప్రయత్నం చేసింది. అదే గ్రామంలోని ఓ రైస్ మిల్ యజమాని కుమారుడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కీర్తన రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి అక్కడే చనిపోయింది. కారు డ్రైవర్ ప్రమాదస్థలం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. అదే కారులో చిన్నారిని మెదక్ పట్టణంలోని ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ మురళీ తెలిపారు. చదవండి: ‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి.. -
విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: భారత సైనిక సమాచారం కోసం పాకిస్థాన్ హనీట్రాప్ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లోని జవహర్లాల్ నెహ్రూ భవన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎమ్ఈఏ డ్రైవర్ పాక్ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన మహిళ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి అతనితో సన్నిహితంగా ఉంటూ సైన్యానికి సంబంధించిన కీలక సేకరించినట్లు గుర్తించారు. కొన్నిసార్లు పాకిస్థాన్ మహిళ పూనమ్ శర్మ, మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకున్న ఆ దేశ గూఢచారి వలలో చిక్కుకున్న డ్రైవర్.. దేశ రక్షణ సమాచారం, డాక్యుమెంట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో 46 ఏళ్ల భాగ్‌చంద్ అనే వ్యక్తిని, రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి రాగా.. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తన బంధువుల ద్వారా భాగ్‌చంద్ తన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉండేవాడని తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! -
Shivapura hanging bridge: వేలాడే వంతెనపైకి కారు
బెంగళూరు: ద్విచక్రవాహనాలు, పాదచారులు మాత్రమే వెళ్లగలిగే వేలాడే వంతెనపై ఓ ప్రబుద్ధుడు ఏకంగా కారే నడపబోయాడు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా శివపుర వంతెనపై బుధవారం జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. ఉళావికి చెందిన ముజాహిద్ సయ్యద్ (26) కారుతో వంతెనపైకి దూసుకెళ్లాడు. అది మధ్యలో ఇరుక్కోవడం, స్థానికులు ప్రతిఘటించడంతో కారును వెనక్కు తోసుకెళ్లాడు. పోలీసులు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్: విద్యార్థినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినికి వేధింపులు ఎదురయ్యాయి. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. చిన్నారిని వేధిస్తున్న వ్యక్తిని చితకొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న బాలికను ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. ఓపిక నశించిన ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని రజినీకుమార్‌ను నిలదీశారు. కోపంతో రగిలిపోయి దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించామని తెలిపారు. చిన్నారికి వేధింపుల విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ప్రమేయం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
చిన్నారిని వేధిస్తున్న కారు డ్రైవర్ ను చితకబాదిన పేరెంట్స్