
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది.
రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment