wife commits suicide
-
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కలిసి నడిచారు.. కలిసే తనువు చాలిచారు
మంథని: పుట్టినిల్లు.. మెట్టినిల్లు రెండూ నిరుపేద కుటుంబాలే.. కూలీపని చేసుకుంటేనే పూట గడిచే ది.. వరద మిగిల్చిన విషాదం ఆ రెండు కుటుంబా లను చిదిమేసింది.. భర్తకు అన్నింటా చేదోడువాదోడుగా, ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య.. భర్త వెంటే తాను తనువు చాలించింది.. కానీ, తన ఇద్దరు చిన్నారుల భవితవ్యం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయలేదు.. విషాదం నింపిన ఈ ఘటన కన్నీరు తెప్పించింది. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచా యతీ పరిధి నెల్లిపల్లిలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి తనవు చాలించిన కటుకు అశోక్(35)అంటే ఆయన భార్య సంగీత(28)కు అమితమైన ప్రేమ అని స్థానికులు అనుకుంటున్నారు. భర్తను ఎవరైనా చిన్నమాట అంటే వారించేదని, తన కూతురు, కుమారున్ని సైతం ఎంతోఅల్లారుముద్దుగా పెంచుకుందని, అలాంటి దంపతులిద్దరూ తన ఇద్దరు చిన్నారులను వదిలి కానరాని లోకాలకు వెళ్లడంపై స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండుసార్లు పంట మునక గ్రామానికి చెందిన కటుకు రాయమల్లు– రమాదేవికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. రాయమల్లుకు ఉన్న కొద్ది పాటి భూమిని తానే సాగు చేసుకుంటున్నాడు. ఓ కుమారుడు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అశోక్ ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేసుకుంటున్నాడు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో అశోక్ సాగు చేసిన వరి, పత్తి పంటలు రెండుసార్లు నీటమునిగి పంటలు దెబ్బతిని నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2లక్షల వరకు అప్పు ఎలా తీర్చేదనే మనస్తాపంతో తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులు భావిస్తున్నారు. పిల్లల ముఖాలకు పసుపు ఎందుకు రాసినట్లు? దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారి పిల్లలు సాయి, సన ముఖాలకు పసుపు ఉందని, అలా ఎవరు, ఎందుకు రాసి ఉంటారని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ పనిమానేసి.. వ్యవసాయం వైపు.. అశోక్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడని, రెండుమార్లు ప్రమాదం నుంచి బయటపడడంతో ఆ పనిమానేసి వ్యవసాయం వైపు దృష్టి సారించినట్లు స్థానికులు తెలిపారు. కాగా అశోక్‌కు వ్యవసాయం కూడా అచ్చిరాలేదని, గతంలో కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పలువురు గ్రామస్తులు అనుకుంటున్నారు. -
సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య
పటమట(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల మేరకు దాడి చంద్రశేఖర్ మంగళగిరిలోని ఏపీ సీఐడీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు 2012లో కాకినాడకు చెందిన జ్యోతి(33)తో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.. ఉద్యోగరీత్యా వీరిరువురూ పటమటలోని తోటవారి వీధిలో కాపురముంటున్నారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం కోసం పిలిస్తే రాకపోవటంతో అనుమానం వచ్చిన పిల్లలు తలుపులు కొట్టగా అవి గడియపెట్టి ఉన్నాయి. దీంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లటంతో అప్పటికే ఫ్యానుకు ఉరేసుకుని ఉంది. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ఆత్మహత్యగా కేసును నమోదు చేసినట్లు పటమట సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. -
కూకట్‌పల్లిలో దారుణం: మహిళా ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ అంతస్తు నుంచి దూకి మృతిచెందింది. వివరాల ప్రకారం.. శ్రీధర్, స్వాతి ఇద్దరు దంపతులు. వీరికి అంగవైకల్యంతో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో, అంగకవైకల్యంతో ఉన్న కుమారుడిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మెర్సీ కిల్లింగ్ కోసం తండ్రి శ్రీధర్.. భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయమై తరచూ భార్యను వేధింపులకు గురిచేశాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకోలేక మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనను స్వాతి ఒప్పుకోలేదు. కాగా, కుమారుడి విషయంలో భర్త.. ఇలా వేధించడం భరించలేక స్వాతి మనోవేదనకు గురైంది. దీంతో, వారు నివాసం ఉంటున్న మంజీర ట్రినిటి హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి స్వాతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా.. స్వాతి మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా శ్రీధర్ అందుబాటులోకి రాలేదు. కనీసం శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులు కోరుతున్నారు. -
ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగరంలోని పుట్టేనహళ్ళి పొలీస్ స్టేషన్ పరిధిలో నిహారిక అనే యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాలు... స్థానికంగా ఉండే నిహారిక (25), కార్తీక్‌లు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలు మాట్లాడుకుని ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. నిహారిక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త నిత్యం వేధింపులు కోటి ఆశలతో కాపురానికి వచ్చిన నిహారికకు భర్త, అత్తమామల నిజస్వరూపం కొద్దిరోజులకే అర్థమైంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. అత్తమామలు కూడా అతనికే వంత పాడేవారు. దీంతో విరక్తి చెంది ఆదివారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పుట్టేనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపుల వల్లనే తమ బిడ్డ చనిపోయిందని నిహారిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
ఏ కష్టం వచ్చిందోగానీ.. కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
సాక్షి, తుమకూరు (కర్ణాటక): ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. చిక్కనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే. ఆదివారం ఉదయం శశిధర్ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శశిధర్ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది. వేధింపులతో యువకుడు ఆత్మహత్య మైసూరు: టి.నరసిపుర తాలూకా వ్యాసరాజపుర గ్రామానికి చెందిన రామనాయక కుమారుడు మను (19) అనే యువకుడు యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో యువతి బంధువులు సిద్దరాజు, ప్రతాప్, శాంతరాజు, భాగ్యమ్మ అనేక సార్లు పిలిచి మనును తిట్టడంతో అతడు ఆవేదన చెందాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మను తల్లి బన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. -
ఏం జరిగిందేమో కానీ.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
కడప అర్బన్ : కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్న పెనుగొండ రవికుమార్ భార్య ప్రసూన (35) ఈనెల 8న ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన జరిగిన వెంటనే ఆమెను కడపలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో వైద్యసేవల కోసం చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి గైక్వాడ్ వీరోజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ ఎస్ఐ జి. అమర్నాథ్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పెనుగొండ రవికుమార్‌కు, తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన గైక్వాడ్ వీరోజీరావు కుమార్తె ప్రసూనకు 2011లో వివాహమైంది. 2012 బ్యాచ్‌కు చెందిన రవికుమార్ శిక్షణను పూర్తి చేసుకుని 2014 ప్రారంభంలో ఎస్ఐగా విధుల్లో చేరారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జైన శ్రీపాద (8), స్పోహిత (6) ఉన్నారు. వీరు ప్రస్తుతం కడపలోని ఓంశాంతినగర్‌లో ఉంటున్నారు. రవికుమార్ ప్రస్తుతం కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎస్ఐగా విధులను నిర్వహిస్తున్నారు. ప్రసూన అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఆసుపత్రులకు తిరిగేవారమని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెడ్రూంలో ఎస్ఐ రవికుమార్ ఉండగా, మరో బెడ్రూంలోకి ప్రసూన వెళ్లింది. తలుపునకు గడియపెట్టుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రవికుమార్ బెడ్రూం వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపు బద్దలుకొట్టాడు. వెళ్లిచూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. వెంటనే కిందకు దించి ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్తకు కరోనా: భయంతో ఉరేసుకున్న భార్య
మెదక్: మహమ్మారి కరోనా వైరస్ దేశంలో దారుణ పరిస్థితులకు దారి తీస్తోంది. వైరస్ ప్రజల వెన్నులో భయం పుట్టిస్తోంది. ఈ వైరస్ పేరు చెబితే ప్రజలందరూ భయపడుతున్నారు. ఈ భయంతోనే చాలా మంది ప్రజలు అనారోగ్యం చెందుతున్నారు. దీంతోపాటు అతిగా భయపడ్డవారు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ వివాహిత కరోనా భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తకు కరోనా సోకడంతో భయాందోళన చెందిన ఆమె తన ప్రాణాలను తీసుకుంది. హవేలి ఘనపూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (36) భర్తకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. భర్తకు కరోనా రావడంతో ఆమె కలత చెందింది. తనకు ఎక్కడ వ్యాపిస్తోందనే భయం ఆమెలో పట్టుకుంది. దాంతోపాటు తన భర్త, కుటుంబసభ్యులకు కూడా సోకుతుందనే ఆందోళనతో కంగారుపడింది. ఇదే కలతతో గురువారం లక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఒకవైపు ఆమె భర్త కరోనా సోకి చికిత్స పొందుతుండగా ఇటువైపు భార్య మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. చదవండి: శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
శాడిస్ట్ సాఫ్ట్వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓ శాడిస్ట్ సాఫ్ట్వేర్ భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. మరొక మహిళతో ఎఫైర్ పెట్టుకుని, భార్యను చనిపోవాలని భర్త తీవ్రంగా వేధించండతో భార్య తనువు చాలించింది. వివరాలు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న సుకిత్.. శివానిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సంతోషంగా సాగిన వీరి వైహహిక జీవితంతో.. అక్రమ సంబంధం చిచ్చెపెట్టింది. సుకిత్ మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని శివానిని వేధించసాగాడు. భర్త సుకీత్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం శివాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శివాని మృతికి సుకితే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి శివానిని ఇబ్బందులు పెడుతున్నాడని, గత ఆరు నెలల నుండి శివానికి నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజుల కిత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన శివాని.. సుకిత్కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ వారికి తెలియజేసింది. దీంతో అప్పటి నుంచి శివానిని చనిపోవాలని, వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేయసాగాడు. భర్త వేధింపులు ఎక్కువడంతో శుక్రవారం రాత్రి అంబర్‌పేట్‌లోని నివాసంలో శివాని ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయాన్ని సుకిత్ కుటుంబ సభ్యులు.. శివాని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు తన సోదరితో మాట్లాడిందని.. ఉరి వేసుకోవడానికి సరిపోయేలా ఇంటి పైకప్పు లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకిత్ కుటుంబ సభ్యులపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
కృష్ణరాజపురం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెట్టే వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం బన్నేరుఘట్టలో చోటు చేసుకుంది. బన్నేరుఘట్టకు చెందిన కవిత (26)కు అదే ప్రాంతానికి చెందిన అప్పు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నాలుగేళ్ల క్రితం తల్లితండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది కాలం సజావుగానే సాగిన కవిత కాపురంలో కొద్ది కాలంగా కలతలు, కలహాలు మొదలయ్యాయి. భర్త ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటుండడం దురలవాట్లకు, జల్సాలకు బానిసవడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పైగా కవితపై అనుమానంతో ప్రతీరోజూ శారీరకంగా, మానసికంగా కూడా వేధించసాగాడు. రోజురోజుకు భర్త వేధింపులు తీవ్రతరం కావడంతో కొద్ది రోజుల కిత్రం బన్నేరుఘట్టలోని తల్లితండ్రుల ఇంటికి చేరుకున్న కవిత శనివారం వీడియోలో భర్త పెడుతున్న వేధింపుల గురించి వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి
భువనగిరి (నల్లగొండ): భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని తాతానగర్‌లో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన జట్కా పూర్ణచందర్ (27) స్థానిక ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈ మధ్యనే పట్టణానికి చెందిన కీర్తి (22) తో వివాహమైంది. పూర్ణచందర్‌కు ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో భార్య పక్క గదిలో ఉన్న సమయంలో బెడ్రూంలోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెడ్రూంలోకి వెళ్లిన భర్త ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కిటికి తెరచి చూసిన భార్య భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో.. ఆవేదనకు గురై ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు నిప్పంటించుకోకుండా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కీర్తి కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.