రోదిస్తున్న సంగీత తల్లి మధునమ్మ
మంథని: పుట్టినిల్లు.. మెట్టినిల్లు రెండూ నిరుపేద కుటుంబాలే.. కూలీపని చేసుకుంటేనే పూట గడిచే ది.. వరద మిగిల్చిన విషాదం ఆ రెండు కుటుంబా లను చిదిమేసింది.. భర్తకు అన్నింటా చేదోడువాదోడుగా, ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య.. భర్త వెంటే తాను తనువు చాలించింది.. కానీ, తన ఇద్దరు చిన్నారుల భవితవ్యం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయలేదు.. విషాదం నింపిన ఈ ఘటన కన్నీరు తెప్పించింది.
మంథని మండలం ఎక్లాస్‌పూర్ గ్రామపంచా యతీ పరిధి నెల్లిపల్లిలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి తనవు చాలించిన కటుకు అశోక్(35)అంటే ఆయన భార్య సంగీత(28)కు అమితమైన ప్రేమ అని స్థానికులు అనుకుంటున్నారు. భర్తను ఎవరైనా చిన్నమాట అంటే వారించేదని, తన కూతురు, కుమారున్ని సైతం ఎంతోఅల్లారుముద్దుగా పెంచుకుందని, అలాంటి దంపతులిద్దరూ తన ఇద్దరు చిన్నారులను వదిలి కానరాని లోకాలకు వెళ్లడంపై స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రెండుసార్లు పంట మునక
గ్రామానికి చెందిన కటుకు రాయమల్లు– రమాదేవికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. రాయమల్లుకు ఉన్న కొద్ది పాటి భూమిని తానే సాగు చేసుకుంటున్నాడు. ఓ కుమారుడు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అశోక్ ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేసుకుంటున్నాడు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో అశోక్ సాగు చేసిన వరి, పత్తి పంటలు రెండుసార్లు నీటమునిగి పంటలు దెబ్బతిని నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2లక్షల వరకు అప్పు ఎలా తీర్చేదనే మనస్తాపంతో తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులు భావిస్తున్నారు.
పిల్లల ముఖాలకు పసుపు ఎందుకు రాసినట్లు?
దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారి పిల్లలు సాయి, సన ముఖాలకు పసుపు ఉందని, అలా ఎవరు, ఎందుకు రాసి ఉంటారని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ పనిమానేసి.. వ్యవసాయం వైపు..
అశోక్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడని, రెండుమార్లు ప్రమాదం నుంచి బయటపడడంతో ఆ పనిమానేసి వ్యవసాయం వైపు దృష్టి సారించినట్లు స్థానికులు తెలిపారు. కాగా అశోక్‌కు వ్యవసాయం కూడా అచ్చిరాలేదని, గతంలో కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పలువురు గ్రామస్తులు అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment