కరీంనగర్‌క్రైం: అదనపు కట్నం తీసుకురావాలనే అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వివాహిత ఉ రివేసుకొని ఆత్మహత్య చే సుకున్న ఘటన కట్టరాంపూర్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ కోటేశ్వర్ క థనం ప్రకారం.. కరీంనగర్ కట్టరాంపుర్ ప్రాంతానికి చెందిన దొంత అజయ్‌కుమార్‌కు సిద్ది పేట జిల్లా బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన శ్రావణి(22)తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వి వాహం జరిగింది. వివాహ సమయంలోనే పు ట్టింటివారు కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చారు.
అయితే, కొద్దిరోజులుగా శ్రావణి భర్త అజయ్‌కుమార్, అత్త ఉపేంద్ర, మామ అంజయ్య కలిసి అదనపు కట్నం కావలని ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులు భరించలేక మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి సంగెం కొము రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, వివాహమైన సుమారు ఏడు నెలలకే చనిపోవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. వారిరాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఏసీపీ నరేందర్, సీఐ కోటేశ్వర్ తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment