
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
శివరాత్రి రోజు చిన్నమెట్‌పల్లిలో విషాదం
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్‌పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం–లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు.
అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment