Inter student commits suicide
-
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
మామునూరు: అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజ నీరింగ్ కళాశాల ప్రాంగణంలోని వాచ్మెన్ నివాస గదిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మా ల గ్రామం మంగ్లీ తండాకు చెందిన కేలోత్ కిషన్, కవిత దంపతులు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని ఓ గదిలో కుమార్తె నందు(17)తో కలిసి నివా సం ఉంటున్నారు. ఈ దంపతులు కళాశాలలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. నందు(నందిని)ఐనవోలు కస్తుర్బాగాంధీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనెల 9న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తరచూ అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు మధ్యాహ్నం గదికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం, పోలీసులకు తెలుపగా హుటాహుటిన పోలీసులు చేరుకుని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు. జీవితంపై విరక్తి చెంది రఘునాథపల్లిలో యువతి.. రఘునాథపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన కురాకుల లక్ష్మయ్య, రేణుక దంపతుల కూతురు కావ్య (23)కు మూడేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన అడిగం మహేందర్‌తో వివాహమైంది. వివాహమైన మూడు నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కావ్య పుట్టింటికి వచ్చింది. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా.. కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్తపై హనుమకొండలోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రఘునాథపల్లిలో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవి తంపై విరక్తి చెందిన కావ్య బుధవారం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు చూసి అపస్మారక స్థితిలో ఉన్న కూతురును జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
వాట్సాప్‌లో మెసేజ్.. అన్నా.. నేను చనిపోతున్నా..!
పెద్దారవీడు(ప్రకాశం జిల్లా): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైనుంచి దూకి అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకం మిగిల్చిన ఈ విషాద సంఘటన పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వజ్రాల అశోక్‌రెడ్డి(17) మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదివాడు. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. పరీక్షలు రాసిన తర్వాత నంద్యాల పట్టణంలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అశోక్‌రెడ్డి ఉత్తీర్ణుడు కాలేదు. గురువారం నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, అన్న, అక్కతో గడిపాడు. అన్న ఆదినారాయణరెడ్డి ట్రాక్టర్ తీసుకుని పొలం పనులకు వెళ్లాడు. ఇంతలోనే అశోక్‌రెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైకి ఎక్కి తన అన్నతో పాటు జమనపల్లె గ్రామంలోని స్నేహితులకు ‘నేను చనిపోతున్నా’ అని వాట్సాప్‌లో మెసేజ్ పంపించాడు. తన సోదరుడు వచ్చేలోపు అశోక్‌రెడ్డి డ్యామ్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యామ్ లోతు దాదాపు 400 అడుగులు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటరెడ్డి, రమణమ్మ గుండెలవిసేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
మొబైల్ కొనివ్వలేదని.. మనస్తాపంతో
సాక్షి, దోమకొండ(నిజామాబాద్) : తల్లితండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండలకేంద్రంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ గ్రామానికి చెందిన కుకుట్ల మౌనిక(16) కామారెడ్డిలోని సాందీపని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో గత వారంరోజుల నుంచి తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లితండ్రులను కోరింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత కొనిస్తామని కూతురుకు వారు తెలిపారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన మౌనిక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుప్రతికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో మౌనిక మంగళవారం చికిత్స పొందుతూ వేకువజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నిజామాబాద్ నగరంలో.. నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆరోటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోగల డైరీఫాంలో మంగళవారం ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గౌరేందర్గౌడు తెలిపారు. నగరానికి చెందిన అబ్దుల్‌జావీద్ ఆర్థిక ఇబ్బందుల వల్లే తన ఇంటిలో మంగళవారం ఎవరు లేని సమయంల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య యాస్మిన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుక్నుట్లు ఎస్సై తెలిపారు. సిరికొండలో యువకుడి ఆత్మహత్యాయత్నం సిరికొండ: మండలకేంద్రంలోని ఎల్లం చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానిక వీఆర్ఏ చిన్న సాయిలు చెరువులో దూకి అతడిని కాపాడాడు. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్(25) తన అత్తగారి ఊరైన రావుట్లకు వచ్చాడు. కుటుంబ కలహలతో తిరుగు ప్రయాణంలో మంగళవారం మధ్యాహ్నం సిరికొండలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. అది చూసిన వీఆర్ఎ చెరువులో దూకి అతడిని ఒడ్డుకు తీసుకువచ్చాడు. సమాచారం తెలిసిన కానిస్టేబుల్ రాకేష్ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కానిస్టేబుల్ తెలిపారు. -
సిద్దిపేట జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
మరో ఇంటర్ విద్యార్థి..
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల మానస(17) అనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థిని పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా..చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఊపిరొదిలింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస ఈ ఏడాది ఇంటర్లో ఎంపీసీ మొదటి సంవత్సరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంది. వార్షిక పరీక్షలు రాసి స్వగ్రామం వెంగన్నపాలెం వచ్చిం ది. గత నెల 18న ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మానస ఫిజిక్స్, ఇంగ్లిష్ తప్పితే మిగతా నాలుగు సబ్జెక్టులు ఫెయిలైంది. పదో తరగతిలో 8 జీపీఏ గ్రేడ్ సాధించి, బాగా చదువుతుందనే పేరున్న తాను ఫెయిల్ కావడమేంటని తదేకంగా ఆలోచిస్తూ..అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగింది. విషయా న్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో..వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ సూపర్‌స్పెషల్ హాస్పిటల్లో తల్లిదంద్రులు చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని హైదారాబాద్ నుంచి వెంగన్నపాలెంకు మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్లే తమ కుమార్తె ఫస్ట్ ఇయర్లో ఫెయిలైందని..ఆమె మృతదేహంపై పడి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా రోదించారు. బాగా చదువుతుందనుకున్న అమ్మాయి..ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, 9వ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు లిఖిత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
విద్యారణ్యపురి: ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కిషన్‌పురంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కొలసాని వెంకటరావు కూతురు రక్షారావు హన్మకొండలోని ఎస్ఆర్ కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలకు సంబంధించి పరీక్ష కేంద్రం హన్మకొండ కిషన్‌పురంలోని ఆర్డీ కళాశాలలో పడింది. భవనం మూడో అంతస్తులో మొదటి పేపర్ సంస్కృతం పరీక్ష రాయడానికి వచ్చిన రక్షారావు.. కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకుని చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు కాపీ చేస్తున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే ఆందోళనకు గురైన రక్షారావు ఒక్కసారిగా భవనం నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల నిర్వాహకులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా / లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.సంధ్యారాణి(16) తమ స్వగృహంలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అర్చకుడు ఎన్.సుబ్బరామ శర్మ కుమార్తె అనంతపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి గాయత్రి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులు కావడంతో సంధ్యారాణి ఇంటికి వచ్చింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేక పోవడం.. తన చదువు కోసం తండ్రి ఇప్పటికే ఎక్కువ ఖర్చు చేయడం.. తల్లి లేదనే మనస్తాపానికి గురై బుధవారం చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందన్నారు. అదే సమయంలో స్నానం చేసేందుకు వెళ్లిన మృతురాలి అక్క దివ్య స్నానం చేసి తలుపులు తెరవాలని ప్రయత్నించగా తలుపులు గడియపెట్టి ఉండటంతో పక్కింటి వారిని పిలిచి తలుపులు తీయించింది. అప్పటికే సంధ్యారాణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. గురువారం ఉదయం పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. -
కాలేజ్ ప్రాంగణంలో పురుగుల మందు తాగి..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుమారి (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సెంకండియర్ విద్యార్థి వెంకటేశ్వరరావు ఆమెను నిత్యం వేధించేవాడని, అతని వేధింపులు తాళలేకనే కుమారి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సీనియర్ వేధింపుల గురించి పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజ్ ప్రాంగణంలో పురుగుల మందు తాగి..
-
తరగతి గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
వనస్థలిపురంలోని శ్రీమేథ కాలేజీ ఇంటర్ విద్యార్థి భవానిసాయి గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భవాని సాయి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజి యాజమాన్యానికి సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కళాశాలకు చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. భవాని సాయి మరణవార్తను అతడి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు పరిశీలిస్తున్నారు. భవాని సాయి మరణానికి గల కారణాలపై పోలీసులు అతని స్నేహితులను విచారిస్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే సాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.