నందు (ఫైల్) కావ్య (పైల్)
మృతురాలు వాగ్దేవి కళాశాల వంట మనుషుల కుమార్తె
ఐనవోలు కసూ్తర్బాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
మామునూరు: అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజ నీరింగ్ కళాశాల ప్రాంగణంలోని వాచ్‌మెన్ నివాస గదిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మా ల గ్రామం మంగ్లీ తండాకు చెందిన కేలోత్ కిషన్, కవిత దంపతులు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని ఓ గదిలో కుమార్తె నందు(17)తో కలిసి నివా సం ఉంటున్నారు. ఈ దంపతులు కళాశాలలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు.
నందు(నందిని)ఐనవోలు కస్తుర్బాగాంధీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనెల 9న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తరచూ అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు మధ్యాహ్నం గదికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం, పోలీసులకు తెలుపగా హుటాహుటిన పోలీసులు చేరుకుని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు.
జీవితంపై విరక్తి చెంది రఘునాథపల్లిలో యువతి..
రఘునాథపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన కురాకుల లక్ష్మయ్య, రేణుక దంపతుల కూతురు కావ్య (23)కు మూడేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన అడిగం మహేందర్‌తో వివాహమైంది. వివాహమైన మూడు నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కావ్య పుట్టింటికి వచ్చింది.
పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా.. కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్తపై హనుమకొండలోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రఘునాథపల్లిలో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవి తంపై విరక్తి చెందిన కావ్య బుధవారం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు చూసి అపస్మారక స్థితిలో ఉన్న కూతురును జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment