
ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి
వైఎస్ఆర్ జిల్లా / లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.సంధ్యారాణి(16) తమ స్వగృహంలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అర్చకుడు ఎన్.సుబ్బరామ శర్మ కుమార్తె అనంతపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి గాయత్రి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులు కావడంతో సంధ్యారాణి ఇంటికి వచ్చింది.
ఆమెకు ఆరోగ్యం సరిగా లేక పోవడం.. తన చదువు కోసం తండ్రి ఇప్పటికే ఎక్కువ ఖర్చు చేయడం.. తల్లి లేదనే మనస్తాపానికి గురై బుధవారం చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందన్నారు. అదే సమయంలో స్నానం చేసేందుకు వెళ్లిన మృతురాలి అక్క దివ్య స్నానం చేసి తలుపులు తెరవాలని ప్రయత్నించగా తలుపులు గడియపెట్టి ఉండటంతో పక్కింటి వారిని పిలిచి తలుపులు తీయించింది. అప్పటికే సంధ్యారాణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. గురువారం ఉదయం పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment