
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.

నిన్నటి వరకు వైఎస్సార్‌సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.

Comments
Please login to add a commentAdd a comment