small traders
-
కడపలో కూటమి నేతల ‘కూల్చివేత’ రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.నిన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
పన్ను విధానాల్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించే అవకాశం
-
చిరు వ్యాపారులపై అధికారుల ఓవరాక్షన్
-
చిరు వ్యాపారులపై రెడ్ బుక్ దౌర్జన్యం
-
కష్టజీవులపై కర్కశం
కనిగిరి రూరల్: వేకువజామున 4 గంటల సమయం.. కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనుకే మునిసిపల్, రెవెన్యూ అధికారులు, సచివాయల సిబ్బంది మందీమార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా.. కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులను పోలీస్‌లు, మునిసిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు. కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జునుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీ షాపులు, గాజుల షాపులు ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.పోలీస్ పహారాతో దమనకాండ వాస్తవానికి చెప్పుల బజార్‌లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్లోని బడ్డీలు తొలగించనున్నట్టు కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ.. బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్డులోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, నలుగురు ఎస్సైలు, సీఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి.జాన్ ఇర్విన్, సీఐలు, ఎస్సైలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాపారుల శాపనార్థాలుబడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడి కూడును నేలపాలు చేసి, తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. -
చిరువ్యాపారులపై కక్ష సాధింపు
-
Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలుస్తూ, వారి ఇళ్లలో ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం గురువారం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ ‘జగనన్న తోడు’ పథకం సీఎం వైఎస్ జగన్ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతగా గురువారం అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. అదే విధంగా ఈ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకోసారి సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వీరందరికీ ‘జగనన్న తోడు’ 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం అందిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా ఏపీ చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘జగనన్న తోడు‘ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి ‘జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు. రాష్ట్రంలో ‘జగనన్న తోడు‘ ద్వారా అందించిన రుణాలే అక్షరాలా రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లు కాగా, ‘జగనన్న తోడు‘ ద్వారా మన రాష్ట్రంలో రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు. -
చిరు వ్యాపారులకు రుణాల్లో భారీగా ఏపీ ‘ముద్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు. కర్టెన్ డిజైనర్ యూనిట్ తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు. -
స్వయం ఉపాధికి ‘తోడు’
పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలో ‘జగనన్న తోడు’ ఒక విప్లవం లాంటిది. అందరం కలసికట్టుగా ఒక్కటైతే పేదవాడికి మంచి జరిగే ఈ మహాయజ్ఞం సత్ఫలితాలనిస్తుంది. ఈ రోజు అదే జరుగుతోంది. చిరువ్యాపారులైన నా 15,87,000 మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఇప్పటిదాకా మంచి జరిగింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించడమే కాకుండా మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా తాజా లబ్ధిదారులతో కలిపితే ఇప్పటివరకు 15,87,000 మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ లేని రుణం కింద రూ.2,955.79 కోట్లు ఇవ్వగలిగామన్నారు. పథకం ద్వారా సున్నా వడ్డీ కింద మరో రూ.74.69 కోట్లు చెల్లించి వారికి మేలు చేసినట్లు చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న తోడు పథకం అమలు సందర్భంగా వడ్డీలేని రుణాలు, వడ్డీ రీయింబర్స్మెంట్ నిధులను మంగళవారం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ పరిస్థితులను మార్చాలనే ఆరాటంతో నా సుదీర్ఘ పాదయాత్రలో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు, బండ్లపై టిఫిన్లు విక్రయిస్తూ పొట్ట పోసుకునే వారి కష్టాలను స్వయంగా చూశా. రోజువారీ పెట్టుబడికి కావాల్సిన రూ.1,000 కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రూ.వెయ్యి తీసుకుంటే ముందుగానే రూ.100 కట్ చేసుకుని సాయంత్రానికి తిరిగి రూ.1,000 వెనక్కి ఇవ్వాలని ప్రైవేట్ వ్యాపారులు షరతు విధించేవారు. చిరు వ్యాపారులకు గత్యంతరం లేక ఆ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సిన దుస్థితిని నాడు చూశా. ఐదారు రూపాయల వడ్డీకి దొరికితే అదే అదృష్టంగా భావించే దారుణ పరిస్థితిని అప్పట్లో గమనించా. అవన్నీ చూశాక ఆ పరిస్థితులను మార్చాలన్న ఆరాటం నుంచి ‘జగనన్న తోడు’ పథకం పుట్టింది. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరు వ్యాపారులందరికీ మేలు.. పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడుబండ్ల మీద పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహార పదార్థాలను అమ్ముకునేవారు, రోడ్ పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, ఆటోలు, సైకిళ్లపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు చేనేత కార్మికులు, సంప్రదాయ చేతివత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారు, బొబ్బిలి వీణలు తయారు చేసేవారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మల తయారుదారులు, లేసు వర్కర్స్.. అందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు అందిస్తూ సకాలంలో కిస్తీలను చెల్లించినవారికి అదనంగా ఏటా రూ.వెయ్యి చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇవాళ వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. దేశం మొత్తం కంటే ఏపీలోనే ఎక్కువ లబ్ధిదారులు.. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల మంది చిరువ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. లబ్ధిదారుల సంఖ్యలో దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మంది ఉండటం అరుదైన ఘటన. ఈ స్థాయిలో సత్ఫలితాలు సాధించేలా పథకాన్ని నడిపిస్తున్న సచివాలయ వ్యవస్ధ, వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధానంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు. లబ్ధిదారుడికి మొదటి విడత రూ.10 వేలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇదొక రికరింగ్ అకౌంట్. సకాలంలో డబ్బులు చెల్లించిన వెంటనే బ్యాంకులు వారికి మళ్లీ రుణాలు మంజూరు చేసి తోడుగా నిలబడతాయి. ఈ క్రమంలో వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లోకి చెల్లిస్తుంది. అక్కచెల్లెమ్మలే అత్యధికం.. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన 15.87 లక్షల మందిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులోనూ 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కావడం మరొక విప్లవం. సామాజికంగా అట్టడుగున ఉన్నవారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలందరికీ మేలు చేసే గొప్ప కార్యక్రమమిది. దీనిద్వారా అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నా. అందరి మేలు కోసం తపించే ప్రభుత్వమిది.. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో ఎవరికైనా ఈ పథకం పొరపాటున రాని పరిస్థితి ఉంటే వెంటనే మీ సమీపంలోని సచివాలయంలో సంప్రదించండి. అక్కడ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటూ తోడుగా నిలుస్తారు. వలంటీర్‌ని అడిగినా దగ్గరుండి దరఖాస్తు చేయించి వెరిఫై అనంతరం పథకం అందేలా చేస్తారు. లేదా 1902 నెంబర్‌కు ఫోన్ చేసినా మీకు ఈ పథకం అందించేలా సహాయపడతారు. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు.. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సిబ్బంది, వలంటీర్లు ఒక బ్యాంకుతో అనుసంధానమై జగనన్న తోడు ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించేలా అంతే ప్రాధాన్యతగా కార్యక్రమాన్ని చేపట్టాలి. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్దీ సంఖ్య పెరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగాలంటే క్రమశిక్షణతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలి. దీన్ని ప్రోత్సహించేందుకే సున్నా వడ్డీ కింద ఆర్నెళ్లకు ఒకసారి ప్రయోజనం చేకూరుస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ రుణం తీర్చుకోలేనిది ఇంటి వద్దే చీరల వ్యాపారం నిర్వహించే నాకు చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలతో ప్రభుత్వం అండగా నిలిచింది. కుట్టు మిషన్‌కు మోటర్ అమర్చుకుని రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నా. నా భర్తకు ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. జగనన్న తోడు పథకం కింద అందిన డబ్బులతో నా భర్త ఇంటి వద్దే టీ దుకాణం ఏర్పాటు చేశారు. ఉన్నతి, సీఐఎఫ్ రుణాల ద్వారా అందిన డబ్బులతో టీ దుకాణాన్ని కిరాణా షాపుగా మార్చుకుని నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోంది. మాకు ఇంత అండగా నిలిచిన జగనన్న రుణం తీర్చుకోలేనిది. – జే లలితకుమారి, మద్దులూరు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా -
Jagananna Thodu: నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడికి అవసరమయ్యే రూ. 5000 కూడా స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొనేవారు. ఇందుకోసం రోజుకు ప్రతి వంద రూపాయలకు రూ. 3 నుంచి రూ. 10 వరకు వడ్డీ చెల్లించేవారు. వారి సంపాదనలో అత్యధిక భాగం వడ్డీలకే సరిపోయేది. అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరువ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వారికి చేయూతనందించడానికి 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం ► ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేయనుంది. ► ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్త రుణాలు ఇప్పిస్తోంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది. ► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 13,29,011 మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు. ► గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి మొత్తం రూ. 2,955.79 కోట్లు రుణ సహాయం పొందినట్టు అవుతుంది. ► ఇప్పడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా.. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోంది. ఇప్పటివరకు రూ. 74.69 కోట్లు వడ్డీ డబ్బు జమ జగనన్న తోడు కార్యక్రమంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు వారి వడ్డీ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ► గత ఆరు నెలల్లో సకాలంలో పాత రుణాలు పూర్తిగా చెల్లించిన 5,03,729 మంది లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రూ.11,03,32,202 డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ► మంగళవారం అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి దాకా రూ. 74.69 కోట్ల మొత్తం వడ్డీ డబ్బులు 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుందని అధికారులు వివరించారు. -
కిలో టమాటా రూ.140
చింతలమానెపల్లి: కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ వారసంతలో శుక్రవారం టమాటా కిలో రూ.140 పలికింది. జూన్ నెల ఆరంభంలో రూ.60 కిలో చొప్పున విక్రయించగా..ఆ తర్వాత రూ.80 నుంచి రూ.100కు చేరింది. టమాటా రూ.140కు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు. టమాటాను ఏపీలోని గుంటూరు, మదనపల్లె, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, లాతూర్, నాసిక్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు పేర్కొన్నారు. టోకు వ్యాపారుల నుంచి 22 కిలోల టమాటాల పెట్టె రూ.2,400 ధర పలుకుతోందని, దీంతో తాము కిలో రూ.140 చొప్పున విక్రయించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వెల్లడించారు. -
చిరు వ్యాపారుల కోసం ముత్తూట్ ఫిన్‌కార్ప్ రుణాలు
హైదరాబాద్: చిరు వ్యాపారులు మొదలుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారి వరకు వివిధ వ్యాపార వర్గాలకు రుణాలను అందించడంపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అదనపు హామీ అవసరం ఉండని వ్యాపార్ మిత్ర బిజినెస్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలు లేదా సిబిల్ స్కోర్ రికార్డులు మొదలైనవి అందించకుండానే వ్యాపార రుణాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. రోజువారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తున్నామని, ముందస్తు చెల్లింపు చార్జీలేమీ ఉండవని పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,600 పైచిలుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖల్లో ఈ రుణాలు పొందవచ్చని వివరించింది. -
కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు..పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు!
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఏమైనా ఊరట లభిస్తుందేమోనని భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉందని.. పన్నులు, ధరల నుంచి ఉపశమనం ఉండాలని పేద, మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు పెరుగుతుందా అని వేతన జీవులు.. పలు రకాల పన్నుల నుంచి ఉపశమనం ఏదైనా ఉంటుందా అని చిన్నా, పెద్దా వ్యాపారులు ఉత్కంఠగా చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో సామాన్యులపై భారం, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని నిధుల కేటాయింపులు, పన్నుల విధింపు ఉంటే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పలువర్గాల వారి నుంచి ‘సాక్షి’ అభిప్రాయాలను సేకరించింది. ఆ వివరాలు.. పన్నుల భారం తగ్గించాలి సామాన్యులపై పన్నుల భారం తగ్గించేలా కేంద్ర బడ్జెట్ ఉండాలి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నా భార్య గృహిణి. మా వృత్తిలో వేతనాలు పెరిగినా.. అంతే స్థాయిలో పన్నుల భారం తప్పడం లేదు. నిత్యావసరాల ధరలు చూస్తే చుక్కల్లోకి చేరుతున్నాయి. కోట్లలో బ్యాంకులను ముంచేస్తున్న వారికి మాఫీలు చేస్తున్న ప్రభుత్వం.. మాలాగా నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై భారాన్ని ఎందుకు తగ్గించకూడదు? – ఉదయ, నాగేందర్‌రెడ్డి, సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబ ఖర్చు పెరిగింది.. రోజువారీ సాధారణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్ ముందు మా కుటుంబ నెలవారీ ఖర్చు రూ.18 వేలు ఉండేది. ఇప్పుడది రూ.28 వేలకు పెరిగింది. ఆదాయంమాత్రం ఆ మేరకు పెరగలేదు. ప్రతిదాని ధర పెరిగి.. సామాన్యుల జీవనం అతలాకుతలం అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి ఆ దిశగా ధరలు తగ్గేలా చూడాలి. – కావలి నర్సింహ,ప్రైవేటు ఉద్యోగి, పరిగి ఆదాయ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పెంచాలి ఉద్యోగులపై ఆదాయ పన్ను భారం తగ్గించాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని వర్గాలకు తప్పనిసరి అయ్యాయి. అలాంటి వాటి ధరలు తగ్గేలా చూడాలి. పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గేలా జీఎస్టీ పరిధిలోకి తేవాలి. – శ్రీవిందు, శ్రీనివాసరావు, ప్రైవేటు ఉద్యోగి మందుల ధరలు తగ్గాలి వృద్ధాప్యంలో మందుల ఖర్చే ఎక్కువ. రిటైర్ అయినప్పటి నుంచీ పెన్షన్‌లో సగం మందుల కోసమే ఖర్చు చేస్తున్నాను. కామన్‌గా వాడే మందుల ధరలు తగ్గిస్తే పెన్షనర్లకు మేలు చేసినట్టు అవుతుంది. – పి.మోహన్‌రావు, రిటైర్డ్ ఉద్యోగి మెరుగైన విద్య, వైద్యం అందాలి దేశంలో ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. యూనివర్సిటీలు, గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. టెక్నాలజీ రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా నిధులు ఇవ్వాలి. – ఏవీ సుధాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇబ్రహీంపట్నం స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలు ఉండాలి ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్‌లు అంటున్నాయి. సమర్థత ఉన్న ఐటీ నిపుణులు స్టార్టప్‌లు పెట్టుకునేందుకు ఊతం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఉండాలి. – ఆదిత్య కొండూరు, ఐటీ ఉద్యోగి చిరు వ్యాపారులకు రాయితీలు ఇవ్వాలి పెద్దపెద్ద మాల్స్ వచ్చాక చిరు వ్యాపారులు బతికే అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్ వచ్చినప్పుడల్లా మా గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నుల భారం పడుతూనే ఉంది. మాల్స్‌లో ఒకదానిపై తగ్గించినా, మరోదానిపై రాబడతారు. ఎక్కువ వ్యాపారం ఉంటుంది కాబట్టి కలిసి వస్తుంది. కానీ చిరు వ్యాపారాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మా లాంటి వారికి ఊరటనిచ్చేలా రాయితీలు ప్రకటిస్తే బాగుంటుంది. – కాకి వీరభద్రం, చిరు వ్యాపారి డీజిల్ ధర అతలాకుతలం చేస్తోంది భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో తెలంగాణలో 19 మంది లారీ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు. డీజిల్ ధర లీటరుకు రూ.50–60 ఉన్నప్పుడు ఖరారు చేసిన చార్జీలనే వ్యాపారులు ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇందులో డీజిల్‌కే ఎక్కువగా ఖర్చవుతోంది. బీమా చార్జీలు రెండింతలు అయ్యాయి. రవాణా వాహనాల యజమానులు బ్యాంకు కిస్తీలు కట్టలేని దుస్థితిలో ఉన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డీజిల్ ధరలను తగ్గించి తీపి అందించాలి. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బతుకు భారం కాకుండా చూడాలి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇంట్లో వాడే నిత్యావసరాలకు కోత పెట్టుకునే పరిస్థితి ఉంది. సరదాగా ఎక్కడికైనా వెళ్తే జీఎస్టీ పేరుతో పిండేస్తున్నారు. ఇంటి బడ్జెట్ రెండేళ్లలోనే డబుల్ అయింది. ప్రతీ దానిపైనా పన్నులేస్తే బతికేదెట్లా? చిన్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉండేలా బడ్జెట్ ఉండాలి. జీఎస్టీ నుంచి పేద వర్గాలు ఉపయోగించే వస్తువులను తొలగించాలి. – కె.రూపాదేవి, గృహిణి -
చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం
-
‘చిరు’ రుణాల్లో ఏపీ ఫస్ట్.. దేశ చరిత్రలోనే రాష్ట్రం రికార్డు
చిరు వ్యాపారులందరూ వాళ్ల కష్టం మీదే ఆధార పడుతున్నారు. పెట్టుబడి సాయం కింద మనం వాళ్ల వ్యాపారం కోసం రూ.10 వేలు సాయం చేస్తున్నాం. వాళ్లు మరొకరి దగ్గర వస్తువులు, పండ్లు, కూరగాయలు తదితరాలు కొనుగోలు చేసి.. ప్రజలకు విక్రయిస్తున్నారు. తద్వారా వాళ్ల బతుకు వారు బతకడమే కాకుండా.. స్వయం ఉపాధి రంగంలో గొప్ప మార్పు తీసుకొస్తున్నారు. అందువల్లే వారికి తోడుగా నిలిచాం. ఇప్పటి వరకు 15,31,347 మంది చిరు వ్యాపారులుకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణం అందించాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంలో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేశం మొత్తం మీద చిరు వ్యాపారులకు 24.06 లక్షల మందికి రుణాలు ఇస్తే, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగనన్న తోడు పథకం కింద 15.31 లక్షల మందికి రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రుణాలను సంఖ్యాపరంగా తీసుకుంటే దేశ వ్యాప్తంగా 39.21 లక్షల రుణాలకు గాను, ఒక్క మన ఏపీలో మాత్రమే 24.06 లక్షల రుణాలు ఇచ్చామన్నారు. తద్వారా స్వయం ఉపాధి వ్యవస్థలో గొప్ప మార్పు వస్తోందన్నారు. చిరు వ్యాపారులందరూ వాళ్లంతట వారే ఉపాధి కల్పించుకోవడమే కాకుండా సమాజానికి కూడా గొప్ప మేలు చేస్తున్నారని కొనియాడారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఆరవ విడత రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంక్‌ల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నడ్డి విరిగే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లె్లమ్మలు, అన్నదమ్ములకు ‘జగనన్న తోడు’ అందుతోందన్నారు. 3.95 లక్షల మందిలో 3.67 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రెండోసారి రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. వీరు కాక మరో 28 వేల మందికి ఇవాళ రుణాలు ఇస్తూ కొత్తగా ఈ పథకంలోకి తీసుకొచ్చామన్నారు. మొత్తంమ్మీద జగనన్న తోడు ద్వారా దాదాపు 15.31 లక్షల చిరు వ్యాపారుల కుటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వీరంతా ఇతరులపై ఆధార పడకుండా.. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రూ.10 వేలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. ‘ఎవరికి అవసరమైతే వాళ్లు రుణాలు తీసుకుంటున్నారు. తిరిగి చెల్లిస్తున్నారు. వాళ్లకు సహాయంగా బ్యాంక్‌లు తిరిగి రుణాలు ఇస్తున్నాయి. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వెనక్కు తిరిగి ఇస్తోంది. తద్వారా వ్యవస్థలో గొప్ప మార్పు కనిí³స్తోంది’ అని అన్నారు. సీఎం ఏమన్నారంటే.. ఆ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ► ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు.. గంపలు, బుట్టల్లో పెట్టుకుని వస్తువులు అమ్మేవారు.. సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారితో పాటు చేనేతలు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారికి. బొబ్బిలి వీణ వంటివి తయారు చేసే వారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలు బొమ్మలు, లేస్ వర్కర్స్ అందరికీ ఈ రోజు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నాం. ► బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే బ్యాంకులను ఒప్పించి వీరందరికీ సున్నా వడ్డీ పథకం కింద రూ.10 వేలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. వారి కష్టాలు, బాధలు చూసినందుకే.. ► నా సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల బా«దలు, కష్టాలు నా కళ్లతో చూశాను. ప్రతి చోటా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇవన్నీ సా«దారణంగా కనిపించే విషయాలు. ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెట్టుబడి సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ► రూ.1,000 అప్పు కావాలంటే ముందే రూ.100 తీసుకుని, రూ.900 చేతిలో పెట్టి.. నెల నాటికి మళ్లీ ఆ డబ్బులు కట్టించుకుంటూ.. తిరిగి ఈ చిరు వ్యాపారులతోనే వ్యాపారం చేసే అధ్వాన్నమైన పరిస్థితుల్లో సమాజం ఉంది. అలాంటి సమాజంలో మార్పులు తీసుకొచ్చి, వాళ్ల బాధలకు, ఆ రోజు నేను చూసిన వాళ్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్న తపన, తాపత్రయంతోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చాం. ► ఇప్పటి వరకు రుణాలు పొందిన 15,31,347 మందిలో 8,74,745 మంది బ్యాంకులకు రుణం చెల్లించి.. మళ్లీ రెండోసారి రుణాలు పొందారు. ఇలా వీరంతా ఏడాది సైకిల్ పూర్తి చేసుకుని బ్యాంకులతో భేష్ అనిపించుకున్నారు. సకాలంలో చెల్లిస్తే రూ.13 వేల వరకు రుణాలు ► సకాలంలో రుణాలు కడితే రూ.10 వేల నుంచి మరో రూ.వెయ్యి పెంచి రూ.11వేలు, రూ.11 వేల నుంచి రూ.వెయ్యి పెంచి రూ.12 వేలు అందించే కార్యక్రమం చేస్తూ.. రూ.13 వేల వరకు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం. వీళ్లందరికీ జగనన్నతోడుతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, విద్యాదీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ,ఆరోగ్య ఆసరా, రైతు భరోసా అన్ని పథకాలతో మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో వీరందరికీ మంచి జరగాలి. జీవనప్రమాణాలు మారాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావాలి. ► ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు ఆదిమూలపు, బొత్స, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాల్గొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ ► 6 నెలలకు ఒకమారు వడ్డీ లేని రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. 2020 నవంబర్‌లో ఈ దిశగా తొలిసారి అడుగులు పడ్డాయి. ప్రస్తుతం 6వ దశ కార్యక్రమం జరుగుతోంది. సకాలంలో వడ్డీ కట్టిన వారికి తిరిగి వెనక్కు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇచ్చే రూ.15.17 కోట్ల వడ్డీతో కలుపుకుని, సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున రూ.63.65 కోట్లు చెల్లించాం. ► అర్హత ఉండీ కూడా ఎవరైనా ఈ పథకాన్ని అందుకోలేకపోయి ఉంటే ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. అలాంటి వారంతా గ్రామ సచివాలయంలోకి వెళ్లి దరఖాస్తు చేసినా, వలంటీర్‌కు చెప్పడంతో పాటు 1902 నంబరుకు ఫోన్ చేస్తే చాలు. వాళ్లతో దరఖాస్తు నింపించడం మొదలు బ్యాంకులతో టై అప్ చేయించి వాళ్ల వ్యాపారాలకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం దగ్గరుండి చేస్తుంది. ఇది నిరంతరం జరుగుతుంది. ఈ పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్లకు సూచిస్తున్నాను. ► సకాలంలో డబ్బులు కడుతున్న వారి కోసం ఒక బ్యాంకును రెండు సచివాలయాలకు టైఅప్ చేశాం. ఈ రెండు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటూ పనిచేస్తారు. ఎవరైనా రుణాలు చెల్లించలేకపోతే.. మిగిలిన వారి మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి.. సకాలంలో చెల్లించాలి. ఈరోజే సంక్రాంతి చిరు వ్యాపారులందరూ ఈరోజే సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. నాది కూరగాయల అంగడి. నా భర్త కూలి పనులకు వెళ్తాడు. ఇది వరకు పెట్టుబడి కోసం రూ.1,000 అప్పు తీసుకుంటే వడ్డీ కింద ముందుగానే రూ.100 పట్టుకుని ఇచ్చే వారు. రూ.500 వడ్డీ కట్టి రూ.4,500 చొప్పున ఎన్నోసార్లు తీసుకున్నాను. తర్వాత రూ.5 వేలు చెల్లించాను. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగనన్న తోడు కింద రూ.10,000 వడ్డీ లేని రుణం ఇచ్చారు. వ్యాపారం చేసుకుని, సకాలంలో రుణం చెల్లించాను. నాకు మీరు వడ్డీ కూడా జమ చేశారు. తర్వాత రూ.11 వేలు.. ఇప్పుడు రూ.12 వేల రుణం అందజేశారు. – పి.కోటేశ్వరి, కొడవలూరు, నెల్లూరు జిల్లా. ఆత్మగౌరవం కాపాడుతున్నారు.. మీరు మా ఆత్మగౌరవం కాపాడుతున్నారు. నేను టైలరింగ్ చేస్తాను. నాకు ముగ్గురు పిల్లలు. టైలరింగ్ మెటీరియల్ కోసం ఫైనాన్షియర్ దగ్గరకు రూ.10 వేల కోçÜం వెళ్తే.. రూ.1,000 మినహాయించుకుని రూ.9 వేలు చేతిలో పెట్టేవారు. ప్రతిరోజూ సాయంత్రం రూ.200 చొప్పున అప్పు తీరే వరకు కట్టేదాన్ని. మీరు వచ్చిన తర్వాత 2020లో నవరత్నాలతో పాటు మీరు అందించిన జగనన్న తోడు మాకు చాలా ఉపయోగపడింది. మా అమ్మ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నప్పుడల్లా నా పెద్ద కొడుకు డబ్బులు పంపించాడని ఆనందంగా చెబుతూ ఉంటుంది. – మాధురి, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా అడగకుండానే వరాలు అన్నా.. మీరు అడగకుండానే వరాలు ఇచ్చిన దేవుడు. నేను టైలరింగ్ చేస్తాను. రూ.10 వేలు వడ్డీకి తీసుకుంటే రూ.2 వేలు వడ్డీ తీసుకుని రూ.8 వేలే ఇచ్చేవారు. ఇలా ఎన్నాళ్లుగానో నా కష్టం వడ్డీ వ్యాపారుల పాలయ్యేది. మీరు వచ్చాక ఆ దుస్థితి పోయింది. మాకు మేలు జరిగింది. వలంటీర్ రెండు రోజుల్లోనే నాకు లోన్ మంజూరు చేయించారు. మేం నలుగురు అమ్మాయిలం. మాకు మగబిడ్డ లేడని అమ్మానాన్నలు బాధ పడేవాళ్లు. మా అమ్మానాన్నలకు ఉన్న ఏకైక మగబిడ్డ మీరే అన్నా. మీ పథకాల వల్ల మేం హాయిగా జీవిస్తున్నాం. – శశికళ, కడప, వైఎస్సార్ జిల్లా జగనన్నే వన్స్ మోర్ అంటున్న జనం మీ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిపోయారు. ఆ రోజు వారందరికీ నేను తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఇప్పటివరకు 15 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.2,400 కోట్లకు పైగా రుణాలు అందించారు. చిరు వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందుకే జగనన్నే వన్స్ మోర్.. అంటున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చిరు వ్యాపారుల కుటుంబాల్లో వెలుగు చిరు వ్యాపారులు, కుల వృత్తుల వారు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకుని.. రోజు వడ్డీలు, వారపు వడ్డీలు, నెల వడ్డీల కోసం వారు సంపాదించిన దాంట్లో 90 శాతం చెల్లించే దుస్థితిని మీరు (సీఎం) మార్చేశారు. ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల్లో రూ.10 వేలు రుణాలిచ్చే విధంగా మీరు తీసుకున్న చర్యలు లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపాయి. వారందరూ కూడా మీరే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి -
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశాను
-
చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం
-
చిరు వ్యాపారుల పెట్టుబడికి భరోసా
సాక్షి, అమరావతి: చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడుతూ జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది. పూర్తి వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను అందించనుంది. సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. వారి కష్టాన్ని చూశారు.. ఆదుకున్నారు.. తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసి, వారి కడగండ్లను స్వయంగా విన్న వైఎస్ జగన్.. సీఎం కాగానే ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్యం కష్టంపైనే ఆధారపడి గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. బుధవారం అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించింది. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం పొందిన వారు 8,74,745 మంది. నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్మెంట్ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.63.65 కోట్లు వడ్డీ చెల్లించింది. ముఖ్యమంత్రి తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉంటోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13 వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు తీసుకుంది. వీరందరికీ జగనన్న తోడు.. గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు.. రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.. గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారందరికీ జగనన్న తోడు పథకం వర్తిస్తోంది. సైకిల్, మోటారు సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసే వారితో పాటు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. -
నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా!
అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. తేడా.. ముఖ్యమంత్రి మార్పు మాత్రమే. గతంలో చేసిన అప్పులతో పోల్చితే.. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఇప్పుడు తక్కువ. గతంలో 19 శాతం సీఏజీఆర్ ఉంటే ఇప్పుడు 15% మాత్రమే ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతోంది? ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు, అవినీతి లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. – సీఎం జగన్ 80% అక్క చెల్లెమ్మలే జగనన్న తోడు లబ్ధిదారుల్లో 80 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది ఒక విప్లవం కాగా ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలే 80 శాతం మంది ఉండటం మహిళా సాధికారిత, సామాజిక న్యాయానికి నిదర్శనం. గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వం. వారు బాగుంటే చాలనుకున్నారు. ఆ పెత్తందార్లకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వారికి మద్దతు పలికే దత్తపుత్రుడికి మంచి జరిగితే చాలనుకుంటారు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచనను గత ప్రభుత్వం ఏ రోజూ చేయలేదని, గత పాలకులది పెత్తందారీ మనస్తత్వమని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. దుష్ట చతుష్టయానికి మంచి జరిగితే చాలనేది వారి విధానమన్నారు. గత సర్కారుది దోచుకో.. పంచుకో.. తిను (డీపీటీ) విధానమైతే ఇప్పుడు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. ‘అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్.. కానీ ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు? గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మారారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులకు ఏటా రూ.పది వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందించే జగనన్న తోడు పథకం ద్వారా కొత్తగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ.395 కోట్ల రుణాలను సీఎం మంజూరు చేశారు. ఆర్నెల్ల కు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులకు మరో రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాలకు జమ చేశారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలిలా ఉన్నాయి. ఖాతాల్లోకి నగదు జమ చేసిన తరువాత లబ్ధిదారులను అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వ్యాపారం కాదు.. గొప్ప సేవ దేవుడి దయతో ఇప్పటివరకు 15,03,558 కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.2,011 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించి మంచి చేస్తున్నాం. ఈరోజు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.395 కోట్ల మేర వడ్డీ లేని బ్యాంకు రుణాలతో తోడ్పాటు కల్పిస్తున్నాం. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నాం. వీరంతా తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరికొంత మందికి పని కల్పిస్తున్నారు. నామమాత్రపు లాభాలనే సంతోషంగా తీసుకుంటూ సమాజానికి సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనేకంటే గొప్ప సేవ అనేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. నడ్డి విరిచే వడ్డీలు.. బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారులకు అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక చిరువ్యాపారులతో పాటు సంప్రదాయ చేతివృత్తిదారులు పడుతున్న బాధలు నా పాదయాత్రలో కళ్లారా చూశా. చాలా సందర్భాల్లో రూ.వెయ్యికి రూ.100 చొప్పున రోజువారీ వడ్డీలు కట్టాల్సిన దుస్థితి. ఉదయాన్నే వడ్డీకి తీసుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన సరుకులను విక్రయించి సాయంత్రానికి వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి. రూ.100కు రూ.పది చొప్పున నడ్డి విరిచే ఈ వడ్డీల బారి నుంచి తప్పించి లక్షల కుటుంబాలకు అండగా ఉంటేనే వారి జీవితాలు బాగుపడతాయని పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆ మాటకు కట్టుబడి జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచింది. దేశంలోనే అత్యధికంగా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు 34 లక్షల మందికి ఇలా తోడ్పాటు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటే ఒక్క మన ఏపీలోనే అందులో సగభాగం అంటే 15.03 లక్షల మందికిపైగా బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటునిచ్చిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలు. రుణ మొత్తం ప్రతి విడతకు రూ.వెయ్యి పెంచేలా.. ఈ 15.03 లక్షల మందికిపైగా లబ్ధిదారుల్లో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు దాదాపు 5.08 లక్షల మంది. సకాలంలో రుణాలు కడితే వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తిరిగి చెల్లించడమే కాకుండా బ్యాంకులు మళ్లీ రుణాలు మంజూరు చేస్తాయి. సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆర్నెల్ల్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. రుణం తీరిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హులు. ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వెయ్యి చొప్పున పెంచేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం. దీనివల్ల చిరు వ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ పది శాతం పెరుగుతుంది. ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు ఇప్పటివరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్ధిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారాన్ని మోస్తూ తిరిగి చెల్లించిన మొత్తం రూ.48.48 కోట్లు. ఇందులో భాగంగా గత ఆర్నెల్ల్లకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని ఇప్పుడు బటన్ నొక్కి రీయింబర్స్ చేస్తున్నాం. నాడు.. రూపాయైనా విదల్చలేదు ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లు, రోడ్ల పక్కన, మోటార్ సైకిల్, సైకిళ్ల మీద వీధి వీధీ తిరిగి వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్, కూరగాయలు, పళ్లు లాంటి వాటిని విక్రయిస్తూ లక్షల మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరిని బాగు పర్చాలన్న ఆలోచన గత పాలకులకు రాలేదు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నారనే సంగతి తెలిసి కూడా సాయం చేయలేదు. మనసు లేని పాలకులు... నిరుపేదలైన చిరువ్యాపారులే కాకుండా సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్క్స్ చేసేవారు, ఇతర సామగ్రి తయారు చేసేవారు, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తిదారులు.. వీరందరికీ వడ్డీ లేని రుణాలిచ్చే ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంగత ప్రభుత్వ హయాంలో జరగలేదు. గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. నాడు డీపీటీ.. నేడు డీబీటీ దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతిలో గత సర్కారు హయాంలో డీపీటీ స్కీం అమలు చేశారు. ఈ రోజు మన ప్రభుత్వంలో నేరుగా బటన్ నొక్కుతున్నాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీతో లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. ఈ రకంగా దాదాపు రూ.1.65 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. ప్రతి కుటుంబానికి 3 –4 పథకాలు ఈ రోజు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న 15.03 లక్షల మందిలో చాలామందికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతి కుటుంబానికీ కనీసం 3 – 4 పథకాలు అందుతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేదు. అన్న ఉన్నారనే ధైర్యం.. పాదయాత్రలో చిరు వ్యాపారులు తమ ఇబ్బందులను మీ దృష్టికి తెచ్చినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారస్తులు జలగల్లా పీడించిన రోజులు పోయి మా అన్న ఉన్నారనే ధైర్యం చిరు వ్యాపారుల్లో కనిపిస్తోంది. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్లకు వెళ్లినప్పుడు అది స్పష్టంగా తెలుస్తోంది. చిరువ్యాపారుల కుటుంబాలను ఆదుకుంటూ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. మా అన్న, మా తమ్ముడు అండగా ఉన్నారన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి చిరు వ్యాపారులకు తోడు సీఎంగా మీ ఆలోచనా విధానం, భావజాలం ఒక్కటే.. సమాజంలో ఏ వర్గం, ఏ వ్యక్తీ అభివృద్ధి, సంక్షేమానికి దూరం కాకూడదన్నదే మీ లక్ష్యం. అభివృద్ది, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలు, కాల్‌మనీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా జగనన్న తోడు చిరువ్యాపారులకు నిజమైన తోడుగా నిలిచింది. అవినీతికి ఆస్కారం లేకుండా రూ.1.65 లక్షల కోట్ల పైచిలుకు పేదలకు అందించారు. – ఆదిమూలపు సురేష్, మునిసిపల్ శాఖ మంత్రి మీరేంటన్నా.. తిరిగి డబ్బులిస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నా కుమార్తెను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోయా. అప్పుడు మీరు సీఎంగా లేనందుకు బాధపడుతున్నా. అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లలో చేర్చాం. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న నా కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చా. మీరేంటన్నా.. మాకు తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మహిళలకు గుర్తింపు, భరోసా లభించింది. దిశ యాప్ వల్ల ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.లక్ష దాకా లబ్ధి పొందుతున్నా. టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. నేను పండ్ల వ్యాపారం చేస్తున్నా. నా భర్త టైలర్. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేశాం. వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోయేది. జగనన్న తోడుతో రూ.10 వేలు లోను వచ్చింది. సకాలంలో తీర్చడంతో వడ్డీ భారం తగ్గింది. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలి. – షేక్ షాజిదా, గుంటూరు జిల్లా మీలా ఎవరూ ఆలోచించలేదు.. ఇంటి దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తా. వడ్డీ వ్యాపారుల దగ్గరికి రూ.10 వేల కోసం వెళితే రూ.1,000 మినహాయించుకుని రూ.9,000 ఇచ్చేవారు. రూ.10,000 కట్టకుంటే మళ్లీ వడ్డీలు వేసేవారు. జగనన్న తోడు పథకాన్ని వలంటీర్ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేయడంతో రుణం వచ్చింది, కూరగాయల కొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నా. రోజూ రూ.500– రూ.800 ఆదాయం వస్తోంది. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. నా కుమార్తెకు అమ్మఒడి, నాకు సున్నావడ్డీ వచ్చింది. మా మామయ్యకు రైతుభరోసా వచ్చింది. పంటల బీమా వచ్చింది. మీలా గతంలో ఎవరూ ఆలోచించలేదు. నా కుటుంబం రూ.82 వేల దాకా లబ్ధి పొందింది. – ఎం. మాధవి, పెద్దపాడు, కర్నూలు మళ్లీ మళ్లీ.. మీరే మాది చిన్న టిఫిన్ కొట్టు. కష్టపడినదంతా వడ్డీలకే సరిపోయేది. మాకు ఏమీ మిగిలేది కాదు. వలంటీర్ ద్వారా జగనన్న తోడు పథకం గురించి తెలుసుకుని రుణం తీసుకున్నా. రెండో విడత కూడా రుణం తీసుకుని వ్యాపారాన్ని పెంచుకున్నా. సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా వచ్చింది. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ కూడా అందింది. మా ఆయన చనిపోవడంతో పెన్షన్ కూడా వస్తోంది. మళ్లీ మళ్లీ మీరే సీఎంగా రావాలి. – ఎం.లక్ష్మి రామతీర్ధం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా -
జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్
-
ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 5876 మంది చిరు వ్యాపారులు మాత్రమే నమోదయ్యారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో గురువారం.. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. 2023-2024 నాటికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 3 కోట్ల మంది వివిధ రకాలైన చిరు వ్యాపారులు, వర్తకులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వారిని ఈ పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. చదవండి: చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి ఈ పథకం కింద ఈ ఏడాది జూలై 17 వరకు దేశవ్యాప్తంగా కేవలం 50680 మంది మాత్రమే నమోదయ్యారని మంత్రి చెప్పారు. గడిచిన రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది చిన్న వ్యాపారులు, వర్తకులు, వీధి వ్యాపారులు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ పథకంలో ఇప్పటికే నమోదయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఆయా రాష్ట్రాల్లో అర్హులైన లబ్దిదారులు ఈ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ పెన్షన్ పథకంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు. -
చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. చదవండి: AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ అంతకుముందు.. ఈ పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు తోడ్పాటునందించాలని కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు సీఎం జగన్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
కోవిడ్ కష్టాల్లో ‘తోడు’ నీడగా
సాక్షి, అమరావతి: కోవిడ్ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో దాదాపు 82% మంది చిరు వ్యాపారులు కరోనాతో ఆదాయాన్ని కోల్పోయి కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు ఎదుర్కొన్నట్లు పలు నివేదికల్లో వెల్లడైందన్నారు. ఇటీవల డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా ఇవే అంశాలను చూశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని అధిగమించి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పారదర్శకంగా నేరుగా నగదు జమ చేసినట్లు చెప్పారు. పేదలను దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మన ప్రభుత్వమే అక్కున చేర్చుకుందని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకం మూడో విడత కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. మీ అన్నగా.. తమ్ముడిగా దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి చిరు వ్యాపారికీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తాజా లబ్ధిదారులతో కలిపి ఇప్పటిదాకా 14,16,091 మందికి రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలిచ్చి మంచి చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సంతోషంగా చెబుతున్నా. క్రమం తప్పకుండా వడ్డీ కట్టినవారందరికీ దాదాపు రూ.32.51 కోట్లు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాం. అరకొర ఆదాయంతోనే స్వయం ఉపాధి నిజానికి ఈ వ్యాపారాలతో పెద్దగా ఆదాయాలు వచ్చే పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి అది వ్యాపారం అనేకంటే మనకు అందిస్తున్న గొప్ప సేవ అనడం సమంజసం. రకరకాల వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు... తదితరాలను పుట్‌పాత్ మీద, తోపుడు బళ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్ సైకిళ్ల మీద, ఇళ్ల వద్ద విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. మనం చేస్తున్న ఈ సహాయం లక్షల మంది చిరు వ్యాపారులు సొంత కాళ్లమీద నిలిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ కష్టాలను దగ్గరగా చూశా.. చిరు వ్యాపారులు తమ పొట్ట పోసుకుంటూనే అనేకమందికి మేలు చేస్తున్నారు. సరుకులు రవాణా చేసే ఆటోల వారికి, మూటలు ఎత్తే కూలీలకు, మిగతా వారికి కూడా ఉపాధి కలిగే గొప్ప వ్యవస్ధ ఇది. చిరు వ్యాపారుల జీవితాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దగ్గరగా చూశా. అసంఘటిత రంగం కావడంతో బ్యాంకు రుణాలు దక్కని పరిస్థితులను, కష్ట నష్టాలు, అవసరాలను చాలా దగ్గర నుంచి స్వయంగా చూశా. బ్యాంకు రుణాలిస్తే గ్యారంటీ ఎవరు ఇస్తారనేది పెద్ద మీమాంస. తోడుగా నిలబడాలనే జగనన్న తోడు... ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి.. వారికి మంచి జరగాలి.. అండగా ఉండాలనే ఆలోచనల నుంచి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చాం. ప్రభుత్వమే పూచీకత్తు వహించి బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాం. లబ్ధిదారులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి తిరిగి రుణం పొందేలా ప్రోత్సహిస్తున్నాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించి రీయింబర్స్ చేసి తోడుగా నిలుస్తోంది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లు చిరు వ్యాపారులు రోజువారీ విక్రయాలు సాగించేందుకు ఇన్నాళ్లూ మరో మార్గం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వంద రూపాయలు తీసుకుంటే సాయంత్రానికి రూ.10 వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. రూ.10 వడ్డీతో వ్యాపారాలు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితుల్లో ఈ రంగం ఉండేది. ఆ దుస్థితిని తొలగించి చిరు వ్యాపారులందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇతర పథకాలతోనూ లబ్ధి జగనన్న తోడు ద్వారా 14.16 లక్షల మందికిపైగా మంచి జరుగుతోంది. అంతేకాదు వారికి జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణం, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు లాంటి వాటిలో ఒక్కొక్కరికి కనీసం మూడు, నాలుగు పథకాల ద్వారా మేలు జరిగే ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే... వీటన్నింటి ద్వారా మార్పు రావాలి. వారి జీవితాలు మారాలి, మెరుగైన పరిస్థితుల్లో ఉండాలనే తపనతో చేస్తున్నాం. సంప్రదాయ చేతి వృత్తులవారికీ... చిరు వ్యాపారులను మాత్రమే కాకుండా, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణల తయారీదారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారీదారులు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్కర్లు, కుమ్మర్లు.. ఇలా చేతివృత్తుల మీద ఆధారపడి జీవించేవారందరినీ కూడా జగనన్న తోడు పథకం కింద తీసుకొచ్చాం. వారికి కూడా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణమిచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. పొరపాటున ఎవరైనా మిగిలిపోతే ఇంకా ఎవరికైనా పొరపాటున రాకపోతే కంగారు పడొద్దు. గతంలోనే చెప్పినట్లు.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి, అర్హులెవరూ మిస్ కాకూడదని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికైనా పొరపాటున రాకపోతే వలంటీర్‌ని సంప్రదించండి. సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోండి. జగనన్న తోడు పథకాన్ని సెర్ఫ్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. నిరంతర పర్యవేక్షణ కోసం www.gramasachivalayam.ap.gov.in పోర్టల్ కూడా ఏర్పాటు చేశాం. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి రుణాలు ఇప్పించడం వరకు వలంటీర్లు పూర్తిగా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తారు. లబ్ధిదారులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒక్క విషయం మరువద్దు.. ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్ధను నీరుగారనివ్వొద్దు. ఇది కనుక నీరుగారిపోతే... మనం తీసుకున్న రుణాలను మళ్లీ బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్ధే కుప్పకూలిపోతుంది. కట్టిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు మళ్లీ కచ్చితంగా రుణాలిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఉంది. ఇదొక రివాల్వింగ్ ఫండ్ మాదిరిగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి.. ఆ తర్వాత టైం ప్రకారం కట్టండి. అలా చేస్తే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తాన్ని మీకు వెనక్కి తిరిగి ఇస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం తిరిగి కట్టకపోతే బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. ఇంకా ఇతర లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశాన్ని కూడా మనం అడ్డుకున్నట్లవుతుందని అందరూ గుర్తెరిగి మనసులో పెట్టుకోవాలని మీ కుటుంబ సభ్యుడిగా కోరుతున్నా. నిశ్చింతగా వ్యాపారాలు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి జగనన్న తోడు అమలు చేస్తుండటంతో 14 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. సెర్ప్, మెప్మా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సకాలంలో రుణాలు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. చిరు వ్యాపారులు ఇప్పుడు హాయిగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్న పరిస్ధితి రాష్ట్రంలో నెలకొంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని మోడల్‌గా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు రెండు చోట్లా అమలు చేస్తోంది. ప్రభుత్వ తోడ్పాటుతో చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. – మంత్రి బొత్స సత్యనారాయణ తోడుతోపాటు ఇతర పథకాలు కూడా.. మా ఆయన ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్తుండగా నేను ఇంటిదగ్గర టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నా. గతంలో రూ.ఐదు, రూ.పది చొప్పున అప్పు చేసి తెచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోగా ఏమీ మిగిలేది కాదు. ఇక కరోనాతో అంత వడ్డీకి కూడా డబ్బులు దొరకలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక వ్యాపారం నిలిపివేసిన సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ. ఆరు వేలు సంపాదిస్తున్నా. నాకు ఆసరా సాయం అందింది. సున్నా వడ్డీ వచ్చింది. గతంలో మాకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఇప్పుడు వలంటీర్లు అన్నీ తెచ్చి ఇచ్చారు. జగనన్న ఇంటి పట్టా కూడా వచ్చింది. మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మంచి చికిత్స అందింది. – సయ్యద్ రుబియా బేగం, లబ్ధిదారు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా ఆ పేరు ఎవరు పెట్టారో కానీ.. మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ చెల్లించారు. నా భర్త తాపీ మేస్త్రి. పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే పెట్టుబడికి డబ్బులు లేవు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే రూ.10 వేలు తీసుకుంటే రూ.వెయ్యి వడ్డీ కింద ముందే మినహాయించుకుని రూ.తొమ్మిది వేలు ఇస్తానన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ నెలకు రూ.5 వేల నుంచి పది వేలు సంపాదిస్తున్నా. మీరు మాకు ష్యూరిటీ లేకుండా డబ్బులు ఇప్పించారు. ఈ పథకానికి జగనన్న తోడు అని ఎవరు పేరు పెట్టారో కానీ మాకు మాత్రం ఎంతో తోడుగా ఉంది. ఆసరాతోపాటు వివిధ పథకాల ద్వారా కూడా మా కుటుంబం లబ్ధి పొందింది. – కె.కళ్యాణి, లబ్ధిదారు, రేఖవానిపాలెం, విశాఖ జిల్లా నాలుగు రెట్లు ఆదాయం మేం పండ్ల వ్యాపారం చేస్తాం. బయట అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటే రోజూ రూ.200 – రూ.300 మాత్రమే మిగిలేవి. జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఎంతో అండగా నిలుస్తోంది. బ్యాంకు ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం అందుతోంది. మీ ఆలోచనకు పాదాభివందనం. ఇప్పుడు రోజూ రూ.700 నుంచి రూ.800 సంపాదిస్తున్నాం. డిగ్రీ చదివినా పట్టుదలతో వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు సున్నా వడ్డీ అందింది. మా కుటుంబానికి చాలా పథకాలు అందాయి. – శారద, లబ్ధిదారు, రుద్రంపేట, అనంతపురం జిల్లా -
జగనన్న మాకు కొండంత అండ
-
చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం
-
చిరు వ్యాపారులకు అండగా నిలవడమే మా లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందజేస్తోందని తెలిపారు. వడ్డీ రీఎంబర్స్మెంట్ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పేదలను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది కోవిడ్ కారణం చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. నిరుపేదల కుటుంబాలను కాపాడేందుకు సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. అవినీతికి తావులేకుండా పేదలకు రూ. 1.29 లక్షల కోట్లు అందించామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కంటే పేదలను మన రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుందని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
చిరు వ్యాపారులకు తోడుగా..
సాక్షి, అమరావతి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం సోమవారం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఐదారు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారాలకు సైతం రోజుకు మూడు నుంచి పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకుంటూ పలువురు తమ ఆదాయాన్ని వడ్డీ వ్యాపారులకు ధారపోస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. లబ్ధిదారుడు ఆ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. ఇప్పుడు మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే 3.56 లక్షల మందికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తోంది. జమ కానున్న రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బు గత రెండు విడతల్లో జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బులను సోమవారం సీఎం వైఎస్ జగన్.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020లో తొలి విడతలో ఈ పథకం ద్వారా రుణాలు పొందిన వారికి 2021 సెప్టెంబర్ 25న రూ.16.35 కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. రెండు విడతల్లో రుణాలు పొందిన వారికి సంబంధించి 2021 డిసెంబర్ ఆఖరు వరకు అయిన వడ్డీని తాజాగా సోమవారం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం గత రెండు విడతలతో పాటు ప్రస్తుత మూడో విడతలో కలిపి మొత్తం 14.16 లక్షల మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది బీసీలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో 2.74 లక్షల మంది ఎస్సీలకు లబ్ధి చేకూరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం మందికి, 12.46 శాతం మంది కాపులకు ప్రయోజనం కలిగింది. మరో 12 శాతం మంది కాపుయేతర ఓసీ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 30 శాతం మంది బడ్డీ కొట్టు చిరు వ్యాపారులు కాగా, మిగతా వారంతా పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు ఉన్నారు. -
మరోదారి లేదు.. ఊరి చివరకు ‘కొట్టు’కెళ్లారు..
సాక్షి, అమరావతి: గతంలో జాతీయ, ఇతర ప్రధాన రహదారుల వెంబడి అక్కడక్కడా దాబాలు కనిపించేవి. ప్రయాణికులు నులక మంచాలపై కూర్చుని.. చెక్క బల్లలపై పెట్టిన ఆహారాన్ని ఆరగించే దృశ్యాలు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర.. రోడ్లపక్కన వెలిసిన దుకాణాలు కన్పిస్తున్నాయి. ఇది కోవిడ్ తెచ్చిన మార్పు. 2020 మార్చి తర్వాత కోవిడ్ మహమ్మారి కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు కనుగొన్న ఉపాధి మార్గమిది. లాక్‌డౌన్‌తో మొదలై.. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూరగాయల షాపులు సైతం మూతపడ్డాయి. ఆ తరువాత లాక్డౌన్ సడలించినప్పటికీ వైరస్ భయంతో మార్కెట్‌కు వెళ్లేందుకు జనం కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అలా అని ఇంటింటికీ వెళ్లి విక్రయాలు చేద్దామంటే.. వైరస్ మోసుకొస్తారనే భయం వెంటాడేది. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారులు బాగా చితికిపోయారు. గత్యంతరం లేని స్థితిలో వారు రోడ్డు బాట పట్టారు. జాతీయ రహదారులే కాకుండా.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర రోడ్ల పక్కన చిన్నపాటి షాపులు పెట్టుకుని అమ్మకాలు సాగించారు. అటుగా పోయే ప్రయాణికులు ఆగి అవసరమైన వాటిని అప్పటికప్పుడు కొనుగోలు చేసుకుని వెళ్లడంతో ఈ ట్రెండ్‌కు ఆదరణ లభించింది. ఫలితంగా జాతీయ రహదారుల పక్కన కూరగాయలు, పండ్లు, ఎండు చేపలు, పచ్చి చేపలు, రొయ్యలు, తినుబండారాలు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఏ రోజు వ్యాపారం ఆ రోజే కావడంతో అక్కడ తాజా పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయని, అవసరమైనప్పుడు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులు పాటిస్తున్న ఈ ఐడియా వారి కుటుంబాలను నిలబెడుతోంది. బతుకుదెరువు కోసమే ఈ ‘మార్గం’ నేను 16 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాను. గతంలో భీమవరం మార్కెట్లో షాపు అద్దెకు తీసుకుని కూరగాయలు అమ్మేవాడిని. కరోనా ఫస్ట్‌వేవ్ నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. కరోనా ఉధృతి పెరగడంతో మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇబ్బందులు పడ్డాం. చివరకు నిత్యం వాహనాలు తిరిగే రోడ్డు పక్కన కూరగాయల షాపు పెట్టాను. దారిన పోయేవారు వచ్చి కావాల్సిన కూరగాయలు కొనుక్కుని వెళ్తారు కాబట్టి అంతగా రద్దీ ఉండదు. ఊరి చివర ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి కార్లు, బైక్‌లు పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బంది లేదు. గతంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం రావడం లేదు. కానీ.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. కరోనా దెబ్బకు కొత్త మార్గాన్ని ఎంచుకుని ఉపాధి చూసుకుంటున్నాం. – జవ్వాది దుర్గాప్రసాద్, కూరగాయల వ్యాపారి, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు పైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తాం రెండేళ్లుగా కరోనా వైరస్ కలవరపెడుతూనే ఉంది. షాపులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా వైరస్ భయం వెంటాడుతోంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు పక్కన పెట్టిన కూరగాయలు, పండ్లు, ఇతర సరుకుల్ని అప్పటికప్పుడు కొనుక్కు తెచ్చుకుంటున్నాం. రోడ్డుపైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తున్నాం. ఇబ్బందులకు తావు లేకుండా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటోంది. – శనివారపు శ్రీనివాస్, ఉండి అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా -
సున్నా వడ్డీ పొందేలా చూసుకోండి
ఇంకా రుణం చెల్లించని వాళ్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబర్‌లోగా రుణాలు చెల్లించండి. ఆటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మళ్లీ మీకు రూ.10 వేలు బ్యాంకు రుణం ఇస్తుంది. మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం. అలా చెప్పకపోతే ఇది తెలియక మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారనేది మా భయం. అలాంటి పరిస్థితి రాకూడదన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సకాలంలో కిస్తీలు కట్టడం ద్వారా బ్యాంకర్ల విశ్వాసం పొందాలని సూచించారు. నెల నెలా కిస్తీలు కట్టకపోతే సున్నా వడ్డీ రుణం పొందడానికి వీలుండదని, అటువంటి పరిస్థితిని తెచ్చుకుని మళ్లీ వడ్డీ వ్యాపారుల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో రుణం చెల్లించిన చిరు వ్యాపారులు సున్నా వడ్డీ రాయితీ పొందడమే కాకుండా మళ్లీ సున్నా వడ్డీకి కొత్త రుణం పొందవచ్చని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2021 జూన్‌లో రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా రెండు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి అమలు చేస్తామన్నారు. రుణం తీసుకున్న వారి కాల పరిమితి డిసెంబర్ నాటికి పూర్తయితే, ఆ లోన్ క్లోజ్ చేసి.. వారి వడ్డీ డబ్బులు వెనక్కిస్తామని తెలిపారు. ఒకసారి డిసెంబర్లో, మరోసారి జూన్ నెలలో ఇలా చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు చెల్లించిన వారికి వడ్డీ సొమ్ము వెనక్కు ఇవ్వడంతో పాటు అదే రోజు మళ్లీ కొత్తగా రుణాలిచ్చే కార్యక్రమాన్ని కలిపి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి ► ఈ పథకానికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి. మళ్లీ డిసెంబర్లో, జూన్‌లో తిరిగి వడ్డీ లేని రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో కానీ ఎవరికైనా సందేహాలుంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు. ► తాజాగా బ్యాంకర్ల నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్పీఏలు, 11 శాతం ఓవర్ డ్యూస్గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి. ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం అని, అవగాహన కల్పించడం కోసం అక్టోబర్‌లోనే వడ్డీ జమ చేస్తున్నాం. ఇందులో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. ► గ్రామ సచివాలయం, వలంటీర్లు, కలెక్టర్లు అందరూ భాగస్వాములై ఈ విషయం లబ్ధిదారులందరికీ తెలిసేలా చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టకపోతే గడువు దాటినట్లే. అంటే ఓవర్ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజులు కట్టకపోతే ఎన్పీఏ (నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్) కింద మారుస్తారు. ఈ విషయాలన్నీ వారికి వివరించాలి. ఏ ఖాతా అయినా ఎన్పీఏ అయిందంటే ప్రభుత్వం నుంచి సున్నా వడ్డీ అందని పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. వీళ్ల పరిస్థితి మారాలనేదే లక్ష్యం ► చిరు వ్యాపారుల పరిస్థితి మార్చి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. వారి ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇప్పించేలా ఒప్పించి ఈ పథకాన్ని గతేడాది ప్రారంభించాం. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం తిరిగి వారికి వెనక్కు ఇస్తుంది. ► దాదాపు 9,05,458 మందికి రూ.10 వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. గత ఏడాది నవంబర్ 25 నుంచి 5 లక్షల 35 వేల మందికి మొదటి విడతలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 8 నుంచి రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాలు పంపిణీ చేశాం. ► ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు ► తోపుడు బండ్ల మీద పండ్లు, సామాన్లు అమ్ముకునే వారు, నగరాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన చిన్న బంక్ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్ మీద వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునే వాళ్లు.. ప్రతి ఊళ్లో కనిపిస్తుంటారు. ► ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చే స్తోమత వీళ్లకు ఉండదు. గతంలో ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితి. లోన్లు అందక వీరి జీవితాలు తల్లడిల్లిపోయాయి. ► అలాంటి వాళ్లు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ.1,000 వర్కింగ్ క్యాపిటల్ కింద అప్పు తీసుకుంటే రూ.900 మాత్రమే చేతికిస్తారు. అయితే రోజుకు రూ.100 చొప్పున మొత్తం రూ.1,000 కట్టాలి. ఇలాంటి పరిస్థితులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. దుకాణం ఏర్పాటు చేసుకున్నా.. వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసే స్థాయి నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాను. రోజుకు నాలుగు ఐదు వందల రూపాయల ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.15 వేల ఆదాయం వస్తోంది. ఆసరా పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశాను. దాని ద్వారా కూడా ఆర్థికంగా అండ లభించింది. మీ మేలు మరవలేను. – పిలకా పద్మ, సీహెచ్ రాజాం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా అధిక వడ్డీల భారం తప్పింది అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. మీరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా నాకు పది వేల రూపాయలు రుణం వస్తుందని మా వలంటీరు చెప్పాడు. అలా రుణం తీసుకుని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను. మీ వల్ల మా స్కూలు బాగుపడిందని మా పాప చెబుతోంది. మా లాంటి వాళ్లందరం సంతోషంగా ఉన్నాం. –మాధవి, లబ్ధిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా అన్నా.. నేను ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నా జగనన్నా.. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం ద్వారా స్టేట్ బ్యాంక్‌లో రూ.10 వేల రుణం పొందాను. వార్డు వలంటీర్ ద్వారా ఈ పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు ఇచ్చిన రుణంతో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాను. కరోనా సమయంలో ఇది నాకు చాలా మేలు చేసింది. మీరు అమలు చేస్తున్న ఇతరత్రా పథకాల ద్వారా మేము ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. ఆరోగ్యశ్రీ, దిశ యాప్, సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతం. – కె.నాగజ్యోతి, ఆర్ ఆర్ పేట, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా -
చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసిన తర్వాతే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తుండటం సంతోషం కలిగిస్తోందన్నారు. కరోనా కష్ట సమయంలో చిరు వ్యాపారులకు అండగా నిలవడంలో భాగంగా ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో విడతలో 3.70 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాలకు రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రెండో విడతతో కలిపి (తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ.535 కోట్లు) ఈ పథకం కింద 9.05 లక్షల మంది చిరు వ్యాపారులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు వడ్డీ లేని రుణం కింద రూ.905 కోట్లు అందించామని తెలిపారు. తిరిగి రుణాలను వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. దీనివల్ల రుణం తీసుకున్న వారిలో సకాలంలో తిరిగి చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. ఆ తర్వాత బ్యాంకులు తిరిగి వారికి రుణం ఇస్తాయని చెప్పారు. ఈ రకంగా ఈ పది వేల రూపాయలు రివాల్వింగ్ పద్దతిలో చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటుందన్నారు. అర్హులకు ఎవరికైనా రాకపోతే కాంగారు పడొద్దని, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో తనిఖీలు పూర్తి చేసి, ఆరు నెలల్లో వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను – వ్యవస్థలను, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకు రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లు కచ్చితంగా భావించాలి. నా పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూశాను. – చిన్న చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకి, వడ్డీలేని రుణాలు వారికి దొరుకుతాయా అంటే.. ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించ లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. – దేవుడు వీరి తలరాతలు మార్చే అవకాశం ఇస్తే, కచ్చితంగా మారుస్తాను అని మేనిఫేస్టోలో పెట్టాను. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నాం. – జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయి. మిగిలిన 3.70 లక్షల మంది గురించి బ్యాంకులతో మళ్లీ మాట్లాడి, వారిపై ఒత్తిడి తెచ్చాం. బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీ నిధి వంటి బ్యాంకులను కూడా రంగంలోకి తీసుకువచ్చి ఈ రోజు రుణాలు ఇప్పిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు – గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. – పుట్ పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు చేసేవారు, లేస్, కళంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు కింద పదివేల రూపాయలు వడ్డీలేని రుణంగా అందజేస్తున్నాం. – రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. తొలి విడతలో 5.35 లక్షల మందికి ఇచ్చిన రుణాలకు సంబంధించి వారు సకాలంలో బ్యాంకుకు చెల్లించిన వడ్డీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో ఇవాళో, రేపో జమ చేస్తాం. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ – 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు ఈ వడ్డీ లేని రుణం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా 1902 అనే నంబర్‌కు ఫోన్ చేస్తే పరిష్కరిస్తారు. అర్హత ఉన్న వారెవరైనా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ జరుగుతుంది. – ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చూసి, వాటిని పరిశీలించి, ఆరు నెలలకు ఒకసారి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. తమకు ఈ పథకం రాలేదని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. – ఈ కార్యక్రమం వల్ల 9.05 లక్షల మంది పేదింటి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. చిరు వ్యాపారులకు పెద్ద సాయం ప్రజలకు ఇచ్చిన మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా మంచి పాలన సాగుతుందో అందరం చూస్తున్నాం. రెండేళ్ల పాలనలో సీఎం జగన్ ఏం చేసినా, అది పేదల కోసమే ఆలోచించి చేస్తారనే మాట మరోసారి రుజువవుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్ పాలన ఆదర్శంగా నిలుస్తోంది. జగనన్న తోడు ద్వారా అందే రుణం చిన్నదిగా కనిపిస్తున్నా.. చిరు వ్యాపారులకు మాత్రం చాలా పెద్ద సహాయం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చిరు వ్యాపారులైన పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో నా పాదయాత్రలో స్వయంగా చూశాను. చిన్న చిన్న మొత్తాలు అధిక వడ్డీతో అప్పుగా పొంది.. ఆ మొత్తంతో పండ్లు, కూరగాయలు కొనుక్కొని తలపై పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ ఎందరో తారసపడి వారి బాధలు చెప్పుకున్నారు. రూ.5 వేలు.. రూ.10 వేలు తక్కువ వడ్డీకి లభిస్తే మా జీవితాలు సాఫీగా సాగుతాయని ఆశ పడ్డారు. వారి కష్టం చూసి ఆ నాడు మాటిచ్చాను. ఆ మాట మేరకు ఇవాళ మొత్తంగా 9.05 లక్షల మందికి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించామని సగర్వంగా చెబుతున్నాను. బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. మీరు రుణాలు ఇస్తే.. వారు సకాలంలో చెల్లిస్తారని చెప్పాను. అర్హత ఉంది అని తేలిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారుల జీవితాలను మార్చడానికి ఈ సాయం ఎంతగానో ఉపయోగ పడుతుంది. మాకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే జగనన్నా.. కరోనా కష్టకాలంలో మీరు అందరినీ ఆదుకుంటున్నారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే. మేం వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు ఆదుకున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీ పథకాల వల్ల పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. – సరళాదేవి, తాడికొండ, గుంటూరు జిల్లా -
9.05 లక్షల మందికి జగనన్న తోడు
-
9.05 లక్షల మందికి జగనన్న తోడు
సాక్షి, అమరావతి: జగనన్న తోడు పథకం కింద మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇస్తున్న 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చినట్లు అవుతుంది. కమర్షియల్ బ్యాంకులు ముందుకు రాకపోయినా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా గుర్తించింది. వలంటీర్లు 9,05,630 మందిని గుర్తించగా.. వీరిలో ఇప్పటికే 5,35,172 మందికి రుణాలు అందించారు. కరోనా కారణంగా మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలు వాణిజ్య బ్యాంకులు పరిమిత సంఖ్యలోనే రుణాలు ఇస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రెండో విడతలో రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్), స్త్రీనిధి సహకార సమాఖ్య ద్వారా రుణాలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విడతలో 3,70,458 మందికి రుణాలు ఇస్తుండగా.. ఇందులో అత్యధికంగా స్త్రీనిధి ద్వారానే 2.81 లక్షల మందికి రుణమిస్తున్నారు. మరో 75 వేల మందికి ఆప్కాబ్ రుణం అందిస్తుండగా.. కమర్షియల్ బ్యాంకులు కేవలం 14 వేల మందికే రుణమిస్తున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ ఎన్.భరత్ గుప్తా తెలిపారు. ఈ జాబితాలో పేరు లేని వారు కంగారుపడాల్సిన అవసరం లేదని, వలంటీర్‌ను సంప్రదించినా లేక గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేసినా.. మూడు నెలల్లో అర్హులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడమే లక్ష్యం పుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్లు, గంపలు, బుట్టల్లో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునేవారితోపాటు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిచేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మల తయారీ, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవించేవారికి ప్రభుత్వం జగనన్న తోడు కింద సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తోంది. వీరిలో అత్యధికులు తమ వ్యాపార పెట్టుబడి కోసం రూ.3 నుంచి రూ.10 వరకు రోజువారీ వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. తమ ఆదాయంలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులకే వెచ్చిస్తూ కుదేలవుతున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిన సీఎం వైఎస్ జగన్ వారిని ఆదుకోవడం కోసం జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి.. రుణంపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది. -
నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..!
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇంటికొచ్చి కలవాలని చెప్పినా.. అయినా పట్టించుకోలే.. నాకు తెలియకుండానే షాప్ పెడ్తార్రా..!’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఆదివారం రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. షాప్ యాజమానిపై దాడి చేశాడు. పక్కనే రాజస్తాన్‌కు చెందిన షాప్ యాజమానిని బూతులు తిట్టగా, అనుచరులు రంజన్లను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన సముద్రాల ఓదెలు రంజన్లతోపాటు ఇతర మట్టిపాత్రలను విక్రయించుకునే షాపును మూడురోజుల క్రితం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీజంక్షన్ సమీపంలో ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సదరు కార్పొరేటర్ భర్త తన ఇంటికి వచ్చి కలవాలని సూచించాడు. పనుల బిజీతో ఓదెలుకు వీలుకాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కార్పొరేటర్ భర్త ఆదివారం రాత్రి బూతులు తిడుతూ చేయిచేసుకున్నట్లు ఓదెలు తెలిపాడు. పక్కనే ఉన్న రాజస్తాన్వాసుల రంజన్ల షాప్ వద్దకు వెళ్లి కొన్ని రంజన్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో బాధితులు భయంతో వణికిపోయారు. సింగరేణి పర్మిషన్, మున్సిపల్ అనుమతితో షాప్ ఏర్పాటు చేసినా ఈ దౌర్జన్యం ఏమిటని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
జగమంత అండ
కరోనా వచ్చింది... ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నెలకు లక్షలు ఖర్చు చేసే వాళ్లు కూడా బ్యాంకు అకౌంట్‌ను భయం భయంగా చూసుకోవాల్సి వచ్చింది. బ్రాండెడ్ షర్టు కోసం వేలాది రూపాయల ఖర్చు చేసే వాళ్లు వెయ్యి రూపాయల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. వెయ్యి రూపాయలు చేతిలో ఉంటే వడ్డీ వ్యాపారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఉండదనే చిరు వ్యాపారి బతుకు దాదాపుగా ఛిద్రమై పోయింది. హోల్‌సేల్ మార్కెట్ నుంచి టోకున కూరగాయలు, పండ్లు కొనుక్కుని కాలనీల్లో అమ్ముకుని రోజుకింత అన్నం తినేవాళ్లకు బతకడమే కష్టమైపోయింది. వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి పొద్దున తొమ్మిది వందలే ఇస్తాడు. సాయంత్రం వచ్చి వెయ్యి రూపాయలు దండుకుంటాడు. పదివేల అప్పు కోసం చెయ్యి చాస్తే ఇచ్చేది తొమ్మిది వేలే. పండ్లు అమ్మగా వచ్చిన రాబడిలో వడ్డీ వ్యాపారికి చెల్లించాల్సింది చెల్లించుకోగా మిగిలిన దాంతో రోజులు నెట్టుకురావాలి. అధిక వడ్డీ కోరల నుంచి చిరు వ్యాపారులను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిరు వ్యాపా రుల రక్తాన్ని పీలుస్తున్న వడ్డీని మాఫీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ‘జగనన్న తోడు’ పథకంతో చిరు వ్యాపారుల జీవితాలలో చిరుదివ్వెలను వెలిగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 10 లక్షల పైగా దీపాలవి. రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న తోడు’ లబ్ధిదారులు 10 లక్షలమంది. ప్రాణానికి హాయి ఇరవై ఏళ్లుగా దోశలు, పొంగనాలు వేసుకుని బతుకున్నాను. గత ఏడాది కరోనా వల్ల మొత్తం వ్యాపారం దెబ్బతినింది. ఐదు నెలలు వ్యాపారం లేదు. చేతిలో రూపాయి కూడా లేదు. కరోనా పోయిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టే ధైర్యం లేకపోయింది. ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో లోన్ తెచ్చుకుని మళ్లీ పని మొదలుపెట్టాను. వడ్డీ లేని రుణం కావడం వల్ల సులభంగా వాయిదాలు చెల్లించగలుగుతున్నా. నిమ్మళంగా వ్యాపారం చేసుకుంటున్నా. ప్రాణానికి హాయిగా ఉంది. – జి. తులశమ్మ, అనంతపురం పట్టణం నేను కలెక్టర్ ఆఫీసు ముందు బండి మీద పండ్లు అమ్ముకుంటాను. ఇంతకు ముందు మాకు బ్యాంకుల్లో రుణం వచ్చేది కాదు. బయట ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు పదివేల లోన్ వచ్చింది. బండికి చిన్న మరమ్మతులు చేయించుకున్నాను. పండ్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నాను. – నారాయణమ్మ,అనంతపురం పట్టణం బ్యాంకు లోన్ వచ్చింది కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు టిఫిన్ సెంటర్ తెరవడం కష్టమైంది. తెరిచిన తర్వాత కూడా నెలపాటు వ్యాపారం మునుపటిలా జరగలేదు. టిఫిన్ సెంటర్ సరుకులు కొనడమే కష్టంగా మారింది. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా పదివేల రూపాయల రుణం ఇవ్వడంతో మా ఇబ్బందులు తీరాయి. కావల్సినన్ని సరుకులు కొన్నాను. వ్యాపారం పుంజుకుంది. నెల నెలా కిస్తీలు కట్టి రుణాన్ని చెల్లిస్తాను, అవసరమైనప్పుడు మళ్లీ రుణం తీసుకుంటాను. – నోముల మరియమ్మ, గుంటూరు పట్టణం నేను సోడాలు అమ్ముకుని జీవిస్తున్నాను. గతంలో వ్యాపారానికి పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునే వాడిని. ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులు గడిచేవి కాదు. నా శ్రమంతా ఏమవుతోందని, ఇల్లు గడవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో అని దిగులుగా ఉండేది. కేవలం వడ్డీలు చెల్లించడం కోసమే వ్యాపారం చేస్తున్నానా అని కూడా అనిపించేది. మరో పని తెలియదు. కుటుంబ పోషణకోసం వేరే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో వడ్డీలేని రుణాలు దక్కడంతో నా కష్టానికి ప్రతిఫలం దక్కుతోందనే సంతోషం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగనన్నే నాకు, నా కుటుంబానికి తోడుగా ఉన్నారు. – ఎ. బాబులు, ఏలూరు పట్టణం ముప్పై ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో మొదటి సారి అప్పు కోసం బ్యాంకు వైపు చూసాను. ఇలాంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తాను. తనఖా లేకుండా వడ్డీ ఇచ్చేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మేము తిరిగి కట్టగలం అని నమ్ముతున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. – మాబు, అనంతపురం పట్టణం కష్టకాలంలో ఆదుకుంది కరోనా లాక్‌డౌన్‌తో నా పిండిమర వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాను. బయట అధిక వడ్డీలతో అప్పు తీసుకోవాలంటే భయం. రోజంతా కష్టపడి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత చేతిలో ఏమీ మిగలదు. కష్టమంతా వడ్డీకి ధారపోయాల్సిందే. అటువంటి సమయంలో ‘జగనన్న తోడు’ పథకం ఆదుకుంది. – పి రమేష్, గుంటూరు పట్టణం -
ఇది పేదల మేలు కోరే ప్రభుత్వం
ఆర్థిక వ్యవస్థలోనే కాదు ప్రజల అవసరాలు తీర్చడంలోనూ చిరు వ్యాపారులు కీలకం. తోపుడు బండ్లపై తిను బండారాలు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు లేకపోతే చాలా మంది కడుపు నిండదు. వీరివల్లే అందరికీ ఇంటి ముంగిటే సరుకులు అందుతున్నాయి. వారు ఎండనకా, వాననకా, చలనకా వ్యాపారాలు సాగించకపోతే వారి బతుకుబండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. అందుకే వారికి తోడుగా నిలుస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్డీ కొట్టు కల నెరవేరనుంది నేను బుట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాను. బడ్డీకొట్టు పెట్టుకోవాలన్నది నా కల. అప్పు కోసం బ్యాంకుకు వెళితే రుణం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇప్పించే రూ.10 వేల రుణంతో బడ్డీ కొట్టు పెట్టుకుని నా కల నెరవేర్చుకుంటా. మా పాపకు అమ్మఒడి, మా అమ్మకు చేయూత, నా భర్తకు వాహనమిత్ర వల్ల లబ్ధి కలిగింది. – స్వాతి, పద్మనాభం, విశాఖ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులను ఆదుకునే గొప్ప కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది పేదల మేలు కోరే ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకాన్ని బుధవారం ఉదయం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ‘నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశాను. లక్షల సంఖ్యలో ఉన్న వారందరికి మంచి జరగాలని మనసారా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయ, మీ చల్లని ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం వచ్చింది’ అని చెప్పారు. పల్లెల నుంచి పట్టణాల వరకు వీధుల్లో చిరు వ్యాపారాల ద్వారా జీవిస్తున్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ‘జగనన్న తోడు’ ప్రారంభిస్తోందన్నారు. ‘వారిని చిరు వ్యాపారులు అనడం కంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలందిస్తున్నారని చెప్పాలి. ప్రతి రోజు వారి జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే మొదలవుతాయి. బండ్లపై టిఫిన్లు అమ్మాలన్నా, కూరగాయలు తెచ్చుకుని విక్రయించుకోవాలన్నా తెల్లవారుజాము నుంచే వారి పని ప్రారంభమవుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘జగనన్న తోడు’ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకృతులను పరిశీలిస్తున్న సీఎం జగన్ అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ► వారు చిరు వ్యాపారులు కాబట్టి, ఆదాయం అంతంత మాత్రమే. కానీ శ్రమ మాత్రం చాలా ఉంటుంది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు కావడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు అందవు. అందువల్ల వారు రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ► వారంతా స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరి కొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఆటోల వారికి, సరుకులు దించే కూలీలకు కూడా పని కల్పిస్తున్నారు. అలా వారు మన సమాజానికి మేలు చేస్తున్న మహానుభావులు. గతానికి, ఇప్పటికి తేడా చూస్తే.. ► గతంలో వారికి తోడుగా ఎవరూ నిలబడలేదు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తోడుగా నిలుస్తున్నారు. దరఖాస్తు తీసుకోవడం మొదలు అన్ని రకాల సేవలందిస్తున్నారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు ఎంతో సేవ చేస్తున్నారు. ► వారి దరఖాస్తులు పంపడంతో పాటు, జిల్లా అధికారులతో, బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నారు. వారి తరఫున నిలబడి, రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుందనే నమ్మకం కలిగిస్తున్నారు. బ్యాంకర్ల సమన్వయంతో చిరు వ్యాపారులకు ఇప్పటికే స్మార్ట్ కార్డులు జారీ చేశాం. ► ఒక అన్నగా, తమ్ముడిగా అండగా ఉండి చేయూత ఇవ్వాలని, వారి జీవితాల్లో మార్పు తేవాలని ఎప్పుడూ అనుకునే వాణ్ని. ఇవాళ ఆ పని చేస్తున్నాను. జగనన్న తోడు అనే పథకం ద్వారా వారికి తోడుగా నిలవగలుగుతున్నాను. వడ్డీ భారం ప్రభుత్వానిదే ► సుమారు 10 లక్షల మందికి దాదాపు రూ.1,000 కోట్ల రుణాలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని పదేళ్లకు తీసుకుంటే రూ.1,000 కోట్లు అవుతుంది. ► అలా వారి జీవితాలు బాగు చేయడం కోసం ప్రభుత్వం బ్యాంకర్లతో కలిసి ఈ పథకం అమలు చేస్తోంది. విప్లవాత్మక మార్పులతో వారందరికి తోడుగా నిలుస్తోంది. వారం నుంచి 10 రోజుల్లో బ్యాంకులు 10 లక్షల మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తాయి. ► చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వీరి తరఫున వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ జమ ► వారంతా గుర్తింపు కార్డులు తీసుకుని, రుణాలను ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే, మన ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. స్వయం సహాయక బృందాలు, పొదుపు సంఘాల లాగే ఇవాళ్టి నుంచి చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు కూడా అండగా నిలబడి వడ్డీలేని రుణాలు ఇస్తాం. ► అర్హులెవరైనా ఇంకా మిగిలిపోతే, వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. వెరిఫికేషన్ పూర్తి కాగానే నెల, రెండు నెలల్లో వారికీ పథకం అమలు చేస్తాం. అందువల్ల ఇప్పుడు రుణం రాని వారెవ్వరూ ఆందోళన చెందవద్దు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. చిరు వ్యాపారం చేసుకుంటున్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ► కార్యక్రమంలో మంత్రులు ఎం.శంకర నారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాట చెబితే అమలు చేసే ప్రభుత్వం మనది మాట చెబితే తప్పనిసరిగా అమలు చేసే ప్రభుత్వం. చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టోలో 600కు పైగా అబద్ధాలు చెప్పారు. మన సీఎం జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చాం ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా, అర్హత ఉన్న వారందరికీ రుణం అందేలా చూస్తాం. – బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ మేలు మరువలేం కరోనా కష్ట కాలంలో రూ.వందకు నెలకు రూ.10 వడ్డీ ఇస్తామంటేగానీ రుణం దొరకని పరిస్థితి. వ్యాపారం జరిగినా, జరగకపోయినా వాళ్లకి వడ్డీ డబ్బు ఇవ్వాల్సిందే. అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టి మాకు వడ్డీ లేని రుణం ఇచ్చి చాలా సహాయం చేస్తున్నారు. మీ మేలు మరువలేం. – శ్యామల, కలంకారీ నిపుణురాలు, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా మీగురించి గర్వంగా చెప్పుకుంటున్నాం నేను మసాల దినుసుల వ్యాపారం చేస్తుంటాను. నా పుట్టింటి నుంచి నా జగనన్నే వచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీ గురించి ప్రతిరోజూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. కడుపులో కన్ను కూడా తెరవని బిడ్డ మొదలు.. వృద్ధాప్యంలో ఉన్న అవ్వా తాతల వరకు మీ నుంచి అందని పథకం లేదు.. అందుకోని గడపా లేదు. ఇప్పుడు నాకు జగనన్న తోడు కూడా అందింది. మా రాష్ట్రానికి మీరు సీఎం అయినందుకు చాలా గర్వంగా ఉంది. – జి.సత్య, వలసపాకుల, తూర్పుగోదావరి ష్యూరిటీ లేకుండా అప్పు ఇచ్చారు నేను రెండేళ్లుగా అగరుబత్తీలు తయారు చేస్తున్నాను. గతంలో బ్యాంకులో అప్పు కోసం వెళితే ష్యూరిటీ అడిగారు. ఈ రోజు మా జగనన్న మంచి మనసు వల్ల ష్యూరిటీ లేకుండానే అప్పు ఇచ్చారు. మీరే మమ్నల్ని నడిపిస్తున్నారు. వాహనమిత్ర, విద్యాదీవెన పథకాల వల్ల మాకు లబ్ధి కలిగింది. మేమున్నంత వరకు మీరే సీఎంగా ఉండాలి. – మధులత, అనంతసాగర్ కాలనీ, అనంతపురం జిల్లా -
చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: రోజువారీ వ్యాపారాలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం.. ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే వెచ్చిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్.. నేడు ఆ మాట నిలుపుకోనున్నారు. చిన్న చిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన ఆయన, అధికారంలోకి రాగానే వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకానికి ఎంపికైన వెయ్యి మంది చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో 50 అడుగుల సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. – శ్రీకాళహస్తి అధిక వడ్డీల నుంచి విముక్తి ► చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు. ► వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది. ► ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలున్న వారెవరైనా జాబితాలో తమ పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజుల్లోపు పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికీ రుణాలందిస్తారు. సమన్వయం, పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తర్వాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రీయింబర్స్ చేస్తుంది. -
చిరు వ్యాపారులపై కోవిడ్ పిడుగు!
రాజారాం గృహావసర వస్తువులను ఊరూరా తిరిగి విక్రయిస్తుంటాడు. జనాలకు ఏయే వస్తువులు కావాలో ముందే చెబితే, వాటిని వారికి అందజేయడంతో పాటు ఇతర వస్తువులు తెచ్చి విక్రయించడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇప్పుడు కరోనా వైరస్‌తో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ బయటకు వెళ్లినా వైరస్ సోకుతుందన్న కారణంతో తమతమ ఊళ్లలోకి గ్రామస్తులు రానివ్వడంలేదు. రహీం ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతుంటాడు. మంచి డిమాండ్ ఉండటంతో సుమారు నాలుగైదు గ్రామాల్లో తిరుగుతుంటాడు. వారంలో ఐదారు గ్రామాలు చుట్టబెట్టడమే కాకుండా వారాంతపు సంతలో సైతం విక్రయిస్తాడు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నాడు. వెళ్దామన్నా ఇతర గ్రామాల్లోకి రాకుండా గ్రామస్తులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వ్యాపారం మరింత ఇబ్బందిగా మారింది. సాక్షి, హైదరాబాద్: చిన్న వ్యాపారాలకు దెబ్బ... ప్రస్తుత కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో ఇది కేవలం రాజారాం, రహీమ్ అనే ఒకరిద్దరు చిరు వ్యాపారులకే పరిమితమైన సమస్య కాదు. మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన వారికి తక్కువ ధరలకే వివిధ పరికరాలు, వస్తువులు, సరుకులు అమ్ముకునే ‘హర్ ఏక్ మాల్’ చిరు వ్యాపారులు, వీధివీధినా తిరిగి ఆయా వస్తువులు విక్రయించే సంచార వ్యాపారులు ఇలా చిన్నా, చితకా వ్యాపారాలు చేసుకునే వారందరి జీవితాలు తలకిందులై పోయాయి. కస్టమర్లు కోరుకునే వివిధ రకాల సరుకులు కొనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేక కొం దరు చిరు వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. అప్పోసొప్పో చేసి ఆయా వస్తువులను తెచ్చి, ఊరూరా తిరిగి అమ్మే ప్రయ త్నం చేసినా కొనేందుకు ఎవరూ ముం దుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లోకి రానివ్వడం లేదు... చిన్నచిన్న తోపుడుబండ్లు, సైకిళ్లు, మోపెడ్లపై రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరుకులు తీసుకుని వెళుతున్న వారిని కరోనా భయంతో గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా ఊరి బయటే అడ్డుకుంటున్నారు. దీంతో వస్తువులు, సరుకులు అమ్ముడుపోక నిరాశగా ఇళ్లబాట పట్టాల్సి వస్తోంది. గతంలో ఊళ్లల్లో ఏర్పాటు చేసిన సంతల్లో సంచార వ్యాపారులు వస్తువులను విక్రయించుకునే వీలుండగా, ఇప్పుడు కోవిడ్ భయంతో ఈ సంతలు కూడా నిలిచిపోవడంతో వీరి వ్యాపారాలు ముందుకు సాగడం లేదు. బకాయిలతో మరో కష్టం... అప్పులుచేసి తీసుకొచ్చిన వస్తువులు అమ్ముడుపోక ఒకవైపు, తీసుకొచ్చిన స్టాక్‌కు డబ్బు కట్టాలంటూ గుత్త వ్యాపారుల బెదిరింపులు మరోవైపు. స్టాక్ అమ్ముడుపోనందున మరికొన్ని రోజులు గడువు కావాలంటూ చిరువ్యాపారులు ప్రాధేయపడుతున్నా, డబ్బు కట్టాల్సిందేనంటూ వారిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు సొంత ఊరిలోనైనా సరుకులు, వస్తువులు అమ్ముకుందామంటే, గ్రామాల్లోకి సరుకులను తీసుకొచ్చేవారిని రానివ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు -
చిన్న వ్యాపారులకు సున్నా వడ్డీ
విజయవాడలోని కానూరులో కూరగాయలు విక్రయించే శ్రీను వ్యాపారం బాగానే ఉన్నా రూ.10 చొప్పున వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చడానికే లాభం అంతా సరిపోతోంది. వ్యాపారం గిరాకీ బాగున్నా చేతిలో చిల్లిగవ్వ లేక అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లా అల్లూరివారి పాలెం గ్రామానికి చెందిన రమణయ్య బండి మీద అరటి కాయలు అమ్ముకునే చిరు వ్యాపారి. రోజూ ఊరి నుంచి 5 కి.మీ దూరంలోని నరసరావుపేటకు వెళ్లి అమ్ముతుంటాడు. వారానికి రూ.2,000 (వడ్డీ మినహాయించి ఇచ్చేది రూ.1,700లే) కాబూలీ వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకోవడం.. రోజూ రూ. 300 చొప్పున బాకీ తీర్చడమే సరిపోతోంది. సాక్షి, అమరావతి: అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అర్హులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అక్టోబర్‌లో నెలలో సున్నావడ్డీ ద్వారా బ్యాంకు రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయాలు తదితర చిరు వ్యాపారాలను నిర్వహిస్తూ పొట్టపోసుకునే వారికి రూ.10,000 చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. రుణంగా పొందే అసలును మాత్రమే బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా వాయిదాల పద్ధతిలో చిరు వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారనే అంచనాతో వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరు అర్హులు..? ► గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. ► రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు. తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు. ► ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు. ► చిరు వ్యాపారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి. ► ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. గుర్తింపు కార్డుల జారీ ఇలా.. ► గ్రామ, వార్డు వలంటీర్ల సర్వేలో అర్హులుగా గుర్తించిన వారి జాబితాలను సచివాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ జాబితాలకు ఎంపీడీవో, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. ► తుది జాబితాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ గుర్తింపు కార్డును అందజేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వలంటీర్లు సహకరిస్తారు. ► చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు విరివిగా రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన సూచన చేశారు. ► గుర్తింపు కార్డులు జారీ చేసిన జాబితాలను జిల్లా అధికారులు అన్ని బ్యాంకులకు పంపుతారు. అక్టోబర్‌లో బ్యాంకు రుణాలు.. ► వలంటీర్ల సర్వే అనంతరం అర్హుల ప్రాథమిక జాబితాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఈ నెల 18 నాటికి ఆమోదం కోసం జిల్లా జాయింట్ కలెక్టర్లకు పంపుతారు. 24వ తేదీ కల్లా జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. 30వ తేదీ కల్లా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ చేపట్టేలా సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ‘జగనన్న తోడు’ ద్వారా అక్టోబర్‌లో సున్నావడ్డీ ద్వారా రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది. -
చిరు వ్యాపారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : చిరువ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల నేపథ్యంలో మే, జూన్, జులై మాసాలకు జీఎస్టీఆర్-3బీ ఫామ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్ లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక జులై 6 వరకూ జీఎస్టీ రిటన్స్‌ను దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులపై అపరాథ వడ్డీ ఉండదని, ఆ తర్వాత జీఎస్టీ రిటన్స్‌ను ఫైల్ చేసే చిరు పన్నుచెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని, ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో అదే అజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. పాన్ మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని చెప్పారు. -
బజ్జీ బండ్లు.. బంగారు బాతుగుడ్లు
► ట్రేడ్ లైసెన్స్‌లకు నోచుకోని చిరు వ్యాపారులు ► లైసెన్స్‌లు ఇవ్వకుండా ఉద్యోగుల నెలవారీ మామూళ్లు ► ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వైనం సాక్షి, అమరావతి: ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మున్సిపాలిటీ ఉద్యోగులకు వరంగా మారింది. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలో ఉండే చిన్న వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సుకు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూళ్ల కింద ఇవ్వాల్సి వస్తోంది. వ్యాపారులకు అవగాహన కల్పించి 24 గంటల్లోగా లైసెన్సు మంజూరు చేయాల్సి ఉద్యోగులే.. మామూళ్లకు అలవాటుపడి రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. 16 లక్షలకు పైగా షాపులుంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు పక్కన బజ్జీ కొట్ల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ సుమారు 16 లక్షల వరకూ వ్యాపార కేంద్రాలు ఉన్నాయని, వారిలో 6 లక్షలకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు ఉన్నట్టు మున్సిపల్ అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రేడ్ లైసెన్సు తీసుకోవాలి. ఒక వేళ చిన్న వ్యాపారులు లైసెన్సు తీసుకోకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి. అయితే.. లైసెన్సులు ఇవ్వడం మానేసిన ఉద్యోగులు.. మామూళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు. మామూళ్లు ఇవ్వకపోతే చిరు వ్యాపారులకు బెదిరింపులు తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల నుంచి వసూళ్ల సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పక్కన చెరకురసం బండి నడుపుతుంటే సంవత్సరానికి ట్రేడ్ లైసెన్సుకింద రూ.165 మాత్రమే చెల్లించాలి. కానీ ఉద్యోగులు అతనికి లైసెన్సు ఇవ్వకుండా మూన్నెళ్లకోసారి వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడలోనే ఇలా మామూళ్లు చెల్లించే చిన్న చిన్న వ్యాపారులు వేలల్లో ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ట్రేడ్ లైసెన్సుల మామూళ్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారులందరికీ లైసెన్సులు జారీచేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మామూళ్లతో అటు మున్సిపాలిటీలూ, ఇటు చిరువ్యాపారులూ ఆర్థికంగా నష్టపోతుండగా, ఉద్యోగులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. -
రోడ్లపై టేలాల తొలగింపు
► రాత్రికి రాత్రే తరలించిన మున్సిపల్ సిబ్బంది ► చిరువ్యాపారుల ఆందోళన సిరిసిల్ల : సిరిసిల్లలో టేలాల తొలగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డుపై ఎలాంటి అనుమతి లేకుండా వేసుకున్న టేలాలు, దుకాణా ల ముందు రేకులను శుక్రవారం తొలగించారు.పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఉన్న దుకాణాలను తీసివేశారు. ఇప్పటికే మున్సిపల్ సి బ్బంది ఆయా దుకాణదారులకు టేలా లు తొలగించాలని కోరారు. వారు తొలగించకపోవడంతో రాత్రికి రాత్రే టేలాలను తరలించారు. కోర్టు ప్రాంతంలో కొన్ని టేలాల్లో కంప్యూటర్లు, జిరాక్స్ మి షన్లు ఉండడంతో వాటిని తొలగించాలని కమిషనర్ సుమన్ రావు కోరారు. టేలాల యజమానులు స్పం దించకుంటే తామే తొలగిస్తామని ఆయన వివరించారు. మున్సిపల్ తీరుపై చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారు లు చేసుకుంటే జీవించే తమ పొట్టలు కొడుతున్నారని వ్యాపారులు పేర్కొం టున్నారు. రోడ్డును ఆక్రమిం చిన వారి పై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా టేలాలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. పట్టణ ప్రజ లు సహకరించాలని కమిషనర్ కోరారు. -
చిన్న వర్తకులకు ‘పన్ను’ నజరానా!
డిజిటల్ లావాదేవీలకు మారితే 6 శాతమే ఆదాయపన్ను: సీబీడీటీ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహక చర్యల్లో భాగంగా చిన్న వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఓ సదవకాశం కల్పించింది. రూ.2 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరిస్తే...ఆదాయపన్ను తక్కువ చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఆదాయపన్ను చట్టం–1961 లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం తదితర వర్గాల వారు వార్షిక వ్యాపారం రూ.2 కోట్లు, అంతకంటేతక్కువగా ఉంటే... ఆ మొత్తం టర్నోవర్‌లో లాభాన్ని 8 శాతంగా పరిగణించి పన్ను చెల్లించే అవకాశం ఉంది. అయితే, ఈ టర్నోవర్‌కు సరిపడా చెల్లింపులను బ్యాకింగ్ చానల్, డిజిటల్ విధానంలో స్వీకరించి ఉంటే ఈపన్ను రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఒకవేళ నగదు రూపంలోనే స్వీకరించి ఉంటే 8 శాతం పన్ను రేటేఅమలవుతుందని స్పష్టం చేసింది. తక్కువ నగదు చలామణి గల వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. -
భలే గిరాకీ
గోదావరి పుష్కరాలు.. భక్తులకు పుణ్యాన్ని ప్రసాదిస్తుండగా వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో వస్తున్న భక్తజనంతో వ్యాపారం వర్ధిల్లుతోంది. తినుబండారాలు, పుస్తకాలు, ఆటవస్తువులు, పూలు తదితరాల విక్రయూలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రోజుల్లో గిరాకీ అంతంతమాత్రంగానే ఉన్నా.. చివరి రోజుల్లో వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వికసిస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయూమని తెలుపుతున్నారు. -కాళేశ్వరం/ధర్మపురి/బాసర/ కందకుర్తి/భద్రాచలం/మంగపేట నుంచి సాక్షి బృందం మూడు రోజులుగా మొదట్లో బాసరలో అంతగా గిరాకీ రాలేదు. ఈ మూడు రోజులుగా కాస్త జనం వస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారు ఇక్కడి నుంచి ఇంటికి పెన్నులు, నోట్ పుస్తకాలను తీసుకెళ్తున్నారు. పుష్కరాల్లో ఆశించిన స్థాయిలో గిరాకీలు రాకున్నా.. ఈ మూడు రోజుల నుంచి వస్తున్నాయి. -శ్రీనివాస్, చిరువ్యాపారి, బాసర అంతంత మాత్రమే పుష్కరాల్లో పండ్ల విక్రయూలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పుష్కరస్నానాలకు వచ్చేవారంతా ఉపవాసదీక్షలతో వస్తున్నారు. వారంతా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని అక్కడే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ధరలు పెంచకుండానే విక్రయిస్తున్నాను. -జమీల్హైమద్, చిరువ్యాపారి, బాసర రోజుకు రూ. 2 నుంచి 3వేల సంపాదన పుష్కరాల సందర్భంగా తినుబండారాల దుకాణం పెట్టడం కోసం కాళేశ్వరం వచ్చినం. అన్ని రకాల తినుబండారాలను అందుబాటులో ఉంచాం. రోజుకు రెండు నుండి మూడు వేల వరకు గిరాకీ అవుతోంది. దేవుడి దయవల్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. - సత్యనారాయణ, వ్యాపారి, సూర్యాపేట రెండు రోజుల నుంచే గిరాకీ పుష్కరాలు ప్రారంభమై పదకొండు రోజులు గడుస్తున్నా కాళేశ్వరంలో గిరాకీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొన్నటి నుంచి మంచిగా గిట్టుబాటు అవుతోంది. మేము పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది. కానీ తినుబండరాలు మిగిలిపోయేలా ఉన్నాయి. - వెంకన్న, నల్లగొండ ఆశించిన స్థాయిలో లేదు గోదావరి మహాపుష్కరాల్లో భక్తుల ఆదరణ ఉంటుందని, నాందేడ్ నుంచి కందకుర్తి వచ్చాం. కూలీలకే రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందలు చెల్లిస్తున్నాను. గిరాకీ ఆశించిన స్థాయిలో లేదు. సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. -షేక్ మోహిన్, మిఠాయి వ్యాపారి, నాందేడ్ అప్పులే మిగిలేలా ఉన్నాయి.. కందకుర్తి త్రివేణి సంగమం తీరంలో ఏర్పాటు చేసి తాత్కాలిక బస్టాండ్ వద్ద మిఠాయి దుకాణం పెట్టాను. రూ. 26 వేలు టెండర్‌కు, రూ. 2.50 లక్షలు మిఠాయి తయూరీకి పెట్టాను. ఆశించిన గిరాకీ రాలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులే మిగిలేలా ఉన్నాయి. -కిరణ్, మిఠాయి వ్యాపారి, బోధన్ రెండింతలు బిజినెస్ పుష్కర స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలనికి తండోపతండాలుగా తరలి వస్తుండటంతో మా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు సాగుతోంది. మొదటి నాలుగు రోజలు తక్కువగా ఉన్నప్పటికీ చివరి మూడు రోజుల్లో రెండింతల బిజినెస్ నిర్వహించాం. -బొలిశెట్టి రంగారావు, హోటల్ యజమాని అధికారులు నిర్ణయించిన ధరకే... కొంతమంది వ్యాపారుస్తులు భద్రాచలం వద్ద పుష్కరాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. కానీ మేము అధికారులు నిర్ణరుుంచిన ధరకే విక్రరుుస్తున్నాం. లాభాలను పొందుతున్నాం. పుష్కర సమయంలో సాధారణ ధరలకే వ్యాపారాలను కొనసాగిస్తూ నిజాయితీ చాటుకుంటున్నాం. - సాయి, టీ కేఫ్ యజమాని లాభం లేదు... నష్టం లేదు.. మహాపుష్కరాలకు మంగపేటకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని అంచనా వేశాం. వ్యాపారం బాగానే నడిచినప్పటికీ, వర్షాలు కురవడంతో భక్తులు పుష్కరస్నానం చేసి వెళ్లిపోయూరు. దీంతో మాకు అటు లాభాలు రాలేదు. నష్టాలూ రాలేదు. -రామశెట్టి శ్రీనివాస్, ఖమ్మం