
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది.
చదవండి: AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’
అంతకుముందు.. ఈ పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు తోడ్పాటునందించాలని కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు సీఎం జగన్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment