Small Business mans
-
చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. చదవండి: AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ అంతకుముందు.. ఈ పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు తోడ్పాటునందించాలని కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు సీఎం జగన్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారస్తుల నిరసనలు.. స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది. చిన్న సంస్థలకు తోడ్పాటు.. ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. -
గూడూరుపల్లి వద్ద ఉద్రిక్తత
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద చిన్న వ్యాపారస్తులకు, వాణిజ్య పన్నుల శాఖాధికారుల మధ్య ఆదివారం గొడవ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. జీఎస్టీ పన్నులు కట్టాలని వ్యాపారస్తులపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒత్తిడి చేయడంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో పండ్లు, కూరగాయలతో పాటు తమ సరుకు అమ్ముకునే దాని కంటే జీఎస్టీ పన్నులు ఎక్కువగా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు. తాము జీఎస్టీ కట్టలేమని చిన్న వ్యాపారస్తులు అనడంతో చిన్న వ్యాపారస్తులకు, అధికారుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో వాణిజ్యపన్నుల అధికారి చెన్నారెడ్డి వాహనాన్ని వ్యాపారస్తులు కట్టెలతో కొట్టి ధ్వంసం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుదింపు కుదిరితేనే రుణం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రుణాలు అందజేసి ఆదుకుంటోంది. రూ.లక్ష నుంచి రూ.12లక్షల వరకు సబ్సిడీ రుణాలు పొందేందుకు నిరుద్యోగులు, చిరువ్యాపారులు, యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న విషయం విదితమే.. కాగా 2017–18 సంవత్సరానికి గాను కేటగిరి–1 కింద రూ.లక్ష యూనిట్ కోసం 3,882 మంది బీసీ లబ్ధిదారులు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో రూ.50వేల యూనిట్ ఆప్షన్ లేకపోవడం, రూ.లక్ష యూనిట్ నుంచే రుణాల దరఖాస్తుల స్వీకరణ ఉండడంతో వాటికి అనుగుణంగానే దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలను అందజేసింది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వేలకు పైగా బీసీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, పూర్తిస్థాయిలో రుణాలకు పంపిణీ చేయలేదు. రూ.లక్ష యూనిట్ కింద దరఖాస్తు చేసుకున్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందజేసి చేతులు దులిపేసుకుంది. మూడేళ్లుగా రుణాలు అందించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా 2017–18 సంవత్సరానికి సంబంధించి బీసీలకు పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రుణాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్ కింద రూ.50వేల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయనుండడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. మిగతా వారికెప్పుడో..! బీసీ స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం కేటగిరి–1 కింద రూ.1లక్ష యూనిట్ నుంచి మొదలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అప్పుడు రూ.50వేల యూనిట్ అని ఎక్కడా లేదు. అయితే రూ.లక్ష యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 వేలకు కుదించి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కాకుండా రూ.50వేల వరకు అవసరమున్న కుటీర పరిశ్రమల వారికి వంద శాతం సబ్సిడీపై పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కుదింపునకు ఒప్పుకున్న వంద మంది లబ్ధిదారులకు అందజేయనుంది. కాగా, కేటగిరి–1లో 3,882 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆయా మండలాల ఎంపీడీఓల నుంచి ఆన్లైన్ ద్వారా 2,708 మంది జాబితా సంబంధిత శాఖలకు చేరుకున్నాయి. కేటగిరి–2లో రూ.లక్ష పైనుంచి రూ.2లక్షల్లోపు 7,051 మంది ఆన్లైన్లో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, 5,364 మందికి సంబంధించిన జాబితా సంబంధిత శాఖకు చేరుకుంది. కేటగిరి–3లో రూ.2లక్షల పైనుంచి రూ.12లక్షల వరకు రుణాల కోసం 2,973 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1305 మంది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా బీసీ కార్పొరేషన్‌కు చేరుకుంది. మిగతా లబ్ధిదారుల జాబితా చేరాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వంద మంది లబ్ధిదారులకు మాత్రమే రూ.50వేల యూనిట్‌కు సంబంధించి రుణాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం రూ.50 లక్షల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.12లక్షల దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురుచూస్తున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు. చిరువ్యాపారులకు ప్రాధాన్యం.. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చిరువ్యాపారు(స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ బిజినెస్ సెక్టార్)లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని రూ.50వేల వరకు రుణాలను పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అందించనున్నారు. చిరువ్యాపారాలు చేసుకొని వీరు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించనుంది. బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి గతంలో ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా స్వయం ఉపాధి రుణాలను అందించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు కాకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే నగదు జమ చేయాలి. పరికరాలను అందజేస్తే నాసిరకంతోపాటు దళారులకు మేలు కలిగించేలా అవుతుంది. లబ్ధిదారులకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచించాలి. – చిక్కాల దత్తు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రూ.లక్ష రుణం అందించాలి.. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ వంద శాతానికి బదులు రూ.లక్ష రుణం వంద శాతం రాయితీపై కల్పించాలి. నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే సబ్సిడీ రుణాన్ని జమ చేయాలి. లేనిపక్షంలో లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుంది. – మందపెల్లి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంద మందికి పంపిణీ.. వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వంద మంది లబ్ధిదారులకు రూ.50వేల చొప్పున రుణాలు అందించనున్నాం. రూ.లక్ష నుంచి కుదించి రూ.50వేలకు ఒప్పుకున్న లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందించనున్నాం. వీటికి సంబంధించి రూ.50లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. – ఆశన్న, జిల్లా బీసీ శాఖ అభివృద్ధి అధికారి -
ఆత్మహత్యే శరణ్యం
► కిరోసిన్ బాటిల్‌తో చిరువ్యాపారి హల్చల్ ►ట్రాఫిక్ పోలీసుల వేధింపులే కారణమని ఆవేదన హన్మకొండ చౌరస్తా: రెండు నెలలుగా దుకాణం పెట్టనిస్తలేరు.. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది.. కుటుంబపోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం హన్మకొండ చౌరస్తాలోని జీవన్‌లాల్ కాంప్లెక్స్ వద్ద చిరువ్యాపారి కిరోసిన్ బాటిల్ చేతిలో పట్టుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగా డు. స్థానిక చిరు వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు దశాబ్దాలకు పైగా హన్మకొండ చౌరస్తాలో రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుం టూ కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. కాగా చిరు దుకాణాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు రెండు నెలల క్రితం చిరు దుకాణాలను తొలగించారు. మరొకసారి రోడ్డు పక్కన దుకాణాలు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రత్యమ్నాయం చూపకుండా, దుకాణాలు పెట్టకుండా అడ్డుకుంటే బతకడం కష్టమని భావించి మంగళవారం ఉదయం సుమారు 15మంది వారి వ్యాపారాలను మొదలుపెట్టారు. పెట్రోలింగ్‌లో ఉన్న హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై సోమయ్య తన సిబ్బందితో వచ్చి చిరుదుకాణాల సామానును స్టేషన్‌కు తరలించే యత్నం చేశారు. దీంతో అడ్డుకున్న చిరు వ్యాపారులకు, పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో సామాను వదిలేసిన పోలీసులు రోడ్డు పక్కన పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనైన టైలర్స్ట్రీట్కు చెందిన చిరువ్యాపారి రమేష్ కిరోసిన్ బాటిల్ వెంట తీసుకుని దుకాణం పెట్టకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తోటి హాకర్లు సర్ధి చెప్పడంతో సద్దుమణిగిన రమేష్, అనంతరం అందరూ కలిసి ట్రాఫిక్ ఏసీపీ సురేంద్రనాథ్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నప్పటికీ ఫలితం లేదని చిరు వ్యాపారులు వాపోయారు.