దాడిలో ధ్వంసమైన వాణిజ్య పన్నుల అధికారి వాహనం
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద చిన్న వ్యాపారస్తులకు, వాణిజ్య పన్నుల శాఖాధికారుల మధ్య ఆదివారం గొడవ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. జీఎస్టీ పన్నులు కట్టాలని వ్యాపారస్తులపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒత్తిడి చేయడంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో పండ్లు, కూరగాయలతో పాటు తమ సరుకు అమ్ముకునే దాని కంటే జీఎస్టీ పన్నులు ఎక్కువగా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు.
తాము జీఎస్టీ కట్టలేమని చిన్న వ్యాపారస్తులు అనడంతో చిన్న వ్యాపారస్తులకు, అధికారుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో వాణిజ్యపన్నుల అధికారి చెన్నారెడ్డి వాహనాన్ని వ్యాపారస్తులు కట్టెలతో కొట్టి ధ్వంసం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment