సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పుంగనూరు మున్సిపల్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నహర్షవర్ధన్‌ను బాత్రుమ్‌లో పెట్టి తోటి విద్యార్థులు తాళం వేశారు. దీంతో భయంతో మూడు గంటలపాటు విద్యార్థి బాత్రుమ్‌లోనే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెంటనే తలుపులు తీసి చూడగా, అప్పటికే హర్ష వర్ధన్ తీవ్ర జ్వరంతో కింద పడిపోయి ఉన్నాడు. హుటాహుటిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. పాఠశాల ఉపాద్యాయుల నిర్లక్ష్యం కారణంగానే హర్ష వర్ధన్ చనిపోయాడంటూ ఆందోళనతో బంధువులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment