సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది. A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం, బెంగళూరు,రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకుల,కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు.
చదవండి: టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, విజయవాడ: పుంగనూరులో చంద్రబాబు సృష్టించిన విధ్వంసకాండను ఖండిస్తూ పైపుల రోడ్డు సెంటర్‌లో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఫ్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముందస్తుగా వ్యూహం పన్ని పోలీసులపై దాడులు చేసి పోలీసు వాహనాలను తగలబెట్టించాడని మండిపడ్డారు.
‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటాడు. కానీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చాలా జుగుప్సాకరంగా ఉంది. అంజు యాదవ్ విషయంలో పవన్ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తప్పుబట్టాడు. పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్షాలు ప్రస్టేషన్ లో ఉన్నాయి. భవిష్యత్తులో గెలవలేమనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. పుంగనూరులో రాబోయే తరాల్లో గెలుపు సాధ్యం కాదని భావించి హింసకు పాల్పడ్డారు. కర్రలు, తుపాకులు తీసుకొచ్చి చేసిన వీరంగం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారిపోతుందనేదానికి నిదర్శనం. ప్రాజెక్టుల పేర్లతో హింసను ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment