punganuru
-
పుంగనూరులో పోలీసుల ఓవరాక్షన్
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనపై ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆయన కాన్వాయ్‌ను అడ్డు తగిలి పలువురు నేతలను వెనక్కి పంపించారు.మున్సిపల్ ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలతో మిథున్‌రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ శ్రేణులు ఆయన పర్యటనకు అడ్డుతగిలే అవకాశం ఉందని చెబుతూ పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. అనుమతికి మించి వాహనాలున్నాయంటూ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ను ఆపేశారు.మరోవైపు.. మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ వైఎస్సార్సీపీ నేతలను, కేడర్‌ను లోపలికి అనుమతించడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో నిజంగా నష్టమా? -
ఎంపీ మిథున్‌పై దాడి.. పుంగనూరులో టీడీపీ గూండాల విధ్వంసకాండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తను నరికి చంపిన టీడీపీ గూండాలు 12 గంటలు గడవక ముందే పుంగనూరులో మరో విధ్వంస కాండను సృష్టించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు, ఆస్తులు, పంటలను కోల్పోయిన బాధితులను పరామర్శించి భరోసా కల్పించేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురువారం రోజంతా మారణాయుధాలతో తిష్ట వేసి దాడులకు దిగాయి.నాలుగు గంటలు స్వైర విహారం..రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మిథున్‌రెడ్డి పుంగనూరు ఎల్ఐసీ కాలనీలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలుసుకున్న టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎంపీ మిథున్‌రెడ్డిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపేందుకు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ గూండాలను నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ, దళిత నాయకుడు రెడ్డప్పపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ రెడ్డప్ప నివాసంలోకి చొరబడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు తలుపులు మూసివేయడంతో బద్ధలు కొట్టేందుకు యత్నించారు. రెడ్డప్ప నివాసంలోకి రాళ్లు రువ్వారు. ఇంటి ముందు ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేసి రెడ్డప్ప వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టారు. నిలువరించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా దాడులు చేశారు. ఘటన గురించి తెలియడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. 4 గంటలపాటు సాగిన ఈ విధ్వంసంతో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా ఓ ఎంపీనే హత్య చేసేందుకు తెగించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు టీడీపీ శ్రేణులు కూల్చివేసిన ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి ఎంపీ మిథున్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుసుకున్న అల్లరిమూకలు హింసాకాండకు బుధవారం రాత్రే పక్కా పథకం రూపొందించినట్లు సమాచారం. మూకుమ్మడిగా చంపాలన్నదే టార్గెట్!ప్రణాళికలో భాగంగా టీడీపీ మూకలు ఉదయం నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ముగించి మిథున్‌రెడ్డి బయటకు వస్తున్నట్లు గుర్తించి ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రెడ్డప్పపైనా దాడికి దిగాయి. ‘రేయ్.. బయటకు రారా..’ అంటూ దుర్భాషలకు దిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా 25 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు సాక్షి విలేకరులతోపాటు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్ఎంపీ, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేతలకు చెందిన 15 వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. మరో 12 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. రెడ్డెప్ప నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అల్లరి మూకల నుంచి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని రక్షించేందుకు గన్‌మెన్ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అడుగడుగునా పోలీస్ వైఫల్యంపుంగనూరులో జరిగిన విధ్వంస కాండలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుతూ, కర్రలతో స్వైర విహారం చేస్తున్నా చూస్తుండిపోయారు. భారీగా టీడీపీ మూకలు మోహరించినా వెంటనే స్పందించాల్సిన ఉన్నతాధికారులు తీరిగ్గా కొంత మంది పోలీసులను పంపి చేతులు దులుపుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. బాబు ఆదేశాలతో హౌస్ అరెస్టు..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి గత నెల 15న పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు వారిద్దరినీ తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలను, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిని ఏకంగా హతమార్చేందుకు పచ్చమూకలు పథకం వేశాయి.బెదిరింపులకు భయపడం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే అజెండాగా పని చేస్తోంది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పురిగొల్పడం దారుణం. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. అభివృద్ధి అంటే వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ కోర్టును ధ్వంసం చేయడమా? ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల ఎదుటే దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మరో బిహార్‌లా మార్చే యత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తేలేదు. ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల్లోనే ఉంటూ మరోసారి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. తిరిగి ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అంటూ ఒక్కరికే ఇస్తామని మాట మార్చారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమ పథకాలను ఆపివేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండా తమ పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంస్థను చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలతో అడ్డుకోవడం సరికాదు. హింసాత్మక ఘటనలు పునరావృతమైతే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.రాళ్లతో కొట్టి చంపే యత్నం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలని టీడీపీ రౌడీమూకలు యత్నించాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దళిత నాయకుడైనా నాపైనా దాడి చేశారు. నా ఇంటిని చుట్టుముట్టి రాళ్లు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. నా కారుకి నిప్పుపెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక విధ్వంసకాండకు తెర తీసింది. ప్రశాంతంగా ఉండే పుంగనూరులో 12 సార్లు దాడులు జరిగాయి.– మాజీ ఎంపీ రెడ్డప్పపాలనపై దృష్టి పెట్టండిచంద్రబాబు దాడులపై కాకుండా పాలనపై దృష్టి సారించాలి. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు తగవు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి మెప్పు పొందాలే కానీ దాడులకు పాల్పడడం సరి కాదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నిర్వీర్యం కాకుండా చూసే బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. వారి తీరు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే పరిస్థితి కనిపించటం లేదు.– నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎంహేయమైన చర్యరాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేయడం అత్యంత హేయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఎలా కాపాడుతుంది? ఎంపీపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారంటే రాష్ట్రంలో ఎలాంటి ఆటవిక పాలన కొనసాగుతుందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని టీడీపీ పాలనలో చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. దాడులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు కచ్చితంగా వస్తుంది. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడి
-
చిన్న సినిమాకు థియేటర్లలో ఊహించని క్రేజ్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించగా.. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు . జూన్ 21న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యూత్, ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వారం విడుదలైన చిత్రాల్లో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు ఆదరణ వస్తోంది. సినిమాలో కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీని ఎంజాయ్ చేస్తూ తమ కాలేజీ రోజులను ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు, పాటలు సైతం ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల కీలక పాత్రలు పోషించారు. -
పుంగనూరు కేసులో అదే కీలకాధారం: చిత్తూరు ఎస్సీ
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో పోలీసులపై దాడి కేసుకు సంబంధించిన 500 మంది నిందితులను గుర్తించామని.. వీళ్లలో 92 మందికి ఇప్పటివరకు అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను సాక్షికి తెలిపారాయన. ‘‘ఫ్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అంగీకరించారు. ఈ కేసులో ఇదే కీలక ఆధారం. వీడియో పుటేజి ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించాం, ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేశాం, 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉంది. ‘‘ఈనెల 1వ తేదీ నాడు పోలీసులు పై దాడికి ప్లాన్ చేశారు, ముందుగా సమావేశం అయ్యారు. అనుకున్న విధంగా ఈనెల 4వ తేదీన దాడి చేశారు,విధ్వంసం సృష్టించారు. పక్కాగా ప్రీ ప్లాన్డ్‌గానే ఈ దాడి చేశారు. నిందితులిద్దరూ రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాన్నే అంగీకరించారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు దక్షిణాది రాష్ట్రాల్లో లొకేషన్స్ మారుస్తున్నారు. అయినా అతిత్వరలో అరెస్ట్ చేస్తాం. చల్లా బాబు హైకోర్టు లో బెయిల్ కోసం అప్లై చేస్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: పవన్‌పై క్రిమినల్ కేసులో కీలక పరిణామం -
పుంగనూరు విధ్వంసంలో వెలుగులోకొస్తున్న విస్తుపోయే నిజాలు
-
పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1..
సాక్షి, అమరావతి: నేడు పుంగనూరు అల్లర్ల కేసుపై హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, కొద్దిరోజుల క్రితం పుంగనూరులో టీడీపీ మూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయి పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వీరి దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడగా.. కానిస్టేబుల్ కంటిచూపు కోల్పోయారు. ముందుగానే దాడులకు ప్లాన్.. మరోవైపు.. పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబే ఏ1.. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది. ఇది కూడా చదవండి: అడ్డంగా బుక్కయిన చంద్రబాబు! 90మంది అరెస్ట్.. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇది కూడా చదవండి: పచ్చ గూండాలు పేట్రేగిన వేళ.. -
పోలీసులపై దాడి కేసులో టీడీపీ కొత్త ఎత్తులు
-
పుంగనూరు పోలీసులపై దాడి కేసు.. మరో 9 మంది అరెస్ట్
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది. A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం, బెంగళూరు,రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకుల,కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ సాక్షి, విజయవాడ: పుంగనూరులో చంద్రబాబు సృష్టించిన విధ్వంసకాండను ఖండిస్తూ పైపుల రోడ్డు సెంటర్లో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఫ్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముందస్తుగా వ్యూహం పన్ని పోలీసులపై దాడులు చేసి పోలీసు వాహనాలను తగలబెట్టించాడని మండిపడ్డారు. ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటాడు. కానీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చాలా జుగుప్సాకరంగా ఉంది. అంజు యాదవ్ విషయంలో పవన్ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తప్పుబట్టాడు. పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్షాలు ప్రస్టేషన్ లో ఉన్నాయి. భవిష్యత్తులో గెలవలేమనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. పుంగనూరులో రాబోయే తరాల్లో గెలుపు సాధ్యం కాదని భావించి హింసకు పాల్పడ్డారు. కర్రలు, తుపాకులు తీసుకొచ్చి చేసిన వీరంగం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారిపోతుందనేదానికి నిదర్శనం. ప్రాజెక్టుల పేర్లతో హింసను ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, తిరుపతి/చిత్తూరు/ పుంగనూరు/బి కొత్తకోట: రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ములకలచెరువు మండలం నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రీ–నీవా, గాలేరు నగరి అనుసంధానం కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి కొత్తకోట మండలం చీతివారిపల్లి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ పనులను పరిశీలించాల్సి ఉండింది. అయితే పుంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్ మ్యాప్ మార్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని ముదివేడు రిజర్వాయర్ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గం మధ్యలోని అంగళ్లు సర్కిల్ వద్ద నిరసన తెలిపి వెనుదిరిగారు. అంతలో అక్కడికి చేరుకున్న చంద్రబాబు బృందం వందలాది మందితో వచ్చీ రాగానే కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు. దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. స్థానికులు భయాందోళనతో ఇళ్లలోకి పరుగులు తీశారు. టీడీపీ గూండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేశవ, అంగళ్లకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అర్జున్‌రెడ్డి (35) తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువుకు చెందిన విశ్వనాథరెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు వారించడం అటుంచి, చోద్యం చూశారు. పైగా జీపుపైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు. పోలీసులపై రాళ్లు విసిరి దాడికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు పుంగనూరు పుడింగితో తేల్చుకుందాం రండి అంగళ్ల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బైపాస్, పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది. చంద్రబాబు రూట్ మ్యాప్‌లో పుంగనూరు ప్రస్తావన లేదు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు.. పుంగనూరుకు వెళ్దాం.. రండి అంటూ టీడీపీ గూండాలకు మైక్ ద్వారా పిలుపునిచ్చారు. ‘పుంగనూరులో పుడింగి ఉన్నాడు.. రండి తేల్చుకుందాం’ అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు. బాబు పిలుపుతో పుంగనూరు వద్ద విధ్వంసం అంగళ్ల వద్ద చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పుంగనూరు వద్ద టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుమిగూడారు. ఒక్కసారిగా బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతలో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గూండాలను వెనకేసుకుని బైపాస్ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్ నుండి పుంగనూరులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘పుంగనూరులో కాలుమోపుతా.. ఎవరు అడ్డుకుంటారో? చూస్తా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. పైగా పోలీసులను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత రాళ్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత కర్రలతో పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు, మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు. పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్ర వాహనాన్ని, మరో పోలీసు వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎంతగా సంయమనం పాటించి, సర్దిచెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్ప వాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ విధ్వంసం గంటన్నరకుపైగా సాగింది. 27 మందికి గాయాలు టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ, డీఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం 27 మందికి రక్త గాయాలయ్యాయి. సాయంత్రం 4 నుండి 5.30 గంటల మధ్య పుంగనూరు బైపాస్‌రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. చిత్తూరు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్ సీఐ భాస్కర్, పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ పోలీసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రక్త గాయాలతో ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఇలా దాడులు చేసి గాయ పరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. అనంతరం అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డితో కలిసి పుంగనూరులో ఘటన వివరాలను మీడియాకు వివరించారు. కాగా, గొడవ విçషయం తెలిసి పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో 50 మందికి టీడీపీ నేతల రాళ్ల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులపైకి రాళ్లు విసురుతూ దూసుకొస్తున్న టీడీపీ శ్రేణులు అంతా వ్యూహాత్మకం చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహే‹Ùపైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వాదీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలతోనే విధ్వంసం రెచ్చగొట్టే ప్రసంగాలతో పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరగడం బాధాకరం. ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు. గాయపడిన పోలీసుల పరిస్థితి ఇది.. తెలుగుదేశం వారు ఉపయోగించిన రాళ్లివి (వీడియో చూపుతూ). అనుమతి పొందిన రూట్‌మ్యాప్‌ను కాదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేయడంతోనే విధ్వంసం జరిగింది. పోలీస్ అధికారుల వద్ద పిస్టల్ ఉన్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రహించినా సంయమనంతో వ్యవహరించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని కాల్పులు జరపలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులు చేసిన వారిని గుర్తిస్తాం. బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తాం. విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – అమ్మిరెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ ముందస్తు పథకం ప్రకారమే దాడులు ముందస్తు పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీస్ వాహనాలను సైతం తగులబెట్టడం దారుణం. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. చట్ట ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రూట్ మ్యాప్‌లో లేకపోయినా.. టీడీపీ నాయకులు కొంత మంది కావాలనే నిబంధనలకు విరుద్దంగా పుంగనూరులోనికి రావడానికి ప్రయత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిలువరించినందుకే దాడి చేశారు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి, దెబ్బలు తిన్నప్పటికీ కాల్పులు జరపలేదు. గొడవనంతటినీ వీడియో చిత్రీకరించాము. చట్టప్రకారం బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. – రిషాంత్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ నేడు చిత్తూరు జిల్లా బంద్ పుంగనూరులో చంద్రబాబు అనుచరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ శనివారం చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. -
పుంగనూరులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు
-
జగన్ పాలన చూసి ఆకర్షితులవుతున్నారు
పుంగనూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరు భగత్‌సింగ్‌కాలనీలో శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ జయకృష్ణ, కౌన్సిలర్ జయభారతి ఆధ్వర్యంలో 55 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన దామోదర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, కృష్ణయ్య, రమేష్, చంద్రకళరెడ్డి, నందినిరెడ్డి, రాధారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాదర్‌బాషా, ఇర్ఫాన్, సలీం, బాబు, షబ్బీర్, గణేష్ తదితరులకు మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పార్టీ కండువాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్, పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షుడు ఇప్తికార్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు. -
ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..
సాక్షి, పుంగనూరు (చిత్తూరు): ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పెళ్లి అయి మూడు నెలలు కూడా కాకుండానే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. పుంగనూరు పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సుధాకర్‌రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.తేజవిష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్యతో వివాహం జరిగింది. ఆషాడమాసం రావడంతో లావణ్య గత వారం పుట్టింటికి వెళ్లింది. తేజవిష్ణువర్ధన్ రెడ్డికి ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటు. శనివారం ఉదయం సైక్లింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తండ్రి సుధాకర్‌రెడ్డి వెంటనే డాక్టర్ చైతన్యతేజారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించి గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు. భర్త మృతి విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడం పూర్తికాగానే తిరుమల దర్శనం చేసుకుని హనీమూన్‌కు వెళ్లేందుకు నూతన జంట ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే తేజవిష్ణువర్ధన్‌రెడ్డి మృతిచెందడంతో స్థానికులు కంటతడి పెట్టారు. చదవండి: (Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ) యువకులు జాగ్రత్తలు పాటించాలి వ్యాయామం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. జిమ్‌లకు వెళ్లేవారు ముందుగా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ల సూచనల మేరకు వ్యాయామం చేయాలి. గుండెపై ఒత్తిడి తీవ్రం కావడం ద్వారా గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు కొల్పోతారు. – డాక్టర్ చైతన్యతేజారెడ్డి, ప్రముఖ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ -
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలితం.. దశాబ్దాల కల సాకారం
సాక్షి, పుంగనూరు: పలమనేరు–పుంగనూరు బైపాస్ రోడ్డు కోసం సుమారు ముప్పై ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. పూర్తిగా సిద్ధమైన ఈ రహదారిని 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కీలకపాత్ర పోషించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2017లోనే పుంగనూరు–పలమనేరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి నడుంబిగించారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో పలుమార్లు చర్చించి రోడ్డు నిర్మాణానికి రూ.309 కోట్లు విడుదల చేయించారు. అనంతరం 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మామూళ్ల కోసం కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులను పరుగులు పెట్టించి మరీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ క్రమంలో దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు) ఇదీ మార్గం పలమనేరు రోడ్డులోని అరబిక్ కాలేజీ నుంచి పుంగనూరు బైపాస్ ప్రారంభమవుతుంది. చదళ్ల సమీపంలోని తిరుపతి రోడ్డు మీదుగా ఎంబీటీ రహదారిలోని భీమగానిపల్లె వద్ద కలుస్తుంది. పెంచుపల్లె, బండ్లపల్లె, బాలగురప్పపల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యం మీదుగా రోడ్డు సాగుతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరకు రెక్కలు రావడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. పుంగనూరుకు తలమానికం ఎంపీ మిథున్‌రెడ్డి అవిరళ కృషితోనే బైపాస్ నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగకరం. – ఎస్.ఫకృద్ధీన్ షరీఫ్, పుంగనూరు -
‘కారుణ్యం’ చూపలేక.. మరణమే పలకరించింది
కన్నబిడ్డ నాలుగేళ్లుగా అనారోగ్యంతో అల్లాడుతుంటే.. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. శక్తిమేర వైద్యం చేయించినా.. కుదుటపడని కొడుకుని చూడలేక తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇక బిడ్డను బతికించుకోలేననుకున్న ఆ తల్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రయత్నించింది. కోర్టు లేదని తెలిసి కొడుకును ఇంటికి తీసుకెళుతుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశాడు ఆ తనయుడు. అందరికంట తడిపెట్టించిన ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగింది. పుంగనూరు: గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెకు చెందిన మణి చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన అరుణను వివాహం చేసుకుని బీర్జేపల్లెలో స్థిరపడ్డాడు. బండలు కొట్టి జీవించే ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకు హర్షవర్ధన్ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. మరో కుమారుడు ఎబిలైజర్ వయసు ఏడాది. నాలుగేళ్ల కిందట ఒకరోజు హర్షవర్ధన్ బడిలో ఆడుకుంటూ పడిపోయాడు. నోటినుంచి, ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. అప్పటి నుంచి తరచుగా అలాగే అవుతుండేది. తల్లిదండ్రులు తిరుపతి, వేలూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. గుర్రంకొండలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మి లక్షలు వెచ్చించినా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. హర్షవర్ధన్‌కు తరచు రక్తస్రావం అవుతోంది. కొడుక్కి వైద్యం చేయించలేకపోతున్నాననే వేదనతో మణి 15 రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో బిడ్డ పడుతున్న వేదన చూసి తట్టుకోలేకపోయిన అరుణ.. అతడికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరాలని నిర్ణయించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కొడుకును తీసుకుని ఆటోలో మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది. కోర్టుకు సెలవని తెలియడంతో వారంతా అదే ఆటోలో వెనుదిరిగారు. బీర్జేపల్లె వెళ్లకముందే ఆటోలోనే హర్షవర్ధన్ తుదిశ్వాస విడిచాడు. కళ్లముందే కన్నపేగు తెగిపోవడంతో ఆ తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది. హర్షవర్ధన్ తాత మృతి గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెలో ఉంటున్న హర్షవర్దన్ తాత కె.రెడ్డెప్ప (70) అనారోగ్యంతో సోమవారం తిరుపతి ఆస్పత్రిలో మృతిచెందాడు. ముందురోజు తాత, మరుసటి రోజు మనుమడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం అప్పిగానిపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పిగానిపల్లెకు చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె గ్రామానికి వెళ్లి మినీ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన గురుమూర్తి(47) ఆమెను అనుసరించి.. ఎవరూ లేని సమయంలో వనమలదిన్నె సమీపంలోని సబ్‌స్టేషన్ వెనుక పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు కమ్మలు, చైను, ముక్కు పుడక లాక్కెళ్లాడు. బాధితురాలు స్పృహ కోల్పోయింది. కొన్ని గంటల తర్వాత తీవ్ర గాయాలతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది. అనంతరం స్థానికులు ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. గ్రామ సమీపంలో తచ్చాడుతున్న నిందితుడు గురుమూర్తిని పట్టుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ గంగిరెడ్డి, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గురుమూర్తికిది అలవాటే.. వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి గతంలోనూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై పుంగనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గురుమూర్తి ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అతని భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు. -
ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
సాక్షి, పుంగనూరు(చిత్తూరు) : ప్రియుడి వేధిపులు తాళలేక మరొక ప్రియుడితో కలిసి అతన్ని ప్రియురాలు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. పుంగనూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను పలమనేరు డీఎస్పీ అరీపుల్లా విలేకర్లకు తెలియజేశారు. పట్టణంలోని ఎంఎస్ఆర్ థియేటర్ ప్రాంతానికి చెందిన దంపతులు ఖాదర్‌బాషా, మల్లికా భాను. మల్లికాభాను ఖాదర్‌బాషాను వదిలివేసి షబ్బీర్ అనే అతనితో ఉంటోంది. అతడు చెడు అలవాట్లకు బానిసై నిత్యం ఆమెను వేధించేవాడు. తన జల్సాలకు డబ్బుల కోసం ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేవాడు. దీంతో మల్లికాభాను తన మరో ప్రియుడు షేక్ చాంద్‌బాషాతో కలిసి గత నెల 21న షబ్బీర్‌ను హత్య చేసింది. షబ్బీర్ తాగిన మైకంలో ఇంట్లో నిద్రిస్తుండగా మల్లికాభాను, చాంద్‌బాషా కలిసి లుంగీని మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చాంద్‌బాషా బొలెరో జీపులో మండలంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరిపీచు వేసి, పెట్రోల్ పోసి కాల్చివేశాడు. కృష్ణాపురం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు గత నెల 29న పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో మృతదేహం షబ్బీర్‌ది అని, మల్లికాభాను ఆమె ప్రియుడు చాంద్‌బాషా కలిసి హత్య చేసినట్లు రుజు వైందని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఇరువురిని పట్టణ సమీపంలోని భగత్‌సింగ్‌కాలనీ వద్ద సీఐ మదుసూదనరెడ్డి, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇరువురినీ రిమాండుకు తరలించామన్నారు. చదవండి : యువకుడితో ఇద్దరు యువతుల పరారీ! -
బాత్రూంలో బంధీగా చిన్నారి ; చివరికి
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పుంగనూరు మున్సిపల్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నహర్షవర్ధన్‌ను బాత్రుమ్‌లో పెట్టి తోటి విద్యార్థులు తాళం వేశారు. దీంతో భయంతో మూడు గంటలపాటు విద్యార్థి బాత్రుమ్‌లోనే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెంటనే తలుపులు తీసి చూడగా, అప్పటికే హర్ష వర్ధన్ తీవ్ర జ్వరంతో కింద పడిపోయి ఉన్నాడు. హుటాహుటిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. పాఠశాల ఉపాద్యాయుల నిర్లక్ష్యం కారణంగానే హర్ష వర్ధన్ చనిపోయాడంటూ ఆందోళనతో బంధువులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. -
గూడూరుపల్లి వద్ద ఉద్రిక్తత
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద చిన్న వ్యాపారస్తులకు, వాణిజ్య పన్నుల శాఖాధికారుల మధ్య ఆదివారం గొడవ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. జీఎస్టీ పన్నులు కట్టాలని వ్యాపారస్తులపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒత్తిడి చేయడంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో పండ్లు, కూరగాయలతో పాటు తమ సరుకు అమ్ముకునే దాని కంటే జీఎస్టీ పన్నులు ఎక్కువగా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు. తాము జీఎస్టీ కట్టలేమని చిన్న వ్యాపారస్తులు అనడంతో చిన్న వ్యాపారస్తులకు, అధికారుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో వాణిజ్యపన్నుల అధికారి చెన్నారెడ్డి వాహనాన్ని వ్యాపారస్తులు కట్టెలతో కొట్టి ధ్వంసం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిని కడతేర్చిన కుమార్తె
పుంగనూరు: చెడు అలవాట్లకు బానిసై, వేధిస్తున్న కన్నతండ్రిని కుమార్తె బండరాయితో కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని మేలుపట్లలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మేలుపట్లలో షేక్‌బాబుబాషా (48)కు కుమార్తె నగీన, కుమారుడు సిద్దిక్ ఉన్నారు. నగీన టీటీసీ చదువుతోంది. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. మద్యానికి బానిసైన షేక్‌బాబుబాషా మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులను కొట్టడం, ఇంట్లో వస్తువులు అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగేవాడు. పలుమార్లు చెప్పిన బాబుబాషా ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో తీవ్రంగా గొడవపడ్డాడు. విసిగిపోయిన నగీన ఇంటి ముందు నిద్రిస్తున్న తండ్రి తలపై పెద్ద బండరాయితో మోదింది. బాబూబాషా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సీఐ సాయినాథ్, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. -
కురవపల్లిలో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52వ రోజు ప్రజాసంకల్పయాత్ర కురవపల్లి వద్ద ముగిసింది. ఆయన ఇవాళ 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అసిపిరెడ్డిగారి పల్లి, కొత్తపల్లి క్రాస్, కరివేండ్లపల్లి క్రాస్, ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లి, పెద్దురు, చెరువుముందరిపల్లి, చెనకవారిపల్లి మీదగా కురవపల్లి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. పాలమందపెద్దూరు, చెరువుముందరపల్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఇప్పటివరకూ ఆయన 728.4 కిలోమీటర్ల నడిచారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ వైఎస్ జగన్ 53వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పుంగనూరు నియోజకవర్గం కురవపల్లి శివారు నుంచి ఆయన శుక్రవారం ఉదయం పాదయాత్రను ప్రారంభిస్తారు. గండ్లపల్లి, కంభంవారిపల్లి, కందూరు క్రాస్, సదాం, భట్టువారిపల్లి, గొడ్కవారిపల్లి వరకూ ప్రజసంకల్పయాత్ర కొనసాగనుంది. -
ప్రేమ పెళ్లి.. ఆత్మహత్య
పుంగనూరు : పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో నివాసముంటున్న యువతి ఆత్మహత్య కు పాల్పడింది. ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన నగేష్ కుమారై తేజశ్వని (20 ) తిరుపతిలో ఉన్న బంధువుల ఇంటికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన ఆర్థర్‌పాల్ కుమారుడు ప్రశాంత్‌పాల్‌తో పరిచయమైంది. ఇద్దరూ 2016లో పెళ్లి చేసుకొని పుంగనూరులో కాపురం పెట్టారు. వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో ఆమె శుక్రవారం రాత్రి ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పింది. వెంటనే ప్రశాంతపాల్ అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
బంగారు రింగుల కోసం..
పుంగనూరు: చిత్తూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పుంగనూరు బైపాస్‌లో ఓ విద్యార్థిని చెవులు కోసి చెవి రింగులు దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై మంగళవారం మధ్యాహ్నం కొందరు యువకులు దాడిచేశారు. బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. సదరు విద్యార్థిని లంచ్ బ్రేక్‌లో భోజనం చేసి స్కూలు బయటకు వచ్చింది. అప్పుడే కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెపై దాడిచేసి బ్లేడుతో చెవులు కోసి రింగులు దోచుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే పుంగనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస చైన్ స్నాచింగ్స్తో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. -
మున్సిపాలిటీ 'పరువు' హత్య!
పన్నుల వసూళ్ల కోసం చెత్త పద్ధతులు ఫాలో కావద్దని న్యాయస్థానాలు ఓ వైపు చీవాట్లు పెడుతూనే ఉన్నా పురపాలక అధికారుల చిత్తంలో మాత్రం మార్పు రావట్లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బకాయి వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు చేసిన నిర్వాకం ఓ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. సకాలంలో పన్నులు చెల్లించలేదంటూ పుంగనూరుకు చెందిన ఆదినారాయణ ఇంటి ముందు చెత్త ట్రాక్టర్‌ను నిలిపారు. మున్సిపల్ అధికారుల చర్యను ఘోర అవమానంగా భావించిన ఆదినారాయణ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆదినారాయణ వైఎస్సీర్ సీపీ రైతు విభాగం పుంగనురు అధ్యక్షుడు కూడా. మున్సిపల్ అధికారులే ఆదినారాయణను పొట్టనబెట్టుకున్నారంటూ ఆయన భార్యా, పిల్లలు పెద్దపెట్టున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అధికారులపై హత్య కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పుంగునూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని సందర్శించారు.