
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనపై ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆయన కాన్వాయ్‌ను అడ్డు తగిలి పలువురు నేతలను వెనక్కి పంపించారు.
మున్సిపల్ ఆఫీస్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలతో మిథున్‌రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ శ్రేణులు ఆయన పర్యటనకు అడ్డుతగిలే అవకాశం ఉందని చెబుతూ పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. అనుమతికి మించి వాహనాలున్నాయంటూ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ను ఆపేశారు.
మరోవైపు.. మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ వైఎస్సార్‌సీపీ నేతలను, కేడర్‌ను లోపలికి అనుమతించడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో నిజంగా నష్టమా?