Mithun Reddy Peddireddy
-
పుంగనూరులో పోలీసుల ఓవరాక్షన్
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనపై ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆయన కాన్వాయ్‌ను అడ్డు తగిలి పలువురు నేతలను వెనక్కి పంపించారు.మున్సిపల్ ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలతో మిథున్‌రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ శ్రేణులు ఆయన పర్యటనకు అడ్డుతగిలే అవకాశం ఉందని చెబుతూ పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. అనుమతికి మించి వాహనాలున్నాయంటూ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ను ఆపేశారు.మరోవైపు.. మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ వైఎస్సార్సీపీ నేతలను, కేడర్‌ను లోపలికి అనుమతించడం లేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో నిజంగా నష్టమా? -
‘సూపర్‌సిక్స్ మరచిపోయారు’
సాక్షి,తిరుపతి: కూటమి నేతలు ప్రజాసమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాష, కౌన్సిలర్లు తిరిగి సోమవారం(సెప్టెంబర్2) వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపించ లేదు అని ప్రశ్నిస్తున్నా. ఎవరైనా పార్టీ మారక పోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌ను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు. సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మరచిపోయారు. వారు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అభివృద్ధిపై దృష్టిపెట్టాలి’ అని మిథున్‌రెడ్డి సూచించారు. కొన్ని కారణాల వల్ల తాము రాజీనామా చేసి వెళ్ళామని, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చామని మున్సిపల్ చైర్మన్ అలీంబాష తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. -
ఈ అరాచకాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫ్యలంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.‘‘ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ కార్యకర్తల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వినుకొండలో రషీద్‌ను హతమార్చిన 24 గంటల్లోనే ఈ దాడి జరగటం దారుణం. అధికారంలోకి వచ్చినప్పటి టీడీపీ కార్యకర్తలు యధేచ్చగా దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ అరాచకాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. I strongly condemn the attack on @YSRCParty Lok Sabha MP PV Midhun Reddy garu and former MP Reddeppa garu by those associated with @JaiTDP. This incident comes just 24 hours after the brutal murder of Rashid in Vinukonda by a TDP goon. Since coming to power, the new regime has…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024వైఎస్సార్సీపీ అత్యవసర సమావేశంరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న దాడులు, పాల్పడుతున్న హింసాత్మక ఘటనలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న జగన్పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో హత్యకు గురవ్వడం, ఇవాళ చిత్తూరు పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరగడం తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక.. రేపు వినుకొండకు వెళ్లనున్న జగన్.. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో కుట్రకోణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ కమిషన్ వేసి నిజనిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసే నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చదువుకునే రోజుల నుంచి పెద్దిరెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు ప్రతిసారి కుట్రలు చేసేవాడని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి వారి నుంచి విశేష ఆదరణ పొందుతున్న పెద్దిరెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా తాను సీఎం అవుతానని చెప్పడంలేదని, బాబును సీఎం చేయడానికే తాపత్రయ పడుతున్నట్టు అర్థమవుతోందన్నారు. చదవండి: (మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం) -
పార్లమెంట్లో ‘హోదా’ గళం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీ మేరకు ఆంధ్ర్రపదేశ్కు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాలని, జీవనాడి లాంటి పోలవరానికి నిధులివ్వకుండా, జాతీయ ప్రాజెక్టులా భావించకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా గళమెత్తారు. అశాస్త్రీయ విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఎనిమిదేళ్లు గడిచినా నెరవేర్చకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో 20 మందికిపైగా ఎంపీలంతా కలసి హోదా ఇవ్వాలని వందల సార్లు డిమాండ్ చేశామని, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని గుర్తించాలన్నారు. కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను గత సర్కారుకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలేవీ పూర్తి కాలేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. 2014లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగతారాయ్ సభకు గుర్తు చేశారు. మంగళవారం లోక్‌సభలో ‘సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’పై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఆ వివరాలివీ.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశ ప్రజల గళం కావాలి. హోదా కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు నివేదించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతోప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సాకులు చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాం. విభజన చట్టానికి సవరణ చేయాలని కోరాం. రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో డిమాండు చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ టీడీపీ సభ్యుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరానికి జాతీయ ప్రాజెక్టు తరహాలో నిధులు విడుదల చేయడం లేదు. నూతన భూసేకరణ నిబంధనలు, ప్రాజెక్టు ఖర్చు పెంపు ఇలా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సాంకేతిక కమిటీ 2019లోనే ఆమోదించినా ఆర్థిక శాఖ ఇంకా ఆమోదించకపోవడం సరికాదు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే తాగునీటి కాంపొనెంట్‌ను వేరు చేయడం. అంచనా వ్యయం నుంచి రూ.4,068 కోట్లు వేరు చేసి కేవలం సాగునీటి కోసమే ప్రాజెక్టును కడుతున్నామనడం ఎంతవరకు సమంజసం? ప్రాజెక్టును తాగునీటికి వినియోగిస్తే ఆ మొత్తాన్ని తగ్గిస్తామనడం సరికాదు. జాతీయ ప్రాజెక్టులో తాగునీరు కూడా ఒక భాగమే. కాంపొనెంట్ వారీ షరతులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలవరానికి రూ.10వేల కోట్ల అడ్‌హక్ నిధులను కేటాయించాలి. ఉపాధి హామీ నిధులు గతేడాదితో పోలిస్తే రూ.8,600 కోట్లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌కు 9.68 కోట్ల పనిదినాలు తగ్గాయి. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలి. విభజన నేపథ్యంలో సుమారు రూ.32 వేల కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. గత ప్రభుత్వం పరిమితికి మించి రూ.17,923 కోట్లకుపైగా రుణాలు అదనంగా తీసుకుందనే కారణంతో ఇప్పుడు కోతలు విధించడం సరికాదు. రూ.6,800 కోట్ల విద్యుత్తు బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత చట్టం ప్రకారం 77 వేల అదనపు టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రానికి అందచేయాలి. ఏపీ ప్రభుత్వం హోదా కోరింది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అయితే 14వ ఆర్థిక సంఘం సాధారణ రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు. రాష్ట్రాల వనరుల లోటును రెవెన్యూ లోటు నిధులతో పూడుస్తున్నామని చెప్పారు. చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!) . -
మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ జీఎస్డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. -
వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు
మదనపల్లె సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషాల సమక్షంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్‌అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్‌ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్‌రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అక్రమాలు నిరూపించగలరా?
సాక్షి, అమరావతి: కుప్పం మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరూపించగలరా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మొత్తం 48 పోలింగ్ బూత్‌లలో ఏ బూత్‌లోనైనా దొంగ ఓట్లు వేసి ఉంటే వాటిపై ఏ బూత్‌లోనైనా టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని బాబును ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో 85% పంచాయతీల్లోనూ.. 90% ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలిచిందని.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు తద్భిన్నంగా రావని.. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే అంచనాకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కట్టుకథలు అల్లుతున్నారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు చేర్చారని చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు రివర్స్ గేర్‌లో మాపై ఆరోపణలు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఏజెంట్లు, అభ్యర్థులెవరూ ఫిర్యాదు చేయలేదు ‘కుప్పం మున్సిపాలిటీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓట్లు వేశారని.. చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీకి వత్తాసు పలికే అనుకూల మీడియాలో పెద్దఎత్తున కథనాలు రాశారు. అవన్నీ కట్టుకథలే. లోకేశ్ రెండ్రోజులపాటు కుప్పంలో మకాం వేసి.. ఆ పార్టీలో బలమైన, సీనియర్ నేతలను పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా నియమించారు. ప్రతి బూత్‌లో ఎన్నికల అధికారి, టీడీపీ ఏజెంటు, వైఎస్సార్సీపీ ఏజెంటు వద్ద కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఫలానా వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడనిగానీ, ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు పోల్ అయ్యాయనిగానీ 48 మంది టీడీపీ ఏజెంట్లు.. 24 మంది టీడీపీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. అక్రమాలు జరిగినట్లు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ప్రతి బూత్‌లో ఏం జరుగుతుందన్నది ఎస్ఈసీ వెబ్‌కామ్ ద్వారా వీడియోలలో రికార్డు చేసింది. చదవండి: (మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే: సజ్జల) అక్రమాలు జరిగింది ఎక్కడ? చంద్రబాబూ.. ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు వేశారు, అక్రమాలు జరిగాయని.. వెబ్‌కామ్‌ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను చూపాలని ఎస్ఈసీని కోరండి. మేం కూడా అదే బూత్‌లో ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని ఎస్ఈసీని కోరుతాం. అందుకు మీరు సిద్ధమా? అసలు.. ఓటరు కాని వ్యక్తి దొంగ ఓట్లు ఎలా వేయగలుగుతాడు? ఓటరు జాబితాలో ఉన్న ఒకరి ఓటును మరొకరు వేయాలి. అప్పుడు అన్ని పార్టీల ఏజెంట్లు బూత్‌లలో ఉంటారు. దొంగ ఓటు వేస్తే ఏజెంట్లు పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఒక్క బూత్లోనూ దొంగ ఓటర్లు వచ్చారని గొడవలు జరిగిన దాఖలాలు లేవు. దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే. ఆ సంస్కృతిని వైఎస్సార్సీపీపై రుద్దితే ఎలా? కుప్పంలో 28వేల దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి 2014లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన ఎన్నికల సంఘం 18 వేల ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఇంకా పది వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు చేర్పించిన దొంగ ఓట్లే. ఆ ఓట్లతోనూ.. దౌర్జన్యాలతోనూ ఇన్నాళ్లూ కుప్పంలో చంద్రబాబు నెగ్గుతూ వస్తున్నారు. కుప్పం ప్రజలకు ఇప్పటివరకూ చంద్రబాబు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల తరహాలోనే కుప్పం నియోజకవర్గాన్ని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు కేవలం 1,300 పక్కా ఇళ్లు ఇస్తే.. రెండున్నరేళ్లలో సీఎం జగన్ 5 వేలకుపైగా మంజూరు చేశారు. హంద్రీ–నీవాలో నీళ్ల లభ్యత తక్కువ ఉంది కాబట్టి, గాలేరు–నగరితో అనుసంధానం చేసి కుప్పానికి నీళ్లు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ గుర్తించే కుప్పం ప్రజలు సీఎం జగన్ వెంట నడుస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుంది’. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ‘కుప్పం ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. ‘చంద్రబాబు గత 30 ఏళ్లుగా మా నాన్నని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలుస్తాం’ అని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పనులపై వచ్చిన వారిని దొంగ ఓటర్లు అంటారా? తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కుప్పం ఉంది. పనుల నిమిత్తం వెళ్తున్న వారిని కుప్పం బస్టాండ్ నుంచి పట్టుకువచ్చి వారే దొంగ ఓటర్లు అని టీడీపీ నానా యాగీ చేసి.. భయానక వాతావరణం సృష్టించింది. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా దొంగ ఓట్లు వేశారని చూపించిన వీడియోల్లో.. ఏ ఒక్కరి వేలిపైనైనా ఓటు వేసినట్లు ఇంకు గుర్తు ఉందా అంటే లేదు. అంటే ఓటే వేయని వారిని చంద్రబాబు, టీడీపీ నేతలు దొంగ ఓటర్లుగా చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. దొంగ ఓటర్లంటూ టీడీపీ పట్టుకున్న వ్యక్తులంతా రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ మద్దతుదారులేనని తేలినట్లుగా పోలీసులే చెబుతున్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? చదవండి: (రెండు రోజులపాటు తిరుమల నడకదారులు బంద్: టీటీడీ) -
‘గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదు’
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అంబటి పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని.. నిమ్మగడ్డ మాత్రం ఎందుకు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షల నేపథ్యంలో అంబటి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి గుర్తుచేశారు. ఇది దుర్మాగం ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. మా హక్కులకు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూడిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉల్లి ఎగుమతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. తమ వినతిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలోనే ఉల్లి ఎగుమతికి అనుమతి వస్తుందని చెప్పారు. -
అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి. రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలి. గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి -
రాహుల్‌కి సుప్రియా సూలే ‘గ్రీన్ ఛాలెంజ్’
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం పెంచే లక్ష్యంతో మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాందీని చేరింది. గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి మొక్కనాటిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్, మరో నలుగురికి మొక్కలు నాటే ఛాలెంజ్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జీఎమ్మార్ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు. వెంటనే దీనిని అంగీకరిస్తూ అఖిల్, మిథున్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మల్లిఖార్జునరావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానంటూ, తన తరపున మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఉన్నారు. మిథున్‌రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన సుప్రియా ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తాను నామినేట్ చేస్తున్నట్లు సుప్రియ ట్వీట్ చేశారు. ఈవిధంగా గ్రీన్ ఛాలెంజ్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని చేరింది. -
సామాన్యుల చెంతకు తుడా సేవలు
సాక్షి, తిరుపతి తుడా: తుడా సేవలను సామాన్యుల చెంతకు తీసుకెళతామని ఆ సంస్థ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. తుడా వీసీ పీఎస్ గిరీషాతో కలిసి ఆయన శనివారం తుడా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వసతుల కల్ప నకు పెద్ద పీట వేయనున్నామన్నారు. తుడా పరి ధిలోని అనేక గ్రామాల్లో ప్రజలు కనీస వసతులకు నోచుకోవడంలేదన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో మరో నాలుగు నిర్మిస్తామన్నారు. మహిళా వర్సిటీ సమీపంలో తుమ్మలగుంట రోడ్డులోని తుడా విశ్రాంత భవనం పక్కన ఉన్న 1.70 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుచానూరు మార్కెట్ యార్డు, మంగళం సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కరకంబాడి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మరింత న్యాయం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. సూరప్పకశంలోని 146 ఎకరాల తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం పది రోజుల్లో తుడా గ్రీన్ టౌన్ షిప్ ప్లాన్ అందుబాటులోకి రానుందన్నారు. తుడా పరిధిలోని ప్రతి ఇం టికీ రెండు పండ్ల మొక్కలు, మరో రెండు వేప, కానుగ వంటి మొక్కలు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను తుడానే అందించి గ్రామీణ విద్యార్థుల ఉన్నతికి దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ గిరీషా, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, తుడా సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతర్గతంగా సమావేశం తుడా కార్యాలయంలో చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వీసీ గిరీషా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ సమావేశమయ్యారు. తిరుపతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. మా బంధం విడదీయరానిది మాది అన్నదమ్ముల అనుబంధం.. కష్టనష్టాల్లోనూ మా బంధం విడదీయరానిదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడారు. తుడా కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి విచ్చేసిన సందర్భంగా శనివారం చైర్మన్ చెవిరెడ్డి, వీసీ గిరీషా, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో చైర్మన్‌తో కలిసి కొంతసేపు మాట్లాడారు. తుడాకు విలువ తీసుకురావడంతోపాటు ఉన్నత స్థితిలో నిలిపేందుకు చెవిరెడ్డి కృషి చేస్తారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదన్నారు. వీసీగా పీఎస్ గిరీషా మంచి సేవలందిస్తారని చెప్పారు. అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులని, ఆ తరువాత తామిద్దరం అంతకు మించి స్నేహితులుగా..అన్నదమ్ముల్లా ఉన్నామని అన్నారు. -
పార్లమెంట్లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు
సాక్షి, కడప కార్పొరేషన్: రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఐదేళ్లుగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి లోపించి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇదే పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ట్యాక్స్ మినహాయింపులు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా తమ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ రాష్ట్రం నుంచి 23 ప్రతిపాదనలు వచ్చాయని, ఎప్పటిలోగా వాటిని మంజూరు చేస్తారో చెప్పాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారని, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే కంపెనీలకు కూడా ఈ స్కీంను వర్తింపజేస్తే అధిక ప్రయోజనం కలుగుతుందని, అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ది కూడా జరుగుతుందని వివరించారు. దీనిపై సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రాయితీలు, సబ్సిడీలు, ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఏపి సర్కార్ ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న కంపెనీలకు వడ్డీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతులను ఆదుకోండి 2012–13 రబీ శనగపంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. ఆశిష్ కుమార్ భుటానిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడేళ్లయినా ఇన్సూరెన్స్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, వెంటనే ఇన్సూరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీనిపై జాయింట్ సెక్రటరీ స్పందిస్తూ క్లెయిమ్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేసి మూడు రోజుల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఫైలు పంపిస్తానని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌లో జైలుశిక్ష అభ్యంతరకరం – ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట: ట్రిపుల్ తలాక్ చట్టం అభ్యంతకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలని చెప్పారు. వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలుశిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతకరమని పేర్కొన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళాసాధికారతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ మరోసారి స్పష్టంచేశారు. ముస్లీం మైనార్టీ మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. -
మేం తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ఉచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరువాత.. ఇక దీనిలో నేరాన్ని వర్తింపజేసే అంశం ఎక్కడ ఉందని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. నాన్ బెయిలబుల్ కేసు, మూడేళ్ల జైలు శిక్ష తదితర అంశాలతో కూడిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ లింగ సమానత్వాన్ని కోరుకుంటోంది. మహిళా సాధికారత కోసం నిలబడింది. మహిళాభ్యున్నతికి పాటుపడుతోంది. ఏపీ నూతన సీఎం ప్రారంభించిన అన్ని పథకాలు మహిళల అభ్యున్నతికి దోహదపడేవే. ఆయన మతసామరస్యం కోసం నిలబడే వ్యక్తి. సాధ్యమైన అన్ని మార్గాల్లో మహిళా సాధికారత కోసం మేం నిలబడుతాం. అయితే ప్రస్తుత రూపంలో ఈ బిల్లును మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేం. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఐఏ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు తదితర ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. 2017 ఆగస్టులో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. నాన్ బెయిలబుల్ కేసు వర్తింపజేయడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి. వివాహ బంధాల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పటికే గృహహింస నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 498ఏ తదితర చట్టాలున్నాయి. గృహహింస చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం మహిళకు మెయింటెనెన్స్ చెల్లించాలి. భర్త జైలులో పడితే మహిళలకు సామాజిక ఆర్థిక సహకారం ఎలా అందుతుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని చెబుతున్న ప్రభుత్వం దీనిలో మాత్రం విశ్వాస్ లేకుండా చేసింది. కొన్ని అభద్రతలు యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వం పునఃపరిశీలించి అభ్యంతరాలను పరిష్కరించి బిల్లును పాస్ చేయాలి. మేం మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం నిలబడుతున్నాము’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
‘హోదా’పై కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేస్తూ 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొత్త డిమాండ్ ఏమీ కాదు. 2014 మార్చిలో అప్పటి కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని నిర్ణయించింది. దానిని తక్షణం అమలుచేయాలని ప్రణాళిక సంఘానికి పంపింది. కానీ, గడిచిన ఐదేళ్లలో దీనిని అమలుచేయలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఆక్షేపించిందని సభలో పలుమార్లు చెప్పారు. కానీ, ఇది వాస్తవం కాదు. కేంద్రం ఒక్క సంతకంతో దానిని అమలుచేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయి. కేంద్రం స్పందించేందుకు ఇది సరైన సమయం. రెవెన్యూ లోటు రూ.63 వేల కోట్ల మేర ఉంది. రాజధాని లేకుండా, మౌలిక వసతలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇంత మొత్తం రెవెన్యూ ఎలా భర్తీ చేసుకోగలదు? అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఒకటి రెండే ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’.. అని మిథున్‌రెడ్డి వివరించారు. చట్టంలో హామీలు నెరవేర్చండి ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు పొందుపరిచారు. కడప స్టీలు ప్లాంటు గురించి బడ్జెట్లో ప్రస్తావనలేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా.. గడిచిన రెండేళ్లుగా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో మీరు పారిశ్రామిక రాయితీలు ఏమిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావనలేదు.. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు.. మెట్రో రైలు పనులు ప్రారంభం కాలేదు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముంది’.. అని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వాటా లెక్కించే విషయంలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది సరికాదని ఆయనన్నారు. -
అరుదైన గౌరవం
సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం స్పీకర్ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభను నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్ స్పీకర్‌గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ప్యానల్ స్పీకర్ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్‌గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్‌సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్‌సభలో చిన్న వయసులోనే ప్యానెల్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్‌సభ నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిపారు. -
‘టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి’
సాక్షి, అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి మండిపడ్డారు. గుత్తి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మిథున్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. కోర్టు నుంచి కేవలం నోటీసులు రాగానే కుట్ర అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజవర్గంలో జేసీ సోదరులు, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేత పెద్దారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారని మిథున్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలపై పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారని తెలిపారు. కొంతమంది అధికారుల వల్ల పోలీసు డిపార్ట్ మెంట్‌కు చెడ్డ పేరు వస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదారు నెలలు మాత్రమే ఉండబోతుందని, వైఎస్సార్సీపీ విజయం ఖాయం అని అన్ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. -
టీడీపీ నేతల అరాచాకలు పెరిగిపోయాయి
-
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వంచనపై గర్జన దీక్ష శిబిరంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎల్లుట్ల మారుతీ నాయుడు, మహేష్, నాగార్జున ఫ్యాన్స్ వెంకట్, నాని, యాసిన్, బాబ్జాన్, శర్మాస్‌వలి తదితరులకు తాజా మాజీ ఎంపీ, పార్టీ జిల్లా ఇన్చార్జి మిథున్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి వెళ్లారు. అయితే హృదయం నిండా వైఎస్సార్సీపీపై అభిమానం ఉంచుకుని ఇతర పార్టీలో కొనసాగలేక తిరిగి వచ్చామన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నానని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరినా అక్కడ ఉండలేక తిరిగి పార్టీలో చేరానని మారుతీనాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. -
బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు
సాక్షి, పీలేరు : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్ రాజశేఖర్ రెడ్డి అని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మికీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మైనార్టీలను వైఎస్సార్సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్ జగన్, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. -
వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితోలో లేరని తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తారని ప్రజలను ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. -
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోండి
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ కుటుంబం’ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘నవరత్నాల’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాజారాం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి ఆదికి ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, కడప : బైరటీస్ గనుల్లో ఏపీఎండీసీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. కులం పార్టీ అడగనిదే ఏపని చేయడం లేదని విమర్శించారు. చివరకు టాక్సీ డ్రైవర్‌ను కూడా సొంత ఊరి నుంచి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారులు బాధ్యతలను వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకొని టీడీపీలోకి వెళ్లాలంటూ చురకలంటించారు. రెండు కంపెనీలకు మేలు జరిగేలా టెండర్ల నిబంధనలు మార్చిన ఘనత చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. అవినీతి అధికారులపై విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకమిటీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కుటుంబం గురించి నీచంగా మాట్లాతున్నారని, మంత్రికి ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. బాబు అవినీతిపై ప్రశ్నిస్తే.. రమణ దీక్షితులు నుంచి ప్రతిఒక్కరిపైనా కేసులు పెడుతున్నారంటూ మండిప్డడారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పసువులను కొన్నట్లు కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొల్లినేని
సాక్షి, రాజాంపేట : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తీరుపై కినుక వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తన అనుచరులతో చర్చించిన ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సమక్షంలో బొల్లినేని పార్టీలో చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. -
కుటుంబమంతా దీక్షా శిబిరంలోనే..
ఐదు కోట్ల ఆంధ్రుల కోసం...విభజన హక్కుల సాధన కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం.. ప్రాణాలను పణంగా పెట్టి హస్తినలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ఎంపీలకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది. జిల్లాకు చెందిన పార్టీ శాసనసభ్యులూ, సమన్వయకర్తలు, వివిధ విభాగాల్లో పార్టీకి సేవలందించే నాయకులంతా మూడు రోజుల ముందే ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీలు దీక్ష చేస్తోన్న శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించి హోదా సాధనలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే..చిత్తూరు జిల్లా నేతలే ఢిల్లీలో కీలకంగా మారి ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఎంపీలందరూ ఈ నెల 6న పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్లో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రోజులు గడుస్తున్నా, దీక్షకు కూర్చున్న వారి ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ప్రాణాలైనా అర్పిస్తాం, ఉద్యమాన్ని వీడబోమన్న ఎంపీల పిలుపునకు వివిధ జిల్లాల నాయకులందరూ కదిలారు. హస్తిన బాట పట్టి దీక్షా శిబిరాన్ని చేరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ శాసనసభలో ఉప నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు సారథ్యం వహించారు. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, చింతల రామచంద్రా రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, ఆర్కే రోజాలతో పాటు సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులంతా దీక్షా శిబిరానికి చేరుకుని ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. హోదా నినాదంలో గొంతు కలిపారు. రాష్ట్రం తరపున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీక్షలు సంపూర్ణంగా ముగిసే వరకూ ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కుటుంబమంతా దీక్షా శిబిరంలోనే.. ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తోన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యులు రెండు పూటలా పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణమ్మ, భార్య దివ్య, సోదరి శ్రీశక్తిలు రెండు రోజులుగా దీక్షా ప్రాంగణాన్ని వీడటం లేదు. దగ్గరుండి మిథున్ రెడ్డికి మద్దతు ప్రకటించి ధైర్యం చెబుతున్నారు. దీక్ష విరమించమని పలువురు మిత్రులు, పార్టీ పెద్దలు చెప్పినా మిథున్ రెడ్డి పట్టువీడటం లేదు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాపునాడు నేతల సంఘీభావం.. రాయలసీమ కాపునాడు నేతలు పలువురు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి దీక్షకు మద్దతు ప్రకటించారు. చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు వీరికి నేతృత్వం వహించారు. జింకా వెంకటాచలపతి, మిద్దింటి కిషోర్, కొండవీటి నాగభూషణం, కోలా సోము, పీటీఎం శివన్న, సోంపాలెం జయచంద్ర తదితరులు మద్దతు ప్రకటించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా తిరుపతికి చెందిన రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ వై. ఆనందరెడ్డి, సదుం రవీంద్రనాథ్‌లు కూడా ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావాన్ని ప్రకటించారు. -
6వ రోజుకి చేరిన వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆమరణ దీక్ష
-
మహాత్ముడి బాటలోనే దీక్ష చేస్తున్నారు
-
అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుంది
-
కేంద్రం దిగివచ్చేవరకు నిరసన కొనసాగిస్తాం
-
రాష్ట్రం కోసం రాజీనామా చేయడం గర్వంగా ఉంది
-
టీడీపీ నేతలే భూకబ్జాదారులు
పీలేరు: పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, టీడీపీ నేతలే భూకబ్జాదారులని రాంజపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పీలేరు పట్టణం ఎర్రమరెడ్డిగుట్టలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలకు సైతం సెంటు స్థలం లేకుండా పీలేరు పట్టణానికి అన్ని వైపులా ఆక్రమణల పరంపర కొనసాగుతోందన్నారు. టీడీపీ నాయకులు అరకొర మిగిలిన వాగులు, వంకలు, చెరువులను కూడా ఆక్రమించి లేఔట్లు వేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణకు గురైన భూములన్నింటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచేస్తామన్నారు. భూఆక్రమణలపై కోర్టులో పోరాటం సాగిస్తామని తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆక్రమణదారులు ఎంతటి వారైనా, ఎవరినైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంపీపీ డి.హరిత, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, మండల పార్టీ కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు పులిచెర్ల(కల్లూరు): తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. కల్లూరులో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకోసం నాలుగేళ్లు మీనమేషాలు లెక్కిస్తూ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనడం ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. ఏప్రిల్ 5లోపు హోదాపై హామీ రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి పోరాటం సాగిస్తామన్నారు. అనంతరం కల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరులకు రూ.20 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన కమ్యూనిటీ హాలుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, ఎంపీ పి.మురళీధర్, మండల కన్వీనరు మురళీమోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నాలుగేళ్లుగా ఆయన ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని తెలిపారు. విభజన హామీలపై మొదటినుంచీ వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని, ప్రత్యేక హోదా సాధనం కోసం వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారని గుర్తుచేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేసేవరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
‘ఏపీ పభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’
సాక్షి, వైఎస్ఆర్ కడప: ఫాతిమ మెడికల్ కళాశాల విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలవరం, ప్రత్యేక హోదాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అవినీతిపై వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలవరం గురించి ఎప్పుడు ప్రస్తావించినా... ఇది ఇక్కడ సాధ్యం కాదు, ఢిల్లీలో అన్నీ సర్దుకుంటాయంటారని మిథున్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. -
రెండింతలిస్తాం.. మీ ఆస్తులిచ్చేస్తారా?
-
రెండింతలిస్తాం.. మీ ఆస్తులిచ్చేస్తారా?
పీలేరు: సీఎం కుటుంబ సభ్యులు ప్రకటించిన ఆస్తుల విలువకంటే రెండింతలు ఎక్కువ ఇవ్వడానికి తాము సిద్ధమని, మీ ఆస్తులు ఇచ్చేస్తారా అంటూ మంత్రి లోకేష్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాలు విసిరారు. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కుటుంబం బూటకపు ఆస్తుల వివరాలు ప్రకటించి ప్రజల్ని మభ్యపెడుతోందని విమర్శించారు. ఆస్తుల ప్రకటనను ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు. కల్లబొల్లి మాటలతో నీతివంతులమని గొప్పలు చెప్పుకోవడానికి శ్రమిస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు దమ్ము, ధైర్యముంటే వారు ప్రకటించిన దానికంటే రెండింతలు ఎక్కువ తీసుకుని కుటుంబసభ్యుల ఆస్తులను వదిలేయాలని సవాలు విసిరారు. తద్వారా వచ్చిన డబ్బుల్ని రైతుల రుణమాఫీకి, డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు? రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 24 గంటలూ కష్టపడుతున్నారని, నిరాడంబరంగా గడుపుతున్నారని, చేతికి ఉంగరం కూడా లేదని నీతులు చెబుతున్న లోకేష్ హైదరాబాద్‌లో విశాలమైన భవంతి ఎందుకు నిర్మించారో చెప్పాలని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాపురమున్నవారు ఎన్ఆర్ఐలు అన్న లోకేష్ వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావిస్తూ.. కల్లబొల్లి మాటలు కట్టబెట్టి హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు అమ్మేసి అమరావతిలో ఇల్లు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలని సూచించారు. -
చినబాబు లెక్కలు.. బుస్.. బుస్... బోగస్
సాక్షి, విజయవాడ : ఎవరూ అడగటం లేదు.. ప్రకటన చేశాక ఎవరూ పట్టించుకోరు... అయినాగానీ ఆస్తుల ప్రకటన పేరిట నారా వారి ఫ్యామిలీ చేసే డ్రామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఈ ఏడాదికిగానూ నారా లోకేష్ ఆస్తుల వివరాలను వెల్లడించగా.. ఆ ప్రకటన ఎంత చిత్ర-విచిత్రంగా ఉన్నాయో ఓసారి చూద్దాం. వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపిస్తూ.. పైగా మార్కెట్ విలువ అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చినబాబు బాగానే చేశాడు. జూబ్లీహిల్స్ లో వందలకోట్ల విలువైన ఇంటి గురించి మాట మాత్రం ప్రస్తావించని లోకేష్.. మదీనా గూడలోని కొన్ని వందల కోట్లు విలువ చేసే పదెకరాల భూమి విలువను కేవలం 73 లక్షల రూపాయలుగా చూపించటం గమనార్హం. ఇక ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా 300 కోట్ల రూపాయాల ఆస్తులను చూపించిన లోకేష్ ఇప్పుడు కేవలం 15 కోట్ల రూపాయిలు అని చెప్పటం ఆశ్చర్యకరమే. తల్లి భువనేశ్వరి పేరు మీద ఉన్న పంజాగుట్టలో ఉన్న ఇల్లు, తమిళనాడులోని కోట్ల విలువైన భవనాలు, భూముల ప్రస్తావన మచ్చుకైనా కనిపించలేదు. భార్య బ్రాహ్మిణి పేరు మీద జూబ్లీహిల్స్, మణికొండ, చెన్నైలో ఉన్న వందల కోట్ల ఫ్లాట్లు, ఫ్లాట్ల విలువ కూడా తప్పుడు లెక్కలతోనే కూడికుని ఉంది. ఇక తనయుడు మూడేళ్ల దేవాన్ష్ ఆస్తి రూ.11.54 కోట్లుగా పేర్కొన్నాడు. వీటన్నింటిని మించి నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తి రూ.2.53 కోట్లు అని ప్రకటించి తమ ఇంట్లో అత్యంత పేద వ్యక్తి తన తండ్రేనని ప్రకటించి సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాడు. ముందు హామీలను నెరవేర్చండి : ఎంపీ మిథున్‌రెడ్డి చిత్తూరు : నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. ‘ఆస్తుల వివరాలు ఎవరూ అడగటం లేదు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అన్నింటికి మించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యండి’ అని ఆయన సూచించారు. -
టీడీపీకి ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ !
లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): విభజన హామీల అమలుకు చేతనైతే కేంద్రంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు ప్రభుత్వం ముందుకు వస్తే పోరాటానికి తాము కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో మీడియా సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు. కేంద్రానికి లొంగిపోయిన బాబు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజియే ముద్దు అని ఓటుకు నోటు కేసులో కేంద్రానికి చంద్రబాబు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఉన్న మంత్రులతో రాజీనామా చేయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులతో అవినీతి వల్ల కేంద్రం నిధులు నిలుపుదల చేస్తే అది ప్రతిపక్షం వల్లే అని దుష్ర్ఫాచారం చేయడం తెలుగుదేశం నీచ రాజకీయాలకు నిదర్శమన్నారు. ఉపాధి హామీ నిధులకు సంబంధించి లేబర్ కంపొనెంట్ నిధులు విడులతకు పార్లమెంట్, అసెంబ్లీలో ప్రశ్నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస పెట్టండి: ఎన్డీఏ మిత్ర పక్షంగా అధికార భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక పోవడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనే ధ్యాస రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలు హర్షిస్తారని ఎంపీ సూచించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పారు. ప్రతిపక్షంపై నీచ రాజకీయాలు మాని, విభజన హామీల అమలుకు కేంద్రంపై పోరాటినికి తెలుగుదేశ ప్రభుత్వం సిద్ధపడాలని ఎంపీ మిథన్ రెడ్డి కోరారు. -
ఆ విద్యార్థులను రీలొకేట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ/ యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కాలేజీ యజమాన్యం తీరుతో రోడ్డునపడ్డ 100 మంది వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్యోగ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. వారిని ఇతర వైద్య కాలేజీల్లో చేర్పించి (రీలొకేట్) ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వెంటనే కేంద్ర మంత్రిని కలసి విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌తో భేటీ అయ్యారు. అలాగే ఈ అంశంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జయశ్రీ మెహతాకు కూడా ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు. కాగా, ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ పార్టీ ఏపీ నేతలు విజ్ఞప్తి చేశారు. -
మైనార్టీలు వైఎస్సార్‌సీపీతోనే
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మదనపల్లె రూరల్: మైనార్టీలు ఎప్పటికీ వైఎస్సార్‌సీపీతోనే ఉంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నవరత్నాల సభలో పాల్గొనేందుకు మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్న మాటలు అవాస్తవమన్నారు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మైనార్టీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారిని మరల్చేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, ప్రలోభాలు పెట్టినా ఎప్పటికీ జరగదన్నారు. ప్రధాని మోదీ మీడియాలో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఒకే దేశం–ఒకే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. అదే జరిగితే రానున్న ఎన్నికలు వైఎస్సార్సీపీకి చాలా కీలకమన్నారు. కార్యకర్తలు పన్నెండునెలలు శక్తివంచన లేకుండా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల జోక్యంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎలాంటి పథకాలకు నోచుకోకుండా, అన్యాయ మైపోయారన్నారు. వైఎస్సార్సీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్న ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి బూత్‌కమిటీలు కీలకమని, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే బూత్‌కమిటీ సభ్యులు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా కలిసే అవకాశం ఉంటుందన్నారు. బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను వైఎస్సార్ కుటుంబంలో భాగస్వాములుగా చేసి, నవరత్నాల పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని, నిస్వార్థంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్, షమీం అస్లాం, జింకావెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. -
2018 లోనే అసెంబ్లీ ఎన్నికలు
- నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు - ఎంపీ మిథున్‌రెడ్డి బి.కొత్తకోట (చిత్తూరు): వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలు కన్పిస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్ద తిప్పసముద్రం, తంబళ్లపల్లెలో నవరత్నాల సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఒకే దేశం–ఒకే ఎన్నిక నినాదం తీసుకు వస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే 2018లో ఎన్నికలు రావచ్చన్న సంకేతాలు కన్పిస్తున్నాయని తెలిపారు. నంద్యాలలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరిస్తే సీఎం సహా మంత్రులు, టీడీపీ నాయకులు రాద్దాంతం చేశారని అన్నారు. అదే సీఎం చంద్రబాబు సభలో జేసీ సోదరులు వైఎస్ జగన్ మోహ న్‌రెడ్డి కుటుంబసభ్యులను విమర్శిస్తే నవ్వుతూ ఉండిపోయారని, ఇది సీఎంకు న్యాయమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజల పక్షాన సమస్యలను ప్రస్తావిస్తే సరైన సమాధానం ఇవ్వని సీఎం, మంత్రులు జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావిస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. నంద్యాలలో 600 మందికి ట్రాక్టర్లు, 2 వేల కుట్టమిషన్లు అందజేసి, అధికారం అండతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నంద్యాల, కాకినాడల్లో తమ పార్టీ బలంగానే ఉందన్నారు. ఈ ఓటమి వచ్చే ఎన్ని కలపై ఎలాంటి ప్రభావమూ చూపబోదని, కేవలం పోలీసుల అండతో టీడీపీ గెలిచిందన్న విషయాన్ని ప్రతి కార్యకర్తా గుర్తుంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
‘టీడీపీలో అవినీతి రాజ్యమేలుతోంది’
సదుం: టీడీపీ ప్రభుత్వ పాలనలో కిందిస్థాయి నుంచి పై వరకు అవినీతి రాజ్యమేలుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ముందుందన్నారు. వైద్యశాలలో ఎలుకలు కపట్టేందుకు రూ.60 లక్షలు వెచ్చించడం సిగ్గుచేటన్నారు. ఆరు మంది భోజనాలకు రూ. 11 లక్షలు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. స్వంత గృహం ఉన్నా ఫైవ్‌స్టార్ హోటల్లో నెలకు కోటి రూపాయలు చెల్లించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పాల సాగిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఆరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ ఫ్లీనరీలో చర్చిస్తామని ఎంపీ చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్లీనరీలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చర్చించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడి సమస్యల పరిష్రారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తామన్నారు. -
‘జగన్‌ను సీఎం చేద్దాం.. సిద్ధంగా ఉండండి’
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గురువారం మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటయింది. దీనికి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలో లీకులు బాబు అవినీతికి నిదర్శనం అని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం నాణ్యతా రహితంగా నిర్మించారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు మరో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అవినీతి రహిత పాలన, ఆదర్శ పాలన చూడాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకై పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. -
నిరూపిస్తే అనంత నుంచి వెళ్లిపోతా: పెద్దారెడ్డి
అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... పదవుల కోసమే రెడ్డి సామాజికవర్గాన్ని దూషిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ది పోందలేదని ఏ ఒక్కరైనా నిరూపిస్తే అనంతపురం జిల్లా నుంచి తాను వెళ్లిపోయేందుకు సిద్ధమని పెద్దారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందని ఆరోపించారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్ సీపీ సమన్వకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రైతు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో శింగనమల నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా పద్మావతి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యల్లనూరు నుంచి గార్లదిన్నె దాకా 150 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేశారు. గార్లదిన్నెలో శనివారం సాయంత్రం జరిగిన ముగింపు సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. టీడీపీ నేతల ఒత్తిడితో పాదయాత్రకు పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారని... వైఎస్సార్సీపీ కి లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు. -
పరనిందలతో ప్రభుత్వం కాలయాపన
అవినీతిలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కమిటీలతోనే టీడీపీ పతనం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మదనపల్లె: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రజల ఇబ్బందులు తీరుద్దామన్న ధ్యాస లేకుండా ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అవివేకమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మి«థున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజంపేట పరిధిలోని నియోజకవర్గాల సమస్యలపై సబ్‌కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మూడేళ్ల పాలనపై స్పందిస్తూ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో కనీసం 5శాతం కూడా నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కనీస మద్దతు ధర లేకుండా రైతులు విలవిల్లాడుతున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులను దగా చేస్తోందన్నారు. రైతులకు అండగా జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరిస్తే, అదేదో తప్పయినట్లు ఆయనపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. జన్మభూమి కమిటీలతోనే 2019 ఎన్నికలలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనమయ్యాయని, వైఎస్ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్యే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్, మహిళా విభాగం కా ర్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్లు జిం కా వెంకటాచలపతి, సుగుణ ఆంజనేయులు, రఫీ, బాలగంగాధర రెడ్డి, సర్పంచ్ శరత్‌రెడ్డి, చిప్పిలి జగన్నాథరెడ్డి, షరీఫ్, కరీముల్లా, రవిచంద్రారెడ్డి, కోటూరి ఈశ్వర్, మహేష్, జన్నె రాజేంద్రనాయుడు, సుబ్రహ్మణ్యం, మిద్దింటి కిషోర్, మేస్త్రీ శ్రీనివాసులు, సెల్వి, శారదారెడ్డి పాల్గొన్నారు. -
స్వరూపానంద స్వామితో ఎంపీ
యూనివర్సిటీ క్యాంపస్: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీని కలిశారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తిరుపతిలో నివాసం ఉంటున్న కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి ఆదివారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఆశీస్సులు తీసుకున్నారు. -
సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
►ఎస్టీలు, మైనారిటీలను అవమానించారు ►సీఎంకు దమ్ముంటే ఫిరాయింపు ►ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి ►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ►జగన్ సీఎం కావడం తథ్యం ►రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పీలేరు: తాను నిజాయితీ పరున్నని, నిప్పునంటూ పదేపదే ప్రగల్బాలు పలికే సీఎం చంద్రబాబు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయించకుండానే మంత్రులుగా ఎలా ప్రమాణం చేయిస్తారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందన్నారు. రాజధాని నిర్మా ణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడమేనా చంద్రబాబు నీతి అంటూ ప్రశ్నించారు. తాను దేశ రాజకీయాల్లో సీనియర్ని అని పదే పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తమ పార్టీ శాసనసభ్యులను మంత్రి మండలిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం తన కుమారుడు లోకేష్‌ని మంత్రిని చేయడం కోసమే మంత్రివర్గ విస్తరణ అంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. మంత్రి మండలిలో సుమారు 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, ఎస్టీలకు మంత్రిమండలి విస్తరణలో అవకాశం కల్పించకపోవడం ద్వారా చంద్రబాబు నిజ స్వరూపం బహిర్గతం అయిం దన్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి
న్యూఢిల్లీః అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అగ్రిగోల్డ్ సంస్థ లక్షలాది మంది నుంచి రూ. 7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిందని, ప్రజలు జీవితకాలమంతా కష్టించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో డిపాజిట్ చేశారని వివరించారు. దాదాపు రూ. 7 వేల కోట్ల మేర ఈ సంస్థ దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. 2015 ఫిబ్రవరిలో ఈ వ్యవహారం ఒక కుంభకోణమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, హైకోర్టు సైతం ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను అమ్మలేదని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందలేదని, ఈ విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత ఆస్తులను రాజకీయ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే సంస్థ ఆస్తుల అమ్మకాల్లో జాప్యం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితుల్లో దాదాపు 100కు పైగా డిపాజిటుదారులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించిందని వివరించారు. అవినీతి రహిత భారతదేశాన్ని కాంక్షిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. -
జనం..రోజులు లెక్క పెడుతున్నారు
• బాబు హామీల మోసగాడు • ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కురబలకోట: అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కిన చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడా అని రైతులు, మహిళలు రోజులు లెక్క పెడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మండలంలోని ముదివేడు పం చాయతీలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. తూపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాబు సీఎం అయి మూ డేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ ని కూడా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ చేస్తారని నమ్మి ఓట్లేసిన రైతులు, బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి మహిళలు అప్పులపాలయ్యారన్నారు. సంక్షేమ పథకాల ఊసే లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు జాబ్ లేకున్నా కొడుకు లోకేష్‌ను మాత్రం ఎమ్మెల్సీ చేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్‌రెడ్డి, చంద్రబాబుకు ఉన్న తేడా ను గుర్తించారన్నారు. అంతేగాకుండా చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా కాళీ మాతలా కన్పిస్తోందని తెలిపారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే అభివృద్ధిలో దూసుకుపోతోందని అసెంబ్లీలో అసత్య ప్రసంగం చేయించారన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రెడ్డి శేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, బాబ్జాన్, కన్వీనర్ డి.ఆర్.ఉమాపతిరెడ్డి, పెద్దపల్లె శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బాబుకు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది’
-
ఎమ్మెల్సీగా యండపల్లెను గెలిపిద్దాం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పీలేరు: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న యండపల్లె శ్రీనివాసులరెడ్డిని గెలిపిద్దామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ మార్చి 9వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉద్యమనేత, నిగర్వి అయిన శ్రీనివాసులరెడ్డిని గెలిపించాల్సిన గురుతర భాద్యత మనందరిపైనా ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కార్పొరేట్ శక్తుల జిమ్మిక్కులు, ప్రలోభాలకు గురికాకుండా విద్యారంగ పరిరక్షణకు నిరంతరం పోరాడుతున్న యండపల్లెను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే ఉన్నత విద్య ప్రయివేటీకరణ దిశగా వెలుతోందని, ఇక ఈ ఎన్నికల్లో కార్పొరేట్ శక్తులను గెలిపిస్తే ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపారు. కౌన్సిల్లో విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలను ప్రశ్నించే ఎమ్మెల్సీల గొంతు నొక్కాలని అధికార పార్టీ ఎత్తుగడలో భాగంగానే కార్పొరేట్ దిగ్గజాలను పోటీలో నిలిపిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, బడుల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యండపల్లె శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. -
కువైట్‌లో పెనగలూరు మండల వాసి మృతి
కడప కార్పొరేషన్: రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం తూరుపుపల్లెకు చెందిన రాయపూరి ఈశ్వరయ్య(48)ఈ నెల 23వ తేదీ కువైట్‌లో గుండెపోటుతోమృతి చెందినట్లు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. 8 సంవత్సరాలుగా కువైట్‌లోని ఓ కంపెనీలో కార్పెంటర్‌గా పనిచేస్తున్న ఈశ్వరయ్య 23వ తేది ఉదయం గుండెపోటుతో మరణించాడన్నారు. మతునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయంలో చట్టబద్ధమైన కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్సీపీ అభిమాని కంచర్ల నాగసుబ్బారెడ్డి పూర్తి చేశారు. ఈశ్వరయ్య మృతదేహం కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఈనెల 25వ తేదీ రాత్రి కువైట్ నుంచి బయలుదేరి 26వ తేది చెన్నైకి చేరింది. చెన్నై నుంచి పెనగలూరు మండలంలోని తూరుపుపల్లెకు తీసుకుపోవడానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఉచిత అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కువైట్ ఆసుపత్రిలో ఈశ్వరయ్య మృతదేహాన్ని వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ బాలిరెడ్డి, కో కన్వీనర్ గోవిందునాగరాజు, సభ్యుడు గాలివీటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బాలు, రమణ, మురళీరెడ్డి, యల్లారెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ మిథున్ రెడ్డి
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి...
ఎంపీ మిథున్, బాబ్జాన్కు జగన్ సూచన మదనపల్లె: గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్జాన్కు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. శని వారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసిన నేతలతో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి ఏ విధంగా మో సగిస్తున్నారో స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని చెప్పా రు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ,మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు. -
టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటాం
ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధం కార్యకర్తల వునోభావాలను దెబ్బతీయులేరు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సరివుడుగు(గుర్రంకొండ): టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని, కుట్రలెన్ని చేసినా వైఎస్సార్సీపీ కార్యకర్తల వునో భావాలను దెబ్బతీయలేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం గుర్రంకొండ మండలంలోని సరివుడుగులో ఏర్పాటుచేసిన సవూవేశంలో వారు మాట్లాడారు. 70 ఇళ్ల కాలనీలో కేవలం ఒక్క వైఎస్సార్సీపీ నేత ఇంటి నే కూల్చడం దారుణమని, దీనిపై ప్రశ్నించిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలై తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఆర్డీవో కార్యాలయుం ఎదుట శాంతియుుతంగా ధర్నా చేస్తే తప్పుడు కేసులతో మరోసారి అరెస్ట్ చేయుడం టీడీపీ దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ని కులంపేరుతో దూషించి దౌర్జన్యానికి దిగినప్పుడు ఇదే పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రవు కేసులు బనారుుంచి టీడీపీవైపు తిప్పుకోవాలని ప్రయుత్నిస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయుపడేది లేదన్నారు. వురికొంతవుంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ గ్లోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని వివుర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు వూనుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీసెల్ కార్యదర్శి జమీర్ అలీఖాన్, ఎంపీపీలు నక్కాచంద్రశేఖర్, వుహితాఆనంద్, అరుణమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రెడ్డిభాషా, జయురావుచంద్రయ్య, శ్రీవళ్లి, తదితర పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్‌రెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా కలకడ మండలంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్సీపీ పట్ల చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
ఇది రాజకీయ కుట్ర : ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా
వడమాలపేట: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం అధికారపార్టీ రాజకీయ కుట్ర అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా విమర్శించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి గురువారం అర్ధరాత్రి వడమాలపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆయనను పుత్తూరు కోర్టుకు తరలించారు. అంతకు ముందు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా వడమాల పేట స్టేషన్లో చెవిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాడే చెవిరెడ్డిని అణచివేయాలనే కుట్రతో తప్పడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అర్ధరాత్రి లాక్కొచ్చి స్టేషన్లో వేయడం ప్రజాస్వామ్యమా అని విమర్శించారు. చెవిరెడ్డిని పరామర్శించిన వారిలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
వీడియో ఆధారాలున్నా కేసు పెట్టరా?
పూతలపట్టు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించకపోవడం ఘోరం ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ తిరుపతి : పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం ఘోరమని ఎంపీ మిథున్‌రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేశారు. వీడియో ఆధారాలున్నా పోలీసులు ఇప్పటివరకూ బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ, పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా మారిందన్నారు. మండల సమావేశం సందర్భంగా ఎస్సీ ఎమ్మెల్యేకి అవమానం జరిగిన నేపథ్యంలో స్వయంగా శాసనసభ్యుడు ఫిర్యాదు చేసినా పోలీసులు సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం, కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో పోలీసులు స్పందించకపోతే హెచ్ఆర్సీకి, ఎస్సీఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ఖాయమని ఎంపీ హెచ్చరించారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇదే విషయంపై జీడీ నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా స్పందించి పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. బాధ్యులపై కేసు నమోదు చేయని పక్షంలో పార్టీ తరపున ఆందోళనలు మొదలు పెడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం, బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పోలీస్స్టేషన్ల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు యోచిస్తున్నారు. వచ్చే మంగళవారం కార్యక్రమాలకు రూపకల్పన జరిపి నిరసన కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించే అవకాశాలున్నాయి. ఎస్సీ ఎమ్మెల్యేపై పోలీసులు చిన్నచూపు చూడడాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?
ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్... తిరిగి పార్టీలో చేరిన బెరైడ్డిపల్లి ఎంపీపీ సాక్షి, హైదరాబాద్ : ఓ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది పూర్తిగా అనైతికమని, వారు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి నెగ్గాలని రాజంపేట ఎం.పి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాలు చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు విమల తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యేలు నిజంగానే అభివృద్ధిని చూసి చేరారా? లేక స్వీయ ప్రయోజనాల కోసమా? అనేది చెప్పాలని మిథున్ డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చనపుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.జగన్ పేరుతో, వైఎస్సార్సీపీ గుర్తుపై ఎన్నికైన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉంటాం: విమల తాను వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని బెరైడ్డిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు విమల పేర్కొన్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థం తిరుపతిలో ఉంటే హాజరు కావడానికి తాను వెళ్లానని అక్కడి నుంచి పెద్ద వాళ్లను కలవడానికి వెళుతున్నామంటూ నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి తన ప్రమేయం లేకుండా టీడీపీ కండువాను కప్పించారని ఆమె మీడియాతో అన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారినా తమ నియోజకవర్గంలో క్యాడర్ చెక్కు చెదరలేదని, జగన్‌ను సీఎంను చేసే వరకూ పార్టీ కోసం శ్రమిస్తామన్నారు. విమలతో పాటు వచ్చిన 9 మంది ఎంపీటీసీలు మాట్లాడుతూ తాము జగన్‌తోనే ఉంటామని చెప్పామన్నారు. -
బాబూ..నీకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధమా ?
వైఎస్సార్సీపీ నేతల సవాల్ కదిరి : ‘రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేం సవాల్ విసురుతున్నాం. నీకు దమ్ము, ధైర్యముంటే మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ వారిని గెలిపించుకునే సత్తా మీకు ఉందా? ఉంటే ఎన్నికలకు సిద్ధమా?..’ అని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. శనివారం కదిరిలో జీవిమాను కూడలిలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ధర్నాలు చంద్రబాబు ఇంటి ముందు చే యండి ప్రజా సమస్యలు పరిష్కరించని చంద్రబాబును ఇంకేమనాలి? ప్రజల్ని మోసగించారని హారతులు పట్టాలా?. ఆయన అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారు. టీడీపీ నేతలు ధర్నాలు చేస్తుంటే నవ్వొస్తోంది. ఆ ధర్నాలేంటో మీ ‘బాబు’ ఇంటి ముందు చేయండి. - రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రతిపక్షమంటే బాబుకు దడ ఎన్నికలకు మునుపు ఎన్నో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రతిపక్షమంటే చంద్రబాబుకు దడ. అందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మేము మాట్లాడుతుంటే ఆయన తన మంత్రులు, ఎమ్మెల్యేలతో మాపైనా, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా బండబూతులు తిట్టించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ? - ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే జగన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ అధినేత జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటి తలుపుతట్టాయని, మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలన్నారు. ఎన్పీ కుంటలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. - రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రె డ్డి చంద్రబాబుకు ఆడోళ్ల ఉసురు తగులుతుంది తాను అధికారంలోకి రాగానే మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చెప్పి మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మా ఆడవాళ్ల ఉసురు తగులుతుంది. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు.- కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ వైఎస్ పాలన సువర్ణయుగం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలకు ఏ కష్టం రాలేదు. ఆయన పాలన సువర్ణయుగంలా సాగింది. చంద్రబాబు పాలన ఎలా ఉందో చెప్పనక్కరలేదు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారు..అవే ఆయన కొంప ముంచడం ఖాయం. - పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి -
ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయండి
కేంద్ర పర్యాటక మంత్రికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వినతి యూనివర్సిటీ క్యాంపస్: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కోదండరామాలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయమని, సంవత్సరం పొడవునా లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇది చారిత్రకమైన హిందూ ఆలయమే కాకుండా పురాతన సాంస్కృతిక క్షేత్రమని తెలిపారు. అయితే ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా బస చేసేందుకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఈ ఆలయానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పురాతన సాంస్కృతిక క్షేత్రంగా గుర్తించాలని కోరారు. -
మిథున్‌రెడ్డికి గన్మెన్లను తగ్గించడం కుట్రే
యూనివర్సిటీక్యాంపస్ః రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి గన్మెన్లను తగ్గించడం ప్రభుత్వ కుట్ర అని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి. హరిప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజాప్రతినిధికి గన్మెన్లను తగ్గిం చడం అన్యాయమన్నారు. ప్రజల మధ్యలేని నాయకులకు 2+2 గన్మెన్లను ఇవ్వడం, మిథున్‌రెడ్డికి 1+1 ఇవ్వడం బాధాకరం. జిల్లాలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రజలం తా మెచ్చుకుంటుంటే సీఎం ఓర్వలేక ఆయన పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన్ను రాజకీయం గా ఎదుర్కొలేక నీచరాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధారణను తగ్గించలేరన్నారు. -
ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు
♦ 2+2 ఉన్న సెక్యూరిటీ 1+1కు తగ్గింపు ♦ అధికార పార్టీ ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం కొనసాగింపు సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ సీపీపై అధికారపార్టీ కక్ష సాధింపు ధోరణి కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు. ఇంతకుముందు 2+2 ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించారు. ఎస్సార్సీ(సెక్యూరిటీ రివైజ్డ్ కమిటీ) నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు గురువారమే ఆదేశాలు వచ్చాయి. దీన్ని వెంటనే అమలు చేయడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం 2+2 సెక్యూరిటీని కొనసాగించాలని ఎస్సార్సీ నిర్ణయించడం విమర్శలకు దారితీస్తోంది. అలాగే ఏ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించని టీడీపీ నేత బద్రీ నారాయణకు(చిత్తూరు ఎమ్మెల్యేకు బంధువు)కు సెక్యూరిటీని ఎలా కొనసాగిస్తారని పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి స్పందిస్తూ సెక్యూరిటీ తగ్గిస్తే భయపడతానని టీడీపీ నేతలు భావిస్తున్నారనీ,కానీ తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
ఆర్థిక బిల్లుపై చర్చలో ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదంటూ హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఇటీవల చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశాయి. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూబీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందన్నారు. తాము ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ-బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వం వారి మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తి చేస్తారు?
ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్న మదనపల్లె: ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలో ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌కే హంద్రీ-నీవాను పూర్తిచేసి రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు చిత్తశుద్ధితో పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. హద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఇంకా 16 లిఫ్ట్ పనులు, మదనపల్లె సమీపంలో టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. టన్నెల్ పనులు పూర్తికావడానికి మరో ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, మొదటి నుంచి నవంబర్ నాటికి హంద్రీ-నీవా పూర్తి చేస్తామని చెబుతున్నారేగానీ, అది ఏ సంవత్సరం నవంబర్ నాటికో స్పష్టీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2019 నవంబర్ నాటికైనా నీళ్లు ఇస్తారా ? అనే సందేహం కలుగుతోందన్నారు. కాగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరుకాగా, వాటిలో ఒకటి రాజంపేటకు.. రెండవది మదనపల్లెకు మంజూరైనట్లు చెప్పారు. అయితే మదనపల్లెలో గత ఏడాది నుంచి ఈ విద్యాలయానికి స్థల సేకరణలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని తెలిపారు. పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సమూచిత స్థానం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. అధికార పక్షం మైండ్ గేమ్ ఆడుతోందని, పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్జాన్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, మహ్మద్ రఫీ, ముక్తియార్‌ఖాన్, సుగుణ, వేమనారాయణ, ఎంపీపీలు జరీనహైదర్, సుజన బాలకృష్ణారెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్, టెలికామ్ బోర్డు మెంబర్ దండాల రవిచంద్రారెడ్డి, నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
'బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'
సదుం (చిత్తూరు జిల్లా) : ఏపీ నూతన రాజధానిలో తెలుగుదేశం నేతలు కొన్న భూముల డబ్బులతో రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయవచ్చని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం సదుం మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న జగన్ మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. త్వరలో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. భూదందా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
'ప్రాణం ఉన్నంతవరకూ జగన్‌తోనే'
వైఎస్ఆర్ కడప: అక్రమ కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తామని చెప్పారు. డబ్బులు, కాంట్రాక్టులిస్తామని చెప్పి ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సిగ్గుచేటని వారు విమర్శించారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకన్నా తెలంగాణకే ఎక్కువగా న్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు కేంద్రంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు. -
'వంద కేసులు పెట్టినా భయపడం'
నెల్లూరు: ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకు తమపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. తమపై వంద కేసులు పెట్టినా భయపడేదిలేదని చెప్పారు. శుక్రవారం నెల్లూరులో పార్టీ నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం ఉందని చంద్రబాబు ప్రభుత్వం విర్రవీగుతోందని మండిపడ్డారు. ప్రజల తరపున వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు మహిళా తహశీల్దార్‌ను జట్టు పట్టుకునికొడితే అడిగే పరిస్థితి లేదని వనజాక్షిపై దాడి ఘటనను ప్రస్తావించారు. తాను తప్పుచేసినట్టు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, పార్టీ శ్రీకాళహస్తి ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. బుధవారం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా, గురువారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. -
జైలు నుంచి వైఎస్సార్సీపీ నేతల విడుదల
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ శ్రీకాళహస్తి ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డిలు గురువారం నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించడం, వారికి బుధవారం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు గురువారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పరామర్శించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న వారికి వైఎస్సార్సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. రాజన్న వారసులం.. జగనన్న సైనికులం నెల్లూరు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం రాత్రి మాట్లాడుతూ తాము మహానేత రాజన్న వారసులం... జగనన్న సైనికులమని, అక్రమ అరెస్ట్ల్ని లెక్క చేయబోమని స్పష్టం చేశారు. సీఎం బాబు వినాశకాలే విపరీత బుద్ధి అన్నచందాన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
జైలు నుంచి వైఎస్సార్ సీపీ నేతల విడుదల
-
ఆధారాలంటే ఇలా ఉండాలి..
♦ తేలిపోయిన తెలుగుదేశం సాక్ష్యాల నాటకం ♦ మిథున్ కేసులో వీడియో ఫుటేజీలలో కనిపించని దాడి దృశ్యాలు.. ♦ విమానాశ్రయంలో అన్ని వీడియోల ఫుటేజ్ బయటపెట్టాలి: వైఎస్సార్సీపీ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తిరుపతి విమానాశ్రయ మేనేజర్‌పై చేయిచేసుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై బనాయించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దమ్ము, ధైర్యం ఉంటే నిజాలు బైటపెట్టండి అని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిస్పందన గానా అన్నట్లు టీడీపీ నేతలు కొన్ని వీడియో దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆ వీడియోలలో మిథున్‌రెడ్డి విమానాశ్రయ మేనేజర్‌పై దాడి చేసినట్లు గానీ, చేయిచేసుకున్నట్లుగానీ ఎలాంటి ఆధారాలూ లేవు. అసలు ఎంపీగానీ, మేనేజర్‌గానీ కనిపించడం లేదు. విమానాశ్రయంలో ప్రయాణీకులు, సిబ్బంది ఒక్కచోట గుమిగూడినట్లు మాత్రమే ఆ ఫుటేజిలో కనిపిస్తోంది. బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోగా ప్రయాణీకులను మేనేజర్ దుర్భాషలాడడం, ఆ తర్వాత వారు ఎంపీ మిథున్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం, ప్రయాణీకులను వెంటబెట్టుకుని వెళ్లి మేనేజర్‌ను ఎంపీ ఈ విషయమై ప్రశ్నించడం వంటి దృశ్యాలేవీ ఆ వీడియో ఫుటేజీలో లేవు. అందుకే విమానాశ్రయంలోని అన్ని సీసీటీవీల ఫుటేజిని బైటపెట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. తమకు బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకపోగా దుర్భాషలాడుతున్నారంటూ 20 మంది ప్రయాణీకులు విమానాశ్రయ మేనేజర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినందునే ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. ప్రయాణీకుల తరఫున మేనేజర్‌ను నిలదీయగా ఎంపీనీ ఆయన దుర్భాషలాడారు. అందుకుగాను ఆ తర్వాత ఆయనే స్వయంగా ఎంపీకి క్షమాపణ కూడా చెప్పారు. విమానాశ్రయంలోని అన్ని సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలిస్తే ఈ వాస్తవాలు బైటపడతాయి. అది వదిలేసి తమకు కావలసినట్లు.. ఎడిటెడ్ ఫుటేజీని చూపించి అవే దాడి దృశ్యాలని చెప్పడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటిని బట్టి చూస్తే ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమంగా, అన్యాయంగా, రాజకీయ కక్షతోనే ఈ కేసు బనాయించారని స్పష్టమవుతోంది. ఈ ఆధారాలున్నాయా...? ⇒ సీసీ ఫుటేజీలలో చేయిచేసుకున్నట్లు ఎక్కడన్నా ఉందా? ⇒ ఆ వీడియోలు పూర్తిగా లేకుండా ఎందుకు ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి? ⇒ విమానాశ్రయంలోని అన్ని వీడియోలలో సీసీ ఫుటేజిని ఎందుకు బైటపెట్టడం లేదు? ⇒ స్పష్టంగా లేని కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు మీడియాకు చూపించి అవే ఆధారాలు అనే దుస్థితి అధికారపార్టీకి ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబుందా? ⇒ విమానాశ్రయంలో మేనేజర్ వంటి ఉన్నతాధికారిని ఎంపీ కొడితే ఆ విషయం అక్కడున్నవారికెవరికీ తెలియకుండా పోతుందా? ⇒ ఒకవేళ ఎంపీ చేయి చేసుకుని ఉంటే సీఐఎస్ఎఫ్ పోలీసులు అక్కడికక్కడే ఆయన్ను అరెస్టు చేసి ఉండేవారు కదా? ⇒ పక్కటెముకలు విరిగేంతగా మేనేజర్‌ను ఎంపీ కొడితే.. ఆ మేనేజర్ రాత్రి 8 గంటల వరకు డ్యూటీ ఎలా చేశారు? ⇒ మర్నాడు కూడా ఆ మేనేజర్ విధులకు ఎలా హాజరు కాగలిగారు? సీమాంధ్రలోకెల్లా అత్యంత మెరుగైన ఆస్పత్రిగా పరిగణించబడుతున్న రుయా ఆస్పత్రిలో మేనేజర్‌ను పరీక్షించి ఇచ్చిన రిపోర్టు ఏమైంది? ⇒ నాలుగు రోజుల తర్వాత యశోదా వంటి ప్రయివేటు ఆస్పత్రికి మేనేజర్‌ను వైద్యపరీక్షల కోసం ఎందుకు పంపించారు? ⇒ మేనేజర్ సోదరుడు ఆ యశోదా ఆస్పత్రిలో పనిచేస్తున్నాడన్న విషయం నిజంకాదా? ⇒ అంటే అక్కడ తమకు నచ్చినట్లుగా వైద్య నివేదికను తయారు చేయించి తాము బనాయించిన తప్పుడు కేసును నిజం చేద్దామన్న తపన నిజంకాదా? ⇒ ఈ ప్రశ్నలకు జవాబులుంటేనే కదా వాటిని ఆధారాలుగా పరిగణించాల్సింది?.. వీటిని వదిలేసి ఏవో కొన్ని వీడియో క్లిప్పింగు లు విడుదల చేసి అవే ఆధారాలంటే ఎలా? అసలు ఆధారాలంటే ఎలా ఉంటాయంటే..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విదేశీ విహారాలకు సంబంధించి అనేక ‘విశేషాలు’... సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో గత కొంత కాలంగా హల్చల్ చేస్తున్నాయి. నారావారి వారసుడు నేషనల్ లెవెల్లో ప్రతిభ చూపడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్న సమయంలోనే ఆయన టాలెంట్ ఏమిటనేది విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసి పోయింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక ఫొటో సాక్ష్యాలలో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. 1. ఒక చేతిలో మగువ మరో చేతిలో మందు గ్లాసు 2. విదేశీ వనితతో ఆటపాటలు 3. ఆటలతో అలసిసొలసి రెండు భుజాలపై సేదదీరుతున్న ఇద్దరు భామలు 4. విదేశీ భామలతో స్విమ్మింగ్‌పూల్‌లో సయ్యాటలు ఇవి కాదు ఆధారాలంటే... టీడీపీ నేతలు విడుదల చేసిన ఈ వీడియో ఫుటేజీలో మిథున్ ఎక్కడ? మేనేజర్ ఎక్కడ? -
ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ
♦ సాయంత్రం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు ♦ రిమాండ్ విధించిన కోర్టు... నెల్లూరు జైలుకు తరలింపు సాక్షి ప్రతినిధి, తిరుపతి/నెల్లూరు(క్రైమ్): రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకునివిచారించారు. రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే. వారిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి శ్రీకాళహస్తి కోర్టు అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11.30 సమయంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు నెల్లూరు జిల్లా కేంద్రకారాగారం నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసుస్టేషన్లో రెండు గంటలపాటు విచారించారు. మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం సాయంత్రం ఎంపీ మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలకు పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్ కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో వారిద్దరినీ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ నిరాకరణ
బియ్యపు మధుసూదన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి తిరుపతి లీగల్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తి నిరాకరించారు. తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ గాజులమండ్యం పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యం శ్రీకాళహస్తి జూనియర్ జడ్జి కోర్టులో పెండింగ్ ఉండడంతో ఈ ద శలో బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా ఇవ్వండి
♦ కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ♦ ఇది టీడీపీ-బీజేపీ ఎన్నికల హామీ అన్నది మరువొద్దని సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న ఇతర అంశాల్నీ అమలు చేసేందుకు సత్వర కార్యాచరణ చేపట్టాలని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభలో ‘అనుబంధ పద్దుల’పై జరిగిన చర్చలో మాట్లాడారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమనే అంశం ఎంతో ముఖ్యమైందన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో అది మొదటి అంశంగా ఉన్నవిషయాన్ని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు తమ రాష్ట్రానికి ఎంతో కీలకమని, తమ రైతులకు జీవరేఖని మిథున్‌రెడ్డి చెప్పారు. అందువల్ల పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడం తమకెంతో అవసరమన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులు తగిన రీతిలో ఉండట్లేదన్నారు. పెరుగుతున్న వ్యయాన్ని సర్దేందుకూ సరిపోవట్లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగితే అంచనా వ్యయం చాలా పెరుగుతుందని, దీనివల్ల అంతిమంగా ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. ఉపాధి కూలీలకు పనిదినాల్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని 50 శాతం జిల్లాలు కరువులో ఉన్నాయని, ఏపీ కూడా కరువులో చిక్కుకుందని, ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రస్తుతమున్న వందరోజుల పనిదినాల్ని 200 రోజులకు పెంచాలని కోరారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారులో స్వామినాథన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. -
విభజన హామీలన్నీ అమలు చేయాలి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం ఉందని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ భాగం మాత్రమే అని, పోలవరంతో పాటు విభజన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని మిథున్ రెడ్డి కోరారు. రైతులకు మద్దతు ధరతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. -
నల్లధనం ఎంతో అంచనాల్లేవు
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లోని నల్లధనం మొత్తాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అధికారిక అంచనాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దేశ విదేశాల్లోని నల్లధనం మొత్తాలను, వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మరో ఎంపీ లక్ష్మీనారాయణ యాదవ్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బదులిచ్చారు. దేశ, విదేశాల్లో లెక్కకు రాని ధనాన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఐపీఎఫ్పీ, ఎన్సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎంల నివేదిక అందిందని, దానిపై పరీక్షిస్తున్నట్టు తెలిపారు. -
ఎందుకీ పక్షపాతం..?
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది. తిరుపతి విమానాశ్రయంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ఎయిర్ ఇండియా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినప్పుడు... మిథున్‌రెడ్డి తదితరులిచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేనేజర్‌పై కేసెందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ప్రతీ కేసునూ రాజకీయకోణంలో చూడటం తగదని హితవు పలికింది. రాజకీయ కారణాలతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదంది. చట్టప్రకారం వ్యవహరించనప్పుడే ఆరోపణలు వస్తాయని, అలాంటివాటికి అవకాశమివ్వకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని సూచించింది. మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలని భావిస్తే, సీఆర్పీసీ చట్టంలోని సెక్షన్ 41ఎ కింద వారికి నోటీసులిచ్చి, వారి వాదనలు విన్నాక చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. గత నెల 26న తిరుపతి విమానాశ్రయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు తమపై చేయి చేసుకున్నారంటూ ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ ఫిర్యాదు చేయగా ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపట్ల దురుసుగా ప్రవర్తించడమేగాక తిరిగి కేసు కూడా పెట్టడంతో ఎంపీ మిథున్‌రెడ్డి తదితరులు రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేయలేదు. పోలీసుల పక్షపాత వైఖరిని ప్రశ్నిస్తూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ విచారించారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధం ఏముంది? పిటిషనర్ తరఫున న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు రాజకీయ కారణాలతోనే పిటిషనర్ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. ఒక ఎంపీ ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోకుంటే ఇక సామాన్యుల సంగతేమిటన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు. హోంశాఖ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. వ్యక్తిగతంగా వచ్చి ఫిర్యాదు ఇవ్వలేదని, అందుకే కేసు నమోదు చేయలేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. వ్యక్తిగతంగానే వచ్చి ఫిర్యాదు చేయాలని ఎక్కడుంది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు తెలియదా? పోస్టుద్వారా పంపినా, మెయిల్ ద్వారా పంపినా కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది కదా. కానీ మీరు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో మీరిప్పుడిలా చేస్తే, వారు కూడా తరువాత ఇలానే చేస్తారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధమేముంది..? మేనేజర్ ఫిర్యాదిస్తే కేసు నమోదు చేశారు. మరి పిటిషనర్ ఫిర్యాదిస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదు.?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నాపై తప్పుడు ఆరోపణలు
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవి పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యంతో కూడినవని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్బలంతో స్థానిక పోలీసులు తప్పుడు కేసు పెట్టారని, సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘‘నవంబర్ 26న హైద్రాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తిరుపతి విమాశ్రయంలో దిగాను. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విమానంలో హైద్రాబాద్ వెళుతున్నారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి విమానాశ్రయం బయటకు వస్తున్నా. అదే సమయంలో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విమానం ఎక్కనివ్వడం లేదని కొందరు ప్రయాణీకులు నాకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తి కోసం ఎదురుచూశాను. ఆయన వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆలస్యానికి కారణాలను ప్రశ్నించాను. సరైన సమాధానం ఇవ్వడానికి బదులుగా ఆయన నాతో కూడా అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు బాధిత ప్రయాణికులతో పాటు పలువురు ప్రత్యక్ష సాక్ష్యులున్నారు. కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ అధికారి, తన సీనియర్ అధికారులు, స్థానిక పోలీసుల సమక్షంలో నాకు క్షమాపణ చెప్పారు. ఆ సమస్య అంతటితో ముగిసింది. అయితే నేను ఎయిరిండియా మేనేజర్ పై దాడిచేశానని రాత్రి సమయం లో ఫిర్యాదు చేశారు. కానీ అది వాస్తవం కాదు. సంఘటన జరిగిన సమయం నుంచి రాత్రి వరకూ ఏమి జరిగిందో నాకు తెలియదు. నా వాదనను రుజువు చేయడం కోసం సీసీటీవీ కెమెరాల రికార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశాను. అయితే ఇంత వరకూ వాటిని విడుదల చేయకపోవడాన్ని బట్టి సంఘటన వివరాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారని అర్ధమౌతోంది. రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలమే అందుకు కారణం. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌కు ఫిర్యాదు చేశాను. హైద్రాబాద్ హైకోర్టును ఆశ్రయించి, నా ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని కోరతాను.’’ అని మిథున్‌రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రేణుక, వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. -
అండగా ఉంటా.. అధైర్యపడొద్దు