పీలేరు: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన పీలేరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరోపిం చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని విమర్శించారు. ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా ఏడాది తన పాలనలో నెరవేర్చలేదని మండిపడ్డారు. రుణ మాఫీ పేరిట రైతులను మోసం చేశారని తెలిపారు.
కొత్తగా బ్యాంకుల్లో రుణాలు పుట్టక అధిక వడ్డీలకు రైతు లు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి తీర్చలేని రుణభారంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాబట్టడంలో సీఎం తోపాటు టీడీపీ ఎంపీలు, కేంద్ర మం త్రులు పూర్తిగా విఫలమయ్యారని వి మర్శించారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎం పీపీ కే.మహితాఆనంద్, జెడ్పీటీసీ జయరామచంద్రయ్య, పీలేరు, కేవీపల్లె మండల పార్టీ కన్వీనర్‌లు నారే వెంకట్రమణారెడ్డి, వెంకట్రమణారెడ్డి, బీడీ. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.