'కొంతమంది కార్పొరేట్ పెద్దల కోసమే'
హైదరాబాద్: రాజధానిపై గుట్టుగా తీసుకున్న నిర్ణయం చంద్రబాబు కుట్రలు వెల్లడిస్తోందని వైఎస్ఆర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కొంతమంది కార్పొరేట్ పెద్దల కోసమే విజయవాడ దగ్గర రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హిట్లర్, ముస్సోలిని ఏమైపోయారో చంద్రబాబు గమనించాలన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికను పక్కనపెట్టి చంద్రబాబు రాజధాని ప్రకటన చేయడం న్యాయం కాదని వైఎస్ఆర్ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.