Chevireddy Bhaskara Reddy
-
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్‌లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్‌లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తుమ్మలగుంటకు విచ్చేయనున్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి మణిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. గురువారం సాయంత్రం 5.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.40కు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ కృష్ణారెడ్డి, ఎంఆర్‌పల్లి సీఐ సురేంద్రరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సుధాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. లైటింగ్‌కు ఇబ్బంది లేకుండా విద్యుత్ అవసరమైన జనరేటర్లు, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: (వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు) -
రాష్ట్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీలో కీలకమైన 23 అనుబంధ సంఘాలను చెవిరెడ్డి రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా సంఘాలను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయనున్నారు. గతంలో పార్టీ అప్పగించిన పెనుగొండ మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్, ఆత్మకూరు, బద్వేల్ ఎన్నికలు.. ఇలా ఎన్నింటినో ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. వీటితో పాటు పార్టీ ప్లీనరీ నుంచి ఇటీవల వైజాగ్‌లో ప్రధాని మోదీ పర్యటన వరకు ఆయా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రస్థాయిలో వైఎస్సార్సీపీ అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రతిష్ట పెంచేందుకు సైనికుడిలా పని చేస్తానన్నారు. చదవండి: (20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి) -
మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్‌కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం. -
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్
నటుడు సాయికుమార్, అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడిలు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. తాను సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఇక రెండేళ్లు క్లిష్ట పరిస్థితులను చుశామని, ఒమిక్రాన్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుదేవా, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కన్ఫ్యూజన్లో ఉన్నారని, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే కన్ఫ్యూజన్లో నిర్మాతలు ఉన్నారని పేర్కొన్నారు. ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసంర ఉందని, ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. కాగా వీరితో పాటు వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సైతం నేడు(జవనరి 1) కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీవై సీఎం నారాయణ స్వామి, జమ్మూకశ్మీర్ లేఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీఎన్ మంత్రి గాంధీ భట్, గుజరాత్ మినిస్టర్ జితేందర్ చౌదరి భట్టి విక్రమార్క, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్‌తో.. వంద అడుగుల సీఎం ముఖచిత్రం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్‌పై సీఎం వైఎస్ జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ ముఖచిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశారు. ఇందుకోసం గత పది రోజుల నుంచి గోశాల వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి దగ్గరుండి పనులు చేయించారు. డ్రోన్‌పై నుంచి చూస్తే సీఎం జగన్ ముఖచిత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సీఎంపై ‘అధిపతి’ టైటిల్‌తో చెవిరెడ్డి భాస్కరరెడ్డి రూపొందింపజేసిన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ పాటను ఎం.కృష్ణవేణి రాశారు. ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య పాడగా.. కార్తీక్ సంగీతమందించారు. పాట సీడీని విడుదల చేస్తున్న సజ్జల, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి తదితరులు పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దార్శనికత ఉంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో సీఎం జగన్ చేసి చూపించారని కొనియాడారు. పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా ఆయన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. జనహృదయ నాయకుడికి తామంతా శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. సీఎం జగన్ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ చిత్రాన్ని ఏర్పాటు చేయించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అభినందించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పోరాటానికి ప్రతీకగా.. చెప్పిన మాట కోసం, నమ్మిన ప్రజల కోసం పనిచేస్తున్న ఆదర్శ నేత సీఎం జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ ఆస్పత్రిగా మారుస్తామన్న ఎమ్మెల్యే
-
వాలంటీర్ల ద్వార మందు పంపిణీ చేస్తామన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
చంద్రగిరి నియోజక వర్గం లో ఆక్సిజన్ కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
కరోనా బాధితులతో చెవిరెడ్డి ‘క్యారమ్స్’
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): కరోనా బాధితులకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే బాధితుల కోసం పడకలు ఏర్పాటు చేసి, కిట్లు అందించి.. తగిన సాయం చేసిన చెవిరెడ్డి తాజాగా వారితో కలిసి చెస్, క్యారమ్స్ ఆడారు. బాధితులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని కోవిడ్ కేర్ సెంటర్‌ను చెవిరెడ్డి సందర్శించారు. మధ్యాహ్నం వరకు బాధితులతోనే గడిపారు. వార్డులన్నీ పరిశీలించారు. కోవిడ్ కిట్లతో పాటు ఆహారం, వైద్య సేవలు, పారిశుధ్యం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వాకబు చేశారు. అక్కడే చెస్, క్యారమ్స్ ఆడుతున్న కరోనా బాధితులతో కలసి చెవిరెడ్డి కూడా ఆడారు. అనంతరం వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నందుకు అభినందించారు. కరోనా గురించి భయపడవద్దని.. ధైర్యంగా ఉండాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా బాధితులను అన్ని విధాలుగా అండగా ఉంటోందని చెప్పారు. -
ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాస్క్ లు పంపిణి చేసిన చెవిరెడ్డి
-
తిరుమలలో శ్రీవారి లక్ష్మీహారం ఊరేగింపు
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఆలయం నుండి వైభవోత్సవ మండపం వరకు ఊరేగించారు. అంతకు ముందు శ్రీవారి పాదాల చెంత లక్ష్మీహారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానా నుంచి అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి అత్యంత భద్రత నడుమ వాహనంలో శ్రీవారి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గజవాహనసేవకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి చెవిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా గజవాహన సేవ రోజు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ.. ఈ సారి భారీ వర్షం కురిసినప్పటికీ ఆ ఆనవాయితీని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు కొనసాగించారు. -
టీడీపీ హయాంలోనే 100 ప్రాంతాల్లో వేలం
సాక్షి, అమరావతి : వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట పెంచే విధంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ స్పష్టం చేశారు. దేవుడి ఆస్తులను పెంచడానికే ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. శ్రీవారిపై అత్యంత భక్తిభావం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, తిరుమలకు కాలినడకన వెళ్లి అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. టీటీడీని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన ప్రభుత్వానికి లేదని వివరించారు. ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే 100 ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులు విక్రయించారని గుర్తుచేశారు. రూ.6కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు హయాంలో వేలం వేశారని చెవిరెడ్డి తెలిపారు. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి) టీటీడీ ఆస్తుల విక్రయాలపై ఆదివారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ‘టీటీడీకి ప్రత్యేకమైన యాక్ట్ ఉంది. 1990లోనే దేవస్థాన భూముల అమ్మకం, లీజులు ఇచ్చేందుకు టీటీడీకి హక్కు కల్పించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది. ఆ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ముఖ్య సభ్యుడు. ఈనాడు స్థంస్థల అధినేత రామోజీరావు బంధువు సుచరిత కూడా బోర్డు సభ్యురాలే. ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా అప్పటి కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. వాళ్లందరూ ఆమోదించిన తర్వాతే ఈ ఆస్తులు వేలానికి వచ్చాయి. 2015 జులైలో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేశారు. 2016 జనవరిలో కమిటీ నివేదిక మేరకు ఆస్తుల విక్రయానికి అప్పటి బోర్డు అంగీకరించింది. వేల కోట్ల విలువైన సదావర్తి భూములను 50 కోట్లకు అమ్మాలనుకుంది చంద్రబాబు కాదా?. మానస ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా?. టీటీడీ ఆస్తులను అమ్మితే టీటీడీ కార్పస్ ఫండ్‌కు జమ అవుతుంది ప్రభుత్వానికి కాదు. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగడం సరైందికాదు’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. -
టీడీపీ హయాంలోనే 100 ప్రాంతాల్లో వేలం
-
ముస్లింలకు రంజాన్ తోఫా
చంద్రగిరి: రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొత్తం పదిరకాల సరుకుల్లో చక్కెర, సేమియా, బాస్మతి, సోనామసూరి బియ్యం, నెయ్యి, రవ్వ, డాల్డా, నూనె ప్యాకెట్ మొదలైనవి ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ రంజాన్ తోఫా పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ముస్లింలకు రంజాన్ కానుక అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. ప్రతి ముస్లిం కుటుంబానికి 10 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా పంచాయతీలకు రంజాన్ తోఫా ను వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అల్లా అందరినీ బాగా చూడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఆయన ఆశీర్వదించాలంటూ ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా ఐక్యతతో మెలగడం తన నియోజకవర్గ ప్రత్యేకత అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు అండగా ఉండడం తన బాధ్యతని తెలిపారు. ఆపత్కాలంలో చెవిరెడ్డి సాయం మరువలేం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్తు సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందించిన సాయం మరువలేమని ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో దేశంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటున్న మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి హేమేంద్రకుమార్ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డి, మైనారిటీ నాయకులు మస్తాన్, ఔరంగజేబు, ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ నరసప్ప, సీఐ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
-
చిత్తూరులో 16లక్షల కోడిగుడ్ల పంపిణీ
-
శానిటైజర్లు,కూరగాయలు పంచిన చెవిరెడ్డి
-
ప్రజలకు శానిటైజర్లు పంపిణి
-
ప్రజా తీర్పులో మార్పు రాదు
-
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ తిరుపతి అధ్యక్షుడు
సాక్షి, తిరుపతి: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు\నిచ్చారు. తుమ్మలగుంటలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి వేదాంతపురం వరకు స్థానిక యువత బుధవారం చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్యర్యంలో తిరుపతి రూరల్ టీడీపీ అధ్యక్షుడు చెరుకుల జనార్థన్ యాదవ్, అతని అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనార్థన్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చెవిరెడ్డి పోరాట పటిమ తనను ఆకర్షించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా: మోపిదేవి మండల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అవనిగడ్డ రమేష్ బాబు అధ్వర్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. 70 కుటుంబాలకు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్యే రమేష్‌బాబు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన 100 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన
-
స్వామి సేవకు చెవిరెడ్డి
తిరుపతి రూరల్/తిరుమల:కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామికి సేవ చేసే అవకాశం ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి లభించింది. శ్రీవారికిఅపరభక్తుడైన ఆయనను తుడా చైర్మన్ హోదాలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్–అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ను ప్రచురించడమే కాకుండా జీఓ సైతం విడుదల చేసింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన ఆయన గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో తుడా చైర్మన్ హోదాలో మూడేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తన రాజకీయ గురువు భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి టీటీడీలో విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామ్యులయ్యారు. టీటీడీ కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ నియమించిన పలు అంతర్గత కమిటీల్లో సభ్యుడుగా ఉన్న ఆయన స్వామి నిధులు వృథా కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. తుమ్మలగుంట శ్రీశక్తి చాముండే«శ్వరి దేవి ఆలయం నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డును వెడల్పు చేయించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర చెవిరెడ్డిదే. తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోసారి స్వామివారికి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. నేడు ప్రమాణస్వీకారం టీటీడీ పాలకమండలి సభ్యుడుగా> నియమితులైన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం 7 – 8 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమేరకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నడకదారిలో స్వామివారి చెంతకు బయలుదేరారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి స్వామి వారికి మొక్కును చెల్లించుకున్నారు. అపరభక్తుడైన ఆయనను తుడా చైర్మన్ హోదాలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్–అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ను ప్రచురించడమే కాకుండా జీఓ సైతం విడుదల చేసింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన ఆయన గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాం లో తుడా చైర్మన్ హోదాలో మూడేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తన రాజకీయ గురువు భూమన కరుణాకరరెడ్డితో కలిసి టీటీడీలో విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామ్యులయ్యారు. టీటీడీ కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ నియమించిన పలు అంతర్గత కమిటీల్లో సభ్యుడిగా ఉన్న ఆయన స్వామి నిధులు వృథా కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. తుమ్మలగుంట శ్రీశక్తి చాముండేశ్వరి దేవి ఆలయం నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డును వెడల్పు చేయించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర చెవిరెడ్డిదే. తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోసారి స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేడు ప్రమాణస్వీకారం:టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులైన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం 7–8 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నడకదారిలో స్వామివారి చెంతకు బయలుదేరారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నారు -
రెండు సమస్యలకు పరిష్కారంగా వాలంటీర్ల వ్యవస్థ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: అటు నిరుద్యోగులకు ఉపాధి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే వాలంటీర్ల వ్యవస్థ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే క్షేత్ర స్థాయిలో పని విభజన జరగాలి. అందుకే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి రాజధాని నుంచి సూచించే ప్రభుత్వ పథకాలు మరో గంటలోపు అమలు చేయగలిగే వ్యవస్థ రూపుదిద్దుకొనున్నదని వివరించారు. వాలంటీర్లు తమకొచ్చే రూ.5వేల గురించి కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గుర్తించాలన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించారనే భయం, బాధ్యతతో చంద్రగిరిలో నీటి సమస్య తీర్చడం కోసం 250 బోర్లకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశానని వెల్లడించారు. నగర కమిసనర్ మాట్లాడుతూ మీ పరిధిలోని 50 గృహాలకు మీరే మండలాధిపతులుగా ఉంటారనీ, నిస్వార్ధంగా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. తుడా సెక్రటరీ రాం సుందర్ రెడ్డి అభిప్రాయంలో సామాన్యులు తమ అవసరాలకు ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారనీ, మీతో ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాలంటీర్లకు నియామక పత్రాలతో పాటు ఉద్యోగ ప్రదాత సీఎం ఫోటోలను స్వయంగా అందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తుడా అధికారులతో చెవిరెడ్డి సమీక్ష సమావేశం
-
సామాన్యుల చెంతకు తుడా సేవలు
సాక్షి, తిరుపతి తుడా: తుడా సేవలను సామాన్యుల చెంతకు తీసుకెళతామని ఆ సంస్థ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. తుడా వీసీ పీఎస్ గిరీషాతో కలిసి ఆయన శనివారం తుడా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వసతుల కల్ప నకు పెద్ద పీట వేయనున్నామన్నారు. తుడా పరి ధిలోని అనేక గ్రామాల్లో ప్రజలు కనీస వసతులకు నోచుకోవడంలేదన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో మరో నాలుగు నిర్మిస్తామన్నారు. మహిళా వర్సిటీ సమీపంలో తుమ్మలగుంట రోడ్డులోని తుడా విశ్రాంత భవనం పక్కన ఉన్న 1.70 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుచానూరు మార్కెట్ యార్డు, మంగళం సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కరకంబాడి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మరింత న్యాయం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. సూరప్పకశంలోని 146 ఎకరాల తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం పది రోజుల్లో తుడా గ్రీన్ టౌన్ షిప్ ప్లాన్ అందుబాటులోకి రానుందన్నారు. తుడా పరిధిలోని ప్రతి ఇం టికీ రెండు పండ్ల మొక్కలు, మరో రెండు వేప, కానుగ వంటి మొక్కలు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను తుడానే అందించి గ్రామీణ విద్యార్థుల ఉన్నతికి దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ గిరీషా, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్, తుడా సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతర్గతంగా సమావేశం తుడా కార్యాలయంలో చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వీసీ గిరీషా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ సమావేశమయ్యారు. తిరుపతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. మా బంధం విడదీయరానిది మాది అన్నదమ్ముల అనుబంధం.. కష్టనష్టాల్లోనూ మా బంధం విడదీయరానిదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడారు. తుడా కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి విచ్చేసిన సందర్భంగా శనివారం చైర్మన్ చెవిరెడ్డి, వీసీ గిరీషా, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో చైర్మన్‌తో కలిసి కొంతసేపు మాట్లాడారు. తుడాకు విలువ తీసుకురావడంతోపాటు ఉన్నత స్థితిలో నిలిపేందుకు చెవిరెడ్డి కృషి చేస్తారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదన్నారు. వీసీగా పీఎస్ గిరీషా మంచి సేవలందిస్తారని చెప్పారు. అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులని, ఆ తరువాత తామిద్దరం అంతకు మించి స్నేహితులుగా..అన్నదమ్ముల్లా ఉన్నామని అన్నారు. -
ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు
-
జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి విద్యావ్యవస్థ పడిలేస్తోందని, ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ప్రస్థానం సరైనమార్గంలో సాగలేదని, విద్యావ్యవస్థను కొందరు అభివృద్ధిపథంలో నడిపితే.. మరికొందరు నిర్వీర్యం చేశారని అన్నారు. గత చంద్రబాబు హయాంలో నాలుగువేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డబ్బులు పిండుకుంటున్నాయని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూ యజమాన్య హక్కుల బిల్లుకు ఆమోదం భూ యజమాన్య హక్కుల బిల్లును ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగనివ్వమని అన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. -
చంద్రగిరిలో గెలుపు చరిత్రాత్మకం : వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో 43వేల భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది చరిత్రాత్మకమైన గెలుపని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో నవరత్నాల పథకాలకు ప్రభుత్వం తగినన్నినిధులు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి రాగా ఆయన కుప్పం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
తుడాకు ప్రత్యేక లీగల్ సెల్: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషస్‌ల దగ్గర ప్రత్యేక రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలో అయన పాల్గొని.. దీని పరిధిలో రెండు నర్సరీలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ప్రతి ఇంటికి నాలుగు మొక్కల చొప్పున.. కొబ్బరి, జామ, పూల చెట్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శ్రీసిటీని తుడా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆమోదానికి తీర్మానం చేశామని తెలిపారు. తుడాకు చెల్లించాల్సిన రూ.35 కోట్ల బకాయిలు టీటీడీ చెల్లించాలి ఆదేశించారు. కాగా తుడాకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసి.. రిటైర్డ్ ఉద్యోగుల నియమాకం చేపడతామన్నారు. దీని పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లపై విచారణకు ఆదేశాలు జారీ చేసి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం
సాక్షి, తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ఈనెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీచేశారు. జీవో నంబర్ 198 ద్వారా ఈ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంచిరోజు చూసుకుని తుడా చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. చెవిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వ విప్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తొలి నామినేటెడ్ పదవిని ఆయనకే కట్టబెట్టారు. మూడేళ్ల కాల వ్యవధితో నియమితులైన ఆయన 2022 మే వరకు తుడా చైర్మన్‌గా కొనసాగనున్నారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెవిరెడ్డి మార్కు తుడా చైర్మన్‌గా అభివృద్ధిని ఇలా కూడా చేయించవచ్చని ఇద్దరంటే ఇద్దరే నిరూపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ గురువైన భూమన కరుణాకర్‌రెడ్డి తుడాను అభివృద్ధి బాట పట్టిం చారు. అనంతరం ఆ పదవిని చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధిలో తన మార్కు పాలన చేశారు. పట్టణం నుంచి పల్లె వరకు సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముఖ్యంగా కనీస అవసరాలకు నోచుకోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి రికార్డు సృష్టించారు. సీసీ రోడ్లు, కాలువలు, పచ్చదనంతో పల్లెల రూపు రేఖలు మార్చేశారు. 2007లోనే 2020 విజన్ పేరుతో అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ప్రతి మండలానికీ సుమారు 100 సీసీ రోడ్లు వేయించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జన్మనిచ్చిన నారావారిపల్లి సొంత గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో స్థానికుల అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి సీసీ రోడ్లు వేయిం చారు. ఇలా కుల, మత, ప్రాంత తారతమ్యాలు లేకుండా ఆయన తుడా పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేపట్టారు. పలు చెరువుల అభివృద్ధి, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు మండలాల్లోని ప్రతి గ్రామంలో మహిళా భవనాలను నిర్మించి మహిళా సాధికారితకు కృషి చేశారు. ఎమ్మార్‌పల్లి–మహిళా వర్సిటీ, ఉప్పరపల్లి, రేణిగుంట జంక్షన్, కరకంబాడి వంటి అనేక ప్రధాన రోడ్ల విస్తరణ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హయాంలో చేపట్టినవే. తుడా కార్యాలయాన్ని కార్పొరేట్ హంగులతో ఆధునికీకరించారు. తుడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తుడా విస్తరణ తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట నాలుగు మండలాల పరిధికే పరిమితం అయిన తుడాను 9 మండలాలకు విస్తరించిన ఘనత చెవిరెడ్డికే దక్కుతుంది. ఆ నాలుగు మండలాలతో పాటు రామచంద్రాపురం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వడమాలపేట, పుత్తూ రు మండలాలను తుడాకు విలీనం చేసి విస్తరించారు. విస్తరించిన మండలాల్లోని గ్రామాలను సైతం అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన తుడా చైర్మన్లు వి.వెంకటమునిరెడ్డి 1982–83 ఎం.వెంకట్రామానాయుడు 1984–85 ఎం.మోహన్ 1986–87 ఎస్.మునిరామయ్య 1988–89 కోలా రాము 1989–90 డాక్టర్ ఆర్.రాజశేఖర్‌రెడ్డి 1992–94 ఎల్బీ ప్రభాకర్ 1995–95 కందాటి శంకర్‌రెడ్డి 1998–99 ఎన్వీ ప్రసాద్ 2003–04 భూమన కరుణాకరరెడ్డి 2004–06 డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2007–10 ఎం.వెంకటరమణ 2013–15 ఎన్.నరసింహయాదవ్ 2017–19 -
ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటేనే ఒక సంచలనం
-
చిత్తూరు: అద్వితీయ విజయం
తిరుపతి రూరల్: నిత్యం అందుబాటులో ఉండే నాయకుడికి ఆదరణ, అభిమానం మెండుగా ఉంటాయని నిరూపించారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు. అధికార కక్షసాధింపులు, అణచివేత కోసం బనాయించిన అక్రమ కేసులు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి పార్టీ క్యాడర్‌ను చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నాలు, ప్రలోభాల పర్వాలు ఇలా ఒకటేమిటి రాజకీయంగా చెవిరెడ్డిపై ఎన్నోన్నో కక్షసాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడింది. ప్రజాభిమానమే అండగా వాటన్నీంటికి ఎదురెళ్లి, వాటిపై పోరాడి, విజయం సాధించిన వ్యక్తిగా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ధీరుడుగా నిలిచిపోయాడు. అందుకే చెవిరెడ్డికి అండగా నిలిచారు. ఓట్లతో తమ అభిమానిన్ని చాటుకున్నారు. ఎంతగా అంటే చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరికి ఇవ్వనంతగా 40,084 ఓట్ల మెజారిటీతో గెలిపిం చారు. జిల్లాలోనే అత్యధిక ఓట్లు చెవిరెడ్డికే జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి రానంతగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1,25,005 ఓట్లను సాధించారు. ఇది జిల్లాలోనే అత్యధికం. సీఎం చంద్రబాబు కూడా 1,00,146 ఓట్ల వద్దే ఆగిపోయారు. చెవిరెడ్డి ప్రత్యర్థి పులివర్తి నానికి 84,921 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో 40,084 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. అన్ని మండలాల్లోనూ మెజారిటీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పాకాల మండలాల్లోనూ ప్రతిరౌండ్‌కు సంపూర్ణ ఆ«ధిక్యత సాధిస్తూ వచ్చారు. 325 పోలింగ్ కేంద్రాలతో పాటు సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలోనూ చెవిరెడ్డి హవానే కొనసాగింది. ఎర్రావారిపాళెం మండలంలో 1,900కు పైగా మెజారిటీ వచ్చింది. చిన్నగొట్టిగల్లు మండలంలో 3,500కు పైగా వచ్చింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత మండలం పాకాలలోనూ 4,000కు పైగా సాధిం చి చెవిరెడ్డి సత్తా చాటారు. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో ఐదు వేలకుపైగా సాధించిన ఓట్లతో చెవిరెడ్డి విజయదుందుభి మోగించారు. రామచంద్రాపురం మండలంలో నూ గతంలో ఎన్నడూ లేనివిధంగా 3,500కు పైగానే మెజార్టీ సాధించారు. అనితర సాధ్యం.. ఆ మెజార్టీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంత మండలం తిరుపతి రూరల్‌లో చెవిరెడ్డికి ఎదురులేకుండా పోయింది. తిరుచానూరులో 3,800కు పైగా, శెట్టిపల్లిలో 2,700, దుర్గసముద్రం, మల్లంగుంట, అవిలాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో చెవిరెడ్డి హవా నడిచింది. మండలంలో దాదాపు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లలో కూడా మెజారిటీ సాధించారు. రీ–పోలింగ్ కేంద్రాల్లో టీడీపీకి గండి అక్రమాలు సాగించారంటూ చెవిరెడ్డి ఫిర్యాదులో నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించిన ఏడు పోలింగ్ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ సీపీకి ఆధిక్యత లభిం చింది. దీంతో దళితులు, గిరిజనులు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ కేంద్రాల్లో 884 ఓట్లు వైఎస్సార్ సీపీకి లభించాయి. దీంతో టీడీపీకి ఓటు బ్యాంక్‌గా ఉన్న ఆ గ్రామాల్లో ఎట్టకేలకు గండి పడింది. చంద్రగిరి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెండోసారి మళ్లీ ఎమ్మెల్యేగావిజయం సాధించారు. దీంతో పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద పార్టీ నాయకులు బాణ సంచా పేల్చి సంబరాలు జరుపుకుకున్నారు. చంద్రగిరి రూరల్ (తిరుచానూరు) : తిరుచానూరులో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి రూరల్ మండల తూర్పు అద్యక్షుడు రామచంద్రారెడ్డి, సీనియర్ నేత సీఆర్. రాజన్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య భారీకేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పాకాల: పాకాలకు గురువారం సాయంత్రం 7.30 గంటలకు వచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రామచంద్రాపురం: మండలంలోని సీకాపల్లె పంచా యతీ సూరావారిపల్లె ప్రజలు కృష్ణుడి ఆల యం వద్ద 1,032 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. మండల కన్వీనర్ బ్రంహ్మానందరెడ్డి, కేశవులురెడ్డి, మొగిలిరెడ్డి, విజయరెడ్డి, చంద్రారెడ్డి, బీకిరెడ్డి, రామిరెడ్డి, జయరామిరెడ్డి, చెంగల్రాయరెడ్డి, షణ్ముగంరెడ్డి, పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన పచ్చమూక
-
చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి
సాక్షి, చిత్తూరు : చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ఆర్ కమ్మరపల్లికి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అడ్డగింతతో వేరే మార్గంలో ఎన్ఆర్ కమ్మరపల్లికి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దళితులపై టీడీపీ చేసిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ దళితులను పరామర్శించడానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దళితులపై టీడీపీ నేతల దాడులు -
టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం
-
దళితుల ఓటు హక్కు కాలరాశారు: చెవిరెడ్డి
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కల్పించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తిరుపతిలో చెవిరెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోలింగ్ రోజు సీసీ ఫుటేజీ పరిశీలించండి.. పట్టించుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాను.. ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు రీపోలింగ్‌కు అనుమతించారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు దళితులకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దళితులు, గిరిజనుల ఓటు హక్కును 30 సంవత్సరాలుగా కాలరాశార’ని వ్యాఖ్యానించారు. ‘పోలింగ్ రోజు జరుగుతున్న అక్రమాలపై జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి, కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏప్రిల్ 13 నుంచి పోలింగ్ రోజు జరిగిన అన్యాయంపై పోరాటం సాగిస్తున్నాం. ఏడు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేశాం.. ఐదు పోలింగ్ కేంద్రాలకు మాత్రమే రీపోలింగ్‌కు అనుమతించారు. 27 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆధారాలు ఉంటే చూపించండి. రీపోలింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన రోజు అన్ని ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. నా స్వగ్రామం తుమ్మలగుంటలో అక్రమాలు జరిగినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి.. నేను రీపోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాన’ని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. సీఎం పేషీలో పనిచేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ స్వామి భక్తితో ఏకపక్షంగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించారని ఆరోపించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం -
టీడీపీకి కలెక్టర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
-
‘ఐదు దశాబ్దాలుగా దళితులను ఓటెయ్యనీయలేదు’
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు రీపోలింగ్‌కు ఆదేశించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఐదు దశాబ్దాలుగా దళితుల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారని చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రీపోలింగ్ జరుగుతున్న ఐదు కేంద్రాల్లో దళితుల్ని ఓటు వేయనివ్వడం లేదని అధికారులు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఫిర్యాదు చేశాం.. అయినా కలెక్టర్ పట్టించుకోలేదని చెప్పారు. పోలింగ్ రోజు దళితులను ఓటు వేయనీయడం లేదని, పోలింగ్ కేంద్రంలో వీడియో ఫుటేజీ తనిఖీ చేసి అన్ని విషయాలు చూడమని ఆరోజే ఫిర్యాదు చేశామన్నారు. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఫిర్యాదు చేశాం.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో ఆ రోజు ఒకే వ్యక్తి ఓటు వేస్తున్న విజువల్స్ సీసీటీవీ పుటేజీలో స్పష్టంగా ఉంది..అయినా కూడా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పందించలేదని అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ రీపోలింగ్‌కు బాధ్యత వహించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గతంలో చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి మండిపడ్డారు. దళితులు, గిరిజనులకు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. చిత్తూరు కలెక్టర్, ఎస్పీ చేసిన తప్పిదాల వల్లే ఈ రీపోలింగ్ వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
చంద్రగిరి అధికారుల తీరుపై ఈసీకు చెవిరెడ్డి ఫిర్యాదు
-
డ్వాక్రా రుణాలు కట్టొద్దు
భాకరాపేట: డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టొద్దని... జగనన్న ఆ రుణాల మొత్తం మాఫీ చేస్తారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మూడు చెక్కులను మూడు ముక్కలు చేసి మహిళలను వంచించారన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదల సొంతంటి కల సాకారం కానుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేరుస్తారన్నారు. జగనన్న సీఎం కావడం ఖాయం జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. భాకరాపేట సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబును విమర్శంచను.. కానీ ఈ రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటే తనకెంతో ఇష్టం అన్నారు. ‘సంక్రాంతికి విద్యానికేతన్‌కు రావాలని పిలిస్తే... సారీ రాలేను ఒక కార్యకర్తను అనవసరంగా జైల్లో పెట్టారు. ఆ ఇంట్లో పండుగ లేదు కాబట్టి నేను కూడా పోలీస్ స్టేషన్ వద్దనే ఉంటాను అన్నారు’ అని తెలిపారు. ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండరని అన్నారు. ప్రజల కోసం పరితపించే నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. చిన్నగొట్టిగల్లు అభివృద్ధికి కృషి చిన్నగొట్టిగల్లు మండలాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తానని చెవిరెడ్డి చెప్పారు. చిన్నగొట్టిగల్లు చెరువు సప్లయ్ ఛానల్ వెడల్పుతో పాటు, లైనింగ్ పనులు చేపట్టడం, అలాగే దేవరకొండ నుంచి దీన్దార్లపల్లె వద్ద ఉన్న చెరువులను అనుసంధానం చేయడం, చిన్నగొట్టిగల్లు ఆస్పత్రిని అభివృద్ధి చేసి పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలను తీసుకురావడం, గ్రామీణ రోడ్లను పూర్తి చేయడం, అర్హులుగా ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇప్పించడం, భాకరాపేట, చిన్నగొట్టిగల్లు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంబులెన్స్‌కు దారి వదలండి అయ్యా.. అన్నా... అక్కా... అంబులెన్స్‌కు దారి వదలండంటూ చెవిరెడ్డి ప్రజలను కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అంబులెన్స్‌కు ఎక్కడ ఉన్నా ఎటువంటి సందర్భమైనా దారి వదలాలి ఓ ప్రాణాన్ని కాపాడాలన్న మన వైఎస్ఆర్ మాటకు విలువిద్దాం అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పగానే కార్యకర్తలు అంబులెన్స్ ముందు సైనికుల్లాగా దారికి అడ్డుగా ఉన్న కార్యకర్తలను పక్కకు పంపించారు. -
లోకేశ్ అక్కడెందుకు పోటీచేయడం లేదు: మంచు విష్ణు
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్‌ను అక్కడి నుంచి ఎందుకు బరిలోకి దింపలేదని సినీ హీరో మంచు విష్ణువర్థన్‌బాబు ప్రశ్నించారు. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు బరిలోకి దింపారని ఆయన అడిగారు. చంద్రగిరిని అభివృద్ధి చేస్తే.. అక్కడి నుంచే లోకేశ్‌ను పోటీకి పెట్టచ్చు కదా! అని ఆయన అన్నారు. చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున మంచు విష్ణు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెలకు 10 రోజులు ఇక్కడ ఉండే తమను చంద్రబాబు వలస పక్షులు అంటున్నారని, సంవత్సరానికి ఒకరోజే నారావారిపల్లెకు వచ్చే ఆయనను ఏమంటారని అడిగారు. వైఎస్ జగన్ తమ బంధువు అని, విలువలతో కూడిన రాజకీయం ఆయన చేస్తున్నారని మంచు విష్ణు పేర్కొన్నారు. -
చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో ఉద్రిక్తత
-
చంద్రగిరిలో టీడీపీ గూండా రాజ్యం
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ‘అధికార’ టీడీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో విచక్షణ కోల్పోయి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు దిగి అరాచకాలు సృష్టిస్తున్నారు. వీరి ఆగడాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే, సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండల పరిధిలోని ముంగళిపట్టు గ్రామంలోకి ప్రవేశించారు. ముందే పక్కా స్కెచ్‌తో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచ రులు ఎమ్మెల్యే చెవిరెడ్డి కారును అడ్డుకున్నారు. ‘మా గ్రామంలోకి కేవలం ‘మా కమ్మ కులస్తులు, మా టీడీపీ వాళ్లు తప్ప వేరే ఎవరు వచ్చినా అంగీకరించం’ అంటూ దౌర్జన్యానికి దిగారు. గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పులివర్తి నాని అనుచరులు ఎమ్మెల్యే చెవిరెడ్డిని దుర్భాషలాడుతూ నానా బీభత్సం సృష్టించారు. దాడికి యత్నించారు. ఇంతలో ఎమ్మెల్యే గన్మ్యాన్లు జాగ్రత్త పడ్డారు. కారులోంచి కిందకు దిగిన చెవిరెడ్డి మాట్లాడు తూ ‘ఇది మంచి సాంప్రదాయం కాదు... మీ కులస్తులే ఈ ఊర్లో ఉన్నారని ప్రచారం కూడా చేయకూడదంటే ప్రజలు హర్షించరు’ అని చెప్పారు. మిగతా పల్లెల్లో ఇతర కులస్తులు టీడీపీ వాళ్లను అడ్డు కుంటే ఎలా ఉంటుందో తెలుసుకోమని హితవు పలికారు. గ్రామంలో ప్రచారం చేసే తిరిగి వెళ్తానని భీష్మించుకుని కూర్చున్నారు. అదే గ్రామంలోని దళితులు చెవిరెడ్డికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. వారు కూడా చెవిరెడ్డితోపాటు నిరసన దీక్షలో కూర్చున్నారు. దళితులపై దాడికి యత్నం చెవిరెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు, దళిత మహిళలను పులివర్తి నాని అనుచరులు అసభ్య పదజాలంతో ధూషిస్తూ, దాడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు రక్షణ కల్పించారు. చెవిరెడ్డిని అడ్డుకుని, దళితులపై దాడికి యత్నించిన టీడీపీ నేతలపై ముంగళి పట్టు గ్రామానికి చెందిన దళిత మహిళలు తహసీ ల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని ఏఆర్వో, తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. ఇలా దౌర్జన్యాలకు దిగడం మంచిది కాదన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్రిక్తంగా మారిన ముంగళిపట్టు టీడీపీ నేతల దౌర్జన్యాలతో ఒక్కసారిగా ముంగళిపట్టులో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ అనీల్బాబుతో పాటు డీఎస్పీలు, సీఐలు ఇతర అధికారులు భారీగా మోహరించారు. పులివర్తి నాని అనుచరుడి వీరంగం ప్రచారానికి గ్రామంలోకి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పులివర్తి నాని అనుచరుడు పట్టాభినాయుడు, ప్రసాద్ దాడికి యత్నించారు. కారులో వస్తున్న చెవిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే చెవిరెడ్డిని కొట్టేందుకు సిద్ధంగా ఉంచుకున్న బెల్టును చేతిలో పెట్టుకుని, కారులో ముందు కూర్చున చెవిరెడ్డిని పట్టాభినాయుడు బలవంతంగా బయటకు లాగి దాడి చేయబోతుండగా..అక్కడే ఉన్న గ్రామస్తులు, దళితులు అడ్డుకున్నారు. దీంతో దళితులతో పాటు చెవిరెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. పులివర్తి నాని, ఆయన అనుచరులు వందల సంఖ్యలో ముంగళిపట్టుకు చేరుకున్నారు. ఘటనా స్థలానికి కాస్త దూరంగా ఉన్న నాని పరోక్షంగా కార్యకర్తలను ఉసిగొల్పి చెవిరెడ్డిపై మరోసారి దాడికి యత్నించారు. పోలీసులపై నాని చిందులు టీడీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులపై పులివర్తి నాని చిందులేశారు. తమ కార్యకర్తలను అడ్డుకునే హక్కును మీకెవరిచ్చారంటూ మండిపడ్డారు. చెవిరెడ్డి ప్రచారాన్ని విరమింపజేసుకోకుంటే ఏమైనా జరగవచ్చునని, పోలీసులు తమ కార్యకర్తలను అదుపు చేయాలని చూస్తే వారి సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిపై దాడికి యత్నం
-
చంద్రగిరి దేవరాయల సిరి
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి నడయాడిన పవిత్రభూమి.. స్వామివారు కొలువైనశేషాచలం అడవులు..మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం.. నడిమధ్యన విజయసామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం నాటి తీపిగుర్తుగా రాజఠీవితో ఉన్న చంద్రగిరి కోట..రైతులకు కల్పతరువుగా నిలుస్తున్న స్వర్ణముఖి నది పరవళ్లు.. పచ్చని పండ్లతోటలు.. పండ్లరారాజు మామిడి మార్కెట్‌కు దిక్సూచీలా నిలుస్తోంది చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ నుంచేచంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైతే..ఇక్కడ జనం మాత్రం బాబును కుప్పానికి సాగనంపారు. గల్లా కుటుంబం రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పితే..మొదటిసారే పోటీ చేసి చంద్రగిరిఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గాన్ని శాసిస్తున్నారు. చిత్తూరు , తిరుపతి రూరల్: నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసే ఇక్కడ ఎన్నికల అనంతరం అన్ని పార్టీలు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుంటాయి. 1978లో చంద్రగిరి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. నాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులను సామాన్యులు ఓడించిన ఘనమైన చరిత్ర ఈ నియోజకవర్గానికే సొంతం. అయితే సమస్యలు కూడా ఇక్కడ తిష్ట వేస్తూనే ఉన్నాయి. తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రానికి తాగునీటిని అందించే తెలుగుగంగా, కల్యాణిడ్యామ్ వంటి తాగునీటి ప్రాజెక్టులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నా..గుక్కెడు నీళ్లు ఇక్కడి ప్రజలకు అందని దుస్థితి ఉంది. ఇంటి స్థలాలకు నోచుకోని వారెందరో. దేశ, విదేశాల నుంచి వచ్చే వ్యాపారులతో కళకళలాడే మామిడి మార్కెట్లు ఇక్కడే ఉన్నా..గిట్టుబాటు ధరకు నోచుకోని పేద రైతుల కష్టాలు వర్ణనాతీతం. నియోజకవర్గ చరిత్ర ఇదీ.. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో చంద్రగిరి ఒకటి. ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే మొదటిస్థానం. 1978లో నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తిరుపతి రూరల్, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, చంద్రగిరి ఆరు మండలాలు కలిపి నియోజకవర్గంగా మార్చారు. నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలం జనాభా పరంగా, విస్తీర్ణంగా కూడా అతిపెద్దది. సగం మంది ఓటర్లు ఈ మండలంలోనే ఉన్నారు. తిరుపతి నగరానికి ఒకవైపు శేషాచలం అడవులు ఉంటే, మూడు వైపులా ఈ మండలం చుట్టుకుని ఉంటుంది. చంద్రబాబును కుప్పానికి తరిమిన సామాన్యుడు.. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వస్థలం ఈ నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి మండలం నారావారిపల్లి. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న చంద్రబాబు యువకుడిగానే 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జనతాపార్టీ అభ్యర్థి పట్టాభిరామచౌదరిపై తక్కువ మెజారిటీతో గెలుపొందారు. తర్వాత మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, మంత్రిగా పనిచేసినా అభివృద్ధిని విస్మరించడంతో 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తిరుపతి రూరల్ మండలం సీమల్లవరానికి చెందిన మేడసాని వెంకట్రామనాయుడు(మీసాల నాయుడు) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యంత చిత్తుగా ఓడిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. చిత్తుగా ఓడిన బాబు మళ్లీ చంద్రగిరిలో పోటీ చేసేందుకు సాహసించలేకపోయారు. చంద్రగిరి నుంచి కుప్పానికి పారిపోయాడు. గల్లా మార్క్ రాజకీయం.. చంద్రగిరి నియోజకవర్గంపై రాజకీయంగా తిరుగులేని ముద్రను వేసుకున్న వ్యక్తి గల్లా అరుణకుమారి. ప్రముఖ పార్లమెంటేరియన్ పాటూరి రాజగోపాల్‌నాయుడు కుమార్తెగా 1989లో చంద్రగిరి నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచిన అరుణకుమారి తన రాజకీయ పునాదిగా ప్రతిష్ట పరుచుకున్నది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. మొత్తం ఆరుసార్లు పోటీచేసిన ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆమెకు రాజకీయంగా, వ్యాపారపరంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన శాఖలకు మంత్రిగా చేశారు. కాంగ్రెస్‌లో మహారాణిలా వెలిగిన ఆమె 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. టీడీపీలోని వెన్నుపోటుదారుల వల్ల ఓటమిపాలు అయ్యారు. రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలుపు.. నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ అంతంత మాత్రమే. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుపొందారు. ఆరుసార్లు చిత్తుగా ఓడారు. 1985లో ఎన్టీఆర్‌పై సానుభూతితో జయదేవనాయుడు గెలిచారు. తర్వాత 30 ఏళ్లలో ఆరు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ తరుఫున రామ్మూర్తినాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై గెలుపొందారు. తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో టీడీపీని ఆమె చిత్తుగా ఓడించారు. ప్రభంజనంలా చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రభావం చూపిన నాయకుడిగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముద్ర వేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరు పొందిన చెవిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడిగా విలక్షణశైలిలో అభివృద్ధి చేసి చూపించారు. యూత్‌ను ఆకర్షించడంలో ఆయనది ప్రత్యేకశైలి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేయగా నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లక్షకు పైగా ఓట్లను సాధించాడు. రాజకీయ ఉద్దండురాలైన గల్లా అరుణకుమారిపై 4,518 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఎమ్మెల్యేగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యువత, రైతులు, మహిళల కోసం సొంత నిధులతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. నానికి తప్పనిఇబ్బందులు మరోవైపు టీడీపీ అభ్యర్థిగా చిత్తూరులో ఏళ్ల కిత్రమే వ్యాపారపరంగా స్థిరపడిన పులివర్తి వెంకటమణిప్రసాద్(నాని)ని ప్రకటించారు. నియోజకవర్గంలో పరిచయాలు లేకపోవడం, గల్లా అరుణ మంత్రిగా ఉన్న పదేళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. అలాగే నాయకులు, కార్యకర్తలను నమ్మటం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. మొత్తం ఓటర్లు 2,70,495 స్త్రీలు 1,37,018 పురుషులు1,33,434 ఇతరులు 43 చంద్రగిరినియోజకవర్గ సమాచారం అభ్యర్థులు: 1. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ) 2. పులివర్తి వెంకటమణిప్రసాద్(టీడీపీ) చంద్రగిరి నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 113 చదరపు కిలోమీటర్లు తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలను ఆనుకుని ఉంది. -
సాక్షి, ఎఫెక్ట్ : చిత్తూరు ఎస్పీపై ఈసీ సీరియస్!
సాక్షి, తిరుపతి రూరల్ : చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహాం వ్యక్తంచేసింది. తమకు తెలీకుండా ఎర్రావారిపాళెం ఎస్సైను ఎలా బదిలీ చేస్తారని నిలదీసింది. బదిలీ కాదు అని ఎస్పీ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్‌స్టేషన్‌లో జనరల్ డైరీ (జీడీ) ఎస్పీ డ్రామాలను బట్టబయలు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు రిలీవ్ అవుతున్నట్లు ఎస్సై రాసిన జీడీని చూసిన ఈసీ, ఎన్నికల విధుల్లో పోలీస్ బాస్ పారదర్శకంగా లేరని నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఎస్సైను తిరిగి విధుల్లోకి పంపించాలని ఆదేశించింది. ఈసీ ఆగ్రహాంతో ఎస్పీ దిగొచ్చి విధుల్లో చేరాలని ఎస్సై కృష్ణయ్యకు సూచించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి విధుల్లోకి చేరారు. ‘సాక్షి’ కథనంతో కదిలిన ఈసీ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ఎస్సై బదిలీపై ‘సాక్షి’ మెయిన్ పేపరులో మంగళవారం ‘ఎన్నికల కోడ్..డోంట్ కేర్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. టీడీపీ నగదు తరలింపునకు ఎస్కార్ట్‌గా వెళ్లనందుకే ఎస్సైను బదిలీ చేశారని చిత్తూరు ఎస్పీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘సాక్షి’ కథనంపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. ఈసీ జరిపిన విచారణలో ఎస్సై కృష్ణయ్యను నిబంధనలకు విరుద్ధంగానే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. టీడీపీ నగదు తరలింపుకు ఎస్కార్ట్ వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. మదనపల్లి డీఎస్పీ మంగళవారం ఎర్రావారిపాళెం స్టేషన్‌కు వచ్చి విచారించారు. ఓ త్రిబుల్ స్టార్ అధికారి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఉద్యోగాన్ని పణంగా పెట్టడమే కాకుండా, తమ ఉద్యోగాలను పణంగా పెట్టాలని బెదిరిస్తున్నారని.. ఆయన ఉంటే విధులను నిష్పక్షపాతంగా చేయలేమని సిబ్బంది డీఎస్పీ వద్ద విన్నవించుకున్నట్లు సమాచారం. ఈసీకి ఫిర్యాదు చేసిన చెవిరెడ్డి.. చిత్తూరు ఎస్పీ ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించడంలేదని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరçఫున న్యాయవాది వాణి కూడా ఎన్నికల సంఘానికి ఆధారాలతో మంగళవారం ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి ఇళ్లలోకి వెళ్లి వృద్ధులను, మహిళలపై దాడిచేయటం, అసభ్యంగా ప్రవర్తించటం, అక్రమ అరెస్టులపైనా బాధితులు కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు, జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదులు చేశారు. చిత్తూరు ఎస్పీపై ప్రైవేటు కేసులను సైతం నమోదు చేయించారు. ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని ఈసీ నిర్ధారణకు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కొనసాగిస్తారా? తప్పిస్తారా అన్నది వేచిచూడాల్సిందే. -
జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
సాక్షి, ఎర్రావారిపాళెం: రాష్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమవుతుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాటి స్వర్ణయుగాన్ని జననేత తిరిగి తీసుకువస్తాడని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎర్రావారిపాళెంలో వైఎస్సార్సీపీ ఆధర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే యువశక్తికి తోడ్పాటుంటుందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో అధికార పార్టీ ఊసరవెళ్లి ధోరణిలో ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఒక జగనన్నకు మాత్రమే ఉందన్నారు. జగనన్న ప్రకటించిన ప్రతి హామీ కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారన్నారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకువారిపల్లె పంచాయతీ పులిపుతృవారిపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మసముద్రం వెంకటరెడ్డి తన భారీ అనుచర ఘనంతో కలసి వైఎస్సార్‌సీపలో చేరారు. వెంకటరెడ్డికి చెవిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ టీడీపలో అవినీతి, అక్రమాల తీరు, పార్టీ విధానాలు నచ్చకనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎంపీపీ రేవతిరెడ్డెప్పరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి దేపట్ల నాగార్జునరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రమేష్, నాగరాజనాయుడు, మహేశ్వర్‌రెడ్డి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు
-
ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు
అమరావతి: ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన చెవిరెడ్డి, చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న కుట్రలను వివరించారు. ఓటర్ల తొలగింపు ఆదేశాల టెలికాన్ఫరెన్సు ఆడియో ఆధారాలను స్వయంగా చెవిరెడ్డి అందించారు. అనంతరం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రగిరిలో ఈ నడుమ సుమారు 22 వేల వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గానికి 30 మందిని సర్వే పేరుతో పంపించారని, పోలింగ్ బూత్ నెంబర్, ఓటర్ ఐడీ కార్డు నెంబర్లను తీసుకుని వారు గుంటూరులో ఉన్న ఆఫీసుకు పంపుతారని చెప్పారు. అక్కడి నుంచి ఆదేశాలు పంపి ఓట్లు తీసేయిస్తున్నారని తెలిపారు. సర్వే చేస్తోన్న 17 మందిని పోలీసులకు అప్పగించినా వారిపై కేసులు పెట్టలేదని చెప్పారు. సర్వే చేసిన వారిని పోలీసులకు అప్పగించిన వైఎస్సార్సీపీ కార్యకర్తల్నే పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. మా వాళ్లను చూపించమని అడిగిన నన్ను అరెస్ట్ చేసి తమిళనాడులో తిప్పి తెల్లవారుజామున వదిలివేశారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఓట్లు తొలగించమని చెబుతున్నట్లుగా మాట్లాడిన సెల్‌ఫోన్ రికార్డింగ్‌ను మీడియాకు వినిపించారు. -
టీడీపీ, జనసేన ఇప్పటికి ఒక్కటే’
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోసం పోలీసు వ్యవస్థ దిగజారి వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సర్వే చేస్తున్న వారిని వదిలిపెట్టి, వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన తమ నేతలపై కేసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒక శాసన సభ్యుడు అని చూడకుండా అతన్ని ఇబ్బంది పెట్టారన్నారు. చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తమ పార్టీని నేరుగా ఎదుర్కొలేక చంద్రబాబు ఓట్లు తీసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ చంద్రబాబుకు అండగా పనిచేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమాన్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం) చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు తమ పార్టీకి ఒంటరిగా పోటీ దమ్ముందని, చంద్రబాబులాగా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేయమని పెద్దిరెడ్డి అన్నారు. ‘ముసుగు రాజకీయాలంటూ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మేము ఎవరితో కలిసి పోటీ చేయం. అనేక పార్టీలతో కలిసి పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుది. బీజేపీతో, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అనేక పార్టీలతో కలిసిన చరిత్ర చంద్రబాబుది. ముసుగు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. బీజేపీతో చంద్రబాబుకు ఇప్పటికీ లోపాయకారి ఒప్పందం ఉంది. టీడీపీ, జనసేన ఇప్పటికి ఒక్కటే. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ముసుగు రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క మనిషికి 100 ముసుగులు ఉంటే.. ఆ మనిషి చంద్రబాబే అవుతారు’ అని ఎద్దేవా చేశారు. అవకాశ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన నాయకులు లేరన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. (ముసుగులో సర్దుబాట్లు!) -
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు
-
చెవిరెడ్డి అరెస్ట్: సత్యవేడు పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
టీడీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి
సాక్షి, అమరావతి : టీడీపీ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తుద ముట్టించడానికి టీడీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇద్దరి చేత రెక్కీ నిర్వహించడం దారుణమన్నారు. సుపారీ చెల్లించి మనషులను పెట్టారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అన్ని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా నిందితులను పోలీసులకు అప్పగించినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే కేసు నమోదు చేయటంలేదని విమర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందించిన సాక్ష్యాధారాలతో వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
చెవిరెడ్డి హత్యకు కుట్ర..!
తిరుపతి రూరల్: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు రెక్కీ జరిగింది. చిత్తూరుకు చెందిన పులివర్తి నాని అనుచరులు ఇద్దరు పట్టుబడ్డారని మీడియాలో రావడంతో తిరునగరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విష సంస్కృతి తిరుపతికి రాకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అసలెం జరిగిందంటే... రెండు నెలల క్రితమే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ఇదే అవకాశంగా చిత్తూరు చెందిన నాని అనుచరుడు నాగభూషణం తాను తిరుపతి వాడినని, తనకు బతుకుదెరువు చూపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని కోరారు. నెలరోజుల క్రితం ఎమ్మెల్యే వాహనాల శ్రేణిలో చేరాడు. 10 రోజుల తర్వాత తన స్నేహితుడు సిసింద్రీని డ్రైవర్‌గా చేర్చాడు. డ్రైవర్‌గా ఉంటునే ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే వివరాలను సేకరించడంతో పాటు ఇళ్లు, ఆఫీసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు చిత్తూరులోని పులివర్తి నాని అనుచరుడు రెడ్డెప్పకు చేరవేశాడు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేపై దాడి జరిగిన సమయంలో ఆయన ఒక్కడే వస్తున్నాడని, అనుచరులు లేరని వేదాంతపురంలోని నాని అనుచరులకు చేరవేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే గొడవ జరగడం, ఎమ్మెల్యే సృహ తప్పడం, ఆస్పత్రిపాలు కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వీడియో తీసి చిత్తూరుకు చేరవేశారు. బయట పడింది ఇలా.. ‘మీ దగ్గర చిత్తూరుకు చెందిన ఇద్దరు డ్రైవర్ల ముసుగులో నాని అనుచరులు ఉన్నారు. హత్యకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి..జాగ్రత్త అంటూ’ దాడి జరిగిన తర్వాత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఓ అజ్ఞాతవ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆరా తీసిన ఎమ్మెల్యేకు పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో చిత్తూరు పంట్రాంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీల ఫోన్లను పరిశీలించారు. దీంతో సమాచారం చిత్తూరు చేరవేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మంగళవారం సాయంత్రం తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితులు నాగభూషణం, సిసింద్రీలు సుఫారీ గురించి వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున డీల్ కుదిరిందని, అందులో తనకు రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చారని నాగభూషణం తెలపగా, తనకు రూ.40 వేలు అడ్వాన్స్ ఇచ్చారని సిసింద్రీ మీడియాకు తెలిపారు. మొదటి దశలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారు? వంటి సమాచారం చిత్తూరులోని నాని అనుచరుడు రెడ్డెప్పకు వాట్సాప్, ఫోన్ ద్వారా చేరవేస్తున్నట్లు చెప్పారు. సమయం చూసి రెండో దశ ఆదేశాలు ఇస్తామన్నారని, అందుకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో పులివర్తి నాని, గోపికి చెందిన గ్రానైట్, ఎర్రచందనం లారీలను పైలెట్‌గా వెళ్లి హైవే దాటించేవాళ్లమని, పోలీసులకు రూ.2వేలు, ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు హైవేలో ఉంటే నానితో ఫోన్లో మాట్లాడించి అకౌంట్ నెం బర్కు నగదును బదిలి చేయించేవాళ్లమన్నారు. చిత్తూరులో జాతర, వినాయకచవితి, గరుడవాహ నం ఉత్సవాల్లో పులివర్తి నాని, వసంత్, గోపి, రెడ్డెప్పకు బ్యానర్లు, కటౌట్లు కట్టేవాళ్లమన్నారు. ఇళ్లు ఇస్తాం...అప్పు తీరుస్తాం.. డీల్‌కు ఓకే అయితే మీకు ఏం కావాలన్నా చేస్తామని నాని అనుచరుడు రెడ్డెప్ప, కార్పొరేటర్ గోపి నిందితులకు ఆశ చూపించారు. రూ.15 లక్షలతో తనకు ఇళ్లు కట్టిస్తామన్నారని నాగభూషణం తెలపగా, రూ.15 లక్షలతో తనకు ఉన్న అప్పులు తీరుస్తామని చెప్పడంతో డీల్‌కు ఒప్పుకున్నట్లు సిసింద్రీ తెలిపారు. అనంతరం నిందితులను అర్బన్ ఎస్పీకి అప్పగించారు. ఎంఆర్‌పల్లి పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుణ్యక్షేత్రం ప్రశాంతంగా ఉండాలి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ భక్తిభావం ఉండాలే తప్ప, హత్య రాజకీయాలు, రెక్కీలు, దాడులు, దౌర్జన్యాలు ఉండకూడదన్నారు. ప్రజల కూడా వాటిని అంగీకరించరన్నారు. ఎవరైనా ప్రజా సమస్యలపైనే పోరాటాలు చేయాలన్నారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి హత్యకు టీడీపీ కుట్ర
-
నా హత్యకు టీడీపీ నేతల రెక్కీ!
తిరుపతి రూరల్: తన హత్యకు టీడీపీ నేతలు రెక్కీ నిర్వహించారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. తిరుపతి తుమ్మలగుంటలో మంగళవారం సాయంత్రం ఆయన.. నిందితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాత్తు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి.. పులివర్తి నాని సహకారంతోనే ఇద్దరు రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఓటమి భయంతోనే తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నేరచరిత్ర కలిగిన ఆ ఇద్దరికి రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి డ్రైవర్ల ముసుగులో తమ వద్దకు పంపారని, నెల రోజులుగా వారు తనతో పాటు, తన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టి వారిని పట్టుకుని ఆరా తీయగా.. సుపారీ విషయాన్ని బయటపెట్టినట్టు చెవిరెడ్డి చెప్పారు. మొదటి దశలో ఇల్లు, ఆఫీసుకు సంబంధించి నిఘా పెట్టడంతో పాటు, తనను ఎవరెవరు కలుస్తున్నారు? మా కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? ఎప్పుడొస్తారు? తదితర సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు తెలిపారు. సమయాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో చెబుతామని నాని అనుచరులు తమకు ఆదేశాలిచ్చారని, నాని సహకారంతోనే తాము రెక్కీ నిర్వహించినట్టు నిందితులు.. చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీలు మంగళవారం తుమ్మలగుంటలో మీడియాతో చెప్పారు. విద్వేషాలు, కక్షతో వ్యవహరించడం బాధాకరం శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు వంటి సంస్కృతి లేదని చెవిరెడ్డి చెప్పారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప.. విద్వేషాలతో వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధకరమన్నారు. నిందితులను చెవిరెడ్డి అర్బన్ ఎస్పీకి అప్పగించి, తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. కాగా, తనకు భద్రతను పెంచాలని ఇటీవల పోలీసులకు చెవిరెడ్డి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటికీ స్పందించక పోవడం గమనార్హం. ఇప్పటికైనా చెవిరెడ్డికి రక్షణ కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
దాడులు చేసినా సహించా : చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా ఉన్న వ్యక్తినని తానని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మినెలల్లో ఏ రోజు కూడా వ్యక్తి గత విమర్శలకు పోలేదని తెలిపారు. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉన్నా. నేను కూడా రాజకీయంగా విమర్శలు చేస్తే ప్రజల్లో అలజడి వస్తుందని, పచ్చగా ఉన్న పల్లెల్లో ప్రశాంతత కోల్పోతుందని తెలుసు. దానికి నేను కారణం కాకూడదనుకున్నా. అందరికీ శాసన సభ్యుడినైన నేను అందరినీ కలుపుకుంటూ పోయా. తెలుగుదేశం పార్టీ వాళ్లు వచ్చినా నేను ఆభివృద్ధి పనులకు ఆటంకం చెయ్యలేదు. చంద్రగిరిలో జీవిస్తున్న వారి జీవన స్థితిగతులు నాకు తెలుసు. నేడు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏనాడు గొడవలను ప్రోత్సహించలేదు. కానీ నేడు తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. నేను చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టా, చదువుకుంది, పదవులు పొందింది ఇక్కడే. అందుకే నియోజకవర్గంలో ఎన్నిగొడవలు ఉన్నా సర్థిచెప్పా. ఏనాడు అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ రోజు నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. గొడవలతో ప్రజలు నిత్యం ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ విష సంస్కృతిని ఎలా అరికట్టాలో అర్థం కావటం లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతకు ముందున్న ఎమ్మెల్యేల మంచి సాంప్రదాయాన్ని నేను కొనసాగించా. మీరు దాడులు చేసినా సహించా, అది భయపడి కాదు. నాపై దాడి చెయ్యడానికి ప్రయత్నించిన వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. పసుపు కుంకుమ కార్యక్రమం ప్రభుత్వానిది. అందుకే వెళ్లా. నేను వెళ్లింది జన్మభూమి కార్యక్రమానికి కాదు. నా కుటుంబసభ్యులు తప్పు చేసిన నేను వ్యతిరేకిస్తా' అని అన్నారు. -
నాలుగున్నర ఏళ్లలో ఒక్క రాజకీయ విమర్శ చేయలేదు
-
నాని అనుచరుల బరితెగింపు
తిరుపతి రూరల్: నిన్న మొన్నటి వరకు చిత్తూరులోనే దౌర్జన్యాలు, రౌడీ రాజకీయాలు, హత్యలు, హత్యాయత్నాలను చూశాం. చంద్రబాబు పుణ్యాన ఆ రౌడీ సంస్కృతి పుణ్యక్షేత్రాలకు నిలయమైన చంద్రగిరి నియోజకవర్గానికి సైతం అంటుకుంది. టీడీపీ అభ్యర్థిగా నానిని చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి దళితులు, ముస్లింలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రోజూ ఎక్కడో అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగానే నాని సైతం రౌడీయిజం పుట్టిన చిత్తూరు నుంచి వచ్చానని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి వచ్చిన ముగ్గురు యువకులు శనివారం రాత్రి తుమ్మలగుంట ఉప్పరపల్లి గ్రామంలో ఫ్లెక్సీలను చించుతూ గ్రామçస్తులపై దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడి: ఇప్పటి వరకు గ్రామ, మండల స్థాయిలో దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్న నాని అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే దాడి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం జరిగిన పసుపు– కుంకుమ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సహాయం పార్టీలకు, వ్యక్తులకు సంబంధం ఉండదన్నారు. ముఖ్యమంత్రి అందిచే చెక్కులయినా, రాబోయే రోజుల్లో జగనన్న ప్రకటించినట్లు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించిన నగదుకు అయినా ప్రజల సొమ్ములేనని ఆయన అన్నారు. దీనిపై నాని అనుచరులు రాద్ధాంతం చేశారు. పసుపు–కుంకుమ మా పార్టీ కార్యక్రమం అంటూ రచ్చ చేశారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. పోలీ సులు వారించినా వినకుండా వారు ఎమ్మెల్యే చెవిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యేకి రక్షణగా ఉన్న తిరుపతి వెస్ట్ డీఎస్పీ నాగేశ్వరరావుపై కారం పొడి చల్లారు. ఎంఆర్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లుపై స్వీట్ ప్యాకెట్లను విసిరారు. ఎమ్మెల్యే చుట్టూ్ట ఉన్న గ్రామ మహిళలపై రాళ్లు రువ్వారు. వెనుక నుంచిజరిగిన ఈ దాడిలో ఎమ్మెల్యేతో పాటు డీఎస్పీ, సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులతో నాని అనుచరులు వాగ్వివాదానికి దిగారు. మహిళలపై రాళ్ల దాడితో ఎమ్మెల్యే చలించిపోయారు. ‘నన్ను కొట్టాలనుకుంటే నన్నే కొట్టండి...మీరు ఏమి చేయదలచుకున్నారో అది చేయండి...మహిళల జోలికి మాత్రం వెళ్లొద్దని’ చెవిరెడ్డి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేదికపై ఎదురుగా నిలబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నాని అనుచరులను వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులకు, నాని అనుచరులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే నలిగిపోయారు. స్పృహతప్పి కిందపడ్డారు. దీంతో నాని అనుచరులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్యేను పోలీస్ వాహనంలోనే రుయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అధికారులు, సిబ్బందిపై కూడా కారం, రాళ్లు, స్వీట్ల ప్యాకెట్లతో దాడి జరగటంతో సభను వదిలి అర్ధంతరంగా వెళ్లిపోయారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది... తోపులాట మధ్య నలిగిపోవటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి శ్వాస తీసుకోవటంలో, బీపీ ఇబ్బంది వచ్చింది. ఊపిరి పీల్చుకోవటం కష్టం అయింది. రుయా సూపరిం టెండెంట్ సిద్దానాయక్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం మెరుగుపడుతుందని, బీపీ కొంత ఇబ్బంది ఉందని వైద్యులు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, యువనేత భూమన అభినయ్ ఆసుపత్రికి వచ్చి చెవిరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను తెలుసుకున్న నియోజకవర్గంలోని చెవిరెడ్డి అనుచరులు, అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుయా ఆసుపత్రికి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్సీపీ చొరవ
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో త్రాగు నీటికి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది. రాజ్యసభ సభ్యుడు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి 7 ట్యాంకర్లు కొనుగోలు చేశారు. రూ. 52 లక్షలతో 7 ట్యాంకర్లను కొనుగోలు చేసి నీటి సరఫరా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చంద్రగిరి వాసులకు 7వాటర్ ట్యాంకర్లు ఇస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. వేమి రెడ్డికి చంద్రగిరి వాసులు రుణపడి ఉంటారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డీ భాస్కర్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా ఎక్కడ నీటి సమస్య ఉంటే అక్కడ ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. -
వైఎస్సార్సీపీలో చేరారంటూ దాడి
ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. చంద్రగిరిలో అప్పుడే యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా వైఎస్సార్ సీపీలో చేరిన వారిపై దాడులకు తెగబడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా దళితులను, కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. చిత్తూరు, చంద్రగిరి: మండలంలోని మొరవపల్లికి చెందిన గోపీచౌదరి వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తన కార్యకర్తలతో కలిసి మూడు రోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోపీచౌదరి వైఎస్సార్సీపీలో చేరడంపై నాని అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్థానిక కొత్తపేటలోని దోస కార్నర్ వద్ద పని చేసుకుంటున్న గోపీచౌదరిపై దాడికి పాల్పడ్డారు. ‘నీకు ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీలో చేరుతావ్.. నువ్వు ఇక్కడ దోస కార్నర్ ఎలా నడుపుతావో చూస్తాం.. మొరవపల్లిలో నీ ఇంటిని నేలమట్టం చేస్తాం’ అంటూ బెదిరించారు. కర్రలతో దాడి చేశారు. నేలపై పడేసి కాళ్లతో తన్నారు. ఇంతలో అటుగా వెళుతున్న కొంతమంది కేకలు వేయడంలో వారు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు చేరుకుని బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు. నాని అనుచరులను అరెస్టు చేయాలంటూ నిరసన నియోజకవర్గంలో నాని అనుచరుల దౌర్జాన్యాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసు స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గోపీచౌదరిపై దాడికి పాల్ప డిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగేందుకు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ ఈశ్వరయ్య స్టేషన్‌కు చేరుకుని నాయకులతో చర్చించారు. చంద్రగిరిలో ఇప్పటి వరకు లేని సంస్కృతిని టీడీపీ నాయకులు తీసుకొస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రౌడీయిజాన్ని, దాడులకు పాల్పడే వారిని ఉపేక్షిం చేది లేదని తేల్చిచెప్పారు. గోపీ చౌదరిపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు నిరసన విరమించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఇన్నేళ్ల రాజకీయంలో చంద్రగిరిలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదన్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని ఖరారైనప్పటి నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిం చిన శాంతి మార్గంలోనే నడుస్తామన్నారు. టీడీపీ నాయకుల దాడితో ఇప్పటికే మండల వ్యాప్తంగా ప్రజలు ఆ పార్టీని అసహ్యంచుకుంటున్నారని తెలిపారు. బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీపై స్థానికుల ఆగ్రహం చిత్తూరుకు చెందిన నాని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుంచి చిత్తూరు రౌడీ యిజాన్ని ఇక్కడ చలాయిస్తు న్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడులు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిలో ఇలా దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు ఎన్నికల్లో మాత్రమే చేయాలని, తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెబుతున్నారు. -
మోహన్ బాబును పరామర్శించిన చెవిరెడ్డి
సాక్షి, చిత్తూరు : సినీ నటుడు మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ పెద్దకర్మ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిసిన అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటి చెబుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘మనిషికి జన్మనిచ్చింది భగవంతుడు అంటారు. కానీ మనకు ఊపిరి పోసింది అమ్మకదా! తొమ్మిది నెలలు నెత్తురు గుడ్డును కడుపులో మోసి, కదలికలోనే బిడ్డబాధను, ఆకలిని తెలుసుకుని, ఆర్తిని తీర్చి, పురిటినొప్పులను భరించి, తాను మళ్ళీ జన్మిస్తూ... మనకు జన్మనిచ్చి, పాలిచ్చి, లాలించి, జోలపాడి, గుండెలను పాన్పుచేసి, నిద్రపుచ్చి, తప్పటడుగులు సరిదిద్ది, నడకనేర్పి, నడతనేర్పి, అక్షరందిద్దించి, అక్షరజ్ఞ్యానం నేర్పించి, చెట్టంత ఎదిగిన బిడ్డను చిరునవ్వుతో దీవించే అమ్మను మించిన దైవంలేదు.’ అంటూ ట్వీట్ చేశారు. మనిషికి జన్మనిచ్చింది భగవంతుడు అంటారు. కానీ మనకు ఊపిరి పోసింది అమ్మకదా! తొమ్మిది నెలలు నెత్తురు గుడ్డును కడుపులో మోసి, కదలికలోనే బిడ్డబాధను, ఆకలిని తెలుసుకుని, ఆర్తిని తీర్చి, పురిటినొప్పులను భరించి, తాను మళ్ళీ జన్మిస్తూ... — Mohan Babu M (@themohanbabu) September 30, 2018 మనకు జన్మనిచ్చి, పాలిచ్చి, లాలించి, జోలపాడి, గుండెలను పాన్పుచేసి, నిద్రపుచ్చి, తప్పటడుగులు సరిదిద్ది, నడకనేర్పి, నడతనేర్పి, అక్షరందిద్దించి, అక్షరజ్ఞ్యానం నేర్పించి, చెట్టంత ఎదిగిన బిడ్డను చిరునవ్వుతో దీవించే అమ్మను మించిన దైవంలేదు. — Mohan Babu M (@themohanbabu) September 30, 2018 -
ఫలించిన చెవిరెడ్డి పోరాటం
తిరుపతి రూరల్/మంగళం: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటంతో మంగళం వాసుల ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. లబ్ధిదారులకు ఇవ్వకుండా రెవెన్యూ కా ర్యాలయాలకే పరిమితం అయిన ఇంటి పట్టాలు... ఎమ్మెల్యే దీక్షతో ఇంటికే వచ్చి లబ్ధిదారుల చేతుల్లో వాలాయి. పార్టీలకు అతీతంగా పోరాడి సాధించుకున్న ఇంటి పట్టాలను చేతపట్టుకుని తమ కోసం మెతుకు కూడా ముట్టకుండా రోజుల తరబడి పోరాడిన ఎమ్మెల్యే చెవిరెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకుని త మ అభిమానాన్ని చాటుకున్నారు. లబ్ధిదా రులు, మహిళలు ఎమ్మెల్యే చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేశారు. రాజకీయాలకు అతీతంగా చేసిన పోరా టం విజయవంతం అయిందని, వందలా ది మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెవిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 743 పట్టాలు పంపిణీ... మంగళం వాసులకు మంజూరైన 786 ఇంటి పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూఅధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం నిరాహారదీక్షకు దిగారు. లబ్ధిదా రుల ఇంటికి వచ్చి పట్టాలు ఇచ్చేంత వరకు తాను దీక్ష విరమించేది లేదని భీష్మించుకున్నారు. మంగళం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన దీక్షకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో అలజడి మొదలైంది. అర్బన్ తహసీల్దార్ చంద్రమోహన్, ఆర్ఐలు ప్రేమ్‌కుమార్, రామచంద్ర 14 మంది గ్రామ రెవెన్యూ అధికారులతో పట్టాల పంపిణీని ప్రారంభించారు. మూడు బృందాలుగా వారు మంగళవారం సాయంత్రానికి 743 పట్టాలను పంపిణీ చేశారు. మరో 43 మంది లబ్ధిదారులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, వారికి బుధవారం అందిస్తామని తహసీల్దార్ చంద్రమోహన్ తెలిపారు. ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ.... అందరినీ ఒకచోటకు పిలిపించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. కానీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెవెన్యూ అధికారులు 743 ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే లబ్ధిదారులకు పట్టాలను అందించారు. జీవితాంతం రుణపడి ఉంటాం... తమ ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని మంగళం వాసులు పేర్కొన్నారు. తమ ఇంటి పట్టాలను చేతపట్టుకుని వచ్చి ఆయనకు చూపి తమ ఆనందాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పోరాడి పరిష్కరించిన ఘనత చెవిరెడ్డికే దక్కిందని వారు కొనియాడారు. నిమ్మరసంతో దీక్ష విరమణ.. పట్టాలు తీసుకున్న అనంతరం మంగళం వాసులు పంచాయతీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ తమకోసం దీక్ష కొనసాగిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డికి పలువురు మహిళలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చెవిరెడ్డి సహకారంతోనే ఒక్క రూపాయి కూడా ఏ అధికారికీ, ఏ నాయకుడికీ చెల్లించకుండానే తమ జీవిత కల నెరవేరిందని పేర్కొన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలబడి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష కొనసాగించిన ఎమ్మెల్యే మేలు ఈ జన్మలో మరిచిపోలేమని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తికి బ్రహ్మరథం పట్టారు. ఈ సం దర్భంగా పట్టాలు అందుకున్న లబ్ధిదారులు, గ్రామస్తులు చెవిరెడ్డిని గజమాలలతో సత్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శెట్టిపల్లి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం ఎమ్మెల్యే చెవిరెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో తాను నిరాహార దీక్ష చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ దీక్షలో అన్ని వర్గాల వారు పాల్గొనడంతో ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కరం లభించిందన్నారు. ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటామన్నారు. మంగళంలో నీటి ఎద్దడిని అరికట్టేం దుకు తాత్కాలికంగా మూడు ట్యాంకరు ట్రాక్ట ర్లు ఇస్తానని హామీ ఇచ్చారు. -
పట్టాలు ఇచ్చేంత వరకు మంగళంను వదిలిరాను
తిరుపతి రూరల్: మంగళం గ్రామంలోని అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చేంతవరకు గ్రామంలోనే ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చేం తవరకు మంగళం గ్రామం వదిలిరానని స్పష్టం చేశారు. ఆ మేరకు సోమవారం నుంచి శెట్టిపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆది వారం సాయంత్రం ఆయన తుమ్మలగుంటలోవిలేకరులతో మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి కాపురాలు ఉంటున్నా ఇంటి పట్టాలు లేక పేదలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. పట్టాలు లేకపోవడం వల్ల ఆ స్థలాలకు లోన్లు రాక, ఏదైనా కష్టకాలంలో, అనారోగ్యం, పిల్లల పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల సందర్భంలో వాటిని అమ్ముకోలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా చేసిన పోరాటాల ఫలితంగా పట్టాలు ఇవ్వడంలో కొంత కదలిక వచ్చిందన్నారు. మంజూరైన పట్టాలు సైతం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. అధికారులు దిగివచ్చి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేంతవరకు స్థానిక ప్రజలతో కలిసి పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. నేడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన మంగళంలోని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రకటించారు. అందులోభాగంగా సోమవారం శెట్టిపల్లి పంచాయతీ కా>ర్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇంటిపట్టాలు చేరేంతవరకు పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. -
సంఘమిత్రల విలువ ప్రభుత్వానికి తెలిసి వచ్చింది
తిరుపతిరూరల్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంఘమిత్రలను ఆదుకునేందుకు తమ కుటుంబం చేసిన నగదు బదిలీ వల్ల వారి విలువ ప్రభుత్వానికి తెలిసి వచ్చిందని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా రాత్రి అనక పగలనక ప్రభుత్వం అప్పగించిన 16 రకాల పనులను ఎవరు చెప్పినా కాదనుకుండా ఆరోగ్యం పాడయ్యేలా సంఘమిత్రలు పనిచేస్తున్నారన్నా రు. వారికి ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందిన పాపాన పోలేదన్నా రు. మ్యాక్స్ చట్టం ప్రకారం వారికి ఎవరినుంచైనా విరాళం తీసుకునే హక్కు, అధికారం ఉందన్నారు. మాకష్టార్జితం నుంచి వారికి చట్టం ప్రకారమే 175 మంది సంఘమిత్రలకు కేవలం రూ.3.50లక్షలు మాత్రమే బదిలీ చేశామన్నారు. అందరితో చర్చించి వారి ఆమోదంతోనే వారి వ్యక్తిగత ఖాతాలకు ఈ నగదు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈనెల 4న బదిలీ చేశామని, వారికి తెలియకుండా బదిలీ అయివుంటే 5వ తేదీనే సంఘమిత్రలు తనను తప్పుపట్టి ఉండేవారని తెలిపారు. 16వ తేదీ వరకు వ్యతిరేకించకుండా ఉండేవారు కాదన్నారు. వాళ్లకు తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఒక సోదరుడిగా నాలుగేళ్లుగా వారికి పసుపు, కుంకుమ, నూతన బట్టలను పెడుతున్నట్టు గుర్తు చేశారు. అందులో భాగంగానే ఈ నగదు బదిలీ సాయం చేశానన్నారు. సాయంలో పోటీ ఉండాలి.. ఆర్థిక ఇబ్బందులతో కష్టాల్లో ఉన్న ఆడపడుచులకు సాయం అందించి వారి అభిమానాన్ని సంపాదించుకోవ డంలో పోటీ ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచించారు. తనకన్నా ఆర్థికంగా ధనవంతులైన వారు సంఘమిత్రలకు తనకన్నా ఎక్కువగా రూ.10వేలు సాయం అందించినట్లు అయితే తాను కూడా అభినందించేవాడినని పేర్కొన్నారు. నాయకుడు అనే వారికి పెద్ద మనసు, పెద్దరికం ఉండాలన్నారు. చిన్నపిల్లలకన్నా తక్కువ స్థాయిలో ఆలోచించడం, గోల చేయడం నాయకత్వ లక్షణాలు కావన్నారు. నా నిర్ణయంతో సంఘమిత్రలకు త్వరలో జీతాలు ఏళ్ల తరబడి సంఘమిత్రలను పనిచేసే కూలీలుగా చూశారే తప్ప మనుషులుగా ఏనాడు చూడలేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు తమ కుటుంబం చేసిన నగదు బదిలీతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. వారి వ్యక్తిగత ఖాతాల్లో జరిగిన నగదు బదిలీని వెనక్కి ఇవ్వాలని అధికార పార్టీ నాయకులను సంఘమిత్రలను ప్రాధేయపడడం, మేమే జీవో ఇస్తాం, జీతాలు ఇస్తామంటూ వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యలో కూడా పార్టీలకు అతీతంగా సంఘమిత్రలకు తనవంతు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానన్నారు. -
బాబు వల్లే స్టీల్ ప్లాంట్ ఆలస్యం
సాక్షి, తిరుపతి : చంద్రగిరిలో జరుగుతున్న వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని, కానీ నారా లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానిని ప్రత్యేక హోదా సంజీవని అని పునరుద్ఘాటించారు. హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశం లభిస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని వైవీ దయ్యబట్టారు. కమీషన్ల కోసమే పోలవరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఇందులో భాగంగానే చంద్రబాబుకు ముడువులు ముట్టాయని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కొసం పోరాడుతున్న పార్టీ, వైఎస్సార్సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే తెలుగుదేశం ఎంపీలు తమతో పాటు కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు. రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైవీ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని, కానీ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ప్లాంట్ ఏర్పాటులో పురోగతి లేదని మండిపడ్డారు. ఏ ఒక్కరోజైనా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు రాజీనామా చేసిన ఎంపీ స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయని అన్నారు. -
బంగారు భవిష్యత్తుకు వేదిక వైఎస్సార్ క్రికెట్ టోర్నీ
తిరుపతి రూరల్: క్రీడలతో పాటు వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో యువత బంగారు భవిష్యత్తుకు వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ వేదికగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలు, భారీ టోర్నమెంట్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు ఐకాన్‌గా మారారని కొనియాడారు. టోర్నమెంట్ వద్దే యువత నుంచి ఉపాధి కోసం బయోడేటాలు స్వీకరించడం హర్షణీయమన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం తుమ్మలగుంట లో నిర్వహిస్తున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ పదో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. మంగళవారం పోటీలకు విజయసాయిరెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ ఎల్బీ ప్రభాకర్‌నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో కలిసి బైక్ నడుపుతూ పది మైదానాల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్‌కు తనవంతుగా రూ.5 లక్షలను అం దిస్తానని తెలిపారు. యువతను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తాను మోడల్ జిల్లాగా ఎంచుకున్న వైజాగ్‌లో చెవిరెడ్డి సహకారంతో ఇలాంటి టోర్నమెంట్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు తాను వెన్నంటి ఉంటానని, చంద్రగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులతో ఆరు వాటర్ ట్యాంకర్లను అందిస్తానని ప్రకటించారు. యువ చైతన్యానికి ప్రతీక చెవిరెడ్డి నిత్యం ప్రజా సేవలో తరిస్తూ, యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి యువ చైతన్యానికి ప్రతీక అని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో రూ.25 లక్షల నిధులను మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 20 గంటలు శ్రమించే నాయకుడు చెవిరెడ్డి అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు నాయకుడికి గట్స్ కావా లన్నారు. ఎల్బీ ప్రభాకర్‌నాయుడు మాట్లాడు తూ చెవిరెడ్డికి యువత ఎంతగా అండగా ఉంటే అంత ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా జూలై 6న జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కోసం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
జూన్ 3 నుంచి వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నీ
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించేందుకు రాజకీయాలకు అతీతంగా జూన్ 3వ తేదీ నుంచి వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్–2018 నిర్వహించ నున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్ క్రీడా మైదానంలోని పది మైదానాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే వారు ఈ నెల 30వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తుమ్మలగుంటలోని వైఎస్సార్ క్రీడా మైదానంలో టోర్నమెంట్ ఏర్పాట్లపై శుక్రవారం క్రీడా ప్రముఖులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఏటా వేలాది మందితో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వారై, కనీసం 15 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొనేం దుకు అర్హులని, ఎటువంటి ప్రవేశ రుసుం ఉండదని తెలిపారు. ఏ పంచాయతీ క్రీడాకారులు ఆ పంచాయతీ తరుఫునే ఆడాల్సి ఉంటుందని, పాల్గొనే ప్రతి ఒక్కరూ చిరునామా, వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా తీసుకురావాల్సి ఉంటుందని, ఒక పంచాయతీకి సం బంధించి ఎన్ని జట్లు అయినా పాల్గొన వచ్చని పేర్కొన్నారు. హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ 16 రోజుల పాటు జరుగుతుందని, క్రీడాకారులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి మ్యాచ్‌కు బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్స్, ట్రోఫీలను బహుకరించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు, పేర్ల నమోదుకు 98490 98747, 91009 26485, 93936 20318 నంబర్లను సంప్రదిం చవచ్చని కోరారు. విజేతలకు భారీ బహుమతులు టోర్నమెంట్లో విజేతలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బహుమతులను ఇవ్వనున్నారు. విజేతకు రూ.2 లక్షల నగదుతో పాటు భారీ ట్రోíఫీ, రన్నర్స్‌కు రూ.లక్ష నగదు,ట్రోఫీ, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.25 వేలు, ట్రోఫీ బహూకరించనున్నారు. పాల్గొనే ప్రతి జట్టుకు బ్యాట్,బాల్, ప్రతి క్రీడాకారుడికి సర్టిఫికెట్, పార్టిసిపెంట్ మెడల్‌ను అందించనున్నట్టు టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి అవిలాల లోకనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ క్రీడా ప్రతిభను చాటాలని పేర్కొన్నారు. -
చరిత్రలో నిలిచేలా పాదయాత్ర
తిరుపతి రూరల్: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చంద్రగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత మరవలేనిదని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏడు రోజులు పాటు 43 కిలోమీటర్ల మేర చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచేలా సాగిందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేలా సాగిన జననేత జగనన్న పాదయాత్రను వేలాదిగా తరలివచ్చిన రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. తుమ్మలగుంటలోని స్వగృహంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు చిన్నియాదవ్‌తో కలిసి ఆయన∙విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అద్భుతంగా సాగిన జగనన్న పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు రోజులు పాటు అభిమాన నాయకుడు ఉండటం మరవలేనిదన్నారు. నియోజవర్గంలో 43 కిలో మీటర్ల మేర జగనన్న పాదయాత్ర సాగిందన్నారు. సైనికుల వంటి పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో 43 కిలోమీటర్లు పార్టీ తోరణాలతో పందిళ్లు వేయడం, జెండాలు కట్టడం, మైక్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 70 టన్నుల పూలతో జననేతకు నియోజకవర్గ ప్రజలు పూలబాట వేశారని గుర్తు చేశారు. దామలచెరువు, అనుప్పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చి అలుపెరగని ప్రజా పోరాటయోధుడు జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపిన తీరు ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. మధురానుభూతిగా....సంక్రాంతి సంబరాలు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఆత్మీయ నాయకుడు జగనన్న సతీమణి భారతమ్మ రావడం, జగనన్న సామాన్యుల మధ్య సంబరాలను చేసుకోవడం నియోజకవర్గంలోని అందరి హృదయాల్లో మధురానుభూతిగా నిలిచిందన్నారు. రికార్డు స్థాయిలో ఏడు రోజుల పాటు సాగిన ప్ర జా సంకల్పయాత్రను విజయవంతం చేయడంలో సహకరించిన నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, పాదయాత్రగా వచ్చిన వారికి వైద్యసేవలు అందించిన వైద్య బృందానికి, స్వచ్ఛందంగా 16 టీమ్‌ల ద్వారా సేవలు అం దించిన నాయకులకు భాస్కర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
బంగారు నాగపడగ సమర్పించిన విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి
-
పండుగ సంబరాల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్ వద్ద ఆయన సోమవారం ఉదయం పండుగ వేడుకల్లో ఉత్సాహం పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్ జగన్.. పంచె, కండువా ధరించారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సునీల్ కుమార్ రెడ్డి, నారాయణస్వామితో పాటు పార్టీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, పాదయాత్ర బృందం కూడా పాలుపంచుకున్నారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు వైఎస్ జగన్ ఇవాళ (సోమవారం) విరామం ఇచ్చారు. పారకాల్వ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాదయాత్ర శిబిరంలోనే ఉంటారు. -
చంద్రగిరిని పట్టించుకోడు.. సింగపూర్ కడతాడట!
సాక్షి, దామలచెరువు : జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రమంతటా మాఫియా ముఠాలను ఏర్పాటుచేసి ప్రజాధనాన్ని దోచుకుంటోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జన్మభూమి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, చంద్రగిరిని పట్టించుకోని ఆయనే.. ఇప్పుడు సింగపూర్ కడతానని ప్రజల్ని మభ్యపెడుతుండటం దారుణమన్నారు. 55వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏర్పాటుచేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్.. జనం సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. జన్మభూమికి ఏం చేశారాయన? : ‘‘సొంత ఊరిని మనందరం కన్నతల్లిలా భావిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లె, ఆయన చదువుకున్న శేషాపురం.. చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయి. బాబుగారు చదువుకున్న స్కూలు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. గతంలో 9ఏళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన.. చదువుకున్న బడినే పట్టించుకోలేదు.. ఇక రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంటుదో ఊహిచవచ్చు. 70 శాతం పల్లెలకు సాగునీరేకాదు.. తాగునీరు కూడా అందని పరిస్థితి. దామలచెరువు మార్కెట్ ద్వారా ఏటా రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతాయి కానీ మార్కెట్‌కు వెళ్లేందుకు సరైన రహదారి ఉండదు. చంద్రగిరిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం మహానేత వైఎస్సార్ ఇచ్చిన జీవోను చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు ఏ దేశానికి పోతే ఆ దేశంలా ఏపీని మార్చేస్తానని ప్రకటిస్తారు. ఇంకానయం.. చిత్తూరుకు సముద్రం తెస్తానని ప్రకటించలేదు!!’ అని వైఎస్ జగన్ అన్నారు. కన్నతల్లిలాంటి ఊరికి.. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు : ‘ ఇదే చంద్రబాబు 1979లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరఫున 2500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాతికాలంలో వైఎస్సార్ పుణ్యాన మంత్రి కూడా అయ్యారు. చంద్రగిరికి ఆయన చేసిన ఘనకార్యాలకు ప్రతిగా1983లో ప్రజలను ఆయనను 17,429 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో చేరారు. ఓడిపోయి చచ్చినపాములా ఉన్న బాబును ఎన్టీఆర్ ఆదరించి, పదవి ఇచ్చారు. కానీ బాబు.. చివరికి ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనాసరే వెన్నుపోటుపొడవటం చంద్రబాబు నైజం. కన్నతల్లిలాంటి ఊరిని, పిల్లనిచ్చిన మామను, సొంత తమ్ముడిని, ఓట్లు వేసిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది’’ అని జగన్ గుర్తుచేశారు. వ్యవస్థలో మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు : రైతులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, పిల్లలు.. వారువీరనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబు నాయుడు.. అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేశారని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘రుణమాఫీ చేస్తామని రైతులను, పొదుపు సంఘాల మహిళలను వంచన చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ డబ్బు చెల్లించకపోవడంతో ఆ భారం జనం మోయాల్సివస్తోంది. ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని యువతను మోసం చేశారు. రాష్ట్రంలో మట్టితవ్వకాలు మొదలు ఇసుక, కరెంటు కొనుగోళ్లు, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములు.. అన్ని చోట్లా అవినీతి రాజ్యమేలుతోంది. ఈ దుర్మార్గ వ్యవస్థ మారాలి. మాట తప్పిన నాయకుడు రాజీనామాచేసే పరిస్థితి రావాలి. మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు తన కార్యకర్తలకు చెబుతున్నారు. మున్ముందు రాష్ట్రాన్ని నడిపించాల్సిన నాయకుడు ఎలాంటివాడైతే బాగుంటుందో మీరే ఆలోచించండి. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు ముఖ్యమంత్రి కాకూడదు. ప్రజల కోసం పనిచేసేవారికే పట్టం కట్టండి..’’ అని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయింది
-
‘కూలిపోవడానికి సిద్ధంగా చంద్రబాబు స్కూలు’
సాక్షి, దామలచెరువు: రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పవిత్ర దేవాలయాల్లో క్షుద్రపూజలు చేస్తున్నారు, గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు చదువుకున్న స్కూలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను అన్ని రకాలుగా చంద్రబాబు వంచించారని అన్నారు. మళ్లీ రాజన్న పాలన రావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు వినడానికి రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన జగన్‌కు జనహారతి పలికారని, రాజన్న తనయుడిపై జనంకున్న అభిమానం, మక్కువ, ఆప్యాయతలకు ఇదే నిదర్శనమన్నారు. రాజన్న పాలన వచ్చే వరకు జగన్ వెంటే నడుస్తామని చెవిరెడ్డి అన్నారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డిపై కేసు కొట్టివేత
సాక్షి, తిరుపతి: సీఎం చంద్రబాబు నాయుడు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు తొలగించారన్న అభియోగం కింద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సాయికుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. కేసులోని వివరాల మేరకు 2014 జనవరి 13న సంక్రాంతి పండుగకు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్నారన్న సందర్భంగా రెండు రోజులు ముందుగా చంద్రగిరి టీడీపీ నాయకుడు కె.ఇందుశేఖర్ మహిళా వర్సిటీ క్రాస్ నుంచి తుమ్మలగుంట రోడ్డు చాముండేశ్వరి దేవాలయం వరకు 99 ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. వాటిని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి టీడీపీపై కోపంతో తొలగించారని ఆయన ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి డీఎస్పీ వెంకటరామానుజులు, ఎస్ఐ ఆదినారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేసి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా భావించి ప్రాసిక్యూషన్ సరైన సాక్షాధారాలతో నిరూపించకపోవడంతో ఎమ్మెల్యేపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
జగన్ పాదయాత్ర విజయవంతం చేద్దాం
పాకాల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం దామలచెరువు రెడ్డెప్పరెడ్డి కల్యాణమండపంలో ఎమ్మెల్యే అ««ధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే జగన్మోహన్రెడ్డికే సాధ్యమని తెలిపారు. పార్టీలోని సభ్యులంతా కుటుంబసభ్యులుగా మెలగాలని, అప్పుడు పార్టీ అభివృద్ధికి కృషిచేసిన వారవుతారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే: మండలంలోని పదిపుట్లబైలు, పేరసానిపల్లి మార్గాల్లో జరిగే జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రదేశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. దామలచెరువులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జ్యోతిప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవ్‌నాయుడు, తుడా మాజీ చైర్మన్ ఎల్బీ ప్రభాకర్‌నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి నంగా బాబురెడ్డి, చిటిపిరాళ్ల చెన్నకేశవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, గుండ్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.