స్వామి సేవకు చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy TTD EO From Today | Sakshi
Sakshi News home page

స్వామి సేవకు చెవిరెడ్డి

Published Sat, Sep 21 2019 10:52 AM | Last Updated on Sat, Sep 21 2019 10:52 AM

Chevireddy Bhaskar Reddy TTD EO From Today - Sakshi

కాలినడకన తిరుమలకు బయలుదేరిన చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌/తిరుమల:కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామికి సేవ చేసే అవకాశం ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌  డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి లభించింది. శ్రీవారికిఅపరభక్తుడైన ఆయనను తుడా చైర్మన్‌ హోదాలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌–అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ను ప్రచురించడమే కాకుండా జీఓ సైతం విడుదల చేసింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన ఆయన గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో తుడా చైర్మన్‌ హోదాలో మూడేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తన రాజకీయ గురువు భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి టీటీడీలో విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామ్యులయ్యారు. టీటీడీ కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ నియమించిన పలు అంతర్గత కమిటీల్లో సభ్యుడుగా ఉన్న ఆయన స్వామి నిధులు వృథా కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. తుమ్మలగుంట శ్రీశక్తి చాముండే«శ్వరి దేవి ఆలయం నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌ వరకు రోడ్డును వెడల్పు చేయించడమే కాకుండా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర చెవిరెడ్డిదే. తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోసారి స్వామివారికి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

నేడు ప్రమాణస్వీకారం
టీటీడీ పాలకమండలి సభ్యుడుగా> నియమితులైన డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం 7 – 8 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమేరకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నడకదారిలో స్వామివారి చెంతకు బయలుదేరారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి స్వామి వారికి మొక్కును చెల్లించుకున్నారు.  అపరభక్తుడైన ఆయనను తుడా చైర్మన్‌ హోదాలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్‌–అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌ను ప్రచురించడమే కాకుండా జీఓ సైతం విడుదల చేసింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచిన ఆయన గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాం లో తుడా చైర్మన్‌ హోదాలో మూడేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తన రాజకీయ గురువు భూమన కరుణాకరరెడ్డితో కలిసి టీటీడీలో విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామ్యులయ్యారు. టీటీడీ కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ నియమించిన పలు అంతర్గత కమిటీల్లో సభ్యుడిగా ఉన్న ఆయన స్వామి నిధులు వృథా కాకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. తుమ్మలగుంట శ్రీశక్తి చాముండేశ్వరి దేవి ఆలయం నుంచి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌ వరకు రోడ్డును వెడల్పు చేయించడమే కాకుండా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర చెవిరెడ్డిదే. తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోసారి స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నేడు ప్రమాణస్వీకారం:టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులైన డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం ఉదయం 7–8 గంటల మధ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నడకదారిలో స్వామివారి చెంతకు బయలుదేరారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement