TTD: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల | TTD Released Srivani Trust Funds For Temple Incense Offerings | Sakshi
Sakshi News home page

TTD: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల

Published Fri, Aug 25 2023 10:00 AM | Last Updated on Fri, Aug 25 2023 10:03 AM

TTD Released Srivani Trust Funds For Temple Incense Offerings - Sakshi

సాక్షి, తిరుపతి: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ. 5వేలు కేటాయించింది. ఆగస్టు నెల కోసం మొత్తం రూ.25.05 లక్షలు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెల నిధులు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. 

కాగా నేడు ఉదయం 10 గం.కు వసతిగదుల కోటా విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌లో తిరుమల, తిరుపతిలో ఉన్న వసతిగదులను కోటా విడుదల చేయనుంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్‌లు  లేకుండా సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా..  - నిన్న శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement