Srivani Trust
-
టీటీడీ కొత్త చైర్మన్ తొలి నిర్ణయం.. శ్రీవాణి ట్రస్ట్ రద్దు
-
శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా.. బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి: టీటీడీ పాలకమండలి నియామకంలో గందరగోళం నెలకొంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు, కొందరు సభ్యులపై విమర్శల నేపథ్యంలో పాలక మండలి జీవో జారీపై ప్రతిష్టంభన ఏర్పడింది. మిడ్ నైట్ మసాలా షో నడిపిన వాళ్లకి టీటీడీ బాధ్యతలా..? అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కొందరు ఇతర రాష్ట్రాల సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండి చెయ్యి ఇవ్వగా, ఏపీ నుంచి ఒక్క బ్రాహ్మణ వ్యక్తికి కూడా టీటీడీలో చోటు దక్కలేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని గాలికి వదిలేశారు. టీడీపీ మేనిఫెస్టోలో టీటీడీ పాలకమండలిలో ఒక బ్రాహ్మణ వ్యక్తికి సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మోసంపై బ్రాహ్మణ వర్గాలు మండిపడుతున్నాయి. మరో వైపు, పార్టీ సీనియర్లను కాదని, ఎన్నికల ముందు వచ్చినవాళ్లకి పదవులు ఇవ్వడంపై కొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో టీటీడీ చైర్మన్‌గా జీవో రాక ముందే బీఆర్ నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు వెయ్యికి పైగా నూతన ఆలయాల నిర్మాణం టీటీడీ చేపట్టింది. బీఆర్ నాయుడు వాఖ్యలపై హిందూత్వ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. టీటీడీపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని భక్తులు కోరుతున్నారు. అన్యమత ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.అయితే, ఎల్లో మీడియా సిండికేట్‌లో భాగమైన టీవీ–5 అధినేత బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే, బీఆర్ నాయుడు కనుసన్నల్లోనే ఆయన కుమారుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు.ఆయన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న హౌసింగ్ సొసైటీలో అవకతవకలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అక్రమాలు.. డ్రగ్స్ వినియోగదారులతో చెట్టాపట్టాలు.. హౌసింగ్, ‘రియల్’ వ్యాపారంపై తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి బీఆర్ నాయుడు నియామకంపై ఎన్నికల కంటే చాలా ముందే టీడీపీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కావాలనే బురదజల్లే కార్యక్రమాలు ప్రసారం చేశారని సమాచారం.ఇదీ చదవండి: బాబు హామీ గాలికి.. టీటీడీ పాలక మండలిలో బ్రాహ్మణులకు మొండిచేయి -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం
తిరుమల: పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టు ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 నూతన ఆలయాలు నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2019లో ట్రస్ట్ విధివిధానాలు ఖరారు: నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించింది. 2018 ఆగస్టు 18వ తేదీనే ట్రస్ట్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించినా విధివిధానాలు మాత్రం 2019 సెపె్టంబర్ 23వ తేదీ ఖరారు చేశారు. అప్పటి వరకు కూడా టీటీడీ ట్రస్ట్‌లకు సంబంధించి లక్ష రూపాయలపైగా ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి రూ.10 వేలను శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనంతో ఆదరణ: వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన రావడానికి ప్రధాన కారణం విధివిధానాలే. అప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులు సిఫార్సు లేఖలు ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్ట్‌కు రూ.10 వేలు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం పొందే సౌలభ్యం టీటీడీ కల్పించింది. భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2,700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడం విశేషం. అంత మందికి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వాటిని రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా, ఆఫ్‌లైన్ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తున్నారు. మరో 100 టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలోనే తిరుపతి విమానాశ్రయంలో కేటాయిస్తున్నారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు అందే విరాళాలు రూ.30 కోట్లకు పరిమితమవుతుంది. నాలుగేళ్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ. వెయ్యి కోట్లకు చేరుకున్నాయి. ♦ 2019లో రెండు నెలల కాలంలోనే 19,737 మంది భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.26.25 కోట్లు విరాళం లభించింది. ♦ 2020లో 49,282 మంది భక్తులు రూ.70.21 కోట్లను విరాళంగా అందించారు. ♦ 2021లో లక్షా 31వేల మంది భక్తులు రూ.176 కోట్లు విరాళంగా అందించారు. ♦ 2022లో అయితే ఏకంగా 2 లక్షల 70 వేల మంది భక్తులు రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు. ♦2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు. -
TTD: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల
సాక్షి, తిరుపతి: ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ. 5వేలు కేటాయించింది. ఆగస్టు నెల కోసం మొత్తం రూ.25.05 లక్షలు విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెల నిధులు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా నేడు ఉదయం 10 గం.కు వసతిగదుల కోటా విడుదల చేయనుంది. ఆన్లైన్లో తిరుమల, తిరుపతిలో ఉన్న వసతిగదులను కోటా విడుదల చేయనుంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. - నిన్న శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకున్నారు. -
శ్రీవాణి ట్రస్ట్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారు: మంత్రి అంబటి
సాక్షి, తిరుమల: మంత్రి అంబటి రాంబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి.. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, శ్రీవాణి ట్రస్ట్‌పై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా టీటీడీపై విమర్శలు చేస్తున్నారు. గొప్ప ఆశయంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. నూతన ఆలయాల నిర్మాణ, శిథిలావస్థలో ఉన్న ఆలయాల ఆధునీకరణ, ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టడం వల్ల దళారీ వ్యవస్థ తగ్గింది. ట్రస్ట్‌పై విమర్శలు చేస్తున్న వారికి ఇకనైనా బుద్ధి రావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో రామోజీరావుకు షాక్ -
పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామని, ట్రస్ట్‌కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. చదవండి: సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు -
చంద్రబాబు, పవన్‌లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్‌కల్యాణ్ అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీల్లో న్యాయవాది సత్య సభర్వాల్‌తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగు తోందనడం అబద్ధం. ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. కాగ్ ద్వారా ఆడిట్‌కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. చదవండి: మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ వారి ఆరోపణలు అసత్యమని రుజువుచేస్తా వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు రశీదులిచ్చి శ్రీవాణి ట్రస్టు ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నా రని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీవాణి ట్రస్టును సందర్శించి వారి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వ్యాఖ్యలు మతప్రాతిపదికన శతృత్వం సృష్టించేలా ఉన్నాయి. ఉద్దేశ/దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యా లు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరువు నష్టం దావా కేసు పురోగతిలో ఉంది. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల
-
శ్రీ వాణి ట్రస్టు ద్వారా రూ. 861 కోట్ల నిధులు.. శ్వేతపత్రం విడుదల
సాక్షి, తిరుమల: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు (శ్రీవాణి ట్రస్ట్) భక్తులు అందించిన విరాళాలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈవో ధర్మారెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు తీర్మానం నం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల, భజనమందిరాలు నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైయిందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 23న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000/- విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. అప్పటినుండి ట్రస్టు వాస్తవ కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికిగాను టీటీడీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయని... ఈ ఏడాది మే 31వ తేదీ వరకు, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో భక్తులు శ్రీవారికి రూ. 861 కోట్లకు పైగా విరాళాలు అందించారని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ. 93 కోట్లు మంజూరు చేశామని, వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు. వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవ ఫౌండేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. చదవండి: చిరుత దాడి.. చిన్నారి కౌశిక్‌ను పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిధులను పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంపై కొందరు పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్ మొత్తం వివరాలు చూపానన్నారు. ఈ వివరాలపై విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసే ముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.