
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్‌కల్యాణ్ అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీల్లో న్యాయవాది సత్య సభర్వాల్‌తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగు తోందనడం అబద్ధం. ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. కాగ్ ద్వారా ఆడిట్‌కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది.
చదవండి: మహిళా కమిషన్‌ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ
వారి ఆరోపణలు అసత్యమని రుజువుచేస్తా
వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు రశీదులిచ్చి శ్రీవాణి ట్రస్టు ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నా రని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీవాణి ట్రస్టును సందర్శించి వారి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వ్యాఖ్యలు మతప్రాతిపదికన శతృత్వం సృష్టించేలా ఉన్నాయి. ఉద్దేశ/దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యా లు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరువు నష్టం దావా కేసు పురోగతిలో ఉంది.
చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం