ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్‌పై తయారు చేసిన సీఎం వైఎస్ జగన్ ముఖచిత్రం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్‌పై సీఎం వైఎస్ జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ ఇదే కావడం గమనార్హం.
ఈ ముఖచిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశారు. ఇందుకోసం గత పది రోజుల నుంచి గోశాల వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి దగ్గరుండి పనులు చేయించారు. డ్రోన్‌పై నుంచి చూస్తే సీఎం జగన్ ముఖచిత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సీఎంపై ‘అధిపతి’ టైటిల్‌తో చెవిరెడ్డి భాస్కరరెడ్డి రూపొందింపజేసిన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ పాటను ఎం.కృష్ణవేణి రాశారు. ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య పాడగా.. కార్తీక్ సంగీతమందించారు.
పాట సీడీని విడుదల చేస్తున్న సజ్జల, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి తదితరులు
పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా..
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దార్శనికత ఉంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో సీఎం జగన్ చేసి చూపించారని కొనియాడారు. పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా ఆయన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. జనహృదయ నాయకుడికి తామంతా శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. సీఎం జగన్ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ చిత్రాన్ని ఏర్పాటు చేయించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అభినందించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పోరాటానికి ప్రతీకగా.. చెప్పిన మాట కోసం, నమ్మిన ప్రజల కోసం పనిచేస్తున్న ఆదర్శ నేత సీఎం జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment