మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి | Chevireddy mohit Reddy Received his Masters Degree from University of Warwick | Sakshi
Sakshi News home page

లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Published Wed, Jul 27 2022 10:14 PM | Last Updated on Wed, Jul 27 2022 10:45 PM

Chevireddy mohit Reddy Received his Masters Degree from University of Warwick - Sakshi

తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్‌కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు.

వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement