Warwick University
-
మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం. -
పీడకలలేగా అని తీసిపారేయొద్దు!
లండన్: పీడ కలలతో చిన్నారులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తున్నారా? ఏం కాదులే..! అంటూ తీసిపారేయకండి. అలాంటి కలలే వారిలో మానసిక సమస్యలకు దారితీస్తాయని వార్విక్వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకు పీడ కలలు వస్తుంటే వారు కౌమారంలో మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు. రాత్రివేళ భయపడే చిన్నారులు కూడా కౌమారంలో రెండు రెట్లు అధికంగా భ్రమలు, ఆలోచనలకు విఘాతం వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘పీడకలలు నిద్రలో రెండో భాగంలో వస్తాయి. అప్పుడు భయంతో నడచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే, నిద్రించగానే తొలి భాగం(గాఢ నిద్ర)లో ఉన్నప్పుడు భయంతో కేకలు పెట్టి లేచి కూర్చుంటారని వివరించారు.