Masters degree
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం: 105 ఏళ్ల బామ్మ మాస్టర్స్ డిగ్రీ
మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయడం సామాన్య విషయం కాదు. అందుకు చాలా పట్టుదల కావాలి. పెళ్లి పిల్లలు తరువాత, పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ, లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే.. ఇపుడేం చదువులే.. అని పెదవి విరుస్తారు చాలామంది. కానీ 105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చాలామందికి డిగ్రీ పట్టా పుచుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GSE) మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో అందుకుంది. వర్జీనియా "జింజర్" హిస్లాప్ తాజాగా ఈ డిగ్రీని అందుకుంది. దీని కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమో భావోద్వేగానికి లోనైంది.1940లలో స్టాన్‌ఫోర్డ్‌లో అవసరమైన తరగతులను పూర్తి చేసింది వర్జీనియా . మాస్టర్స్ థీసిస్‌లో ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపుఆమె ప్రియుడితో పెళ్లి. భర్త జార్జ్ హిస్లోప్ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లి పోయాడు. దీంతో అమెరికాలోని అనేకమంది ఇతర మహిళల్లాగానే వర్జీనియా కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అతనికి సాయం చేస్తూ, కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. తాజాగా ఇద్దరు పిల్లలు, నలుగురు మనుమలు , తొమ్మిది మంది మనవరాళ్లతో కూడిన తన కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అటు వర్జీనియా వాషింగ్టన్ స్టేట్‌లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేశారు. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీయలేదు. పట్టుదలతో సాధించింది. ఈ ఏడాది జూన్ 16, ఆదివారం తన కల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ని దక్కించుకుంది. మనుమలు, మనువరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కాలేజీ డీన్ డేనియల్ స్క్వార్ట్జ్ ఆమెకు డిప్లొమాను అందజేస్తోంటే సంతోషంగా ఉప్పొంగిపోయింది. -
బెంగాల్లో స్కీములన్నీ స్కాములే
కృష్ణనగర్: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమత సర్కారు మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. నాడియా జిల్లాలోని కృష్ణనగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రంసంగించారు. బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆరి్ధకాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సాగించిన అకృత్యాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధిత మహిళలను గోడు వినిపించుకోవడం లేదని, నిందితులను అరెస్టు చేయకుండా కాపాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో ఆశలతో నమ్మి అధికారం అప్పగిస్తే ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ‘మా, మాటీ, మను‹Ù’ అంటూ నినాదాలు చేసే తృణమూల్ కాంగ్రెస్ మన అక్కచెల్లెమ్మలకు రక్షణ కలి్పంచడం లేదని మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో నేరగాళ్లే నిర్ణయిస్తున్నారని, పోలీసులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి, బంధుప్రీతి తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్(నువ్వు, నేను, అవినీతి) దుయ్యబట్టారు. బిహార్‌లో అరాచక పాలన మళ్లీ రానివ్వం ఔరంగాబాద్: ప్రధాని మోదీ శనివారం బిహార్‌లో పర్యటించారు. రూ.34,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారని, రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఇక ఎప్పటికీ ఎన్డీయేలోనే ఉంటా: నితీశ్ కుమార్ తన ప్రయాణం ఇకపై ఎప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే అని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని అన్నారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడానికి తమ రాష్టానికి వచి్చన ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కొంతకాలం ఎన్డీయేకు దూరమయ్యానని, మళ్లీ తిరిగివచ్చానని, ఇకపై ఇదే కూటమిలో కొనసాగుతానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నితీశ్‌ను చూస్తూ ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించడం విశేషం. -
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
Varatha Shanmuganathan: వరతమ్మా నీకు వందనాలమ్మా!
‘ఈ వయసులో చదువు ఏమిటి!’ అనుకునేవాళ్లు ఒక్కసారి వరత షణ్ముగనాథన్ గురించి చదివితే– ‘అవును. నాకు కూడా చదువుకోవాలని ఉంది’ అని బలంగా అనుకుంటారు. చదువుకు ఉన్న బలం అదే! కెనడాలోని ‘యార్క్ యూనివర్శిటీ’ నుంచి 87 సంవత్సరాల వయసులో మాస్టర్స్ డిగ్రీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది వరత షణ్ముగనాథన్. విద్యారంగంలో ఆమె స్ఫూర్తిదాయకమైన కృషిని గుర్తించి గౌరవించింది ఆంటేరియో లెజిస్లేచర్ అసెంబ్లీ. షణ్ముగనాథన్ హాలులోకి అడుగు పెడుతున్న సమయంలో సభ్యులు లేని నిల్చొని జయజయధ్వానాలు చేశారు. ‘ఈ తరానికి ఎన్నో రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే మహిళ’ అంటూ షణ్ముగనాథన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అసెంబ్లీ సభ్యులు. షణ్ముగనాథన్ కెనడాకు వెళ్లిన సమయంలో సీనియర్స్‌కు ‘యార్క్ యూనివర్శిటీ’లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించింది. అలా మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగం అయింది. కూతురు ఎంతోప్రో త్సాహకంగా నిలిచింది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’లో డిగ్రీ చేసిన షణ్ముగనాథన్ ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసేనాటికి ఆమె వయసు యాభై సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వరత షణ్ముగనాథన్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చి వైరల్‌గా మారింది. షణ్ముగనాథన్‌ను ప్రశంసిస్తూ అన్ని వయసులవారి నుంచి కామెంట్స్ వచ్చాయి. మచ్చుకు కొన్ని.... ‘కాస్త వయసు పైబడగానే ఈ వయసులో ఏం నేర్చుకుంటాం అనే నిర్లిప్తత చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే విజయం ఇది’ ‘నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. ఏదైనా చేయాలి...అని ఆలోచించేవాడిని. అంతలోనే ఈ వయసులో ఏం చేస్తాములే అని వెనక్కి వెళ్లేవాడిని. వరతమ్మ వీడియో చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆమెలాగే నేను కూడా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను’ చదువు ఎప్పుడూ మనల్ని చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి బలహీనం కాకుండా చూస్తుంది. చదువుకు వయసుతో సంబంధం లేదు. -
మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్‌కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం. -
ఫైర్ బ్రాండ్ మరో మమత
మమతా బెనర్జీతో ఏ అమ్మాయినీ పోల్చలేం. 15 ఏళ్ల వయసుకే మమత రాజకీయాలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే విజేతగా నిలిచారు! మమత లోపల ఉన్న ఫైర్‌తో మాత్రం ప్రతి అమ్మాయినీ రిలేట్ చెయ్యొచ్చు. ఇంటి దగ్గర మనం రోజూ చూసే అమ్మాయిని, జేఎన్‌యు స్టూడెంట్ లీడర్ ఐషీ ఘోష్‌ని కూడా! 26 ఏళ్ల ఐషీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది! మే 2 న వెలువడే ఎన్నిక ఫలితాలలో జమూరియా నియోజకవర్గం నుంచి సి.పి.ఐ (ఎం) అభ్యర్థి ఐషీ గెలిచినట్లు వార్త వస్తే కనుక భవిష్యత్తులో ఏనాటికైనా ఒకరోజు దేశ ప్రజలు.. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఐషీ ఘోష్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు’’ అనే వార్తనూ వినబోతారు! మరీ టూ మచ్ అనిపిస్తే కనుక.. ఆ నిప్పును కొంచెం తాకి చూస్తే ఐషీ హౌమచ్చో తెలుస్తుంది. జేఎన్యులో ప్రస్తుతం పొలిటికల్ ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఐషీలోని ’చప్పున అంటుకునే’ గుణం గల చైతన్యశీలతే ఆమెను రాజకీయాల్లోకి రప్పిస్తోంది! 3ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నెలాఖరుకు గానీ నోటిఫికేషన్ విడుదల కాని ఏడో విడత ఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు, ఢిల్లీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు కారణం ఏడో విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగే జమూరియా నియోజకవర్గం నుంచి జేఎన్‌యు విద్యార్థి సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పోటీకి నిలబడటం! ఆమె సీపీఐ (ఎం) తరఫున పోటీ చేయబోతున్నప్పటికీ, ఏ పార్టీ నుంచి అని కాకుండా, అసలు ఆమె పోటీకి దిగడమే విశేషం అయింది. ‘‘నా మదిలో, నా హృదయంలో జేఎన్ యు ఉంది. పశ్చిమ బెంగాల్ బొగ్గు గనుల కార్మిక ఉద్యమ అనుభవం నన్ను రాజకీయాల్లోకి ప్రేరేపిస్తోంది’’ అంటున్నారు ఘోష్, తన ‘కొత్త’ రాజకీయ రంగ ప్రవేశం గురించి. ఇప్పటికే ఆమె విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. గత ఏడాది జనవరి 5 న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీలోని పెరియార్ హాస్టల్లో ఆమెపై ప్రత్యర్థుల దాడి జరగడానికి కూడా ఆ చైతన్యశీలతే కారణం. దాడి అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ వెళ్లి ఆమెను అభినందించారు. ఆశీస్సులు అందించారు. ఆయనకన్నా ముందు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ వెళ్లి ‘వందనం.. అభివందనం’ అన్నారు! ఐషీ ఘోష్ ప్రస్తుతం ఎంఫిల్ రెండో సంవత్సరం చదువుతున్నారు. జేఎన్‌యు లో చదువుతూ ఒక విద్యార్థి అసెంబ్లీకి పోటీ చేయడం యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమం. వర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో ఆమె తన మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ∙∙ జేఎన్యులో తాము ఎందుకోసం అయితే పోరాడుతున్నామో, అదే ఉద్యమ పోరును తాను దేశ రాజకీయాల్లో కొనసాగించబోతున్నానని ఐషీ అనడంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పార్టీల దృష్టీ ఆమెపై మళ్లేలా చేసింది. మెరుగైన విద్య, ఉపాధి, మంచి జీవన ప్రమాణాలు ఆమె తొలి ప్రాధాన్యాలు. జమూరియా బరిలో దిగేందుకు ఇప్పటికే ఆమె తన హాస్టల్ గదిలోని సామగ్రి ని సర్దుకుని ఉన్నారు. జమూరియాకు గంటన్నర దూరంలోనే ఆమె స్వస్థలం దుర్గాపూర్. అది వేరొక నియోజకవర్గ పరిధి లో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు దుర్గాపూర్‌లోనే ఉంటున్నారు. తండ్రి దేబశిష్ ఘోష్ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ఉద్యోగి. కార్మిక నాయకుడు. తల్లి శర్మిష్ఠ ఘోష్ గృహిణి. ఇంట్లో ఐషీనే పెద్ద. చెల్లెలు ఇషిక కూడా ఢిల్లీలోనే అక్కడి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. ఐషీ ఘోష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల ఇంట్లో అందరూ సుముఖంగా ఉన్నారు. తండ్రయితే సంతోషంగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాలకు జమూరియా పేరుమోసిన ప్రాంతం. తన కూతురు గెలిస్తే అక్రమాలు తగ్గుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఐషీ వాటిని ఎలాగూ తగ్గిస్తారు. అయితే ఆమె ప్రధాన అజెండా వేరే ఉంది. ‘‘ఉన్నత విద్యల కోసం, పెద్ద జీతాల కోసం, మంచి జీవితం కోసం యువత పరాయి ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పశ్చిమ బెంగాల్ వృద్ధాశ్రమంలా మిగిలిపోతోంది. వాళ్లను ఆపడం కోసం ఉపాధి కల్పనపై మొదట నా పని ప్రారంభిస్తాను’’ అంటున్నారు ఐషీ. ఘోష్ దుర్గాపూర్‌లోనే ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. దుర్గాపూర్‌లో ఉండగా తండ్రితో పాటు స్థానిక బొగ్గు గనుల కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. ఇరవై ఏళ్ల వయసులో విద్యార్థిగా ఢిల్లీ వచ్చేశారు. ఎన్నికల అభ్యర్థిగా ఇప్పుడు మళ్లీ బెంగాల్ వెళుతున్నారు. ‘‘ఒకవేళ మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా జమూరియాను, ఎంఫిల్ విద్యార్థిగా జేఎన్‌యును ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు?’’ అనే ప్రశ్న ఇప్పటికే మొదలైంది. ‘‘బ్యాలెన్స్ చేసుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసం తో చెబుతున్నారు ఐషీ ఘోష్. ఆ ఆత్మ విశ్వాసం ఆమెలో ఫైర్ బ్రాండ్ మమతను ప్రతిఫలింపజేస్తోంది. గత ఏడాది ప్రత్యర్థుల దాడిలో గాయపడి, కోలుకుంటున్న సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఐషీఘోష్. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
మమ్మీ నా బుక్సేవీ!
చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. మాధవ్ శింగరాజు కాబోయే భర్తతో కన్నా, చేయబోయే డిగ్రీతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడపిల్లలు. భర్తొస్తే భార్య హోదా వస్తుందని, భార్య హోదా గుర్తింపు తెస్తుందని వాళ్లకేం ఉండదు. చదువు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చని, కెరీర్‌ని చక్కగా తమకు ఇష్టమైనట్లు మలుచుకోవచ్చని ఉంటుంది. ఒకవేళ డిగ్రీ కంటే భర్తగారే ముందొచ్చినా, ఆ భర్తగారిని కూడా కెరీర్లో ఒక భాగంగానే చూస్తారు.. కెరీర్‌కి అడ్డంకి గానో, కెరీర్‌కి సపోర్ట్గానో. మంచి భర్త దొరకాలని ఈ జనరేషన్లో ఆడపిల్లలెవరూ ఆలయాలకు వెళ్లి రావడం లేదు. వచ్చేవాడు ఎలాంటి వాడో దేవుడికే తెలియనప్పుడు గుడికెళ్లి ప్రదక్షిణలు చేసే బదులు కెమిస్ట్రీలో, మేథ్స్‌లో ఏం ప్రశ్నలు వస్తాయో ఇంట్లో కూర్చుని గెస్ పేపర్ తయారు చేసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. ఊహించిన ప్రశ్నలే రాకున్నా, పూర్తిగా ఊహకు అందనివైతే రావు. భర్తగా ఎలాంటి వాడు వస్తాడో దేవుడే గెస్ చెయ్యలేనప్పుడు టెన్తో, ఇంటరో అయిన పిల్లేం గెస్ చేస్తుంది. చదువులో ఎంత ‘టెన్ బై టెన్’ గ్రేడ్ తెచ్చుకుంటే మాత్రం?! అక్క భర్తను అంతా దేవుడు అంటున్నా, ఆ భర్తలో ఎంత శాతం దేవుడున్నాడో అక్క చెప్పకపోయినా, తనకు తెలియందా! పెళ్లయి ఏళ్లవుతున్నా అక్క చెప్పులు గుమ్మం లోపలే అరగని ఆభరణాల్లా ఉండిపోయాయంటే అక్క ఆశలన్నిటినీ ఎటూ కదలనివ్వకుండా దేవుడులాంటి ఆ భర్తగారే భుజాలపై మోసుకు తిరుగుతున్నాడనే కదా. మోయడమే కనిపిస్తుంది లోకానికి. ‘‘నన్ను కిందికి దింపు ప్లీజ్.. నేనూ నడవగలను కదా’’ అని అక్క చేసే మూగ ఆక్రందనలు వినిపించవు. నడవడమే కాదు, తను పరుగెత్తగలదు, ఎగరగలదు. కాళ్లల్లో సత్తువ ఉంటుంది. రెక్కల్లో బలం ఉంటుంది. అయినా సరే.. దేవుడి లాంటి భర్త కదా.. అక్కను మోసుకునే తిరుగుతాడు! అంత మంచి భర్త పొరపాటున ఎక్కడొచ్చి పడతాడోనని భయము, బెంగ ఉండే ఆడపిల్లలు కనిపిస్తారేమో బహుశా గుళ్లలో.. ‘దేవుడి లాంటి భర్తను మాత్రం ఇవ్వకు దేవుడా’ అని వేడుకోడానికి. అమ్మ, నాన్న వినకపోతే దేవుడే కదా చెప్పుకోడానికి మిగిలేది. దేవుడి దగ్గర కూడా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ చదువు. ‘సీటొచ్చేటట్టు చెయ్ ప్లీజ్’ అని. లీస్ట్ ప్రయారిటీ భర్త. ‘ఇప్పట్లో పెళ్లి ముహూర్తాన్ని దగ్గరకు రానీయకు ప్లీజ్’ అని. చదువుకి, జీవితానికి అంత లింకు పెట్టేసుకుంటారు అమ్మాయిలు. చదువు.. వాళ్ల లవ్ ఇంట్రెస్ట్. బాలికల్ని చదివించని కాలంలో ‘మళ్లీ బాలురదే పైచేయి’ అని ఏటా రిజల్ట్స్ వచ్చేవి. బాలురు ఇప్పుడు ఏ ఫలితాల్లోనైనా మునుపటంత ధారాళంగా కనిపిస్తున్నారా? లేదు. బాలికల్ని కూడా చదివిస్తున్నాం కదా. చదువంటే తమకెంత ప్రాణమో చూపిస్తున్నారు. ప్రాణాలు గుండెల్లో ఉంటాయనుకుంటాం. ఆడపిల్లలకు పుస్తకాల్లోని పాఠాల్లో ఉంటాయి.చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్ డిగ్రీలో జాయిన్ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. ఆ మహిమ అలా ప్రవహించి చదివే వాళ్ల ముఖాల్లోకీ వచ్చేస్తుంది. రకుల్‌ప్రీత్ సింగ్ ఇన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలిస్తే ఏం అనిపించదు. రకుల్‌ప్రీత్ సింగ్ ‘జీసస్ అండ్ మేరీ కాలేజ్’లో మేథమేటిక్స్ చదివారట అని తెలిస్తే అందులోకి గ్లామర్ వచ్చేస్తుంది! రష్మికా మండన్నా మళ్లొకసారి విజయ్ దేవరకొండతో నటిస్తున్నారని తెలిస్తే ఏం అనిపించదు. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివారని, సైకాలజీ–జర్నలిజం–ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చేశారంటే ‘ఇంట్రెస్టింగ్!’ అనిపిస్తుంది. చదువు కోసం కెరీర్లో, చేస్తున్న పెద్ద జాబ్‌లో బ్రేక్ తీసుకునే అమ్మాయిలు కొందరు ఉంటారు! ‘రియల్లీ గ్రేట్’ అనిపిస్తుంది. జాబ్‌నీ, చదువునీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఇంకా గ్రేట్‌గా కనిపిస్తారు. ఇక ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకునే వాళ్లైతే గ్రేట్ అనే మాట సరిపోదు. సెల్యూట్ కొట్టాలి. ఎంత పేరు, ఎంత డబ్బు, ఎన్ని ఆభరణాలు, ఎంత మంచి భర్త ఉన్నా.. వాళ్లింకా ఏదో చదువుతున్నారంటే గౌరవం వచ్చేస్తుంది వాటన్నిటికీ. దివ్యమైన వెలుగేదో ఫోకస్ అవుతుంది వాటన్నిటిపైన. హిమాదాస్ స్ప్రింటర్. అస్సాం అమ్మాయి. 2000 సంవత్సరంలో పుట్టింది. 2018లో ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టింది. ‘ధింగ్ ఎక్స్‌ప్రెస్’ అని పేరు. ధింగ్ ఆమె పుట్టిన ఊరు. వరల్డ్ యు20 ఛాంపియన్షిప్స్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి హిమాదాస్. దోహాలో ఈ సెప్టెంబరులోనో, అక్టోబరులోనో జరగబోతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల కోసం ప్రస్తుతం టర్కీలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆమె అక్కడ ఉండగానే ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. 500కి 349 మార్కులు వచ్చాయి. అస్సామీ లాంగ్వేజ్ పేపర్లో 80 శాతానికి పైగా స్కోర్ చేసింది హిమ. పరీక్షలు గత ఫిబ్రవరిలో జరిగాయి. అప్పటికే తను టర్కీలో ఉంది. పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం ట్రైనింగ్‌కి బ్రేక్ తీసుకుని వచ్చింది! ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే టైమ్ అంతా ప్రిపరేషన్‌కే అవుతుందని గౌహతి వెళ్లి అక్కడి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఎగ్జామ్‌కీ, ఎగ్జామ్‌కీ మధ్య విరామాలలో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి ప్రాక్టీస్ చేసింది. తిరిగి టర్కీ వెళ్లిపోయింది. గతేడాది కూతురు బంగారు పతకం సాధించుకొచ్చినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేరు ఆమె తల్లిదండ్రులు. ఆమె ఫస్ట్‌క్లాస్‌లో పాసైందని తెలిసినప్పట్నుంచీ ఇంటిపైన మేఘాలలోనే వాళ్ల నివాసం!ఆడపిల్లలు చదువుతో ఇంత గౌరవాన్ని, గర్వాన్ని తెచ్చిపెడతారు కదా.. ఎందుకని మనం హఠాత్తుగా ‘ఇక దిగమ్మా’ అని మధ్యలోనే చదువు నిచ్చెనని పక్కకు తీసేస్తాం?! నిచ్చెన పైనుంచి దించి, భుజాలపైకి ఎక్కించడానికి మంచి కుర్రాడుంటే చూడమని ఎందుకు వాళ్లకూ వీళ్లకూ చెప్పడం మొదలుపెడతాం? బాధ్యతను నెరవేర్చడం! బాధ్యతగా నిచ్చెన వేశాం కదా, అలాగే బాధ్యతగా భుజాల్ని వెతుకుతాం. నిచ్చెన చివరివరకు ఆడపిల్లని ఎక్కనిస్తే భుజాలను వెతికే అవసరం ఉండదన్న ఆలోచనను మన బాధ్యత మనకు రానివ్వదేమో మరి. పిల్లలు తమ చదువుని బాధ్యతగా కాక, ప్రాణంగా ఫీల్ అవుతున్నప్పుడు మన ప్రాణసమానం అయిన పిల్లల చదువుల్ని, ఆశల్ని ఎందుకు అర్ధంతరంగా ఎవరి భుజాలపైనో ఎక్కించాలని చూడడం! భుజాలపైకి ఎక్కితేనే కానీ కిచెన్‌లోని ఉప్పు డబ్బానో, షెల్ఫ్‌లోని పాల డబ్బానో అందదని ఆడపిల్లల్ని చదువు మాన్పించేస్తామా?! ∙ -
దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు..
’లో మాస్టర్స్ డిగ్రీని చేసేందుకు అర్హతలు, ప్రవేశవిధానం, ఈ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? - గౌరి, హైదరాబాద్ హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ.. కార్పొరేట్ అండ్ కమర్షియల్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, లీగల్ పెడగాజి అండ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, పర్సనల్ లాస్, జనరల్ స్పెషలైజేషన్లతో ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తోంది. అర్హత:కనీసం 55 శాతం మార్కులతో ఎల్ఎల్బీ/బీఎల్. ప్రవేశం: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ఉత్తీర్ణత ఆధారంగా.వెబ్సైట్: www.nalsar.ac.in హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో కానిస్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లాస్, లేబర్ లా స్పెషలైజేషన్లతో ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఎల్ఎల్బీ. ప్రవేశం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీసీహెచ్ఈ) నిర్వహించే పీజీఎల్‌సీఈటీ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in/lawcollege/ గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పీజీ డిపార్ట్మెంట్ ఫర్ లీగల్ స్టడీస్.. లేబర్ లాస్, కానిస్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, టార్ట్స్ అండ్ క్రైమ్స్, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా స్పెషలైజేషన్లతో ఎల్ఎల్ఎం కోర్సును అందిస్తోంది. అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in ఎంఏ తెలుగు కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్న యూనివర్సిటీల వివరాలు తెలపండి? -కృపాసాగర్, అమరావతి విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది. అర్హత: తెలుగు ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది. అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ. వెబ్సైట్: www.svudde.in హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది. అర్హత: బ్యాచలర్ డిగ్రీ కోర్సులో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వెబ్సైట్:www.oucde.ac.in -
గీత బాటలో...
స్ఫూర్తి ఇక్కడ మేకపిల్లతో కనిపిస్తున్న మహిళ పేరు గీతాఫర్తియాల్. మొన్నటివరకూ ఆమెను ఓ నలభై మేకల యజమానిగానే చూశారందరూ. ఇప్పుడు గీత చిరునామా మారిపోయింది. ఒక పక్క మేకలను మేపుకుంటూనే వాటిపై వచ్చిన ఆదాయంతో హిందీ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది గీత. ఉత్తరాఖాండ్ హిమాలయ కొండల ప్రాంతంలో ఉన్న కొతెరా గ్రామానికి చెందిన గీత ఈ మధ్యనే అల్మొరా విశ్వవిద్యాలయంలో తన చదువు పూర్తి చేసింది. అప్పటివరకూ అందరూ గీతను ఏవో పుస్తకాలు చదువుకునే అమ్మాయిగానే చూశారు. తీరా ఇంత చదువు చదివిందని తెలియగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ ప్రాంతంలో మేకల్ని అమ్ముకుని బతికేవారు ఎక్కువ. ముఖ్యంగా మహిళలు. వాటిపై వచ్చిన ఆదాయంతో పెళ్లిళ్లు చేయడమొక్కటే తెలిసిన మహిళలకు గీత ఆదర్శంగా నిలబడింది. మాస్టర్ డిగ్రీ చేతిలో ఉన్న గీత ప్రస్తుతం తన మేకలను అన్నకు అప్పగించి ఉద్యోగం వేటలో ఉంది. ‘ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో మరిన్ని మేకల్ని కొని వాటిపై వచ్చిన ఆదాయంతో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను’ అని చెప్పే గీత మాటలు పెంపుడు జంతువులను నమ్ముకుని బతికే ప్రతి మహిళకూ ఆదర్శమే. -
జననేతే ఆదర్శమంటున్న హర్షవర్ధన్ రెడ్డి