ఔరంగాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీ, సీఎం నితీశ్ సరదా ముచ్చట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం
కృష్ణనగర్: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమత సర్కారు మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు.
నాడియా జిల్లాలోని కృష్ణనగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రంసంగించారు. బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆరి్ధకాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు.
టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్
బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సాగించిన అకృత్యాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధిత మహిళలను గోడు వినిపించుకోవడం లేదని, నిందితులను అరెస్టు చేయకుండా కాపాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో ఆశలతో నమ్మి అధికారం అప్పగిస్తే ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం ‘మా, మాటీ, మను‹Ù’ అంటూ నినాదాలు చేసే తృణమూల్ కాంగ్రెస్ మన అక్కచెల్లెమ్మలకు రక్షణ కలి్పంచడం లేదని మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో నేరగాళ్లే నిర్ణయిస్తున్నారని, పోలీసులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి, బంధుప్రీతి తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్(నువ్వు, నేను, అవినీతి) దుయ్యబట్టారు.
బిహార్‌లో అరాచక పాలన మళ్లీ రానివ్వం
ఔరంగాబాద్: ప్రధాని మోదీ శనివారం బిహార్‌లో పర్యటించారు. రూ.34,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారని, రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు.
ఇక ఎప్పటికీ ఎన్డీయేలోనే ఉంటా: నితీశ్ కుమార్
తన ప్రయాణం ఇకపై ఎప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే అని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని అన్నారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడానికి తమ రాష్టానికి వచి్చన ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కొంతకాలం ఎన్డీయేకు దూరమయ్యానని, మళ్లీ తిరిగివచ్చానని, ఇకపై ఇదే కూటమిలో కొనసాగుతానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నితీశ్‌ను చూస్తూ ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment