పశ్చిమ బెంగాల్ ముఖ్యంమత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని ఆమె కోరారు.
కాగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. అయితే క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడం వల్ల పార్లమెంట్‌లో వీటిపై సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని దీదీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను కేంద్రంలోని ఇటీవల బీజేపీ ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే.
బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్ధేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థను, కోర్టు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment