కోల్‌కతా : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరా సలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీ యులను స్వదేశానికి తీసుకు రావాలన్నారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని కోరారు. మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని చెప్పారు.
అయితే, అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్కడి నుంచి వచ్చిన బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు అసెంబ్లీలో స్పందించాల్సి చచ్చిందన్నారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలకు ఎటువంటి కొరత లేదన్నారు.
వక్ఫ్ పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంది
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముస్లింలను విభజించి ఏకాకులుగా మార్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు.
హిందూ ఆలయ ట్రస్టులు, చర్చిల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకోగలడా అని ఆమె ప్రశ్నించారు. మూడింట రెండొంతుల మెజారిటీ లేని బీజేపీ పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదా అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బిల్లుపై జేపీసీలో జరిగే చర్చల్లో ప్రతిపక్ష సభ్యులను బీజేపీ మాట్లాడనివ్వడం లేదని అందుకే టీఎంసీ ఆ కమిటీ నుంచి వైదొలగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment