Hindu Priest
-
బంగ్లాదేశ్‌కు ఐరాస దళాలు పంపాలి: మమతా డిమాండ్
కోల్‌కతా : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరా సలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీ యులను స్వదేశానికి తీసుకు రావాలన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని కోరారు. మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని చెప్పారు. అయితే, అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్కడి నుంచి వచ్చిన బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు అసెంబ్లీలో స్పందించాల్సి చచ్చిందన్నారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలకు ఎటువంటి కొరత లేదన్నారు.వక్ఫ్ పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందిబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముస్లింలను విభజించి ఏకాకులుగా మార్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. హిందూ ఆలయ ట్రస్టులు, చర్చిల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకోగలడా అని ఆమె ప్రశ్నించారు. మూడింట రెండొంతుల మెజారిటీ లేని బీజేపీ పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదా అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బిల్లుపై జేపీసీలో జరిగే చర్చల్లో ప్రతిపక్ష సభ్యులను బీజేపీ మాట్లాడనివ్వడం లేదని అందుకే టీఎంసీ ఆ కమిటీ నుంచి వైదొలగిందని వివరించారు. -
‘మీకు మసీదులు, చర్చిలు గుర్తుకు రావా’
ముంబై: కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలు తప్ప మసీదులు, చర్చిల జోలికి వెళ్లరేందుకని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఏం చవాన్ ‘కరోనాపై పోరుకు ప్రభుత్వం దేశంలోని అని మత ట్రస్టుల వద్ద వున్న బంగారాన్ని వినియోగించాలి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది. తక్కువ వడ్డీ రేటుకు ఈ బంగారాన్ని బాండ్ల ద్వారా తీసుకోవచ్చు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హిందూ దేవాలయాల నుంచి బంగారం తీసుకునే ముందు.. కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు భారీ సంపదను కూడబెట్టారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందు వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి’ అని ‘తపస్వి చావ్ని’ స్వామి పరమన్స్ అన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు) మహాంత్ కమల్ నయన్ దాస్, మణి రామ్ దాస్ చావ్ని వంటి వారు ‘కాంగ్రెస్ నాయకులు ‘దేశ వ్యతిరేకులు’’ అని ఆరోపించారు. ‘చవాన్ దేవాలయాల నుంచి మాత్రమే డబ్బు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ మసీదులు, చర్చిల జోలికి వెళ్లడం లేదు ఎందుకు’ అని వారు ప్రశ్నించారు.(రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..) -
అమెరికాలో పూజారిపై దాడి
న్యూయార్క్: అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ఫ్లోరల్ పార్క్ సమీపంలో జూలై 18న ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) స్వామి హరీశ్ చంద్ర పురీ అనే పూజారిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆయన గాయాలపాలయ్యారు. జాతి విద్వేషం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన 52 ఏళ్ల సెర్గియో గోవియా అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఫ్లోరల్ పార్క్ సమీపంలోని గ్లెన్ ఓక్స్‌లో శివ శక్తి పీఠం ఉంది. అక్కడి దగ్గర్లోని రోడ్డుపై హరీశ్ చంద్ర పూజారి వేష ధారణలోనే నడుచుకుంటూ వెళ్తుండగా, సెర్గియో వెనుక నుంచి వచ్చి హరీశ్ చంద్రపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలకు తాళలేక హరీశ్ చంద్ర ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ‘ఇది మా ప్రాంతం’ అని దాడి సమయంలో సెర్గియో అరిచినట్లు హరీశ్ చంద్ర పురీ చెప్పారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తర్వాతే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిని ప్రతినిధుల సభలో సభ్యురాలైన గ్రేస్ మెంగ్ ఖండించారు. అమెరికాలో అల్పసంఖ్యాకులైన హిందువులకు తాను అండగా ఉంటాననీ, వివిధ దేశాల నుంచి వచ్చిన అనేకమంది మైనారిటీలు తన నియోజకర్గంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
అమెరికాలో స్వామీజీపై దాడి
న్యూయార్క్: అమెరికాలోని గ్రీన్ఓక్స్ ప్రాంతంలో ఓ హిందూ పూజారిపై దాడి ఘటన కలకలం రేపింది. గ్లెన్ఓక్స్లోని శివ శక్తి పీఠం ప్రాంతంలో పీఠానికి చెందిన స్వామీజీ హరీష్ చందర్ పూరి నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి స్వామీజీని దారుణంగా పలుమార్లు కొట్టి గాయపరిచాడు. స్వామీజీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హిందూ స్వామీజీపై దాడి ఘటనలో 52 సంవత్సరాల సెర్జియ గువెయను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామీజీపై దాడిని విద్వేష దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వామీజీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆయన శిష్యులు కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇది మా ప్రాంతం అని నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. కాగా తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్ధన చేస్తానని స్వామీజీ హరీష్ చందర్ చెప్పారు. కొన్నిసార్లు ప్రజలు నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తారని అన్నారు. గాయాల నుంచి తాను మెల్లగా కోలుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
దేవాలయాలు, హిందూ మత గురువుల వివరాలతో పనేంటి..?
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా నాలుగోసారి అధికారం కైవసం చేసుకోవాలని అధికార బీజేపీ చూస్తోంది. అయితే, ఆగస్టు నెలలో విడుదలైన పలు నివేదికల్లో ఈసారి బీజేపీపై రాష్ట్రంలో ప్రతికూల పవనాలు వీయనున్నాయని వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన కమల దళ నాయకులు అధికారం చేజారిపోకుండా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, మఠాలు, హిందూ మత గురువుల జాబితాను రూపొందించే పనిలో మునిగారని పలువురు భావిస్తున్నారు. కాగా, జాబితా రూపకల్పనపై ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు, హిందూ మత గురువుల సమాచారం సేకరించిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే, సేకరించిన డాటాతో ఏం చేయబోతున్నారని మాత్రం చెప్పలేదు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరించడంలో వింతేముందని అన్నారు. బూత్ స్థాయిలో కేడర్‌ను పటిష్టం చేయడం కోసం డాటా సేకరించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలలో కూడా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
ఒక పాట.. ఒక హత్య
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 200 ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని వదలి వలస వెళ్లినట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. నెల రోజుల కిందట జానపద గాయకుడిని ఒక అర్చకుడు, అతని మిత్రులు హత్య చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్నవివరాలివి. రాజస్థాన్‌లోని జైసల్మీర్ జిల్లా, ఫోఖ్రాన్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది దంతాల్ గ్రామం. ఈ పల్లెటూరు భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉండడం గమనార్హం. హిందూ దేవీదేవతల స్త్రోత్రాలు, మంత్రాలు, శ్లోకాలకు గాయకుడు అహ్మద్ ఖాన్ (45) రాగయుక్తంగా పాడేవాడు కాదు. ఇలా పాడడం తప్పని ఆలయ పండితుడు రమేష్ సుథార్ పలుసార్లు ఆతనికి వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అర్చకుడు రమేష్ సుథార్, అతని మిత్రులు కలిసి అహ్మద్‌ఖాన్‌పై సెప్టెంబర్27 దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తరువాత గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడినట్లు సీనియన్ పోలీస్ అధికారి గౌరవ్ యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును ఆయనే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అర్చకుడు రమేష్ సుథార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. రమేష్ కుటుంబ సభ్యులు సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిలో ఉన్నారని.. ఈ కేసు గురించి మాట్లాడేందుకు వారు ఇష్టపడడం లేదని గౌరవ్ అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇక్కడకు పారామిలటరీ బలగాలను తెప్పించామన్నారు. ఇదిలావుండగా.. తమ సోదరుడు చేసిన చిన్న పొరపాటుకు దారుణంగా హత్య చేశారని అహ్మద్‌ఖాన్ సోదరి రఖాఖాన్ చెప్పారు. ఇకపై ఈ గ్రామంలో జీవించలేమని.. అందుకే ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నామని ఆమె ఆవేదనగా చెప్పారు. -
హిందూ పూజారులపై ఆగని దాడులు
ఢాకా: బంగ్లాదేశ్ లో హిందూ పూజారులపై దాడులు ఆగడం లేదు. నిన్న ఒక హిందూ పూజారిని ఉగ్రవాదులు నరికి చంపిన ఘటన మరువకముందే మరో పూజారిపై శనివారం దాడి జరిగింది. సత్ఖిరా జిల్లాలోని శ్రీ రాధా గోవింద గుడిలో పూజారిగా పనిచేస్తున్నబాబాసింధ్ రాయ్(48) పై దేవాలయం కంపౌండ్ లో నిద్రించిన సమయంలో ఆయనపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరళించామని ఇది ఉగ్రవాదుల దాడి గానే భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. గడిచిన మూడేళ్లో 50 మంది మైనారిటీలు ఆదేశంలో హత్యకు గురయ్యారు.