ముంబై: కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలు తప్ప మసీదులు, చర్చిల జోలికి వెళ్లరేందుకని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఏం చవాన్ ‘కరోనాపై పోరుకు ప్రభుత్వం దేశంలోని అని మత ట్రస్టుల వద్ద వున్న బంగారాన్ని వినియోగించాలి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది. తక్కువ వడ్డీ రేటుకు ఈ బంగారాన్ని బాండ్ల ద్వారా తీసుకోవచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హిందూ దేవాలయాల నుంచి బంగారం తీసుకునే ముందు.. కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు భారీ సంపదను కూడబెట్టారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందు వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి’ అని ‘తపస్వి చావ్ని’ స్వామి పరమన్స్ అన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు)
మహాంత్ కమల్ నయన్ దాస్, మణి రామ్ దాస్ చావ్ని వంటి వారు ‘కాంగ్రెస్ నాయకులు ‘దేశ వ్యతిరేకులు’’ అని ఆరోపించారు. ‘చవాన్ దేవాలయాల నుంచి మాత్రమే డబ్బు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ మసీదులు, చర్చిల జోలికి వెళ్లడం లేదు ఎందుకు’ అని వారు ప్రశ్నించారు.(రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..)
Comments
Please login to add a commentAdd a comment