Prithviraj Chavan
-
తిరుగు లేదనుకుంటే.. తిప్పిపంపారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. తమకు మంచి పట్టు, ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలలో విజయం ఖాయమని భావించి బరిలోకి దిగిన మహామహులు పరాజయభారాన్ని మోయక తప్పలేదు. తమకు తిరుగులేదని, ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కొందరు విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు ఊహించని విధంగా తీర్పునివ్వడంతో వారంతా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తథ్యమనుకుని బరిలో దిగి ఓటమిని చవిచూసిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.సోలాపూర్ నార్త్‌సిటీ.. బీజేపీదే ఐదోసారీసోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ఘనవిజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలో మహా వికాస్ అగాఢీ తరపున కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించినప్పటికీ తన ప్రత్యర్థి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి మహేష్ కోటేపై మాభైఒక్కవేల ఎనభైఎనిమిది ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన అభ్యర్థిగా విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు.బీజేపీ, మహాయుతి కూటమి కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారని, ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని విజయ్ కుమార్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. అన్ని వర్గాల మద్దతు వల్లే తన గెలుపు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మహాయుతి కూటమి పదాధికారులు, కార్యకర్తలు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు పేలుస్తూ గులాల్ జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.వర్లీలో ఆదిత్య ఠాక్రే ఘనవిజయం ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో మొదటిసారిగా పోటీ చేసిన గెలిచిన ఆదిత్య ఈసారీ విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఈఎన్నికల్లో శివసేన (యూబీటీ) నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేయగా, శివసేన (శిందే) నుంచి మిలింద్ దేవ్రా ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఇక మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) నుంచి సందీప్ దేశ్‌పాండే పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వర్లీలో ఆదిత్య ఠాక్రే విజయం కోసం స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. చివరకు 8,801 ఓట్ల మెజారీ్టతో ఆదిత్య ఠాక్రే తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించారు.భివండీ రూరల్‌లో శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం భివండీ: భివండీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహాయుతి కూటమి శివసేన (శిందే) అభ్యర్థి శాంతారామ్ మోరే హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. మహావికాస్ ఆఘాడీ కూటమి శివసేన(యూబీటీ) అభ్యర్థి మహాదేవ్ ఘటల్పై 57,962 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చదవండి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలుహోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో శాంతారామ్ మోరే 1,27,205 ఓట్లతో మొదటిస్థానంలో, మహాదేవ్ ఘటాల్ 69,243 ఓట్లతో రెండోస్థానంలో, జిజావు సంస్థ స్వతంత్ర అభ్యర్థి మనీషా ఠాక్రే 24,304 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి ఈసారి కేవలం 13, 816 ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నారు. -
పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్ దిగ్గజం) రాయని డైరీ
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్‌లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్ చేసింది ఆరెస్సెస్‌లోని ఒక పెద్ద మనిషి. ‘‘నేనిప్పుడు నా 78లో ఉన్నాను. అయినప్పటికీ... ‘మీరు మీ వృద్ధాప్యంలో ఆలోచిస్తారు...’ అని మీరు నాతో అనటం ద్వారా నా వయసు పట్ల మీరు కనబరుస్తున్న గొప్ప ఔదార్యం నన్ను కట్టిపడేస్తోంది. అలాగని నేను కాంగ్రెస్ కట్లు తెంపుకొని బీజేపీలోకి వచ్చేయలేను...’’ అన్నాను మృదువుగా.‘‘కట్లు అని మీరే అంటున్నారు. తెంపుకొని వచ్చేయటానికి ఏమిటి ఆలోచన?!’’ అన్నారాయన.‘‘అవి నన్ను నేను కాంగ్రెస్‌తో కట్టేసుకున్న కట్లు. కాంగ్రెస్ నన్ను ఫోన్ చేసి పిలిపించుకుని కట్టిపడేసిన కట్లు కావు...’’ అన్నాను. పెద్దగా నవ్వారాయన.‘‘మీలోని ఈ కట్టుబాటే నా చేత మీకు ఫోన్ చేయించేలా బీజేపీని ప్రేరేపించింది చవాన్జీ! ఢిల్లీలో బీజేపీకి మీ అవసరం ఉంది. సీనియర్ మోస్ట్‌గా మీకూ బీజేపీలో తగినంత గౌరవం ఉంటుంది. వచ్చేయండి...’’ అన్నారు.కోరుకున్న చోట దక్కే గౌరవం, కోరుకోని చోట పొందే గౌరవం... రెండూ ఒకటి కావు. దక్కింది సంతృప్తిని ఇస్తుంది. పొందిందిసంతోషాన్ని మాత్రమే ఇస్తుంది.‘‘నాకిక్కడ కాంగ్రెస్‌లో తగినంత గౌరవం దక్కుతూనే ఉంది మహోదయ్ జీ...’’ అన్నాను. ఆయన మళ్లీ నవ్వారు.‘‘నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆరేళ్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌లో సహాయ మంత్రిగా ఉండటం, ఒక టర్మ్‌కు పైగా రాజ్య సభలో ఉండటం, రెండు టర్మ్‌లు లోక్‌సభలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం... ఇవన్నీ నిజంగా దక్కుదలలే అంటారా చవాన్ జీ... ఒక్కసారి మీ మనసును అడగండి...’’ అన్నారాయన!ఆయన ఉద్దేశం – ఇవేవీ ఆరెస్సెస్ ‘ప్రచారక్ ’, ‘విచారక్’లతో కానీ, బీజేపీ ‘మార్గదర్శక్ మండల్’ సభ్యత్వంతో కానీ సమానమైనవి కావన్నట్లుగా ఉంది!మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసింది ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు. రెండోసారి ఫోన్ చేసింది నామినేషన్లకు ముందు. మూడోసారి ఫోన్ చేసింది నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందు. ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి, ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయండి, చవాన్ జీ...’’ అంటున్నారు 20న పోలింగ్, 23నకౌంటింగ్ పెట్టుకుని!కరద్ సౌత్ నుంచి వరుసగా రెండుసార్లు నా మీద పోటీ చేసి ఓడిపోయిన అతుల్ సురేశ్ భోసలేనే మళ్లీ నాపై నిలబెట్టింది బీజేపీ. మొదటిసారి 18 వేలు, రెండోసారి 9 వేల ఓట్ల తేడాతో అతుల్ ఓడిపోయారు కనుక ఈసారి ఆయన కచ్చితంగా గెలిచి తీరుతారని ఆ పార్టీ నమ్మకం.నమ్మకాలు బీజేపీకి మాత్రమే ఉంటాయా?! కరద్ సౌత్‌లో మళ్లీ నేనే వస్తానని కాంగ్రెస్ నమ్ముతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వస్తే నేనే సీఎం అని నేను నమ్ముతున్నాను. తనే సీఎం అని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే నమ్ముతున్నారు.అడ్డు తొలగించుకోవటం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. బీహార్‌లో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చిన నితీశ్‌కు సీఎం సీటును ఇచ్చేస్తుంది. కరద్ సౌత్‌లో అతుల్‌కి దీటైన పోటీ లేకుండా నన్ను పార్టీలోకి తీసుకోటానికి ఆరెస్సెస్‌తో ఫోనూ చేయిస్తుంది. ‘‘వృద్ధాప్యంలో మీరు ఆలోచిస్తారు...’’అంటూ ఈసారి మళ్లీ ఆ ఆరెస్సెస్ మహోదయ్ ఫోన్ చేస్తే ఒకటే చెప్పాలి... కాంగ్రెస్‌లో వృద్ధాప్యమనేదే ఉండదని గట్టిగా చెప్పాలి! - మాధవ్ శింగరాజు -
కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: కాంగ్రెస్ నేతలందరూ కలసి ఎన్నుకునే వ్యక్తి పార్టీకి తోలుబొమ్మ అధ్యక్షుడిగా ఉండకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కొత్తగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. పాతికేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా..ఆయన రాజీనామా దురదృష్టకరమన్నారు. పార్టీలో ఆయన సీనియర్ నేతని, ఆయన లౌకికవాదని వివరించారు. గ్రూప్ 23లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పార్టీలో అంతర్గత సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 2020లో లేఖ ఇచ్చామని, అయితే పార్టీ ప్రయోజనాలకు కాపాడేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే ఆ లేఖను ఇచ్చామని అయితే పార్టీలోని కొంతమంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్) -
‘మీకు మసీదులు, చర్చిలు గుర్తుకు రావా’
ముంబై: కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలు తప్ప మసీదులు, చర్చిల జోలికి వెళ్లరేందుకని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఏం చవాన్ ‘కరోనాపై పోరుకు ప్రభుత్వం దేశంలోని అని మత ట్రస్టుల వద్ద వున్న బంగారాన్ని వినియోగించాలి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది. తక్కువ వడ్డీ రేటుకు ఈ బంగారాన్ని బాండ్ల ద్వారా తీసుకోవచ్చు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై హిందూ మతాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హిందూ దేవాలయాల నుంచి బంగారం తీసుకునే ముందు.. కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు భారీ సంపదను కూడబెట్టారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందు వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవాలి’ అని ‘తపస్వి చావ్ని’ స్వామి పరమన్స్ అన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు) మహాంత్ కమల్ నయన్ దాస్, మణి రామ్ దాస్ చావ్ని వంటి వారు ‘కాంగ్రెస్ నాయకులు ‘దేశ వ్యతిరేకులు’’ అని ఆరోపించారు. ‘చవాన్ దేవాలయాల నుంచి మాత్రమే డబ్బు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ మసీదులు, చర్చిల జోలికి వెళ్లడం లేదు ఎందుకు’ అని వారు ప్రశ్నించారు.(రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..) -
తెలంగాణలో మార్పు తథ్యం
సాక్షి, హైదరాబాద్: నియంతృత్వ పాలనను ఇక తెలంగాణ సమాజం అంగీకరించబోదని, ఇక్కడ మార్పు ఖాయమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ మీడియా సెల్ నేతలు యతీశ్, ప్రశాంత్, ఏఐసీసీ సభ్యుడు ఫయీంలతో కలసి మీడియాతో మాట్లాడారు. మరింత వేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అయితే ప్రజలు ఆశిం చినా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన విషాదాన్నే మిగిల్చిందని దుయ్యబట్టారు. గత ఎన్నికల హామీ ల్లో ఒక్క దాన్ని కూడా నెరవేర్చని కేసీఆర్, మళ్లీ ఇప్పుడు ఎలా హామీలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, అందుకే కేసీఆర్ ముం దస్తు ఎన్నికలకు వెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకున్నారన్నారు. అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మోసం చేసిన కేసీఆర్.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ నమ్మిం చి మోసం చేశారని చవాన్ ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే ఇసుక మాఫియా నడిపిస్తూ ప్రశ్నించిన నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు 10 వేలు కూడా దాటలేదని, లక్ష ఉద్యోగాలిస్తామని మాట తప్పారని విమర్శించారు. ‘హస్తం’ అధికారంలోకి వస్తే అందరికీ మేలు.. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని, ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చవాన్ చెప్పారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీజేపీకి శివసేన కటీఫ్ చెబుతుంది
పుణె: బీజేపీతో మిత్రబంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల లోపు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరించుకుంటుందని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ముంబై నగరపాలక సంస్థతో పాటు మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ లోగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలుగుతుందని చవాన్ పేర్కొన్నారు. శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడుతుందని, అప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయని అభిప్రాయపడ్డారు. -
‘మాఫీ’పై మీ వైఖరేంటి?
ముంబై : రుణమాఫీపై ప్రభుత్వం తన వైఖరి తెలిపే వరకు కాంగ్రెస్ చర్చలో పాల్గొనదని ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తేల్చి చెప్పారు. రుణమాఫీపై మీడియా తన మాటలు వక్రీకరించిందని ఫడ్నవీస్ చెప్పారని, అదే నిజమైతే ఆ వ్యాఖ్యలను సభలో ప్రకటించాలన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని సీఎం అన్నప్పుడు సభలో దానిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీలో సభా కార్యక్రమాలు మొదలైన తర్వాత మాఫీపై ప్రభుత్వ వైఖరి తెలపాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. కాగా, రైతుల రుణ మాఫీ కోసం విధాన్ భవన్ ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు ఎన్సీపీ మద్దతు ప్రకటించలేదు. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలపడమే దీనికి కారణమని తెలుస్తోంది. గోందియా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఎన్సీపీతో కాంగ్రెస్ కలవకుండా బీజేపీతో పొత్తు పెట్టుకొని జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. బీజేపీకి వైస్ ప్రెసిడెంట్ పదవి చేజిక్కించుకుంది. మరోవైపు భండారాలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రెసిడెంట్ పదవి దక్కించుకుంది. వైస్ ప్రెసిడెంట్ పదవి ఎన్సీపీ చేజిక్కించుకుంది. మరోవైపు బీజేపీతో కలసివెళ్లాలనే గోందియా స్థానిక నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం స్వాగతించదని కాంగ్రెస్ నేతలంటున్నారు. శాసనమండలి కాంగ్రెస్ నేత మానిక్రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. రెండు పార్టీలు రైతు సమస్యలపై కలసికట్టుగా పోరాడతాయన్నారు. గోందియా వ్యవహారంలో నిర్ణయాన్ని సోమవారం తెలుపుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్‌దాస్ అగర్వాల్‌తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అనేకమార్లు చర్చించినప్పటికీ దాస్‌ను ఒప్పించడంలో విఫలమయ్యారు. చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతాం: అశోక్ చవాన్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్ అశోక్ చవాన్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై పోరాడేందుకు చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతామన్నారు. గోందియా విషయాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం సభ 45 నిమిషాలు వాయిదా పడి తిరిగి సమావేశమైన అనంతరం కాంగ్రెస్ రైతు సమస్యలపై చర్చించింది. విఖే పాటిల్ మాట్లాడుతూ.. తీవ్ర కరువు, అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రుణమాఫీ ఒక్కటే రైతుల సమస్యలకు పరిష్కారం కాదని చెప్పారు. రుణమాఫీ సాధ్యంకాదని తాను చెప్పలేదన్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. రైతుకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. విత్తనాలు విత్తి ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షాల జాడలేదని ఆవేదన వ్యక్తం చే శారు. రైతులు మళ్లీ విత్తానాలు విత్తుకోవాల్సి ఉంటుందన్నారు. రూ. 3000 కోట్లు రాబట్టుకోవడం కోసం ఎల్జీటీ, టోల్ అనుబంధ డిమాండ్లను విధించింద ని విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్చ జరగ కుండా ఉండేందుకు ఓ వ్యూహాత్మక అవగాహనతో బీజేపీ, ఎన్సీపీలు సభ వాయిదావేసేలా ప్రవర్తిస్తున్నారని ఓ శివసేన విమర్శించారు. రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించేంతవరకు సభా కార్యక్రమాలు జరగనివ్వమని ఎన్సీపీ ఆందోళన చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. రుణమాఫీపై సీఎం తన మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, రుణమాఫీ కోసం ప్రకటించడం కోసం ఆందోళన చేపట్టడంలేదని దుయ్యబట్టారు. ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలా ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణలపై మండలి చైర్మన్ విచారణకు ఆదేశిస్తే.. నిర్దేశించిన సమయంలోపు ప్రభుత్వం నివేదిక సమర్పిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీతో శివసేనకు వైరం పెంచేందుకు ఎన్సీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంటోదని ఆరోపించారు. మొత్తం 63 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలని, ఈ ఎమ్మెల్యేలంతా రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. రుణ మాఫీ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని ఎన్సీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీకి శివసేన ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఉపసంహరించుకోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తమ నియోజకవర్గాలకు వెళ్లినపుడు అక్కడి ప్రజలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. -
వారంలోగా సీఎం ‘వర్షా బంగ్లా’కి..
సాక్షి, ముంబై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ అధికార నివాసమైన ‘వర్షా బంగ్లా’ లోకి వచ్చే వారం గృహప్రవేశ ం చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రెండు రోజుల కిందటే వర్షా బంగ్లా ఖాళీ చేసి వెళ్లారు. దీంతో కొత్తగా అందులోకి వచ్చే ముఖ్యమంత్రికి, కుటుంబ సభ్యులకు అనుకూలంగా, నచ్చే విధంగా బంగ్లాలో మార్పులు, చేర్పులు చేయడం రివాజు. కాని ఆ బంగ్లాలో మార్పులు చేయడానికి ఫడ్నవిస్ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. అందులో ఉన్న ఫర్నిచర్, ఇతర సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. రెండు రోజుల్లో బంగ్లాను శుభ్రం చేసే పనులు పూర్తవుతాయి. మంగళవారం ఫడ్నవిస్తోసహా కుటుంబ సభ్యులు బంగ్లాను సందర్శిస్తారు. ఆ త ర్వాత అందులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వారి సూచనల మేరకు ఆధునికీకరణ పనులు చేపడతారు. వచ్చే వారంలో ముహూర్తం చేసుకుని సీఎం వర్షా బంగ్లాలోకి గృహ ప్రవేశం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మాజెస్టిక్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నాలుగో అంతస్తులోని 421 ఫ్లాట్‌లో నివాసముంటున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో భారీమార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఫలితాలకు ముందు లేదా ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేక మార్పులు జరగనున్నాయని తెలిసింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై వేటు పడే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఓ వైపు లోకసభ ఎన్నికల్లో ఘోరపరాజయం.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెనకబడిపోయామని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పృథ్వీరాజ్‌చవాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు తీవ్ర తలనొప్పులు తీసుకువచ్చాయి. అలాగే రాష్ట్రంలోని పార్టీకి సంబంధించిన ఇతర కార్యవర్గాలను కూడా మార్చి నూతన కార్యవర్గాలను నియమించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయం కాలేదు. -
'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా'
పుణే: తన కంటే ముందు పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర తాజా మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏమరుపాటుగా జరిగిన పొరబాటని ఆయన వివరణయిచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పతనమైతే... ఆదర్శ్ కేసులో మాజీ ముఖ్యమంత్రులు విలాస్ రావ్ దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్ లపై చర్యలు తీసుకుంటానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ పేర్కొన్నారు. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నానని ఆయన తెలిపారు. తన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా ఆయన అన్నారు. -
నాయకుడు లేని పార్టీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం వహించేందుకు బీజేపీకి నాయకుడెవరూ లేరని, తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆధారపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ఎన్నికల ప్రచారం అసాధారణమని పేర్కొన్నారు. ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రి కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని బహిరంగసభల్లో పాల్గొనలేదని చెప్పారు. ఇది బీజేపీకి ఉన్న బలహీనత అని చవాన్ మంగళవారం ఇక్కడ పలు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణంతో బీజేపీకి చెప్పుకోదగిన నాయకుడే లేకుండా పోయారని అన్నారు. ఆ బలహీనతను దాచేందుకు మోడీని రాష్ట్రమంతటా తిప్పుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ దురహంకారిగా మారిందని ఆరోపించారు. ప్రచారం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడుతో పాటు రాజస్థాన్, గోవా ముఖ్యమంత్రులను ప్రచారం చేసేందుకు పిలుస్తున్నారని అన్నారు. దీనిని బట్టి స్థానిక నాయకత్వంపై బీజేపీకి విశ్వాసం లేనట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముంగిట తన ప్రభుత్వానికి మద్దతునుపసంహరించిన ఎన్సీపీపై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా దొడ్డిదారిలో మోడీకి అధికారం అప్పగించేందుకు చేసిన కుట్ర అనిఅన్నారు. ఆచరణ సాధ్యం కాని షరతులను విధించడం వల్లనే ఎన్సీపీతో పొత్తు కుదేలైందని చవాన్ చెప్పారు. బీజేపీకి సహకరించేందుకు ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉన్నాం..: బీజేపీ నేతలు ఫడ్నవిస్,జవదేకర్ సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ధులేలో జరిగిన పార్టీ ప్రచారసభలో తానున్నంత వరకు మహారాష్ట్రను ఎవరూ ముక్కలు చేయలేరనిప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం రాష్ట్రానికి చెందిన అదే పార్టీ నాయకులు ఇలా మాట్లాడడం విస్మయం కలిగించింది. మోడీ సభ అనంతరం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో జవదేకర్, ఫడ్నవిస్‌లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నరేంద్ర మోడీ చెప్పింది ముంబైని మహారాష్ట్ర నుంచి ఎవరు విడగొట్టలేరని చెప్పారని, ఆయన వ్యాఖ్య విదర్భ గురించి కాదని వారు వివరణ ఇచ్చారు. -
ఆసక్తికర పోరు
కరద్: సతారా జిల్లాలోని కరద్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ తలపడుతున్న వారిలో ఒకరు రాజకీయాల్లో తలపండిన వారైతే అతని ప్రత్యర్థి రాష్ట్రాన్నే ఏలినవారు. ఒకరు వరుసగా ప్రజాభిమానంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారైతే, అతనిపై పోటీకి దిగిన వ్యక్తి అటు కేంద్ర మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా పని చేసినవారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఈ ఇద్దరు మహామహుల మధ్య పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతుండగా, ఆయన ప్రత్యర్థి 79 ఏళ్ల విలాస్‌రావ్ ఉండాల్కర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉండాల్కర్కు కాకుండా అతని స్థానంలో పృథ్వీరాజ్ చవాన్‌ను బరిలోకి దించింది. దీంతో ఉండాల్కర్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పని చేసిన చవాన్ 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరివీ విరుద్ధమైన వ్యక్తిత్వాలు. ఉండాల్కర్ ఈ ప్రాంతంలో కాకా పేరుతో ప్రసిద్ధులు. అమెరికాలో విద్యనభ్యసించిన చవాన్ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు. చవాన్‌ను ఇక్కడి గ్రామాల ప్రజలు బాబా అని పిలుచుకుంటారు. ధోవతి, కుర్తా ధరించే కాకా వద్ద కనీసం ఓ పెన్ను, లేదా మొబైల్ ఫోన్ కూడా ఉండదట. కానీ పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను పేరు పెట్టి గుర్తించగలరని అతని మద్దతుదారులంటున్నారు. ఈ విషయంలో చవాన్ చాలా వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా చవాన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇక్కడి అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు. మచ్చలేని వ్యక్తిత్వం, కరద్ అభివృద్ధికి ప్రత్యేక కృషి, తనతోపాటు తల్లిదండ్రులు ఆనంద్‌రావు, ప్రేమలతాయిలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహించడం వంటివి చవాన్‌కు కలసి వచ్చే అంశాలు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న అతుల్ భోస్లే కూడా నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడే. సహకార, విద్యా సంస్థల నెట్వర్క్ ఉన్న రాజకీయ కుటుంబంనుంచే ఈయన కూడా వచ్చాడు. కరద్ నియోజకవర్గంలో ఎన్సీపీ తన అభ్యర్థి రాజేంద్ర యాదవ్‌ను పోటీ నుంచి ఉపసంహరించి ఉండాల్కర్కు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్సీపీపై కినుకు వహించిన యాదవ్‌ను చవాన్ చేరదీశారు. తమకు తాగు, సాగు నీటి సమస్యను కాకా పరిష్కరించారని ఓ సర్పంచ్ చెప్పారు. ఈసారి పోటీ చేయడం కాకాకు ఇష్టం లేదని, కానీ తామే బలవంతపెట్టామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే దాకా చవాన్ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఉండాల్కర్కు ప్రజాదరణ తగ్గిపోయిందని, 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ చేయలేదని చవాన్ మద్దతుదారులంటున్నారు. 2.75 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో చవాన్ తన ప్రత్యర్థికన్నా ఒక అడుగు ముందే ఉన్నప్పటికీ విజయం అంత సునాయాసం కాబోదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధికి ఓటేయండి: సీఎం నాసిక్: మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించిందని కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేయాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని అన్నారు. తమ హయాంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. జిల్లాలోని పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన చవాన్ తమ ప్రభుత్వాలు అమలు చేసిన పలు పథకాలను ఏకరువు పెట్టారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని కాంగ్రెస్‌పార్టీ మాత్రమే చేయగలదని చెప్పారు. -
అభివద్ధికి ఓటు వేయండి: చవాన్
నాసిక్: మహారాష్ట్రలో అభివద్ధికి ఓటు వేయాలని ఓటర్లకు మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం సాధించిందని అన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చవాన్ తెలిపారు. -
‘ఉపసంహరణ’ పూర్తి..
సాక్షి, ముంబై: నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగడంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ జరగనుంది. మరోవైపు ఈసారి కూడా దాదాపు అన్ని పార్టీల్లోనూ తిరుగుబాటుదారుల బెడద కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,646 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో పరిశీలన పూర్తి తర్వాత 6494 నామినేషన్లు మిగిలాయి. కాగా చాలా మంది బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి వల్వీ తెలిపారు. అయితే ఉపసంహరించుకున్న వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని రాత్రి పది గంటల సమయంలో ‘సాక్షి’కి చెప్పారు. ఈసారి ఇండిపెండెంట్లతోపాటు పలు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు కూడా రద్దు కావడం విశేషం. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ పార్టీల అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పృథ్వీరాజ్ చవాన్ కోసం ఎన్సీపీ అభ్యర్థి ఉపసంహరణ.. కరాడ్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రికృతమైన దక్షిణకరాడ్ అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఎన్సీపీ ఊరటనిచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి రాజేంద్ర యాదవ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దక్షిణ కరాడ్ అసెంబ్లీ నుంచి పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేయనున్నారని తెలిసినతర్వాత స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులైన విలాస్‌కాకా ఉండాల్కర్కు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో చివరి రోజున ఎన్సీపీ రాజేంద్ర యాదవ్ నామినేషన్‌ను వెనక్కితీసుకోవాలని సూచించి, విలాస్ కాకాకు మద్దతు ప్రకటించింది. ఉపసంహరించుకున్న బీజేపీ అభ్యర్థి రమేష్ మాత్రే.. అసెంబ్లీ ఎన్నికల వాడివేడి కొనసాగుతున్న తరుణంలో కళ్యాణ్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రమేష్ మాత్రే తన నామినేషన్‌ను వెనక్కితీసుకున్నారు. ఈ సంఘటన బీజేపీకి షాక్‌నిచ్చిందని చెప్పవచ్చు. మొదట శివసేన టికెట్ ఆశించిన మాత్రేకు ఆ పార్టీ మొండిచేయి చూపడంతో తిరుగుబాటుచేసి రమేష్ మాత్రే బీజేపీలో చేరి కళ్యాణ్ రూరల్ నుంచి శివసేన అభ్యర్థి సుభాష్ భోయిర్‌కు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అయితే చివరి రోజు ఊహించని విధంగా రమేష్ మాత్రే నామినేషన్ వెనక్కితీసుకోవడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వర్సోవా అసెంబ్లీ శివసేన అభ్యర్థి నామినేషన్ రద్దు... పశ్చిమ అంధేరిలోని వర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన టికెట్‌పై బరిలోకి దిగిన రాజు పటేల్ నామినేషన్ ఫారాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం రద్దు చేసింది. నామినేషన్‌తోపాటు ప్రతి/్ఞ పత్రాన్ని జతపరచపోవడంతో నామినేషన్‌ను రద్దుచేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే ఈ విషయంపై రాజు పటేల్ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. -
వారిది గేమ్ ప్లాన్..
ముంబై: ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించడం ద్వారా కేంద్రంలో పదవులు పొందడం కోసమే ఎన్సీపీ తమతో పొత్తు తెగతెంపులు చేసుకుందని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ కోరిన తర్వాత ఏమాత్రం సమయం ఇవ్వకుండానే ఇక్కడ రాష్ట్రపతిపాలనకు కేంద్రం మొగ్గుచూపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సీపీ తొలగిన వెంటనే గవర్నర్ విద్యాసాగర్ రావు తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారన్నారు. అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించేలా కేంద్రం సంతకం చేయించిందని విమర్శించారు. అతడిని కనీసం న్యాయ సలహా కూడా తీసుకోనివ్వలేదని ఆరోపించారు. కాగా దీని వెనుక ఎన్సీపీ హస్తం కూడా ఉందని ఆయన విమర్శించారు. తమను 144 అసెంబ్లీ సీట్లు అడగటంతోపాటు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడే వారు తమతో పొత్తును తెగతెంపులు చేసుకోవడానికే సిద్ధపడిపోయారని అర్ధమైపోయిందని చవాన్ చెప్పారు. వారు ఈ విషయంలో ముందే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో మంత్రి పదవులు పొందేందుకు రాష్ట్రాన్ని వారికి ధారాదత్తం చేశారని విమర్శించారు. కాగా ఎన్సీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు నీటిపారుదల కుంభకోణంలో క్లీన్ చిట్ రావడంపై చవాన్ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ‘తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి చూశారు కదా.. 18 యేళ్ల తర్వాత ఆమెపై ఆరోపణలు కోర్టులో నిరూపించబడ్డాయి.. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. మాధవ్ చితాలే కమిటీ అతడి(అజిత్ పవార్)కి క్లీన్ చిట్ ఇచ్చి ఉంటే.. కోర్టు ఎందుకు పవార్, సునీల్ తత్కారేలపై విచారణకు ఆదేశించింది?.. నీటిపారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒక మంత్రి ఉండకూడదని చితాలే కమిటీ నివేదించింది. అయితే ఆ సమయంలో అజిత్ మంత్రి కాదా? మన న్యాయవ్యవస్థ కొంత నెమ్మదిగా స్పందించవచ్చేమో గాని చివరకు న్యాయమే గెలుస్తుంది.. జయలలితకు కూడా 18 యేళ్ల తర్వాతే దోషిగా తేలింది కదా..’ అంటూ వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్రలో ఉన్న అవినీతిని అంతమొందించడానికే సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించానన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో తన పనిని సంపూర్ణంగా చేయలేకపోయానని చెప్పారు. ఈసారి తమకు పూర్తి మెజారిటీ వస్తే.. మొదట రాష్ట్ర సహకార సంఘాలకు చైర్మన్‌గా మంత్రులను నియమించడాన్ని రద్దు చేస్తానన్నారు. మహారాష్ట్రకు కేంద్రం సాయం అవసరంలేదని, రాష్ర్ట అభివృద్ధికి కావాల్సిన వనరులు ఇక్కడే ఉన్నాయని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చవాన్ స్పందిస్తూ.. ఈ రాష్ట్రం భారతదేశంలో భాగమే తప్ప ప్రత్యేకంగా లేదు కదా.. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు పరిణతి లేని రాజకీయ వ్యాఖ్యలన్నారు. తమకు అధికారం ఇస్తే కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేస్తామని బీజేపీ నాయకులు ఇస్తున్న హామీలపై చవాన్ వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తమతో సత్సంబంధాలు కొనసాగించదా అంటూ ప్రశ్నించారు. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కేబినెట్ శనివారం సిఫార్సు చేయగా.. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనపై ప్రణబ్ సంతకం చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, దీంతో సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయడం తెలిసిందే. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: వచ్చే నెల 15న శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేసిన మరుసటి రోజునే ఢి ల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పదిహేనేళ్ల పొత్తుకు స్వస్తి చెబుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తన నివేదిక పంపుతూ, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. -
ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఎన్సీపీ తమ నుంచి విడిపోవడంతో ఇక సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ ఆసిమ్ అజ్మీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కలిసి చర్చలు జరిపారని సమాజ్‌వాదీ ప్రతినిధి అబ్దుల్ ఖాదిర్ చౌదరి చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు. శివాజీనగర్-మన్‌ఖుర్ద్ నుంచి అబూ ఆజ్మీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీవండి, కుర్లా, మిరాజ్, నాగపూర్ సెంట్రల్ స్థానాలను తాము కోరుతున్నామని చెప్పారు. విదర్భలో ప్రాబల్యం ఉన్న జోగేంద్ర కవాడే, సులభ కుంభారేలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలిసింది. -
షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరద్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్‌లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. -
మీ నాయకుడెవరు?
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బీజేపీకి సవాలు విసిరారు. నరేంద్ర మోడీ పేరిట ఓట్లు అడగటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజువారీ నిర్ణయాలు చేసేది ముఖ్యమంత్రి అని, ప్రధాన మంత్రి కాదని పేర్కొన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉన్నపక్షంలో వారిని తొలగించేందుకు వెనుకాడబోమని చవాన్ స్పష్టం చేశారు. యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అదే సమయంలో తమ నియోజకవర్గాలను తీర్చిదిద్దిన వారిని విస్మరించబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవానికి, యువతకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు చవాన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు. ఢిల్లీలో మాకు మోడీ ఉన్నాడని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది. ఇక్కడ రోజువారీ వ్యవహారాలను నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా?’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని అన్నారు. నాయకత్వం అంశంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఉద్ధవ్ ఠాక్రే నాయకునిగా ఉంటారని శివసేన ఇదివరకే ప్రకటించింది. ప్రజలు పార్టీని, పార్టీ విధానాలను, పార్టీ నేతను బట్టి ఎన్నుకుంటారని చవాన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ నాయకులను ప్రకటించాయని, బీజేపీ మాత్రమే ఇంతవరక వెల్లడించలేదని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలల కాలంలో అనేక ప్రజల నిర్ణయాల్లో మార్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల తీర్పు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్లు భిన్నంగా స్పందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు చవాన్ సానుకూలంగా స్పందించారు. అయితే గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాలను తీర్చిదిద్దిన ఎమ్మెల్యేలను వదిలివేయబోమని స్పష్టం చేశారు. మంచిపనులు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పారు. తమ పార్టీలో యువత, మహిళలు చురుకుగా పని చేస్తున్నారని, విద్యావంతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు. -
పొత్తా?.. ఒంటరి పోరా?
మహారాష్ట్రలో తేలని ప్రధాన కూటముల పొత్తుల కొట్లాట 119 కన్నా ఎక్కువ సీట్లివ్వబోమన్న శివసేన; 130 కావాలంటున్న బీజేపీ 124 ఇస్తానంటున్న కాంగ్రెస్; ఇంకా ఎక్కువ కోరుతున్న ఎన్సీపీ పొత్తులపై కాంగ్రెస్, ఎన్సీపీల కీలక భేటీ నేడు సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు కలసి పోటీ చేస్తాయా? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివసేన, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలోను.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో.. ఆయా పార్టీలు ఒంటరి పోరు దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ(సెప్టెంబర్ 27) దగ్గరపడుతుండటంతో నాలుగు ప్రధాన పార్టీలు ఒకవైపు పొత్తులపై చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు తమతమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి. అవసరమైతే సొంతంగా బరిలో దిగుతామంటూ ఒకవైపు కత్తులు దూస్తూనే.. పొత్తును కాపాడుకుంటామంటూ మరోవైపు ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు కూటములు. పాతికేళ్ల బంధం కొనసాగుతుందా? బీజేపీ, శివసేనల పాతికేళ్ల పొత్తుకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెబుతుండగా, 135 సీట్లు కావాలంటూ బీజేపీ కోరుతోంది. కనీసం 130 సీట్లైనా తమకు ఆమోదయోగ్యమేనని చెబుతోంది. ఆ ప్రతిపాదనకూ శివసేన ససేమీరా అంటోంది. ‘మేము 130 స్థానాలు కోరడం ద్వారా మేం ఒక ఉదాత్తమైన ప్రతిపాదన పంపాం. అదీ శివసేన ఏనాడు గెలవని స్థానాలనే మాకివ్వమంటున్నాం. దానికీ ఒప్పుకోకపోతే.. మొత్తం 288 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం స్పష్టం చేశారు. పొత్తును కాపాడేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారని.. సాయంత్రం ప్రధాని మోదీ కూడా ఉద్ధవ్‌కు ఫోన్ చేసి, సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపు ఉండాలని హితవు చెప్పారని సమాచారం. 20, 30 మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఉద్ధవ్ చెప్పిన 119 స్థానాలే తమ చివరి మాట అని శివసేన సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల పొత్తు భవితవ్యమేంటి? అధికార ప్రజాసామ్య కూటమి(డీఎఫ్)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 144 స్థానాలు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా.. 124 ఇస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం పార్టీ కోర్ కమిటీ భేటీలో.. పొత్తును కొనసాగించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 స్థానాలు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 15 ఏళ్ల పొత్తును కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం ఇరు పార్టీల మధ్య మరో భేటీ జరగనుందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను కొట్టివేశారు. కాంగ్రెస్ కూడా సీట్ల విషయంపై గట్టిగానే ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించామని పేర్కొంది. ఒకస్థాయిలో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరో స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు ఒకవైపు పొత్తు పట్లు కొనసాగుతుండగా.. మరోవైపు మోదీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ముస్లింపై మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. మాతృభూమిపై ముస్లింల దేశభక్తికి మోదీ గ్యారంటీ ఇచ్చి కొత్త అధ్యాయం లిఖించారని, ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అందులో పేర్కొంది. ముస్లింలను ప్రశంసించడాన్ని ..మోదీలో హిందుత్వవాదం సన్నగిల్లినట్లుగా చూడరాదని తెలిపింది. ప్రధానమంత్రిగా మోదీ అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారంది. నకిలీ లౌకికవాదులు మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారని తెలిపింది. -
వివాదం ముదిరేనా?
సాక్షి, ముంబై: దక్షిణ కరాడ్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే వివాదం మరింత ముదిరే అవకాశముంది. అక్కడి నుంచి పోటీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తుండగా, వదులుకునేందుకు సిద్ధంగా లేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విలాస్‌కాకా పాటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ అధిష్టానం దక్షిణ కరాడ్ నుంచి తనకు అభ్యర్థిత్వం ఇవ్వని పక్షంలో మరో పార్టీ నుంచైనా పోటీ చేస్తానని, ఒకవేళ అదికూడా వీలుకాకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని పాటిల్ పేర్కొన్నారు. దీంతో ఈ నియోజక వర్గంపై వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా పృథ్వీరాజ్ చవాన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశం ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఈ సమస్య ఎటూ తేలకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందగోళం నెలకొంది. వచ్చే నెల 15న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దక్షిణ కరాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందులోభాగంగా అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజక వర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన విలాస్‌కాకా పాటిల్ ఈ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తానని పేర్కొన్నారు. ‘దక్షిణ కరాడ్ నియోజక వర్గం నాకు కంచుకోట. ఇప్పటికే అక్కడినుంచి రెండుసార్లు గెలిచా. ఈ ఎన్నికల్లోనూ నా గెలుపు తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని వదులుకోను’అని అన్నారు. దీంతో చవాన్ ఇరకాటంలో పడిపోయారు. -
సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, ముంబై: షిర్డీలో 2018లో జరగనున్న సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ యాజ మాన్యం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. రూ.1,104 కోట్లతో కూడిన ప్రతి పాదనను పరిపాలనా విభాగానికి సమర్పించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి ృథ్వీరాజ్ చవాన్ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. రహదారులు, నీరు, విద్యుత్, ఆరోగ్యం తదితరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచనున్నారు. 2018 డిసెంబర్లో జరగనున్న సాయి సమాధి శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాదిమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. వారందరికి భోజనం, ప్రసాదంతోపాటు బస తదితర వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు వేలాదిగా వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి రాధాకృష్ఱ విఖేపాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలకోసం షిర్డీ సాయి ఆలయ సంస్థాన్‌తోపాటు ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తొలి విడత కింద కనుక రూ.153 కోట్లు మంజూరైతే షిర్డీలో రహదారుల మెరుగు పనులను ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. గత సంవత్సరం నాందేడ్‌లో సిక్కు మత పెద్దల శతాబ్ది ఉత్సవాలు ఏ స్థాయిలో జరిగాయో అదే స్థాయిలో షిర్డీలో కూడా సాయిబాబా సమాధి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. -
సరైన సమయంలో ‘పొత్తు’!
ముంబై: వచ్చే 15వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో తమ పొత్తుపై తుదినిర్ణయం సరైన సమయంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందస్తు పొత్తు మంచిదా.. లేక తర్వాత పొత్తు పెట్టుకుంటే మంచిదా అనేది చర్చల్లో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ఇప్పటివరకు 5 సార్లు ఎన్నికల్లో పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే ఆరోసారి అవుతుంది. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఎటువంటి పొత్తు లాభదాయకమో చర్చల ద్వారా నిర్ణయించుకుంటామని చవాన్ తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రజల మద్దతు పొందిన ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సీఎం పదవి చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరాటంపై ప్రశ్నించగా.. అతడు అధికారానికి కొత్త అని చవాన్ అన్నారు. గత బీజేపీ, సేన ప్రభుత్వంలో ఉద్ధవ్ పనిచేయలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే, ముంబై, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార బీజేపీ-శివసేన కూటమి అధ్వాన పాలనను తాము ఈ ఎన్నికల్లో తమ అస్త్రం గా వాడుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ముస్లింలు, మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన ్ల ప్రజాస్వామ్య కూటమి కల్పించిందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కృషిచేస్తున్నారని చవాన్ కొనియాడారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఒకేవిధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత విధానపరమైన నిర్ణయా ల్లో పురోగతిపై దృష్టిపెట్టానని చవాన్ చెప్పారు. ప్రచారానికి సోనియా, రాహుల్ ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ప్రచారానికి మొత్తం 40 మంది పార్టీల ప్రముఖుల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ వెల్లడించారు. ఆజ్‌తక్ చానెల్ ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయం చెప్పారు. అభివృద్ధి విషయంలో గుజరాత్ కంటే తాము అన్ని విధాలా ముందు ఉన్నామని స్పష్టీకరించారు. ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు నడిపిస్తామని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు. -
కారుపై ఎర్రబుగ్గను తొలగించే ప్రసక్తే లేదు!
ముంబై: తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గ (రెడ్ బీకాన్)ను తొలగించేది లేదంటూ ముంబై నగర్ మేయర్ స్నేహాల్ అంబేకర్ తేల్చిచెప్పారు. ఆమె కొత్తగా మేయర్ గా ఎన్నికైన అనంతరం తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను కల్గి ఉండటంతో వివాదం చెలరేగింది. దీంతో స్పందించిన ఆమె.. ముఖ్యమంత్రి వాహనంపై ఎర్రబుగ్గకు అనుమతి ఇచ్చి.. మేయర్ కారుపై తొలగించాలని పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. అంతేకాకుండా మేయర్ పదవి అనేది సీఎం పదవితో సమానం అంటూ ఎద్దేవా చేశారు. 'మేయర్ స్థానం సీఎం స్థానంతో సమానం. సీఎం వాహనంపై రెడ్ బీకాన్ ఉంటుంది. మరి నాకు ఇబ్బంది ఏంటి' అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా అభిప్రాయాన్ని అడిగితే ఇది సమాధానం చెబుతానని ఆమె మొండికేశారు. సీఎం అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను వాడగా అభ్యంతరం లేనిది.. తన వరకూ వచ్చేసరికి ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. ' ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నియమాలు కూడా ఉంటాయ్' అని స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ నియమావళిలో మేయర్ వాహనంపై రెడ్ బీకాన్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని మాజీ మేయర్ సునీల్ ప్రభూ కూడా ఖండించారు. మేయర్ తన అధికారి కారుపై ఎర్రబుగ్గను వాడటం ఒక సాంప్రదాయంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. -
ప్రధాని కార్యక్రమంపై టీచర్లు, తల్లిదండ్రుల తీవ్ర అసంతృప్తి
ముంబై: ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులతో టీవీద్వారా నేరుగా సంభాషించాలనే ప్రధాని ప్రతిపాదనపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సున్నితంగా ఉండాలనే ఉద్దేశంతో తాము సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని తిలక్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్కులర్లోని అంశాలు సరిగా లేవని, దీనిని ఈ అంశాన్ని సరైన వేదికపై ప్రస్తావిస్తామన్నారు. ఒక్క వ్యక్తికి ప్రచారం కల్పించేందుకు మొత్తం యంత్రాంగాన్ని వాడుకుంటున్నారన్నారు. ప్రధాని ప్రసంగాన్ని విద్యార్థులు ఆలకించాలనడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. కాగా ప్రధాని కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని, ఎటువంటి ఒత్తిళ్లు ఉండబోవని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. పాలన విఫలం ప్రధానమంత్రి నరేంద్రమోడీ 100 రోజుల పాలన విఫలమైందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. కనీసం హోం శాఖ మంత్రి సైతం తన అనయాయుడికి పదవిని ఇప్పించుకోలేని స్థితిలో పడిపోయారన్నారు. నాయకత్వ లోపమే కారణం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కేంద్రంలో సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని చవాన్ ఆరోపించారు. ప్రధాని షోలాపూర్ పర్యటనకు ముందే విద్యుత్ సంక్షోభంపై హెచ్చరించానన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆనా టి సభలో తాను ప్రసంగించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయించిన కోటాలో కేవలం 60 శాతం బొగ్గు మాత్రమే వస్తోందన్నారు. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలోని అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయన్నారు. ఇక ఎన్నికల విషయమై మాట్లాడుతూ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా యన్నారు. -
గుజరాత్ కంటే మేమేముందున్నాం..
ముంబై: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ అనుసరించిన గుజరాత్ అభివృద్ధి నమూనా గురించి చర్చ జరుగుతుండడం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాత్రం ఈ విధానంతో ఒరిగేదీ ఏమీ లేదన్నారు. అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం కంటే తాము ముందంజలో ఉన్నామని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గత 15 ఏళ్లలో తమ ప్రభుత్వం మహారాష్ట్రను గుజరాత్ కంటే ఎక్కువే అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. ‘ప్రతి రంగంలోనూ మేం గుజరాత్ కంటే ముందే ఉన్నాం. మోడీ చేసింది.. మేం చేయనిది ఏంటి ? ఉద్యానవనాలు, పారిశ్రామికీకరణ, విద్య, వైద్యం.. ఇలా అన్నిరంగాల్లో మేం పురోగతి సాధించాం. మాది పూర్తిగా పరిశ్రమల అనుకూల విధానం. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తుల్లో 18.4 శాతం మా రాష్ట్రం నుంచే వస్తున్నాయి. స్థూల దేశీయ ఉత్పత్తిలోనూ మా వాటా 14.09 శాతం. మా రాష్ట్రానికి రూ.14,73,466 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే గుజరాత్‌కు వచ్చిన వాటి విలువ రూ.13,98,347 కోట్లు మాత్రమే. పోషకాహార లోపాలను నివారించేందుకు మేం చేసిన కృషిని యూనిసెఫ్ కూడా ప్రశంసించింది. చిన్నారుల్లో ఎదుగుల లోపాలను కూడా చాలా వరకు అరికట్టగలిగాం. ఇక నుంచి పారిశ్రామిక కేంద్రాలు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తాం. 10, 12వ తరగతుల విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రైవేటు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఫలితంగా వ్యవ సాయరంగంలోకి ఆధునిక పరిజ్ఞానం ప్రవేశించి మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియజేసేందుకు మేం ప్రత్యేకంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తాం. మోడీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. మాది వ్యక్తిగత ప్రచారం కాదు. సమష్టిగా ప్రజప్రయోజనం కోసం దీనిని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. ఈసారి కూడా గెలుపు మాదే.. ముఖ్యమంత్రి, పార్టీ వేర్వేరు కాదని, పార్టీ గెలిస్తే నాయకులు, కార్యకర్తలంతా గెలిచినట్టేనని స్పష్టం చేశారు. ప్రజల్లో తనపై సానుకూల అభిప్రాయం ఉంటే, అది ఎన్నికల్లో బయటపడుతుందన్నారు. ‘ప్రజలు నన్ను మరోసారి సీఎంగా కోరుకుంటే ఓట్లు వేస్తారు. యూపీఏ-2 ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో దానికి పరాభవం తప్పలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మేం పరాజయం పాలయ్యాం. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిం చడం ద్వారా ఈ వైఫల్యాన్ని అధిగమిస్తాం. అధికార వ్యతిరేకత మాకు సమస్యే కాదు. మా ప్రభుత్వం ఏం చేసిందనేదే ప్రజలకు ముఖ్యం’ అని అన్నారు. ఎన్నికల కోసమే మరాఠాలు, ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్న విమర్శలకు బదులిస్తూ ఈ వర్గాల వెనుకబాటుతనంపై అన్ని రకాల అధ్యయనాలు పూర్తి చేసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. ఎన్సీపీని మా కార్యకర్తలు నమ్మడం లేదు.. కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహారాష్ట్రను గత 15 ఏళ్లుగా ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని ఎన్సీపీ పట్టుబట్టడంతో ఇరు పక్షా ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీట్ల పంపకాలపై చర్చలు స్తంభించాయి. ఎన్సీపీ వైఖరిపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ చర్యలన్నీ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు తమ కార్యకర్తలు భావిస్తున్నారని చవాన్ చెబుతున్నారు. అయితే ఈసారి కూడా ఎన్సీపీతో కలసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ‘కాంగ్రెస్‌ను ఓడించాలని ఎన్సీపీ పలుసార్లు స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపింది. అందుకే మా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది’ అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ తమకు 144 కేటాయించాల్సిందేనని ఎన్సీపీ అగ్రనాయకుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ కాంగ్రెస్ కంటే రెండు ఎక్కువ సీట్లు సాధించడంతో పవార్‌తోపాటు మరికొంద రు నాయకులు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. లేకుంటే ఒంటరిగానే పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై చవాన్ స్పందిస్తూ ‘అధిష్టానం సూచన మేరకు సీట్ల సర్దుబాటు గురించి నేను చాలా సార్లు ఎన్సీపీ వాళ్లతో మాట్లాడాను. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. ఇవి నాతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి పరీక్ష వంటివి. ఈసారి బీజేపీ ఓడిపోతే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధిం చిన విజయం పాలపొంగు వంటిదని ప్రజలు భావించే పరిస్థితి వస్తుం ది’ అని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. -
మెట్రోకు భూమిపూజ
సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం మరోల్‌లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
మోడల్‌పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!
ముంబయి: మోడల్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ సునీల్ పరాస్కర్కు ఊచ్చు బిగుసుకుంటుంది. సునీల్‌ను విధులు నుంచి తొలగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారి మంగళవారం ముంబైలో వెల్లడించారు. ఆయనకు ఇప్పటికే ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 25న ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై మాజీ అదనపు నగర కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్(57) ... 2012లో ఓ కేసు విచారణకు సంబంధించి తాను పరాస్కర్‌ను కలిసినప్పుడు తనకు సన్నిహితంగా ఉన్న పరాస్కర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మలవానీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను కలసి పరాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. మరోవైపు పరాస్కర్‌పై ఆరోపణలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సునీల్‌ను విధుల నుంచి తప్పించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర సర్కార్ సునీల్‌పై చర్యలకు ఉపక్రమించింది. -
పోటీకి రాజ్ దూరం
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్‌ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ తనవేనని, ప్రస్తుతం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నాసిక్ లేదా ముంబైలో ఏదో ఒక శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని రెండు నెలల కిందట ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. కచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇటు ప్రజల్లో, అటు ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా...? ఆ నియోజకవర్గానికే పరిమితమవుతాను. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నాను. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ నావే’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం తరువాత మే 31న మొదటిసారి బహిరంగా సభ ఏర్పాటుచేసి ప్రజల ముందుకు వచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా ఏంటో నిరూపిస్తానని ప్రకటించారు. దీంతో ఠాక్రే కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి రాజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీచేయడం లేదని తాజాగా ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘మా కుటుంబంలో ఇంతవరకు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మా ‘జన్యుపరమైన’ సమస్య’ అంటూ చమత్కరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం ఇస్తే మహారాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఏం చేస్తామో తెలియజేసే మార్గదర్శక నివేదికను (బ్లూప్రింట్) వచ్చే వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని ఈ సందర్భంగా రాజ్ స్పష్టం చేశారు. మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని ప్రశంసించిన ఠాక్రే ఆదివారం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటీవల నాగపూర్‌లో మోడీ సభను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బహిష్కరించడం సబబేనని అన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించి, అవమానించడం సరికాదన్నారు. చివరగా రాజ్ మాట్లాడుతూ కేవలం తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లోనేగాక మొత్తం 288 శాసనసభ స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. -
కావాలనే అవమానించారు
బీజేపీ హామీ ఇస్తేనే మోడీ సభలకు వెళ్తానని స్పష్టీకరణ సాక్షి, ముంబై: బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించేంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే షోలాపూర్ సభలో తనను అవమానించారని స్పష్టం చేశారు. షోలాపూర్‌లో మోడీ సభ సందర్భంగా కొందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చవాన్ ప్రసంగం ఆపాలని, మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీంతో సీఎం ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి చెందినట్టు సీఎం చెప్పారు. తనతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు వ్యతిరేక ంగా బీజేపీ కార్యకర్తలు ఇలాగే వ్యవహరించారని విమర్శించారు. అందుకే తాము మోడీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని హామీ లభిస్తే ఆయన కార్యక్రమాలకు హాజరవుతానని పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పుణే మెట్రో లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై తాను అసంతృప్తి చెందలేదని సీఎం వివరణ ఇచ్చారు. మోడీ ఎలా బాధ్యుడు ? ప్రధాని సభల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రుల ప్రసంగాలను అభిమానులు అడ్డుకుంటే దానికి నరేంద్ర మోడీ ఎలా బాధ్యుడని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. షోలాపూర్ సభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రసంగాన్ని అడ్డుకున్న వాళ్లు గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో రాలేదు. వీళ్లంతా మహారాష్ట్ర వాళ్లే. హర్యానా, జార్ఖండ్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇలాగే పరాభవం జరిగింది’ అని శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. మోడీ భారీ ప్రజామద్దతుతో గెలిచారని, అందుకే ఎక్కడైనా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మూడు రోజుల క్రితం నాగపూర్‌లో జరిగిన మోడీ సభకు చవాన్ గైర్హాజరు కావడం దురదృష్టకరమని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. అక్కడి సభలో ప్రజల నినాదాలు గమనిస్తే కాంగ్రెస్‌పై వారికి ఎంత విముఖత ఉందో స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషించింది. యూపీఏ హయాంలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోందని సామ్నా వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సులు జరిగినప్పుడు మోడీని సవతి సోదరుడి మాదిరిగా చూసే వారని ఉద్ధవ్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ నాగపూర్‌లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహ రించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్ సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్య క్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నా రని విమర్శించారు. -
చవాన్ డుమ్మా కరెక్టే: నితిన్ రౌత్
నాగపూర్: ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి తమ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ గైర్హాజరు కావడాన్ని మహారాష్ట్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి నితిన్ రౌత్ సమర్థించారు. సోలాపూర్ లో మోడీ సభలో పరాభవం ఎదువడంతో చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులను అవమానించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు భూపిందర్‌సింగ్ హూడా, హేమంత్ సోరెన్‌కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది. -
సోరెన్‌కూ తప్పని అవమానం
మోడీ పర్యటన సభలో బీజేపీ కార్యకర్తల నిరసన ప్రజాస్వామ్యంపై అత్యాచారమన్న సొరేన్ మా సీఎంలపై కుట్ర: కాంగ్రెస్ రాంచీ: మహారాష్ర్ట, హర్యానా ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, భూపిందర్‌సింగ్ హూడాల తరహాలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా మోడీ మద్దతుదారుల నుంచి అవమానం ఎదురైంది. రాంచీలో జరిగిన సభలో మోడీ సమక్షంలో సోరెన్ ప్రసంగించేందుకు మైకు వద్దకు రాగానే మోడీ మద్దతుదారులు అడ్డుతగిలారు. మోడీ అనుకూల నినాదాలతో సభను హోరెత్తించారు. సంయమనం పాటించాలంటూ మోడీ సూచించినా సోరెన్ ప్రసంగం ముగిసే వరకూ నినాదాలు చేశారు. ప్రధాని హర్యానా, మహారాష్ట్ర పర్యటనల్లోనూ హూడా, చవాన్లకు ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రధాని సభకు చవాన్ గైర్హాజరయ్యారు. ప్రజాస్వామ్యంపై అత్యాచారం: సోరెన్ రాంచీ సభలో మోడీ మద్దతుదారులు తన ప్రసంగానికి అడ్డుపడటంపై జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేంఎంఎం) నేత హేమంత్ సోరెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై అత్యాచారంగా అభివర్ణించారు. సీఎం హోదాలో ప్రసంగిస్తున్న తనను మోడీ మద్దతుదారులు గేలి చేస్తూ అవమానించడం ఎంతో బాధించిందన్నారు. కాగా, మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఎంఎం డిమాండ్ చేసింది. సీఎంల గేలి వెనక కుట్ర: కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను మోడీ మద్దతుదారులు ఎగతాళి చేయడం వెనక మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మద్దతుదారులను పురికొల్పడం ద్వారా సీఎంలను అవమానించే హక్కు ఎవరికీ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంబికా సోని పేర్కొన్నారు. మోడీ సభలకు 500 మంది కార్యకర్తలను పంపి ఎగతాళి చేయించడం తమకు పెద్ద కష్టమేమీ కాదని...కానీ ఆ చర్య ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అగ్ర పథానికి దేశాన్ని అభివృద్ధి బాటలో అగ్ర పథానికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సమతౌల్య అభివృద్ధి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. అదే సమయంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. గురువారం జార్ఖండ్‌లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాంచీ-ధరమ్జేగఢ్-సిపాత్ల మధ్య రూ. 1,600 కోట్లతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 765 కేవీ అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. (తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన తొలి అంతర్రాష్ట్ర లింకు ఇదే. దీని ద్వారా తూర్పు ప్రాంతంలోని మిగులు విద్యుత్‌ను పశ్చిమ ప్రాంతం మీదుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు బదిలీ చేసే వీలు కలుగుతుంది.) అలాగే దేవ్‌గఢ్ జిల్లాలోని జాసిదిహ్లో ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 109 కోట్లతో నిర్మించిన ఆయిల్ టర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఉత్తర కరాన్పురాలోని ఛాత్రాలో ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంటు (ఒక్కోటీ 660 మెగావాట్ల సామర్థ్యంగల మూడు యూనిట్లు) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాంచీలో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ అభివృద్ధిలో గుజరాత్‌ను ఎన్నో రెట్లు అధిగమించగల సామర్థ్యం జార్ఖండ్‌కు ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల వెనకబడిపోయిందని...ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శంకుస్థాపన చేసిన ఉత్తర కరాన్పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును గత యూపీఏ ప్రభుత్వం పదేళ్లుగా పెండింగ్‌లో పెట్టి రాష్ర్ట ప్రజలకు అన్యాయం చేసిందని విమర్శించారు. తన ప్రభుత్వం ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీకి రావాల్సిన అవసరం లేకుండానే జార్ఖండ్‌కు ఏటా రూ. 400 కోట్ల లబ్ధి చేకూర్చేలా ఖనిజ మైనింగ్‌పై రాయల్టీని పెంచిందన్నారు. నిరంతర విద్యుత్‌కు ప్రాధాన్యం... జార్ఖండ్ పర్యటన అనంతరం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోడీ...నాగ్‌పూర్‌లోని మౌడాలో రూ. 5,459 కోట్ల వ్యయంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. అలాగే నాగ్‌పూర్‌లో మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని గ్రామాలకూ నిరంతర విద్యుత్‌ను అందించేందుకు తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి మహమ్మారిని రూపుమాపుతానన్నారు. -
ప్రధాని సభకు డుమ్మా
సాక్షి ముంబైః ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. ముందుగా పేర్కొన్నట్టుగానే వీరు ఈ కార్యక్రమాలను బహిష్కరించారు. వీరితోపాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నితిన్ రావుత్ కూడా హాజరుకాలేదు. పుణే, షోలాపూర్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమాల సందర్భంగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం తెలిసిందే. బొగ్గు కుంభకోణం, యూపీఏ అవినీతి వంటి అంశాలను ప్రస్తావించడంతో చవాన్ ఇబ్బందిపడ్డారు. మోడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే నాగపూర్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లడంలేదని, ప్రభుత్వం తరఫున ఒక అధికారి మాత్రం వెళ్లనున్నట్టు పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయం సబబుకాదు: బీజేపీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ తీసుకున్న నిర్ణయం సబబుకాదని ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే పేర్కొన్నారు. అభివృద్ధిలో బాగంగా ఎంతో కీలకమైన ప్రాజెక్టుల కోసం నిర్వహించిన కార్యక్రమానికి స్వయానా ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. పృథ్వీరాజ్ చెప్పినట్టుగా ప్రధాని ఎవరినీ అవమానించలేదన్నారు. చవాన్ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. చవాన్ చర్య సరైందే: కాంగ్రెస్ నాగపూర్‌లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహరించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్‌లో శనివారం నిర్వహించిన సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. -
సరిహద్దు వివాదం..
ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శివసేన మండిపడింది. మహారాష్ట్ర రాజకీయ పార్టీల వల్లే ఈ అంశం తీవ్రరూపం దాల్చుతోందని కన్నడ సీఎం విమర్శించారు. రామయ్య మాటలకు ధీటుగా బదులు చెప్పాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మంగళవారం డిమాండ్ చేసింది. బెల్గాం వివాదంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. సరిహద్దు గురించి మహారాష్ట్రతో ఎలాంటి వివాదమూ లేదని, మహాజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. దీనిపై సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదానికి మహాజన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఒక్కటే మార్గమని రామయ్య స్పష్టీకరించారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయినా ఈ విషయంలో రామయ్యకు ధీటైన బదులు చెప్పాలని సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం అభిప్రాయపడింది. బెల్గాం వివాద పరిష్కారానికి మహాజన్ కమిటీ ఒక్కటే పరిష్కారం చూపలేదని వ్యాఖ్యానించింది. స్వార్థప్రయోజనాల కోసం మహారాష్ట్ర నాయకులు బెల్గాం వివాదం సద్దుమణగకుండా చూస్తున్నారని రామయ్య విమర్శించారు. కర్ణాటక సరిహద్దు పట్టణం బెల్గాంలో ఇబ్బందిపడుతున్న 20 లక్షల మంది మరాఠీల గురించి మాట్లాడడం తప్పెలా అవుతుందని సామ్నా నిలదీసింది. కర్ణాటక అధికారులు మరాఠీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే ఈ సమస్య కొనసాగుతూనే ఉందని ఆరోపించింది. ‘ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న మరాఠీ ప్రజలకు రామయ్య కృతజ్ఞతలు చెప్పాలి’ అని పేర్కొంది. బెల్గాం యెల్లూర్ గ్రామంలో మహారాష్ట్రకు అనుకూలంగా ఒక ఉన్న సైన్‌బోర్డు తొలగింపుపై గత నెల హింస చెలరేగింది. దీనిపై చవాన్ రామయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనను సేన తీవ్రంగా ఖండించింది. ఇది కన్నడిగుల ఉగ్రవాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భగవత్ వ్యాఖ్యలకు ఉద్ధవ్ సమర్థన భారత్ హిందూదేశమన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాఖ్యలను శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే సమర్థించారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని స్పష్టీకరించారు. బాల్‌ఠాక్రే కూడా ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారని, దీనిపై తమ వైఖరి మారబోదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న వారంతా హిందూ సంస్కృతి నుంచి వచ్చినవారేనని కూడా భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ప్రణాళికాసంఘం రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించడానికి కూడా ఉద్ధవ్ తప్పుబట్టారు. ఆ సంఘంతో ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘సంఘం రద్దుపై చవాన్ అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లలో ప్రణాళికాసంఘం ప్రజలకు చేసిన మేలేంటో ఆయన తెలియజేయాలి’ అని అన్నారు. కాశ్మీరీ వేర్పాటువాద నేతతో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం చర్చలు జరపడంపై మాట్లాడుతూ ఇక నుంచైనా ప్రభుత్వం పాకిస్థాన్‌తో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాక్ హైకమిషన్ చర్యకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఇరు దేశాల విదేశీ కార్యదర్శుల సమావేశాలను రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. -
జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ
రాయ్‌గఢ్ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాంతాన్ని సందర్శించడంతో తన జన్మ ధన్యమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నవశేవాలో సెజ్‌కు శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. నౌకాశ్రయాల అనుసంధానానికి రూ.1,926 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా భూమిపూజ నిర్వహించారు. షోలాపూర్‌లోనూ పవర్ గ్రిడ్‌ను ఆవిష్కరించారు. సాక్షి, ముంబై: ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్రలో తొలిసారిగా రాయగఢ్‌కు రావడంతో తన జన్మ ధన్యమయిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాచీన హిందూ నగర రాజధాని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాయగఢ్ నవశేవాలో రూ.నాలుగు వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నవశేవాలోని ‘జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్’ (జేఎన్పీటీ) సమీపంలో దీనిని నిర్మిస్తారు. బీజేపీ పాలనలో భూమిపుత్రులకు (అన్నదాతలు) అమిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అన్న నినాదంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ చివర్లోనూ ఇదే నినాదం చేసి రాయగఢ్ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అదేవిధంగా నౌకాశ్రయాల అనుసంధానం కోసం రూ. 1,926 కోట్లతో నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు కూడా మోడీ భూమిపూజ నిర్వహించారు. భూమిపుత్రులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ విద్య,ఆరోగ్యంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయగఢ్ పర్యటనతో తన జన్మ ధన్యమయిందని వ్యాఖ్యానించినప్పుడు చప్పట్లు మార్మోగాయి. ఈ సెజ్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ సందర్భంగా మోడీ చేతుల మీదుగా భూములు పంపిణీ చేశారు. విలాస్ జోషి, బాలకృష్ణ ధరణే, మధుకర్, ఠాకూర్, కమలాకర్ ధరణే తదితరులకు భూమి పత్రాలు అందజేశారు. ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది... మనదేశానికి దిగుమతులకంటే ఎగుమతుల అవసరం అధికంగా ఉందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యువశక్తితో ఎగుమతులను వృద్ధి చేయవచ్చన్నారు. ‘ఓడరేవులు దేశానికి ప్రవేశద్వారాలుగా మారాలి. ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడాలి. ఇలా జరిగితే మన జాతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమార్కెట్ లో మనదేశంసుస్థిరస్థానాన్ని సాధించగలుగుతుం ది. అంతర్జాతీయ విపణిలో సముద్రవాణిజ్యం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కం టెయినర్లు హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాయి. భవిష్యత్‌లో సముద్ర వాణిజ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. అందుకే రేవు పట్టణాల్లో ‘సాగర్మాల’ పథకాలను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. వీటి వల్ల తీర ప్రాంతాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చవాన్.. ఆందోళన చెందకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 146 సెజ్‌ల గురించి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ముందుకు కదలడం లేదని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ స్పందిస్తూ సెజ్‌ల పురోగతిపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ‘రోగులను బాగుచేసేందుకు మంచి డాక్టర్ అవసరం. అలాంటి డాక్టర్ లభించారు. మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్‌నారాయణ, ప్రతిపక్ష నాయకులు ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తాం షోలాపూర్, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా పుష్కలంగా విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం 365 రోజులు విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమన్నారు. షోలాపూర్‌కు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్న నరేంద్ర మోడి హోం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. షోలాపూర్-పుణే నాలుగు లైన్ల రహదారి, పవర్గ్రిడ్నును జాతికి అంకితం చేశారు. అలాగే షోలాపూర్-సంగారెడ్డి, షోలాపూర్-ఎడిషి వరకు నిర్మించబోయే నాలుగులైన్ల రహదారులకు శంకుస్థాపన చేశారు. గవర్నర్ కె. శంకర్నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎంపీ రవీంద్ర గైక్వాడ్, వినోద్ తావ్డే, దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే జపాన్ రాయబార కార్యాలయ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘బీఎస్పీ.. బిజ్లీ(కరెంటు), సడక్ (రోడ్లు), పానీ (నీరు)కి తమ ప్రభుత్వం అత్యధికం ప్రాధాన్యం ఇస్తుంది. కరెంటు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటేనే మంచి దిగుబడి సాధిస్తాడు. సువిశాల రహదాలు ఉంటేనే ధాన్యాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మవచ్చు. మనదేశంలో వర్షాలకు కొదవ లేదు. ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ మూడూ సక్రమంగా ఉంటే రైతులు దేశంలో బంగారం పండిస్తారు. షోలాపూర్ పవర్‌గ్రిడ్ ద్వారా దేశంలోని నలుమూలలకూ విద్యుత్ సరఫరా చేయవచ్చు’ అని మోడీ అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సరిపడా బొగ్గు, గ్యాస్‌ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి చవాన్ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్స్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, మరమగ్గాలు అధికంగా ఉన్న షోలాపూర్ వంటి పట్టణాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ నాలుగులైన్ల రహదారులు, విద్యుత్ ఉత్పత్తికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే చవాన్ ప్రసంగం ప్రారంభించగానే.. జనం ‘వద్దు వద్దు’ అంటూ నినాదాలు చేయగా, మోడీ వారించారు. దీంతో కేవలం ఐదు నిముషాల్లో చవాన్ ప్రసంగం ముగిసింది. -
మధ్యతరగతికి సొంత ఇల్లు
ముంబై: రాష్ట్రంలోని నగరాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మంత్రాలయ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముంబై సహా ఇతర మహా నగరాల్లో నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. త్వరలోనే దీనికోసం కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో మహారాష్ట్రను ‘ఆన్లైన్’ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చవాన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తమకు కావాల్సిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చునన్నారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పారదర్శక, స్ఫూర్తిదాయక పాలన అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు సైతం ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ ప్రభుత్వం మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల వల్ల మైనారిటీ వర్గాలైన ముస్లింలు, మరాఠాలు ఉద్యోగ,విద్యా రంగాల్లో తగిన అవకాశాలు పొందగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకం ద్వారా లబ్ధిదారులు పైసా ఖర్చు లేకుండానే తగిన వైద్య సేవలు పొందగలుగుతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.62 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం వీరి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.712 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఇదిలా ఉండగా, నాగపూర్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి నితిన్ రావుత్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధాని అయిన నాగపూర్‌ను దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆలోచనలకు రూపంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు డీఎఫ్ సర్కార్ కృషిచేస్తోందని అన్నారు. నగరానికి పశ్చిమంలో 1800 ఎకరాల్లో గోరెవాడా జూను అభివృద్ధిచేసేందుకు కార్యాచరణ రూపొంది స్తున్నామన్నారు. పుణ్యక్షేత్రమైన సుఫీ సెయింట్ బాబా తాజుద్దీన్ సమాధి వద్ద రూ.132.49 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే ఆహార భద్రత చట్టం కింద సుమారు 7.17 కోట్ల మందికి ఆహార దినుసులను అందజేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.900 కోట్లు ఖర్చుపెడుతోందని రావుత్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కృష్ణ, పోలీస్ కమిషనర్ కె.కె.పాఠక్, డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గడ్చిరోలీ జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ‘మాఝీ ముంబై- నిర్మల్ ముంబై’ డ్రైవ్ ప్రారంభం ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ‘మాఝీ ముంబై-నిర్మల్ ముంబై’ అనే కార్యక్రమాన్ని ధారవిలో ప్రారంభించారు. నగరంలో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో చెత్త సమస్య చాలా ఎక్కువగా ఉంద న్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు చవాన్ వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. -
ప్రీమియం పన్ను రద్దు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు బాధితులకు అందజేసే స్థలంపై ‘ప్రీమియం పన్ను’ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతి పాదనపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోద ముద్రవేశారు. దీంతో ఇక్కడి నివాసులకు, రైతులకు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొంతమేర ఊర ట లభించినట్లయింది. నవీముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణం కోసం అనేక మంది తమ స్థలాలు కోల్పోయారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇలాంటి బాధితులకు నష్ట పరిహారంతోపాటు 22.5 శాతం ప్రత్యామ్నాయ భూములు ప్రభుత్వం అందజేయనుంది. అయితే ఈ భూములకు ‘లీజు ప్రీమియం పన్ను’ సిడ్కోకు చెల్లించాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. నవీముంబైలో ఉన్న స్థలాలన్నీ సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలాలను నివాసులకు, పరిశ్రమలకు, ఇతర ప్రయోజనాలకు 60 ఏళ్ల కోసం లీజుకు ఇచ్చింది. అందుకు సిడ్కో వీరి నుంచి లీజు ప్రీమియం వసూలు చేస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత విమానాశ్రయం ప్రాజెక్టు కోసం స్థలా లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం అందజేస్తున్న 22.5 శాతం భూమిపై లీజు ప్రీమి యం తీసుకోకూడదని సిడ్కో నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం నిర్మాణం కోసం 2,268 హెక్టార్ల భూమి అవసరముండగా సిడ్కో ఆధీనంలో 1,572 హెక్టార్ల స్థలం ఉంది. అదనంగా 671 హెక్టార్ల స్థలం సేకరించాల్సి అవసరం ఏర్పడింది. సుమారు పది గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. అందుకు బాధితులకు పుష్పనగర్ ప్రాంతంలో 22.5 శాతం స్థలాన్ని అందజేయనున్నారు. ఈ స్థలానికి ఎలాంటి లీజు ప్రీమియం పన్ను వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో సిడ్కో సుమారు రూ.70 కోట్లు ఆదాయం కోల్పోయినట్లే. గతంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆం దోళనలు నిర్వహించారు. ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం, వివిధ ప్యాకేజీలు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు కొద్ది నెలలు అటకెక్కింది. చివరకు రాజ కీయ నాయకులు, స్థానిక ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. బాధితుల డిమాండ్ ప్రకారం ప్రత్యామ్నాయ స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే లీజు ప్రీమియం పన్ను విషయం తెరమీదకు వచ్చింది. దీనిపై ఎటూ తేలకపోవడంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఎట్టకేలకు లీజు ప్రీమియం పన్ను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందుకురావడంతో ఓ పెద్ద సమస్య పరిష్కారమైందని ప్రజలు, అధికారులు భావిస్తున్నారు. -
ముంబై మెట్రో రైళ్లలో భద్రత డొల్ల
సాక్షి, ముంబై : మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కరువైంది. కొందరు ఆకతాయిలు ఒక బోగీ నుండి మరో బోగిల్లోకి తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మెట్రో రైల్లో ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వివషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలా ఫిర్యాదులకు నోచని సంఘటనలెన్నో ఉన్నాయి. ఈనేపథ్యంలో మెట్రో రైళ్లలో మహిళల కోసం ప్రత్యేక బోగీని కేటాయించాలన్న డిమాండ్ మరింత ఊపందుకొంది. ప్రత్యేక బోగీలు లేవు ఘాట్కోపర్-డీఎన్నగర్ల మధ్య నడిచే మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తీవ్రమైంది. ముఖ్యంగా మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక బోగీలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైళ్లలో నాలుగు బోగీలుంటాయి. ఒక బోగీ నుండి మరో బోగీలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఈక్రమంలో ఆకతాయిలు ఒకబోగీ నుంచి మరోబోగీలోకి వెళ్తూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మెట్రో రైలుకు ఉండే నాలుగు బోగీలల్లో ఒక బోగీని మహిళల కోసం కేటాయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ‘అన్ని ప్రాంతాల్లో సీసీటీవి కెమెరాలున్నాయని, మహిళల భద్రతకు ఎలాంటి ఢోకాలేదని ముంబే మెట్రోవన్ ప్రెవైట్లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) ప్రకటించింది’. కానీ, జూలై 4వ తేదీ జరిగిన సంఘటన అనంతరం మహిళ ప్రయాణికుల భద్రతపై తక్షణమే స్పందించాలని మహిళలు పట్టుబడుతున్నారు. రైళ్లలో మహిళల భద్రతపై ఘాట్కోపర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలి : ఎన్సీడబ్ల్యూ మెట్రో రైళ్లో మహిళలకు ప్రత్యేక బోగీ కేటాయించాలని ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా’ (ఎన్సీడబ్ల్యూ) మహారాష్ట్ర శాఖ డిమాండ్ చే స్తోంది. ఈ విషయంపై ఎన్సీడబ్ల్యూ మహారాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శుశిబేన్ షా మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలోనైనా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని అన్నారు. మెట్రో రైళ్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. -
గెలుపుగుర్రాలకే టికెట్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఈసారి గెలుపుగుర్రాలకే టికెట్లు లభిస్తాయని, వారిలో నాయకుల బంధువులు ఉండొచ్చు... ఉండకపోవచ్చునని సీఎం వ్యాఖ్యానించారు. ఆగస్ట్ క్రాంతి దినాన్ని పురస్కరించుకుని శనివారం సీఎం,పలువురు నాయకులు ఆగస్ట్ క్రాంతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు.. వారిలో పలువురు మంత్రుల, బడానేతల కుమారులు, బంధువులు కూడా ఉన్నారు.. అయితే పోటీచేస్తానంటోంది నాయకుడి కుమారుడా, బంధువా అని చూడటం లేదు.. టికెట్ ఇస్తే సదరు వ్యక్తి గెలవగలడా..లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.. అటువంటి వ్యక్తులకే టికెట్ కేటాయించాలని స్పష్టం చేసింది..’ అని తెలిపారు. కాగా, ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపైనే సీఎం పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనకు తగిన గుర్తింపునివ్వడం లేదని, ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదని ఇటీవల మంత్రి పదవికి నారాయణ్ రాణే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పార్టీని కూడా వీడి వెళ్లనున్నట్లు ప్రకటించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీచేయాలని లేదని, పార్టీ అధిష్టానం ఆదేశాలనుసరించి పనిచేస్తానని ప్రకటించిన రాణే తన కుమారుడు అసెంబ్లీకి పోటీచేస్తాడని ప్రకటించారు. రాణే ప్రకటన తర్వాత సీఎం శనివారం పై విధంగా స్పందించడంపై పలురకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాణే సహా నాయకులెవరూ తమ పిల్లలు, బంధువులకు టికెట్ల కోసం సిఫారస్ చేయొద్దని సీఎం పరోక్షంగా హెచ్చరించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎటువంటి విధివిధానాలు పాటించనున్నారోననే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. -
ముప్పుగ్రామాలను గుర్తిస్తామని హామీ
ముంబై: అసమర్థ ముఖ్యమంత్రి.. అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పృథ్వీరాజ్ చవాన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆగడాలు కొనసాగకుండా అడ్డుపడుతున్నందునే తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చవాన్ అనేక విషయాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో పారదర్శకతను తీసుకురావాలనుకున్నాను. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాను. భూమి ధరల పెరుగుదల ఏ కొందరికో లాభం చేకూర్చదని భావించాను. రియల్ ఎస్టేట్ సెక్టార్‌ను ప్రక్షాళను చేశాను. ఈ నిర్ణయాలు కొందరికి ఇబ్బం దిని కలిగించాయి. దీంతో వారు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని పనిగట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభిం చారు. అవి నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ బిల్డరు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నా వైఖరిని మార్చుకోకూడాదని నిర్ణయించుకున్నా. ప్రత్యర్థులు చేస్తున్నట్లు నేను అసమర్థుడినే అయితే కీలక నిర్ణయాలు ఎలా తీసుకునేవాడిని..? ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మరాఠా రిజర్వేషన్ బిల్లును సభముం దుకు తెచ్చే ధైర్యం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. 2000 మురికివాడలను క్రమబద్ధీకరిస్తామని 2004, 2009 ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటిని నా ప్రభుత్వ హయాం లో పూర్తి చేశాం. కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలోనే నిలబెట్టాం. గుజరాత్‌తో రాష్ట్రాన్ని పోల్చేందుకు నేను ఇప్పటికీ సిద్ధ మే. మరాఠా ఎలా ముందుందో నేను వివరిస్తాను. పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాం. నేను అసమర్థుడినైతే ఇవన్నీ ఎలా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా... పనిచేసినవారెవరో.. చేయనివారెవరో స్వయంగా మీరే నిర్ణయించుకోండి. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కొంతమందికో ప్రయోజనం కలిగించడానికి కాద’న్నారు. రాణే విమర్శలను ఎప్పుడో మర్చిపోయా... తనపై విమర్శలు చేస్తూ.. తన పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన రాణేపై చవాన్ సానుభూతి ధోరణి కనబర్చారు. రాణే చేసిన విమర్శలన్నింటిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఉధ్వేగంతో ఆయన ఏవేవో మాట్లాడారని, వాటన్నిం టిని నేను మర్చిపోయానని,కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాటిని మర్చిపోయారని తాను ఆశిస్తున్నానన్నారు. -
బదిలీలుంటే చేసుకోండి
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రాకముందే ఉద్యోగుల బదిలీలు ఎవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించించింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల సంఘం చేసిన సూచన విషయం తె లుసుకున్న అధికారులు బదిలీల కోసం ఫైరవీలు మొదలుపెట్టారు. తాము కోరుకున్న స్థానాలకు పంపేలా సంబంధిత మంత్రులు, శాఖల అధిపతులకు అర్జీలు పెట్టుకుంటున్నారు. కీలక బదిలీలపై చవాన్ దృష్టి... కీలకమైన శాఖల్లో అధికారుల బదిలీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్వయంగా దృష్టి సారించారు. బదిలీలకు సంబంధించిన ప్రతీ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు పంపిస్తున్నారు. దీంతో తమకు నచ్చిన చోటకు బదిలీ చేయాలని పైరవీలు చేసుకున్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు కలవరం మొదలైంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు తమకు ఫలానా శాఖకు, ఫలాన చోటుకు బదిలీ చేయాలని కోరుతూ మంత్రులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా ముఖ్యమంత్రి తీరుతో జాగ్రత్తపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బదిలీ ప్రక్రియ జూన్ ఆఖరు వరకు పూర్తి చేయాలి. ఆ తరువాత జరిగే బదిలీల ప్రక్రియ ప్రత్యేక అంశంగా పరిగణించి చేస్తారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయనే ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు విధించారు. పోలీసు, రవాణ, రెవెన్యూ, నగరాభివృద్థి, ప్రజాపనులు తదితర కీలకమైన శాఖలకు బదిలీ కావాలంటే అధికారులు భారీగానే అవినీతికి పాల్పడతారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలకమైన శాఖల బదిలీలపై చవాన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఎలాంటి సిఫార్సులకు తావీయకుండా ఎవరిని, ఏ శాఖకు బదిలీ చేయాలనే విషయంలో చవాన్ స్వయంగా తుది నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు. వారంరోజుల కిందట పోలీసు శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రకియకు ముందు ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ప్రతి అధికారి ఫైలును చవాన్ స్వయంగా పరిశీలించారు. నియమాలకు లోబడి ఉన్న అధికారులను మాత్రమే బదిలీ చేశారు. రవాణ, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖల బదిలీలను కూడా చవాన్ ఇదే పద్ధతిలో చేపట్టారు. కొందరు అధికారులు మంత్రుల అండచూసుకొని తమ తమ బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారి ఆటలు సాగలేకపోయాయి. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో చవాన్ అదే పద్ధతిలో ముందుకు సాగుతారని చెబుతున్నారు. దీంతో బదిలీలపై ఆశలు పెట్టుకున్న అధికారులకు చివరకు నిరాశే మిగిలే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. -
‘చేయి’జారలే..!
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని కూడా వీడనున్నట్లు వచ్చిన ఊహాగానాలకు మాణిక్‌రావ్ మంత్రాంగంతో తెరపడింది. నారాయణ రాణే జులై 21న మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో రాణే పార్టీని వీడనున్నారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాణేను బుజ్జగించేందుకు అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దించింది. వీరిమధ్య మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం రాణే తన రాజీనామాను వెనక్కితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, మంత్రిపదవిలోనూ కొనసాగుతానని స్వయంగా రాణే ప్రకటించారు. ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలోని ధ్యానేశ్వరి నివాసస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ... మంత్రి పదవిని చేపట్టి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన డిమాండ్లను నెరవేరుస్తామని పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిందని చెప్పారు. ఈసారి మాట తప్పబోమంటూ పార్టీ చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాన్నారు. మంత్రిపదవికి చేసిన తన రాజీనామాను ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇంత వరకు స్వీకరించలేదన్నారు. దీంతో తాను మంత్రి పదవిలో కొనసాగడంతోపాటు పార్టీలో క్రియశీలంగా వ్యవహరించనున్నట్టు స్పష్టం చేశారు. మూడు నెలలు అధ్యక్ష పదవి కావాలి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడునెలపాటు తనను అధ ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్టానాన్ని కోరానని, బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాణే వివరణ ఇస్తూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని భావించానని, విషయాన్ని అధిష్టానానికి తెలిపానన్నారు. అయితే ఈసారి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కోరిందని, దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రాణే స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు తన కుమారుడు నితేశ్ రాణే పోటీ చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ఉద్దవ్‌పై మండిపాటు... శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివసేనలో చేరిన దీపక్ కేసర్కర్పై రాణే తీవ్రంగా మండిపడ్డారు. ఘాటైన పదజాలంతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. కేవలం శివసేన అధినేత దివంగత బాల్‌ఠాక్రే కారణంగా ఉద్ధవ్‌కు రాజకీయాల్లో చోటు దక్కిందనే విషయం మరచిపోవద్దని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా అసెంబ్లీలో కూడా అలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని కలలు కంటున్న ఉద్ధవ్‌కు భంగపాటు తప్పదన్నారు. ఎన్సీపీని వీడి, శివసేన పార్టీలో చేరి దీపక్ కేసర్కర్పై కూడా రాణే విమర్శలు కొనసాగించారు. ఎమ్మెల్యేగా విఫలమైన కేస్కర్ శివసేనలో చేరారని, అసలు కేస్కర్ ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి పనులే మా ఎజెండా... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ది పనులే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. మంచిరోజులు వస్తాయంటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజలను మోసగించారని, ఆయన పాలనలో ధరలు మరింతగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి రాష్ట్ర ప్రజలు మోడీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
'సోషల్ మీడియాలో ప్రచారం చేయండి'
నాగపూర్: రాజకీయ నాయకులు సోషల్ మీడియా మంత్రం జపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సామాజిక సంబంధాల వెబ్సైట్లను వాడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మీడియాను సమర్థవంతంగా వాడాలని పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ టెక్నాలజీని మనదేశంలోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి చెందినప్పటికీ వాటిని వినియోగించడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చవాన్ అన్నారు. -
ఆదుకుంటాం: సీఎం పృథ్వీరాజ్ చవాన్
సాక్షి, ముంబై: పుణే జిల్లా అంబేగావ్ తాలూకాలోని మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. మాలిన్ గ్రామప్రజలందరికీ పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. దీంతోపాటు ఈ సంఘటనలో గాయపడినవారందరికీ చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామం దాదాపు భూస్థాపితమైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 53 మంది మృతి చెందారని వీరిలో 25 మంది మహిళలు, 21 మంది పురుషులు, ఏడుగురు చిన్నారులున్నట్టు చెప్పారు. ఇంకా 100 మందికిపైగా శిథిలాల కింద ఇరుక్కుని ఉన్నారని భావిస్తున్నారు. వర్షం, బురద కారణంగా శిథిలాల తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ యుద్ధప్రాతిపదికపై ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. ముందుకు వచ్చిన ముంబై ‘డబ్బావాలా’లు... మాలిన్గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ముంబై డబ్బావాలాలు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయం చేసేంత స్థోమత లేకున్నప్పటికీ తమదైన పద్ధతిలో మాలిన్ వాసులకు సహాయం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబైలోని సుమారు రెండు లక్షల మందికి భోజనం డబ్బాలతోపాటు మాలిన్ గ్రామ ప్రజలకు సాయం చేయాలని కోరుతూ ఓ లేఖను అందించనున్నారు. దీంతోపాటు అంధేరిలోని ‘డబ్బావాలా గోవింద పథక్’ (డబ్బావాలా ఉట్టికొట్టే మండలి)’ ఉట్టీలు పగులకొట్టి గెలుచుకున్న నగదులోనుంచి కొంత మాలిన్గ్రామంలోని చిన్నారులకు అందించనున్నట్టు ప్రకటించారు. రూ. 50 లక్షల సాయం ప్రకటించిన సిద్ధివినాయకుని మందిరం... మాలిన్ వాసులకు అండగా నిలిచేందుకు ముంబై ప్రభాదేవిలోని సిద్ధివినాయకుని ఆలయ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గ్రామ పునరావాసం కోసం రూ. 50 లక్షల సాయం అందించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నరేంద్ర రాణే ప్రకటించినట్లు ట్రస్టు సభ్యుడు ఏక్నాథ్ సంగం ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు వస్తున్న అనేక సంస్థలు... సర్వం కోల్పోయిన మాలిన్ గ్రామప్రజలకు అండగా నిలిచేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. బాధితుల కోసం ఆరు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు మంచర్ రోటరి క్లబ్ పేర్కొంది. విఘ్నహర చక్కెర పరిశ్రమ రూ. అయిదు లక్షల మద్దతును ప్రకటించింది. ఇదిలా ఉండగా మంచర్లోని రేణుకామాతా పొదుపు సంఘం (రేణుకామాతా బచత్ ఘట్), బిన్దాస్ పొదుపు సంఘం (బిన్దాస్ బచత్ఘట్)లు సహాయక చర్యలు చేపడ్తున్న ప్రజలకు, గాయాలైనవారి కోసం భోజన సదుపాయాలు కల్పిస్తోంది. మాలిన్గ్రామంలోని 16 మందికి జీవితా బీమా పాలసీలు ఉన్నాయని, వారి కుటుంబీకులకు వీలైనంత త్వరగా క్లైమ్లు ఇప్పేంచేందుకు ప్రయత్నిస్తామని ఎల్ఐసీ అధికారులు హామీ ఇచ్చారు. మాలిన్ గ్రామాన్ని గురువారం సందర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మృతుల కుటుంబీకులకు రూ. రెండు లక్షల చొప్పున మద్దతు ప్రకటించడంతోపాటు మాలిన్గ్రామం పునరావాసం కోసం రూ. 50 లక్షలను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 10 వేల డాలర్ల సాయం ప్రకటించింది. కొనసాగుతున్న గాలింపు సాక్షి, ముంబై: ‘మాలిన్’ ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గ్రామంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులైనప్పటికీ శిథిలాల కింద ఇరుక్కున్నవారందరినీ బయటికి తీయడానికి బురదతోపాటు వర్షం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు మృతుల సంఖ్య 63కు చేరింది. అక్కడి పరిస్థితులను బట్టి కనీసం మరో మూడు నాలుగు రోజులపాటు శిథిలాల తొలగింపు పనులు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మూడు రోజులు కావస్తుండడంతో శిథిలాల కింద ఇరుక్కున్నవారు ప్రాణాలతో ఉండేందుకు ఆస్కారాలు సన్నగిల్లినట్టేనని భావిస్తున్నారు. పలువురి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. బాధితులకు ఆఠవలే పరామర్శ ముంబై: మాలిన్ గ్రామ అభివృద్ధికి రాజ్యసభలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఆర్పీఐ అధినేత ఆఠవలే ప్రకటించారు. ఆయన శుక్రవారం మాలిన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. సహాయక కార్యక్రమాలను ఇంకా విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వీలైనంత త్వరగా బయట తీయడానికి కృషిచేయాలన్నారు. గ్రామస్తులందరికీ పునరావాసం కల్పించాలన్నారు. కొండల అంచుల్లో ఉన్న ఇతర గ్రామాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘మాలిన్’ ఘటన పునరావృతం కానివ్వం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మాలిన్’ ఘటనను పునరావృతం కానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుమల అంచుల్లో ఉన్న గ్రామాల రక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ అధ్యయనం జరిపి, తగిన నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కాగా, ఇటువంటి ఘటనలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ను ఆదేశించామన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
‘పాల్ఘర్’ పాలన షురూ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో 36వ జిల్లా అవతరించింది. ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారికంగా ప్రారంభించారు. దీంతో స్థానికుల 29 యేళ్ల కల నిజమైనట్లయ్యింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు (పాల్ఘర్, వసాయి, డహాణూ, జవ్హార్, మోఖాడా, విక్రమ్‌గఢ్, తలాసరీ, వాడా) తాలూకాలున్నాయి. దీంతో ఠాణే జిల్లాలో ప్రస్తుతం ఏడు (ఠాణే, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్, అంబర్నాథ్, ముర్బాడ్, భివండీ, షాపూర్) తాలూకాలే మిగిలాయి. పాల్ఘర్ జిల్లా ఏర్పాటును జవార్, విక్రమ్‌ఘడ్, తలాసరి, మోఖాడా తదితర తాలూకాలోన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి సంబంధించి నల్లజెండాలను కూడా ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రదర్శించి తమ నిరసనను తెలిపారు. ఇది మినహా జిల్లా అవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్ఘర్ సెషన్‌కోర్టు సమీపంలోని సేల్స్‌టాక్స్ నూతన భవనంలో జిల్లా కార్యాలయాన్ని పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. వర్షం కారణంగా పాల్ఘర్కు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్ జిల్లా అవిర్భావోత్సవ కార్యక్రమం జాప్యం కాకుండా ఉండేందుకు రైలుమార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆయన బాంద్రా-వాపి షటిల్ రైల్లో పాల్ఘర్కు చేరుకున్నారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మళ్లీ పాల్ఘర్ రైల్వేస్టేషన్ నుంచి గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్, వసంత్ డావ్కరే, జిల్లా ఇంచార్జీ మంత్రి గణేష్ నాయిక్లతోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాల కిందటే ఠాణేను విభజించి, పాల్ఘర్ లేదా జవార్ జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ అధికారికంగా 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న శరద్‌పవార్ జిల్లా విభజన అవసరమని చెప్పారు. రాజకీయంగా... ఠాణే జిల్లా విభజన అనంతరం కూడా ఠాణే జిల్లానే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జిల్లా విభజన అనంతరం జిల్లా విస్తరణ, క్షేత్ర విస్తీర్ణాన్ని పరిశీలిస్తే ఠాణే జిల్లా కంటే పాల్ఘర్ పెద్ద జిల్లాగా అవతరించింది. రాజకీయపరంగా పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఠాణేకే పెద్దపీట వేశారు. పాత జిల్లాలో నాలుగు లోకసభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. కాని విభజన అనంతరం పాల్ఘర్ జిల్లాలో కేవలం ఒక లోకసభ (పాల్ఘర్) మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే ఠాణేలో మాత్రం మూడు లోక్‌సభ (ఠాణే, భివండీ, కళ్యాణ్), 18 అసెంబ్లీ నియోజకవర్గాలుండనున్నాయి. -
మరమగ్గాలకు చేయూత
షోలాపూర్, న్యూస్‌లైన్ : పట్టణంలోని మరమగ్గాల పరిశ్రమల యజమానులకు శుభవార్త. ఎన్నో ఎళ్లుగా పరిశ్రమలు నడుపుతూ అప్పులపాలయ్యారు. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు తీర్చేస్థోమత కూడా లేకుండా పోయింది. సంక్షేమం చతికిలబడింది. ఇలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యజమానులకు కాసింత ఊరట లభించింది. పట్టణంలోని 472 మరమగ్గాల పరిశ్రమల యజమానులకు 50 శాతం రుణ మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వస్త్ర పరిశ్రమ, సహకార, ఆర్థిక శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయాన్ని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధర్మన్న బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముంబైలోని సహ్యద్రి అతిథి గృహంలో సీఎం చవాన్, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ శిందే, ఎంఎల్ఏ ప్రణతి శిందే,ఆయా శాఖల కార్యదర్శులు మంగళవారం మరుమగ్గాల పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. మరమగ్గాల యజమానుల పలు సమస్యలను ఎమ్మెల్యే శిందే సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ‘ఈ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్యాకేజీని ప్రకటించాలి. మరమగ్గాల వారికి నాగరి సహకార బ్యాంక్ మూత పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విధించిన రుణంపై వడ్డిని తాత్కాలికంగా మాఫీ చేసి ఓటీఎస్ పథకం వర్తించేలా చూడాలని సీఎం సహకార శాఖ కార్యదర్శిని ఆదేశించారు. మరమగ్గాల సహకార సంస్థలకు కూడా ఈ పథకం వర్తించే అంశంపై మంత్రి వర్గ సమావేశానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. వీటితో పాటు మరమగ్గాల వారికి రుణ మాఫీ సదుపాయం, మరమగ్గాల కార్మికుల సంక్షేమ మండళ్ స్థాపించడానికి రుణ మాఫీ 50 శాతం అంటే రూ. 17 కోట్ల 50 లక్షలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని’ ధర్మన్న వివరించారు. ఈ మేరకు చేనేత సొసైటీ రుణ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో కృష్ణారి చిన్ని, కార్పొరేటర్ అనిల్ పల్లి, సింద్రం గంజి, రాజు రాఠి, చంద్రకాంత్ దయమాలతో పాటు భివండీకి చెందిన మహేష్ చిలువేరి పాల్గొన్నారు. -
భ్రమలు తొలగుతున్నాయ్!
మోడీ సర్కార్ పనితీరుపై సీఎం చవాన్ విమర్శ ముంబై: నరేంద్ర మోడీ సర్కార్ పనితీరుపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నరేంద్రమోడీ కాస్తా మౌనేంద్ర మోడీ అయ్యారంటూ విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై ఉన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగతున్నాయని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడమే అందుకు నిదర్శనమన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీపై, ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై చవాన్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘గుజరాత్లో మోడీ పాలన నిరంకుశంగా సాగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఢిల్లీలో కూడా అటువంటి పాలనే కొనసాగుతోంది. మోడీ అధికారంలోకి వస్తే నిరంకుశ పాలనను ఎదుర్కోవాల్సిందంటూ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మోడీ ప్రభుత్వంలో మంత్రులకు విలువ లేకుండా పోతోంది. ఆయన కూడా అన్ని విషయాలకు మౌనమే సమాధానమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కీలక విషయాలపై కూడా మోడీ నోరు విప్పడంలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా తమ ప్రభుత్వ విధానం ఇలా ఉంటుందంటూ మోడీ చెప్పలేదు. విదేశాంగ విధానం గురించి కూడా ఎన్డీయే ప్రభుత్వం తన విధానమేంటో వెల్లడించలేదు. సామాజిక సమస్యలు, ఆర్థిక వ్యవహారాల కూడా మోడీ వైఖరి ఏమిటో ఇప్పటికీ స్పష్టం కావడంలేదు. వారికి ఆర్ఎస్ఎస్ నిర్ణయం శిరోధార్యంగా మారింది. కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యర్థి కంపెనీల ఉత్పత్తులపై విమర్శలు చేసి అమ్ముకుంటాయి. అధికారంలోకి వచ్చేందుకు మోడీ కూడా ఎన్నిలకు ముందు కాంగ్రెస్‌పై విమర్శలు చేసి ప్రధాని అయ్యారు. మోడీ పాలనను, కాంగ్రెస్ పాలనతో బేరీజు వేసుకోవడం ప్రజలు అప్పుడే మొదలుపెట్టారు. మోడీ పాలన నుంచి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని ఆశించలేం. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలేవీ ప్రజోపయోగంగా ఉండడంలేదు. ఆయన ప్రజల పక్షాన నిలిచి ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత నిరంకుశంగా ఉంటున్నాయో తెలిసేది. కానీ ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు ఆయనకు కనిపించడంలేదు. ట్విటర్లో గొప్ప గొప్ప రాతలు కనిపిస్తున్నాయి. నిజానికి అవి మోడీ రాస్తున్నారో... లేక ప్రతిభావంతులైన మరే ఇతర అధికారులు రాస్తున్నారో తెలియడంలేదు. బీజేపీలో ప్రతిభావంతులకు కొదవలేదు. అయితే మోడీ మాత్రం వారిని ఉపయోగించుకోవడానికి సందేహిస్తున్నారు. మంత్రులను అనుమానించే సంస్కృతి బీజేపీలో ఇటీవలే బయటపడింది. గుజరాత్‌తో పోలిస్తే మహారాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ. ఏ రకంగా చూసిన మహారాష్ట్ర, గుజరాత్ కంటే ముందంజలోనే ఉంద’న్నారు. ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు... భాగస్వామ్య పార్టీ ఎన్సీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మరోసారి స్పష్టం చేశారు. మతతత్వ పార్టీలను ఎదుర్కోవాలన్నా, సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలన్నా మరోసారి కూటమిగానే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు పోట్లాడుకుంటే ప్రయోజనం పొందేవి మతతత్వ పార్టీలేనని, వాటికి ఆ అవకాశం ఇవ్వబోమని చవాన్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల మంత్రిపదవికి రాజీనామా చేసిన నారాయణ్ రాణేపై విమర్శలు చేసేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్ర ప్రజల క్షేమమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని, సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లడం సరికాదంటూ సున్నితంగా చురకలంటించారు. ఇక సీట్ల పంపకాల గురించి మాట్లాడుతూ.. ఎన్సీపీతో సీట్ల పంపకాలపై చర్చలు సరైన సమయంలోనే జరుగుతాయన్నారు. ఇప్పటికే సూచనప్రాయంగా ఒప్పందం కుదిరిందని, దాదాపుగా అదే ఖరారవుతుందన్నారు. అయితే ఈ ఒప్పందం ఒకరికొకరు సహకరించుకునేలా ఉంటుందని మాత్రమే చెప్పారు. -
సరిహద్దు లొల్లి..
సాక్షి, ముంబై: కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ మరాఠీ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కర్ణాటక పోలీసులు యెళ్లూర్ గ్రామంలోని మరాఠీ ప్రజలను ఇళ్లల్లోకి చొరబడి చితకబాదారు. ఇది చాలా అమానుష’ మంటూ దుయ్యబట్టారు. భారత్-పాక్ సరిహద్దు అంశం ఎంత కీలకమైనదో.., శివసేనకు కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం కూడా అంతే కీలకమైనదని ఉద్దవ్ నొక్కి చెప్పారు. సరిహద్దులోని యెల్లూర్ సంఘటనపై సోమవారం ప్రచురితమైన ‘సామ్నా’ సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంఘటనపై ఏపార్టీ నాయకులూ ఎందుకు నోరు విప్పడంలేదని నిలదీశారు.‘ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ సంఘటనపై అన్ని పార్టీలూ రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించాయి. మరి ఈ ఘటనపై ఎవరూ ఎందుకు నోరు విప్పడంలేదో అర్థం కావడంలేదు.. ఇది మన ఆత్మగౌరవ సమస్య..’ అని అన్నారు. సరిహద్దులోని మరాఠీ ప్రజలకు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు జరిగినా కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో కొన్నేళ్లుగా సమస్య నడుస్తోంది. సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న మరాఠీలు తమను కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఐదు దశాబ్దాల కిందట యెళ్లూర్లో ఏర్పాటుచేసిన మహారాష్ట్ర రాజ్-యెళ్లూర్’ అనే హోర్డింగ్‌ను పోలీసులు శనివారం తొలగించారు. దిమ్మెను పగలగొట్టేశారు. దాంతో స్థానిక మరాఠీలు ఆందోళనకు దిగడంతో కర్ణాటక పోలీసులు మరాఠీయులను చితకబాదారు. శని,ఆదివారాల్లో జరిగిన ఘటనలో సుమారు 50మందికి పైగా మరాఠీలు గాయపడ్డారు. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ముంబైలో కర్ణాటక సంఘం, భవనం కూడా ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో వాళ్లు హోటల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి స్థానిక మరాఠీలు ఎన్నడూ ఎటువంటి హానీ తలపెట్టలేదు. కాని కర్ణాటకలో ఉన్న మరాఠీయులను మాత్రం స్థానిక ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది..’ అని ఠాక్రే విమర్శించారు. ఇదే విషయమై గతంలో బేల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం మరాఠీ ప్రతినిధులే విజయం సాధించారని.. దీన్ని బట్టి అక్కడి స్థానికుల్లో ఉన్న ఆకాంక్షను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్రం న్యాయం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంకు పృథ్వీరాజ్ చవాన్ ఫోన్.. యెళ్లూర్ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసే చర్యలకు దిగకూడదని హితవు పలికారు. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే మాట్లాడుతూ ముంబైలో కర్ణాటక దినోత్సవాన్ని జరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే ముంబైలోని డబ్బావాలాలు సైతం కర్ణాటకలో మరాఠాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. యెళ్లూర్ ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనకు కారకులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల్లో శాంతిస్థాపనకు కృషిచేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. -
కాంగ్రెస్‌ను గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు: చవాన్
ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. -
మా పార్టీని గౌరవిస్తేనే పొత్తు
ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్రలో అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంతప్తిగా ముగిశాయి. దీనిపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ను ప్రశ్నించగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేస్తే అది బీజేపీ-శివసేనలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు ఉన్నా లేకున్నా.. ఆగస్టు 7 నాటికి అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. -
చేజేతులా అసమ్మతి!
పూలమ్మినచోటే కట్టెలు అమ్మడం అంటే ఏమిటో ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అనుభవంలోకి వస్తున్నది. పార్టీలో పదవి ఉన్నా లేకున్నా ఆయన తిరుగులేని నాయకుడిగానే చలామణి అయ్యారు. కానీ, అదేం ప్రారబ్ధమో ఆయనకూ, విజయానికీ ఎప్పుడూ చుక్కెదురే. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి, ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరి పోరు వ్యూహాన్ని ఖరారుచేశారు. ఇది బెడిసికొట్టి కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఏణ్ణర్ధంక్రితం కీలకమైన పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నాక విలేకరుల సమావేశాలు పెట్టి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ప్రారంభించారు. ప్రధానితోసహా ఎవరినీ ఏనాడూ వద ల్లేదు. కేవలం వారసత్వంవల్లే ఇలా మాట్లాడే వెసులుబాటు కలిగినా... అవకాశం వచ్చినప్పుడల్లా వారసత్వ రాజకీయాలనూ చెరిగిపారేశారు. అధికారానికి చేరువగా ఉన్నా ఆయన తనను తాను తటస్థుడిగా భావిం చుకుని అధికారం విషంతో సమానమని మాట్లాడారు. అది తనకు సరిపడని విషయమన్నట్టు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాళ్లకు బలపం కట్టుకు తిరిగినా ఓటర్లు ఆ పార్టీని కనికరించక రెండం కెల స్థానాలకు సరిపెట్టారు. ఫలితంగా పార్టీలో ఒక్కో గొంతే ధిక్కార స్వరం వినిపిస్తున్నది. మిత్రులు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. అసోంలో విద్యామంత్రి, సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌పై నిప్పులు చెరిగారు. మంత్రి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిం చారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ నాయకత్వంలో తాము పనిచేయలేమని అక్కడి మంత్రి నారా యణ్ రాణే నిర్మొహమాటంగా చెప్పారు. ఇలాంటి ‘విఫల నేతల’తో కలిసి ప్రయాణించి పార్టీకి దాపురించబోయే ఓటమిలో భాగస్వామిని కాదల్చుకోలేదన్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాది ఆఖరుకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసోం అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండుచోట్లా తిరుగు బాటు చేసిన నేతలకు ముఖ్యమంత్రి పదవు లపై మోజున్న మాట నిజమే. నారాయణ్ రాణే అయితే కాంగ్రెస్‌లో చేరిననాడే తనకు ముఖ్యమంత్రి పదవిని స్తామని వాగ్దానం చేశారని నేరుగా చెప్పారు. ఇలాంటి స్థితి ఏర్పడటానికి ఎవరినైనా తప్పుబట్టేముందు పార్టీ అధినేతలు తమను తాము ప్రశ్నించుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లోని లెజిస్లే చర్ పార్టీల మనోగతాన్ని లెక్కచేయకుండా సీల్డ్ కవర్లలో నిర్ణయాలను పంపి రుద్దే వైఖరే ఇలాంటి అసంతృప్తికి కారణమవుతున్నది. ఎమ్మెల్యే లందరూ మెచ్చినవారికి పట్టంగడితే అలాంటివారు స్థానికంగా బలపడ తారేమో, తమకు పక్కలో బల్లెంలా మారతారేమోనన్న భయంతోనే ఈ సీల్డ్ కవర్ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. పృథ్వీరాజ్ చవాన్ అలా వచ్చినవారే. ఇక తరుణ్ గోగోయ్ విషయానికొస్తే ఆయన నాయక త్వంలో వరసగా మూడుసార్లు పార్టీ అసోంలో విజయం సాధించినా ఆయనను అదుపులో ఉంచుకోవడం కోసం అసంతృప్తవాదులను ఎప్ప టికప్పుడు పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఏతావాతా రెండు చోట్లా ఇప్పుడు పార్టీకి సంకట స్థితి దాపురించింది. రాహుల్‌గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టాక ఆయన ఇలాంటి ధోరణులను అరికట్టడంపై దృష్టి సారించివుంటే వేరుగా ఉండేది. స్థానికులు మెచ్చిన నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అవకాశమిచ్చి వారు స్థిమితంగా పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తే మంచి ఫలితాలు వచ్చేవి. పార్టీ తిరుగులేని స్థితిలో ఉండేది. అందుకు భిన్నంగా అధిష్టానం ఆశీస్సులతో ఎప్పటిలాగే నడిచిన రాజకీయాల పర్యవసానంగా రాష్ట్రాల్లో పాలన పడకేసింది. అసంతృప్తి నానాటికీ పెరిగింది. కానీ, రాహుల్‌కు ఇదంతా పట్టినట్టు లేదు. ఆయన తనదైన ప్రపంచంలో ఉండిపోయారు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలోనే కాలంవెళ్లబుచ్చారు. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన నేతలను కాదని యువరక్తాన్ని ఎక్కించాలన్న ఆత్రుతలో ఇంటర్వ్యూల ద్వారా కొత్త నేతలను ఎంపికచేశారు. వారిలో కొందరికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించారు. వాస్తవానికి బీహార్, యూపీ ఎన్నికలప్పుడే ఆ ప్రయోగం విఫలమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు అమెరికాలో జరిగే ప్రైమరీ ఎన్నికల నమూనాను అనుసరించడానికి ప్రయత్నించారు. కానీ, అలాంటివారంతా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చడానికి ఏంచేయాలో తెలియని స్థితిలో రాహుల్‌గాంధీ ఉంటే, దీనిపై ఎలాంటి చర్యలు అవసరమవుతాయో అర్ధంకాక సోనియాగాంధీ అయోమయపడు తున్నారు. మహారాష్ట్రలో అయితే మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగబో తున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రి పదవినుంచి చవాన్‌ను తప్పిం చినా అది పార్టీకి ముప్పు కలిగిస్తుంది. అలాగని కొనసాగించినా రాణే రూపంలో వచ్చిపడిన తిరుగుబాటు పర్యవసానంగా అక్కడ వేరే ఫలితాలు వచ్చే స్థితి కనిపించడంలేదు. ఇక అసోంలో తరుణ్ గోగోయ్‌ను సమర్థించాలని రాహుల్ నిర్ణయించాకే అక్కడి మంత్రి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఇలావుంటే మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్‌కు బాహాటంగానే షాకులిస్తున్నది. త్వరలో ఎన్నికలు జరగబోయే జమ్మూ-కాశ్మీర్లో ఇక కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా దేశ ప్రజలు తమకేమి సందేశం ఇచ్చారో ఇప్పటికైనా గ్రహించి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టిస్తే, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు ఏం కోరుకుంటున్నారో గుర్తిస్తే కాంగ్రెస్ కాస్తయినా కోలుకుంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వస్తుంది. -
పంచాయితీ ఢిల్లీకి..
సాక్షి, ముంబై: కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షా బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి రాణే, చవాన్‌తోపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ నాయకులు హాజరయ్యారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాణే ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలిసింది. రాజీనామాను ఉపసంహరించుకొని, తమతోపాటు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చవాన్, ఠాక్రే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనను సంతృప్తి పరిచేందుకు చవాన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాణే స్పష్టం చేశారు. దీంతో ఎటువంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం నాటిచర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ముఖ్యమంత్రి చవాన్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనతోపాటు రాణే, ఠాక్రే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవుతామని ప్రకటించారు. ఆమె ఆపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమావేశం అనంతరం చవాన్ వెల్లడించారు. సోనియాగాంధీ దృష్టికి రాణే డిమాండ్లను తీసుకెళ తామని అన్నారు. ఈ సమావేశంలో రాణే రాజీనామా అంశంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల విషయంపైనా చర్చించినట్లు చవాన్ తెలిపారు. ఇదిలా ఉండగా సోనియాతో భేటీ అనంతరం రాణే ఎంత వరకు శాంతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మీకు ఎంపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు రాణే బదులిస్తూ ‘నాకు అలాంటి అవకాశం ఇస్తామని ఎవరూ చెప్పలేదు. నేను లేవనెత్తిన అంశాలకు పరిష్కారం చూపిస్తే రాజీనామా ఉపసంహరణ గురించి ఆలోచిస్తానని చెప్పాను’ అని వివరించారు. ఈ సందర్భంగా చవాన్ మీడియాతో మాట్లాడుతూ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. 2005లో శివసేనను వీడిన రాణే కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. తమ పార్టీలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికీ ఆ పని చేయకపోవంతో ఆగ్రహానికి గురైన రాణే రాజీనామా బాట పట్టారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
ముఖ్యమంత్రి కుర్చీ ఇక భద్రం
ఇదిగో మారుస్తారు.. అదిగో మారుస్తారు అని చెబుతూ వస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. ఇక బేఫికర్‌గా ఉండొచ్చు. ఆయన యథాతథంగా కొనసాగుతారని, ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఏమీ లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మోహన్ ప్రకాష్ తెలిపారు. పృథ్వీరాజ్ నిస్సందేహంగా తన పదవిలో కొనసాగుతారని అన్నారు. అంతకు ముందు పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పడతారనే ఊహాగానాలు దాదాపు రెండు మూడు వారాల నుంచి అటు మహారాష్ట్రతో పాటు ఇటు ఢిల్లీల్లో కూడా జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే 48 గంటలు గడవకుండానే మళ్లీ ఆయన పదవి సేఫ్ అని చెప్పారు. అధిష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున చవాన్‌కు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక దశలో భావించింది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిండే, నారాయణ రాణే, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయంతో మరోసారి వారందరికీ ఆశాభంగం కలిగింది. -
కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎంను మారుస్తుందా?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పట్టనున్నారా? మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ మేరకు ఊహాగానాలు జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి హుటాహుటిన పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బవాన్ ను ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేతృత్వం భావిస్తోంది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిందే, నారాయణ రాణే, రాధాకృస్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చవాన్ ను తొలగించాలని ఎన్సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
చర్చల తరువాతే నిర్ణయం
సాక్షి ముంబైః కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సంయుక్తంగా నిర్వహించే సమావేశంలోనే సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. కొందరు నాయకులు అసెంబ్లీ సీట్ల పంపకాల విషయంపై ప్రకటనలు చేస్తూ ఆయా నియోజకవర్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను ఉద్దేశించి చేసినవని భావించవచ్చు. గత కొన్ని రోజులుగా సీట్ల పంపకంపై ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమకు అధికంగా సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎంతమాత్రమూ సుముఖంగా లేదు. ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోకుంటే, రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఎన్సీపీ పోటీ చేస్తుందని అజిత్ పవార్ హెచ్చరించడం సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన పృథ్వీరాజ్ చవాన్ పైవ్యాఖ్యలు చేశారు. ‘మా మిత్రపక్షం ఎన్సీపీతో కలిసే చాలా ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రతిసారీ ఎన్నికలకు ముందు మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకున్నాం. ఈసారి కూడా సీట్ల పంపకాలపై సంయుక్త సమావేశం ఉంటుంది. కొందరు నాయకులు ఇప్పుడే సీట్ల పంపకాలు జరిగినట్టు ప్రకటిస్తూ, ఆ నియోజకవర్గాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం సరైందికాదని మిత్రపక్షానికి సూచిస్తున్నాను. సీట్ల పంపకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు’ అని చవాన్ వివరణ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా గురించి విలేకరులతో మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధి వల్ల మహారాష్ట్ర దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ కంటే మహారాష్ట్ర ముందున్నదని, అందరికీ మేలు జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ముంబైలో రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని, మరో రూ.15 వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. దీంతోపాటు రూ. 36 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని చవాన్ చెప్పారు. ఇవి పూర్తయితే ముంబై రూపురేఖలు మార తాయని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బుధవారం ప్రకటించింది. -
పాండురంగా పాహిమాం
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు నిత్యం సుఖఃసంతోషాలతో ఉండేలా వర్షాలు కురిపించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విఠల-రుక్మిణి దంపతులను వేడుకున్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం వేకువజామున మూడు గంటలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా పండరీపూర్‌లోని విఠల-రుక్మిణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుణుడు నెల రోజులు ఆలస్యంగా కరుణించడంతో రాష్ర్టంలోని రైతాంగం నిరాశకు లోనయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకుసాగుతున్నదని అన్నారు. విఠలుడి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున, వారికి తగిన సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇక్కడి మఠాలు, ధర్మశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు భారీగా నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. షోలాపూర్ పట్టణవ్యాప్తంగా రూ.81 కోట్ల వ్యయంతో సులభ్ మరుగుదొడ్ల కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. భీమనది తీరంలోని గోపాల్పూర్ వద్ద స్నానపు గదులు నిర్మించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంత్ నామ్‌దేవ్ స్మారకం నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు. పల్లకీ యాత్రలు సాగే దేహూ, ఆలంది, బండారా, డోంగారు, నెవాసా తదితర ప్రాంతాలు, రోడ్ల అభివృద్ధికి రూ.143 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు రూపొందించామన్నారు. పల్లకీయాత్ర సందర్భంగా మరణించిన, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కిక్కిరిసిన భక్తజనం... లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల ‘పాండురంగ విఠల విఠల’ నామస్మరణతో పండరీపూర్ పులకించిపోయింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న విఠల-రుక్మిణి ఆలయం సమీపంలోని చంద్రబాగా నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీలు, కాలినడకన, వాహనాల ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకొని చంద్రబాగా నదిలో స్నానాలు ఆచరించారు. విఠల రుక్మిణిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల మంది ఈ యాత్రకు వస్తుంటారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక రథాన్ని అలంకరించి అందులో ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు విఠలుడికి ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రికి సన్మానం... పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు అన్నాసాహెబ్ డాంగె, పాలకవర్గ సభ్యులు.. ముఖ్యమంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి దంపతులతోపాటు ఈ పూజలో పాల్గొనేందుకు కర్ణాటక బీదర్ జిల్లా వాసులైన శేలుకే రాము, ప్రమీల దంపతులకు అదృష్టం దక్కింది. మూడుతరాలుగా తమ కుటుంబీకులు వార్కారీలుగా ప్రతి ఏటా పండరీపూర్‌కు వస్తున్నట్లు రాము తెలిపారు. ముఖ్యమంత్రి ఈ దంపతులను సన్మానించారు. జీవితాంతం ఉచితంగా ఎంఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్‌లను అందజేశారు. -
మోనోరైలుకు విశేష స్పందన
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ల మధ్య 11.4 కి.మీ ప్రయాణించే మెట్రో రైలును జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన విషయం తెలి సిందే. మంగళవారానికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ మెట్రో రైళ్లు మొత్తం 13 వేల ట్రిప్పులు కొట్టాయి. దాదాపు లక్షన్నర కి.మీ ప్రయాణించాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రిలయన్స్ ఇన్ఫ్రా అభిప్రాయపడింది. సెలవుదినాల్లో చిన్నారులకు ఉచితం ముఖ్యంగా ప్రతీ శని, ఆదివారాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది. పిల్లలతోపాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారని ఇన్ఫ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం శని, ఆదివారాలు కార్యాలయలు, పాఠశాలలకు సెలవులు కావడంతో అత్యధిక శాతం జాయ్ రైడ్ కోసమే అందులో ప్రయాణిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. ప్లాట్‌ఫారాలపై రద్దీకూడా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు మినహా పిల్లలు, జాయ్ రైడ్ చేసే పెద్దల సంఖ్య అంతగా కనిపించడం లేదు. పర్యాటకుల ఆకర్షణ ముఖ్యంగా ఈ మెట్రో రైళ్లు స్థానిక ముంబైకర్లతోపాటు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బోగీలన్నీ మూసి ఉండడంతో బయటి శబ్ధం లోపలికి ఏమాత్రం వినిపించదు. రైలంతా ఏసీ, విశాలమైన కిటికీ అద్దాల్లోంచి బయట నగర అందాలను తిలకించేందుకు వీలుంది. దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ చివర నుంచి ఆ చివర వరకు వెళ్లేందుకు బోగీలన్నీ జాయింట్ చేశారు. లోపల ఎలక్ట్రానిక్ ఇండికేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రైలు ఆగిన స్టేషన్, వచ్చే స్టేషన్ పేరు ముందుగానే హిందీ, ఇంగ్లిష్‌లో ప్రకటిస్తుంది. తత్ఫలితంగా ఈ రైళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూర్చునే సామర్థ్యం తక్కువగా ఉంది. నిలబడి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం కేటాయించారు. అతి తక్కువ సమయంలో కోటికిపైగా ప్రయాణికులను చేరవేసిన ఘనత ముంబై మెట్రో రైళ్లు దక్కించుకున్నాయి. -
డాక్టర్ల సమ్మె విరమణ
సాక్షి, ముంబైః పదోన్నతులు, జీతాలు, పదవీ విరమణ పెంపు తదితర డిమాండ్లతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ గెజిటెడ్ మెడికల్ ఆఫీసర్స్’ (మాగ్మో) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డాక్టర్ల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో చర్చల అనంతరం మాగ్మో అధ్యక్షుడు రాజేష్ గైక్వాడ్ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. సందర్భంగా రాజేశ్ గైక్వాడ్ మాట్లాడుతూ ‘గత ఆరు రోజులుగా కొనసాగిన సమ్మె కారణంగా ఇబ్బందిపడ్డ రోగులకు మేం క్షమాపణలు చెబుతున్నాం. ఇక నుంచి మా డాక్టర్లంతా రోజుకు రెండు గంటలు అదనంగా పనిచేస్తారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు మేం సమ్మెను విరమిస్తున్నాం’ అని ప్రకటించారు. మాగ్మో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం అనేక ఆస్పత్రుల రోగులపై పడింది. పరిస్థితి విషమిస్తుండడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం ఆందోళనకు దిగిన డాక్టర్లతో చర్చలు నిర్వహించారు. సహ్యాద్రి అతిథి గృహంలో మధ్యాహ్నం మాగ్మో నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లతోపాటు అనేక విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం సమ్మె చేపట్టినవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జల్గావ్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృతి చెందిన అనంతరం సమ్మె నిర్వహిస్తున్న డాక్టర్లపై ‘మహారాష్ట్ర ఎస్సెన్షియల్ సర్వీస్ అండ్ మెయింటెన్స్’ (మెస్మా) పోలీసు ఠాణేలో ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సుజాతా సైనిక్ సూచించారు. సమ్మె విరమించేదాకా చర్చలు ఉండబోవని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే సమ్మె చేపట్టిన ఆరవ రోజు ఎట్టకేలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వారితో చర్చలకు అంగీకరించారు. ఇక నుంచి బీఏఎమ్మెస్ డాక్టర్లకు త్వరగా పదోన్నతులు కల్పించడం, పదవీ విరమణ వయసును పెంచడం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్ల సేవలను క్రమబద్దీకరిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే మాగ్మో సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అష్టకష్టాలకు గురయ్యారు. చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. -
ఇవేం సేవలు..!
సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మెట్రో సేవలకు నగరవాసుల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నా అప్పుడప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రోరైలు ప్రారంభించిన తరువాత మొదటి ట్రిప్పులోనే సాంకేతిక సమస్య తలెత్తి దాదాపు అర గంటసేపు రైలు ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక స్టేషన్లో సమస్యలు ఎదురుకావడం పరిపాటిగా మారింది. ప్రారంభించిన తొలిరోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడంతో సుమారు 25 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వారం తరువాత ఓ బోగీ డోర్లు తెర్చుకోకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రో ల్ రూమ్‌కు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో 20 నిమిషాల పాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా బుధవారం మరోల్ స్టేషన్లో రైలు ఆగినా రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. దీంతో అక్కడ దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడ్డారు. అప్పటికే రైలు ముందుకు కదలడంతో తరువాత వచ్చే సాకినాకా స్టేషన్లో దిగిపోయారు. ఇక బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెట్రో రైలు బోగీల్లోకి నీరు వచ్చిచేరింది. ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో లోపలున్న ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. మెట్రోరైలు ప్రారంభించిన తరువాత అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శని, ఆది వారాల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు ఉంటోంది. దీంతో మెట్రోకు భారీ ఆదాయమే వస్తోంది. మొత్తం 16 మెట్రో రైళ్లుండగా ప్రతీరోజూ దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. మూడోవంతు జనానికి సేవలందించే సమయంలోనే ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటే పూర్తిస్థాయిలో జనం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నీరు, విద్యుత్ పొదుపు చేయండి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చవాన్ పిలుపు ముంబై: వర్షాభావ పరిస్థితుల కారణంగా జల వనరులు క్లిష్ట స్థితికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, నీరు, విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రుతుపవనాల పరిస్థితిపై సమీక్షించారు. అవసరమైన ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ట్యాంకర్లను వినియోగించాలని, ఇందుకు తహసీల్దార్ (రెవెన్యూ అధికారి)లకు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. ట్యాంకర్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో అధికారులు పైసేవరి (పంటను విలువకట్టడం) పరిశీలించరాదని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో నీటి కొరత క్లిష్ట దశకు చేరుకుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోయింది. అందువల్ల ప్రజలు నీటిని, విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 30 నాటికి 58.50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం 355 తాలూకాలకు గాను, 194 తాలూకాల్లో 0 నుంచి 25 శాతం వర్షాలు మాత్రమే కురిశాయి. 123 తాలూకాల్లో 50 శాతం వరకు, 28 తాలూకాల్లో 75 శాతం వరకు వర్షపాతం నమోదైంది. ఠాణే, రాయిగఢ్, నాసిక్, దూలే, నందుర్బార్, జల్గావ్, పుణే, ఔరంగాబాద్, జాల్నా, ఉస్మానాబాద్, నాందేడ్, హింగోలీ, బుల్దానా, అకోలా, యవత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో 0 నుంచి 25 శాతం వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 19 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. 1,359 గ్రామాలు, 3,317 హేమ్లెట్‌లలో 1,464 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రణాళికను ఐదు రోజుల్లో సిద్ధం చేసి, పుణే, నాసిక్, ఔరంగాబాద్ డివిజన్లలో తాగునీటికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయాలు పదోన్నతి పొందే అవకాశం లేని ప్రభుత్వోద్యోగులకు అడిషనల్ గ్రేడ్ పే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. బీడ్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా మరో 200 పడకలను మంజూరు చేసింది. దీంతో పాటు ఆస్పత్రిని ఉన్నతీకరిస్తూ, 125 కొత్త పోస్టులను సృష్టించనున్నట్లు మంత్రివర్గం పేర్కొంది. గ్రామీణ నీటి సరఫరా పథకాలలో ప్రజలు పది శాతం చెల్లించాలన్న నిబంధనను రద్దు చేసింది. గ్రామ పంచాయతీల వాటాను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది. -
హైలెస్సా..లెస్సా..హైలెస్సా..
సాక్షి, ముంబై: సబర్బన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించే నిమిత్తం నగర తూర్పు తీరప్రాంతాల్లో త్వరలోనే జల రవాణా సేవలను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఐలాండ్ ప్యాసింజర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ (ఐపీడబ్ల్యూటీ) ప్రాజెక్టుకు మంచి స్పందన వస్తుందో లేదో అని రాష్ట్రప్రభుత్వం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ జల రవాణాను నెరుల్ నుంచి మండ్వా వరకు కొనసాగించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్టేట్ చీఫ్ సెక్రటరీ (సీఎస్), ఇతర ముఖ్యమైన విభాగాలకు చెందిన అధికారులు ఇటీవలే ఈ విషయమై ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ప్రాజెక్టు నిమిత్తం తయారు చేయాలనుకున్న జెట్టీల పరిమాణంపై సమావేశంలో చర్చించారు. మొదట చిన్న సైజు జెట్టీలను నడపాలని, జలరవాణాకు మంచి స్పందన లభించిన తర్వాత జెట్టీల పరిమాణం మరింత పెంచవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సేవలతో హార్బర్ మార్గంలో కొంత మేర రద్దీ తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సమావేశంలో తూర్పు తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్న జల రవాణా విజయవంతం అవుతుందో లేదో అన్న సందేహాన్ని అధికారులు వెలిబుచ్చారన్నారు. దీంతో జెట్టీల పరిమాణం తగ్గించాలని ఎంఎస్‌ఆర్డీసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ జెట్టీల పరిమాణం ప్రతిపాదనలో 40 మీటర్లు ఉండగా 10 మీటర్లు తగ్గించమని అధికారులు సూచించారన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా వుండగా 40 మీటర్ల జెట్టీలు నిర్మించడానికి సుమారు రూ.1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అంత ఖర్చు పెట్టిన తర్వాత జలరవాణాకు తగిన స్పందన రాకపోతే కష్టమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రయోగాత్మకంగా 30 మీటర్ల జెట్టీలను నడపాలని యోచిస్తోంది. దీని వల్ల ఖర్చు కూడా సుమారు రూ.350 - 400 కోట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, నెరుల్ జెట్టీ నిర్మాణాన్ని రూ.308.28 కోట్లతో ఫెరీ వార్ఫ్‌కు కాంట్రాక్టుకు ఇవ్వగా, జె.కుమార్ ఫౌండేషన్ అసోసియేట్స్, డీబీఎం సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు... మండ్వా జెట్టీల నిర్మాణాన్ని రూ.63.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ జెట్టీల నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎంఎస్ఆర్డీసీ ప్రైవేట్ వ్యక్తులకు ఈ సేవలను అప్పగించనుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ జెట్టీల నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. జల రవాణాతో లాభాలు... ఈ జల రవాణా పర్యావరణానికి ఎలాంటి చేటు కలిగించదు. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది. జల రవాణా సేవలు వేగంగా ఉండడమే కాకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటాయి. నగర వాసుల వాహన నిర్వహణ ఖర్చు కూడా కొంత మేర ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్లపై కూడా కొంత మేర రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణ, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. -
తాగునీటికి ప్రాధాన్యత
ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతో సీఎం సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సూచించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యతనిచ్చిన తర్వాతే మిగతా అవసరాలపై దృష్టి సారించాలన్నారు. వర్షా బంగ్లాలో శుక్రవారం ఔరంగాబాద్, పుణే, నాసిక్ విభాగ కమిషనర్లతోపాటు ఈ మూడు విభాగాల్లోని 20 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు పరిస్థితి ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే విషయమై నివేదికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి కోసం ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ నిధులను వినియోగించుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే విధానాలను అనుసరించాలని, తాగునీటికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు నీరు వృథాకాకుండా చూడాలన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండా జలాశయాల్లోని నీటిని విడుదల చేయవద్దన్నారు. నీటి సరఫరా పథకానికి, సిమెంట్ నాలా ఆనకట్టల నిర్మాణానికి కావల్సిన నిధులను ప్రతి జిల్లాకు అందచేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ప్రధాన కార్యదర్శికి అందజేయాలన్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, అందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ఎస్. సహారియా, వ్యవసాయశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధీర్‌కుమార్ గోయల్, ఆర్థికశాఖ ఉన్నత ప్రధాన కార్యదర్శి సుధీర్‌కుమార్ శ్రీవాస్తవ్లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వర్షాభావం కొనసాగితే తాగునీటికి కోతే... ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో నగరంలోని జలాశయాల్లో నీటి స్థాయి తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసులకు నీటి సరఫరాలో 15 శాతం కోత విధించే అవకాశం ఉంటుందని పురపాలక సంఘ అధికారులు శుక్రవారం చెప్పారు. జూన్ నెలలో ఇప్పటివరకు మూడు శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీఎం)కు చెందిన సీనియర్ అధికారి అన్నారు. సాధారణంగా ఇప్పటికి 15 శాతం వర్షపాతం నమోదు కావాలని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో నగరంలో వర్షాలు కురవకపోతే నీటి సరఫరాలో 10 నుంచి 15 శాతం కోత విధించక తప్పదని అన్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో జరగనున్న సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ బంబాలే చెప్పారు. నగరంలో వర్షాలు ముఖం చాటేసిన నేపథ్యంలో పౌరులు నీటిని పొదుపుగా వాడాలని, తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించరాదని బంబాలే సూచించారు. నీటి కొరత ఏర్పడినందున నీటిని వృథా చేయకూడదని పౌరులను హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ సమయంలో ఎంతగా వీలైతే అంతగా నీటిని సంరక్షించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయో లేదో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బంబాలే ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీరు కూడా ఇంకిపోతే ఇక తాము చేసేదేమీ ఉండదని ఆయన నిరాశను వ్యక్తం చేశారు. ప్రస్తుతం, నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు ప్రధాన చెరువుల్లో 1.32 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని బంబాలే చెప్పారు. ఈ నీరు ఒక నెలకు మాత్రమే సరిపోతుందని అన్నారు. గతేడాది ఇదే సమయంలో 3,33,906 లక్షల మిలియన్ లీటర్ల నీరు ఉందని పేర్కొన్నారు. నగరంలో నీటి సంక్షోభం ఇంతకుముందు 2009 జూలైలో ఏర్పడిందని, అప్పుడు 30 శాతం కోత విధించాల్సి వచ్చిందని బంబాలే గుర్తు చేశారు. ముంబై నీటిసరఫరా నెట్వర్క్ అనుమతించిన మేరకు గరిష్టంగా నీటి సరఫరాలో కోత విధించామని ఆయన చెప్పారు. -
సరే.. సహకరిస్తాం!
ముంబై: తమ నివాసాలను కాపాడుకునేందుకు దశాబ్దకాలానికిపైగా పోరాటం చేసిన క్యాంపాకోలావాసులు గత్యంతరంలేక ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసిన తర్వాత మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో క్యాంపాకోలా కాంపౌండ్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందికి మార్గం సుగమమైంది. నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని, చట్టానికి అంతా సహకరించాలని చవాన్ క్యాంపాకోలా వాసులతో చెప్పడంతోనే వారు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ విషయంలో క్యాంపాకోలా వాసుల డిమాండ్‌ను సీఎం సూచనప్రాయంగా అంగీకరించడంతోనే వీరంతా వెనక్కు తగ్గినట్లు సమాచారం.క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 96 ఫ్ల్లాట్లు అక్రమంగా నిర్మించారంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బీఎంసీ అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. గతంలో అనేక పర్యాయాలు బీఎంసీ సిబ్బంది వాటిని కూల్చివేసేందుకు వెళ్లారు. కాని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అప్పటికే కొందరు నివాసులు కోర్టు తీర్పును గౌరవిస్తూ ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగతావారు మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల అండదండల మొండిగా అక్కడే ఉంటూ వచ్చారు. చివరకు నీటి, గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని బీఎంసీ ప్రకటించింది. అక్కడికి వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, గేట్లు మూసివేసి లోపలికి రాకుండా చేయడం వంటి ఘటనలు గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నవిషయం తెలిసిందే. సీఎం చవాన్ జోక్యంతో ఎట్టకేలకు సంవత్సరన్నర నుంచి జరుగుతున్న ఆందోళనకు తెరపడింది. దీంతో సోమవారం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అసలేం జరిగింది... మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్ ఆదివారం నివాసులతో కలిసి సీఎం చవాన్‌తో భేటీ అయ్యారు. సోసైటీలో అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని వినియోగించి నివాసులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని చట్టపరంగా పరిశీలించాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేను ఆదేశించారు. అంతేకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, మీరు కూడా సహకరించాలని కోరడంతో అందుకు నివాసులు అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కూల్చివేత పనులను తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తోందని, మానవతా దృక్పథంతోనే క్యాంపాకోలా వాసులు డిమాండ్ చేసినట్లుగా 67,000 చదరపు గజాలా ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్‌ను ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని చెప్పినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్దకు.. క్యాంపాకోలా వివాదం చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లినట్లు తెలిసింది. స్థానిక ప్రతినిథుల బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిందని సమాచారం. ఈ విషయమై క్యాంపాకోలా వాసి అంకిత్గార్గ్ మాట్లాడుతూ... ‘సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి లేఖ రాశాం. తమ విషయంలో కరుణ చూపాలని కోరాం. నివాసాలను కూల్చివేస్తే వందలాదిమంది రోడ్డున పడతారని, వారిలో పిల్లలు, వృద్ధులు ఉన్నారని, వారందరికి కొత్తగా నివాసాలు దొరకడం ముంబై మహానగరంలో అంత త్వరగా సాధ్యం కాదని, జోక్యం చేసుకొని క్యాంపాకోలా వాసులకు ఊరటనివ్వాలని కోరామ’న్నారు. దీనిపై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ వాఘ్రాల్కర్ మాట్లాడుతూ... ‘రాష్ట్రపతికి లేఖ రాసినా అక్కడి నుంచి ఎటువంటి సమాచారమైతే మాకు అందలేదు. దీంతో మా విధులు మేం నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకోసం పోలీసు బలగాలను కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నాం. సోమవారం కూల్చివేత పనులను కొనసాగిస్తామ’న్నారు. -
పోయివచ్చిరి హస్తినకు..!
ఢిల్లీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం ఢిల్లీకి క్యూకట్టారు. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వారంరోజులుగా మీడియాలో అనేకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చవని, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కూడా మార్చనున్నారంటూ మీడియా ఊదరగొట్టింది. దీంతో ఈ విషయంపై సీఎం చవాన్ కూడా స్వయంగా స్పందించారు. ఇప్పటిదాకా తనకు ఎటువంటి సమాచారం లేదని, మీడియాలో వస్తున్నవన్నీ కబుర్లేనంటూ కొట్టిపారేశారు. అయితే మరుసటి రోజు ఉదయమే ఆయన ఢిల్లీ విమానం ఎక్కారు. ఆ వెనుక విమానాల్లో పార్టీలోని కీలక నేతలుగా చెప్పుకుంటున్న నారాయణ్ రాణే, శివాజీరావ్ మోఘే తదితరులు ప్రయాణమయ్యారు. దీంతో మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో మొదటి నుంచి రాణే పేరు వినిపిస్తోంది. ఆయన ఇటీవల సోనియాతో సమావేశమైనట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇక పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కోసం మోఘే ఫైరవీలు చేస్తున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. దీంతో వీరిద్దరు కూడా విమానం ఎక్కడంతో అధిష్టానం వీరిని పిలిపించిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఇదిలావుండగా అటు ఢిల్లీలో సీన్ మాత్రం మరో ఉన్నట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి చవాన్ బిజీబిజీగా గడిపారు. రాణే, మోఘే ఎవరిని కలిశారన్న సమాచారం అందకపోయినప్పటికీ మీడియా ప్రతినిధులు మాత్రం పూర్తిగా చవాన్పైనే దృష్టిపెట్టారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో అధినేత్రి సోనియాతో చవాన్ భేటి అయినట్లు తెలిసింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం పార్టీ అంతరంగం ఏమిటనే విషయం నేరుగా చెప్పకుండా రకరకాల లీకులు మీడియాకు విడుదల చేశారు. షిండేకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు వెళ్లాయని కొందరు చెప్పగా నాయకత్వ మార్పుపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోందని మరికొందరు చెప్పారు. దీంతో అసలు విషయం ఏమిటన్నది తేలలేదు. -
సోనియాతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ భేటి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం పదవి, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావు ఠాక్రేను మారుస్తున్నారనే వార్తల నేపథ్యంలో సోనియాతో పృథ్వీరాజ్ చవాన్ భేటి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పత్రికలు, టెలివిజన్ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని శుక్రవారం చవాన్ ఖండించారు. అయితే మార్పు లేదని చవాన్ వెల్లడించినప్పటికి.. మహారాష్ట్రలో సీఎం మార్పు తప్పదని రాజకీయవర్గాలు తమ వాదనల్ని బలంగా ప్రచారం చేస్తున్నాయి. -
శరద్ పవార్ బాంబు పేల్చారు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ కి మిగిలిన అతికొద్దిమంది మిత్రుల్లో ఒకరైన శరద్ పవార్ ఉన్నట్టుండి బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేస్తోందని, మళ్లీ అశోక్ చవాన్ లేదా సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం నుంచి రావలసింది. కానీ కాంగ్రెస్ మిత్రపక్షం నుంచి వస్తోంది. అదే విచిత్రం. అంతే కాదు. మిజోరాం, అసొం ముఖ్యమంత్రులను కూడా కాంగ్రెస్ మార్చేయబోతోందని ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కి ఎన్ సీ పీకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. శరద్ పవార్ మేనల్లుడు, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చాలా కాలంగా ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి మహారాష్ట్ర లోకసభ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత పృథ్వీరాజ్ ను తొలగించాలన్న డిమాండ్ బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై శరద్ పవార్ ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే కాంగ్రెస్ సీఎంను మార్చాలని భావించి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పవార్ మాత్రం ఈ నిర్ణయం వెనుక తన ఒత్తిడేమీ లేదని అంటున్నారు. తనకు అసలు కాంగ్రెస్ అంతర్గత విషయాలతో సంబంధమే లేదని ఆయన అన్నారు. -
కథనాలన్నీ ‘కబుర్లే’!
సాక్షి, ముంబై: తనతోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మారుస్తున్నారంటూ పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఈ విషయమై పుణేలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు వస్తున్న కథనాల్లో నిజం లేదు. అధిష్టానం ఈ విషయమై ఎటువంటి ఆలోచనలు చేయలేదు. ఇవన్నీ కేవలం వార్తాపత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలు మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తా. వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతగా నిర్వర్తిస్తా. లోకసభ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో తమ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీనికి బాధ్యత వహిస్తూ తాము అప్పుడే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధిష్టానానికి చెప్పాం. పార్టీలో అవసరమైన మార్పులు చేయాలని మేమందరం అధిష్టానాన్ని కోరాం. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరమే జరిగింది. అప్పటి పరిణామాలపై మీడియాలో ఇప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయి. తాజాగా అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా నాకు తెలియదు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదయోగ్యమే. ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాన’న్నారు. ఎన్నికలపై చర్చలు జరిగాయి... రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎన్సీపీతో ఇటీవల చర్చలు జరిగాయని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్లాలనే విషయంపై పార్టీ సీనియర్ నాయకులతో ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ చర్చలు జరిపారని, అదే విషయమై తనతోకూడా చర్చలు జరిపారన్నారు. నాయకత్వమార్పు విషయంపై తమ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. తనకు ఏదైనా సమాచారం అందితే ముందుగానే మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఇదిలాఉండగా ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ కూడా నాయకత్వ మార్పు కథనాలను కొట్టిపారేశారు. ఎన్నికలముందు ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు. -
తలకాయలు మార్చినా తలరాతలు మారేనా?
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల్లో అంతర్మథనం మొదలైంది. అనేకరకాల సమీక్షల తర్వాత ఇరుపార్టీల అధిష్టానాలు.. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక ఎన్సీపీలో కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌ను మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన మార్పులు ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తలకాయలు మార్చినంత మాత్రనా ఇరుపార్టీల తలరాతలు మారే అవకాశం లేదని కొందరు చెబుతుండగా నాయకత్వ మార్పు కొంతమేరకైనా ప్రజలపై ప్రభావం చూపుతుందని మరికొందరంటున్నారు. సోనియాను కలిసిన నారాయణ్ రాణే... లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ నేత నారాయణ్ రాణే, అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. దీంతో రాణేను పార్టీ అధినాయకత్వమే పిలిపించిందా? లేక రాణే స్వయంగా వెళ్లి అధిష్టానాన్ని కలిశారా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేకున్నా మొత్తానికి పార్టీ పదవులతోపాటు ముఖ్యమంత్రి పదవిలో కొత్తవారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనే సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని షోలాపూర్ నేత, మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వనున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఎంసీసీసీ అధ్యక్ష పదవిని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్ దాని నుంచి బయటపడితేగానీ ఏ నిర్ణయం తీసుకోలేమనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఫలిస్తే సరే.. మరి వికటిస్తే.. పార్టీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఫలిస్తే సరే... మరి వికటిస్తే పరిస్థితి ఏంటని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎంపికచేసేవారి విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంపిక చేసే ముందు కూడా పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. కీలక పదవుల బాధ్యతలను కొత్తవారికి అప్పగించినప్పుడు వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా వారి ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వ్యక్తులకే కాకుండా ప్రాంతాలవారీగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో సమతూకం పాటించినప్పుడే మార్పులు సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు. జాదవ్ స్థానంలో ఎవరో? కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌ను మార్చనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పదాధికారులతో శరద్‌పవార్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై అభిప్రాయాలు కూడా సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ జాదవ్‌కు మంత్రి మండలిలో చోటిచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునీల్ తట్కరే కు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో మార్పుల జరిగిన తర్వాత వాటికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఠాక్రేలకు భుజ్‌బల్ చురకలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్సీపీ నేత, ప్రజాపనుల శాఖమంత్రి ఛగన్ భుజ్‌బల్ చురకలించారు. ‘ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు’ అంటూ పరోక్షంగా ఠాక్రేలిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ఠాక్రేలు ముఖ్యమంత్రులు కావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన భుజ్‌బల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. -
అందుబాటులోకి ఫ్రీవే
సాక్షి, ముంబై: దశాబ్దాలుగా వే ధిస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి దక్షిణ ముంబైవాసులకు విముక్తి లభించనుంది. ఇకపై దక్షిణ ముంబై నుంచి ఘాట్కోపర్కు వెళ్లాలంటే కేవలం అరగంట చాలు. ఎందుకంటే పశ్చిమ శివారులోని ఖేర్వాడి ప్రాం తంలో నిర్మించిన ఫ్లైఓవర్, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డులను సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించనున్నారు. ఖేర్వాడి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంవల్ల దహిసర్ నుంచి నేరుగా వర్లీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించవచ్చు. పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డు వంతెన వల్ల దక్షిణ ముంబై నుంచి తూర్పు శివారు ప్రాంతం వరకు కేవలం అర గంటలోపే చేరుకోవచ్చు. ఈ వంతెన కారణంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఖేర్వాడి ఫ్లైఓవర్ 580 మీటర్ల పొడవుంది. ఈ వంతెనను వినియోగించే వాహన చోదకులకు ఖేర్వాడి జంక్షన్ వద్ద ఎదురయ్యే భారీ ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి లభించనుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. ఈస్టర్న్ ఫ్రీవే మార్గంపై నిర్మించిన పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు వంతెన 2.80 కి.మీ. పొడవుంది. కొద్ది రోజులుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. దక్షిణ ముంబై-పాంజర్పోల్ వరకు ఇది వరకే 13.60 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పు డు 2.80 కి.మీ. వంతెన కూడా సిద్ధం కావడంతో మొత్తం 16.40 కి.మీ. పొడవైన వంతెన వినియోగంలోకి రానుంది. అత్యంత పొడవైన ఈ వంతెన అం దుబాటులోకి రావడంవల్ల దక్షిణ ముంబై నుంచి నేరుగా తూర్పు శివారు ప్రాంతం వరకు ఎలాంటి అడ్డులేకుండా కేవలం అరగంట లోపు చేరుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఖేర్వాడి వంతెనను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు, పాంజర్పోల్-ఘాట్కోపర్ లింకు రోడ్డును మూడున్నర గంటలకు సీఎం చవాన్ ప్రారంభిస్తారని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. -
రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన
ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం సీఎం రేసులో షిండే, ఎంపీసీసీ అధ్యక్షుడి రేసులో అశోక్‌చవాన్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు కాగానే సీఎంను తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు ముందే సీఎం పృథ్వీరాజ్ చవాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడిని కూడా మారుస్తారని, ఈ రెండు స్థానాలను అనుభవం ఉన్న నేతలకు అప్పగిస్తారని చెబుతున్నారు. పవార్‌తో చర్చించిన సోనియా..? ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమిని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై కూడా సోనియా పవార్‌ను అడిగినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు. మొదలైన ఫైరవీలు... ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పదవులను దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు అప్పుడే ఫైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులతోపదవుల కోసం రాయబారాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రేసులో ఎవరెవరు? ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందన్న ప్రశ్నలకు పార్టీ నేతల నుంచి హర్షవర్ధన్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, రాధాకృష్ణ విఖేపాటిల్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ వీరివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అధిష్టానం తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లయితే ఈ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను కూర్చుండ బెట్టే సూచనలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం పదవిని పోగొట్టుకున్న అశోక్ చవాన్‌ను పెయిడ్ న్యూస్ కేసు వెంటాడుతోంది. దీనిపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 20లోపు విచారణ పూర్తిచేసి నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 20 తర్వాత ఒకవేళ అశోక్ చవాన్‌కు క్లీన్ చిట్ లభిస్తే పీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు ఆయనకే కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. -
ప్రభుత్వమే నిర్మిస్తుంది
శివ్డీ-నవాశేవా సీలింకుపై సీఎం చవాన్ సాక్షి, ముంబై: శివ్డీ-నవాశేవా సీలింకు పనులు చేపట్టేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబర్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. దీంతోపాటు రూ.10 వేల కోట్లతో దక్షిణ ముంబైలోని కోస్టల్ రోడ్డు ప్రాజెక్టును మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్వయంగా చేపట్టనుందని చవాన్ స్పష్టం చేశారు. ముంబై-నవీముంబై ప్రాంతాలను కలిపే శివ్డీ-నవాశేవా సీలింకు ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు పదేళ్ల కిందట ప్రభుత్వం ప్రకటించింది. అందుకు రిలయన్స్ కంపెనీతోపాటు అనేక ప్రైవేటు సంస్థలు టెండర్లు వేశాయి. కానీ ఆ తర్వాత రద్దు చేసుకున్నాయి. దీంతో పదేళ్లకుపైగా పెండింగులో పడిపోయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.9,630 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చవాన్ చెప్పారు. ఇదిలావుండగా భావుచా ధక్కా-నెరుల్-రేవస్-మాండ్వా జలరవాణా మార్గాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీడ్కో), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెస్సార్డీసీ), మెరీ టైం బోర్డు సంయుక్త కంపెనీలకు జలరవాణా బాధ్యతలు అప్పగించింది. ఇందులో సిడ్కో 40 శాతం, ఎమ్మెస్సార్డీసీ 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూర్చనున్నాయి. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
ముంబై: పట్టణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చట్టం రూపకల్పన కోసం బీఎంసీ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శాసనసభకు గురువారం తెలిపారు. ఉల్హాస్నగర్ భవనాల క్రమబద్ధీకరణ విధానాన్ని ఇతర నగరాలకూ వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా సమస్య ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధానాలు అవసరమవుతాయన్నారు. పింప్రి-చించ్వాడ్లో అక్రమ నిర్మాణాలపై చర్చలో పాల్గొంటూ ఆయన పైవిషయం తెలిపారు. ఉల్హాస్‌నగర్‌లో 6,623 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించినా, 100 నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించలేదు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణ పటిష్టత అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. పింప్రి-చించ్వాడ్లోని అక్రమ నిర్మాణాల గణాంకాల విశ్లేషణను ఈ నెలాఖరుకు సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. వేసవిలో పోలీసు ఉద్యోగాల భర్తీ వద్దు పోలీసుల ఉద్యోగాల కోసం ముంబై, నాసిక్‌లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇద్దరు యువకులు మరణించడంతో.. ఇక నుంచి వేసవిలో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయవద్దని పలువురు సభ్యులు సభలో గురువారం సూచించారు. నాసిక్‌లో మరణించిన అంబాదాస్ కుటుంబానికి రూ.ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాలేగావ్ ఎమ్మెల్యే దాదా భూసే ప్రభుత్వాన్ని కోరారు. పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. విక్రోలీ వద్ద ఉన్న భర్తీ కేంద్రంలో తాగునీటి వంటి కనీస సదుపాయాలు కూడా లేవ న్నారు. ఐదు కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నప్పుడు వడదెబ్బ తగిలి అంబాదాస్ మరణించాడని అన్నారు. వేసవిలో ఎండలు అధికం కాబట్టిఅక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మెల్యే బాలానంద గావ్కర్ అన్నారు. ఆర్.ఆర్.పాటిల్‌కు క్లీన్చిట్ అత్యాచారాల నిరోధంపై హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్ స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పోలీసు ఉన్నా అత్యాచారాలను నిరోధించడం సాధ్యం కాదని మంత్రి సభలో బుధవారం అన్నట్టు వార్తలు వచ్చాయి. మీడియా వచ్చిన కథనాలు, అసెంబ్లీ రికార్డులను పరిశీలించానని, పాటిల్ మాటల్లో తప్పేమీ లేదని స్పీకర్ అన్నారు. మంత్రి అలాంటి మాటేదీ అనలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ తనను కించపర్చాలనే దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంటికీ ఒక పోలీసును నియమించడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ మీడియా సభా కార్యకలాపాలను ప్రసారం చేయడానికి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. -
ఇక రెండోమార్గం...
ముంబై: మెట్రోరైలు మొదటిమార్గం ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో ఇక రెండోదశ కారిడార్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ఆర్థిక, సాంకేతిక అంశాలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వేశాఖ అధీనంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్)ను కోరింది. రెండోదశలో నిర్మించబోయే దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మార్గ నిర్మా ణం కోసం అధికారులు ప్రాజెక్టు సవివర నివేదికను కూడా తయారు చేస్తున్నారు. చార్కోప్లోనిర్మించాల్సిన మెట్రోరైళ్ల డిపోను దహిసర్‌కు తరలిస్తున్నందున కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు నిరాకరించే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. ఇదే అంశంపై శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన పైవిషయాలను వెల్లడించారు. వివిధ శాఖల నుంచి అనుమతులు రాకపోవడం వల్లే రెండోదశ ప్రాజెక్టు ఇది వరకే ఆలస్యమయింది. డిపోల తరలింపు వంటి మార్పుల ఫలితంగా పనుల్లో మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రెండోదశ కారిడార్‌ను పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దహిసర్-చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ మార్గం నిర్మాణం కోసం 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. లింకురోడ్డు, ఎస్వీరోడ్డును స్టేషన్లతో అనుసంధానించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరు ఆలస్యమవుతుండడమేగాక, చాలా ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ వైర్లు ఉండడం, జుహూ ఎయిర్‌పోర్టు సమీపాన ఉండడం తదితర అడ్డంకులనూ అధిగమించాల్సి ఉంటుంది. ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే ఘాట్కోపర్-వెర్సోవా మెట్రోమార్గాన్ని ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెట్రో రెండోదశ మార్గాన్ని కొలాబా నుంచి చార్కోప్ వరకు 40 కిలోమీటర్ల మేర నిర్మించాలని మొదట భావించారు. కొలాబా-మహాలక్ష్మి మార్గాన్ని పూర్తిగా భూగర్భంలోనే నిర్మించాలనే ప్రతిపాదించారు. సొరంగాల తవ్వకానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి చార్కోప్ నుంచి మాన్‌ఖుర్ద్ వరకు ఉపరితలంపైనే (35 కిలోమీటర్లు) మెట్రోమార్గాన్ని నిర్మించేలా సవివరణ ప్రణాళికలో మార్పులు చేశారు. పెరుగుతున్న మెట్రో వినియోగం ముంబైలో ఆదివారం నుంచి మెట్రోరైలు సేవలు మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం వరకు పది లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ కారిడార్ మార్గంలో మెట్రో సేవలు మొదలవడం తెలిసిందే. తొలి 59 గంటల్లో 10 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసిన ఘనత ముంబై మెట్రోకు దక్కింది. ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులను చేరవేసిన మొదటి మెట్రోరైలు తమదేనని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. బుధవారం ఉదయం 5.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు 1.71 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. ఇది నిత్యం ఏడు లక్షల మందికి సదుపాయాలు కల్పించగలదని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా తొలిరోజే ప్రకటించింది. ఒక్కో రైలులో దాదాపు 1,500 మంది వరకు ప్రయాణింవచ్చు. పార్కింగ్ కష్టమే... బైకులు, కార్లను నిలిపి ఉంచేందుకు మెట్రో స్టేషన్లలో తగినంత స్థలం లేకపోవడంతో వాహన యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్ల సమీపంలో ఎక్కడో ఓ చోట పార్కింగ్ చేసి మెట్రోలో ప్రయాణించవలసివస్తోందని వాళ్లు చెబుతున్నారు. వెర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్ నగర్ తదితర స్టేషన్లలో పార్కింగ్ కేంద్రాలు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. -
మెట్రో రైలు రాకతోరవాణాసంస్థలకు ముప్పే
అత్యాధునిక సదుపాయాలకు నెలవైన మెట్రోరైలుతో తక్కువ ధరలో తొందరగా గమ్యస్థానం చేరే అవకాశం ఉంది కాబట్టి బస్సుల్లో ప్రయాణించే వారిలో అత్యధికులు మెట్రోకు మారతారని భావిస్తున్నారు. ఫలితంగా బెస్ట్ వంటి ప్రభుత్వ రవాణా సంస్థలకు మరిన్ని నష్టాలు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు ప్రారంభం కావడంతో ప్రజారవాణా వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించినట్లయింది. ఈ మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం, డబ్బు ఆదా కాయడం ఖాయం. అయితే కొన్ని దశాబ్దాలుగా ముంబైలో సేవలు అందిస్తున్న వివిధ ప్రజారవాణా సంస్థలను మెట్రోరైలు ఆర్థికంగా దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) వంటి రవాణా సంస్థలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీనికితోడు ఆదివారం నుంచి మెట్రోరైలు మొదలుకాగా, మోనోరైలు మార్చి నుంచే సేవలు అందించడం మొదలుపెట్టింది. కొన్ని దశాబ్దాలుగా నగరంలో తిరుగతున్న బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, ముంబైకర్లకు లైఫ్‌లైన్‌గా పేరుగాంచిన లోకల్ రైళ్లపై ఆదాయంపై మెట్రో ప్రభావం పడనుంది. మెట్రో ప్రభావం అన్నింటికంటే బెస్ట్‌పై ఎక్కువగా ఉండవచ్చని సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బెస్ట్ బస్సుల టికెట్ల చార్జీలు విపరీతంగా పెరగడంతో.. ఇద్దరుంటే చాలు ట్యాక్సీ లేదా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు. అత్యధికులు ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. ఇప్పటికే అనేక రూట్లలో బెస్ట్ ఆదాయం పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో కారణంగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య తిరిగే బెస్ట్ బస్సుల్లో కలెక్షన్లు మరింత తగ్గుతాయని అంటున్నారు. బెస్ట్‌కు నష్టాలు ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి తోడు మోనో, మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోనుంది. దీంతో సంస్థ పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. మెట్రో స్టేషన్లో ప్రమాదం ఘాట్కోపర్లోని మెట్రోస్టేషన్ ఎస్కలేటర్ ఎక్కిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తూ కింద పడడంతో గాయాలయ్యాయి. వీరిని ఘాట్కోపర్లోని రాజావాడి ఆస్పత్రిలో చేర్పించారు. వీరిని అంధేరిలో నివాసముంటున్న వైశాలి దేశాయ్ (60), సునీతా రాణే (50), ఘాట్కోపర్వాసి రిజ్వానా షేక్ (50)గా గుర్తించారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. తొలిరోజే విశేష స్పందన మెట్రోరైలుకు మొదటి రోజే భారీ స్పందన కనిపించింది. ఆదివారం దాదాపు 2.40 లక్షల మంది వరకు ప్రయాణించారని దీని నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్, రిలయన్స్ గ్రూపు సంస్థల అధిపతి అనిల్ అంబానీ, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆదివారం మెట్రోరైలు ప్రారంభం కావడం తెలిసిందే. ‘మెట్రోరైలు ప్రారంభోత్సవం మాకు మరపురాని వేడుక. ఆదివారం సెలవు దినం అయినప్పటికి మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి 2.40 లక్షల మంది రైలులో ప్రయాణించారు. ఇది ముంబైకర్ల ప్రయాణరీతిని మార్చేసింది’ అని రిలయన్స్ ఇన్ఫ్రా సీఈఓ లలిత్ జలాన్ అన్నారు. ముంబై తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో ప్రతినిత్యం ఏడు లక్షల మందికి సేవలు అందిస్తామని తెలిపారు. ప్రోత్సాహక పథకంలో భాగంగా మొదటి నెల రోజులపాటు వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు (11.40 కిలోమీటర్లు) కేవలం రూ.10 చార్జీలు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. మెట్రోచార్జీలపై స్టే కోరిన ఎమ్మెమ్మార్డీయే ముంబై: ప్రభుత్వం సూచించిన వాటికంటే మెట్రో నిర్వాహక సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా అధిక చార్జీలు వసూలు చేయడంపై ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) హైకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ అధిక చార్జీలు వసూలు చేయకుండా స్ట్టే మంజూరు చేయాలని సోమవారం అభ్యర్థించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి రిలయన్స్ ఇన్ఫ్రా కాస్త సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ఆర్డీ ధనూకా ప్రకటించారు. విచారణ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే న్యాయవాది ఏపీ భరూచా మాట్లాడుతూ మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి కాబట్టి కేసు విచారణ త్వరగా చేపట్టాలని కోరారు. మెట్రో చార్జీల టారిఫ్‌పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని రిలయన్స్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది. -
మెట్రో గురించి 20 ముచ్చట్లు
ముంబై: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై మెట్రోరైలు సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ముంబై రవాణా వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిన మెట్రోరైలు గురించి 20 ఆసక్తికర అంశాలివి. * ప్రభుత్వం సూచించినట్టుగా తక్కువ చార్జీలతో కూడిన టారిఫ్ అమలు చేయకుంటే మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రాబోనని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దీని ప్రమోటర్, రిలయన్స్ అనుబంధ సంస్థ ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)ను హెచ్చరించారు. * టారిఫ్‌ను పెంచేందుకు బీజేపీ ఎంఎంఓపీల్కు సహకరిస్తోందంటూ సీఎం బీజేపీపై మండిపడ్డారు. * మెట్రోరైలు సేవలను జూన్ ఎనిమిది నుంచి ప్రారంభిస్తామంటూ ఎంఎంఓపీఎల్ అధికారికం గా ప్రకటన చేసిన వేదికపై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే), రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేరు. మరో ఆసక్తికర సంగతి ఏమంటే మెట్రోలో ఎమ్మెమ్మార్డీయేకు 26 శాతం వాటా ఉంది. * ఎమ్మెమ్మార్డీయే మెట్రోరైలును ప్రారంభించకుంటే తామే బలవంతంగా మొదలుపెడతామని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య హెచ్చరిం చంతో ఎంఎంఓపీఎల్ హఠాత్తుగా ఈ ప్రకటన చేసింది. * ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు మెట్రో సేవలను ప్రారంభిస్తూ ఘాట్కోపర్ వద్ద చిన్న పూజ కూడా నిర్వహించడం విశేషం. * ప్రభుత్వం సూచించిన దానికంటే ఎంఎంఓపీఎల్ ప్రకటన ప్రారంభోత్సవ చార్జీలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే తుది టారిఫ్‌పై ఎంఎంఓపీఎల్, ప్రభుత్వం మధ్య వివాదం ఉంది. మెట్రో చట్టం ప్రకారం చార్జీల విధింపు తన పరిధిలోకి వస్తుందని ఎంఎంఓపీఎల్ వాదిస్తోంది. కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 మధ్య చార్జీలు ఉండేలా టారిఫ్ తయారు చేసింది. ప్రభుత్వం మాత్రం చార్జీలు రూ.9-13 మధ్య ఉండాలని కోరుకుంటోంది. * ప్రభుత్వం 2009లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే మెట్రో పాలన సాగాలని ఎంఎంఓపీఎల్ పట్టుబడుతోంది. * మెట్రో అంచనావ్యయం రూ.2,356 కోట్ల నుంచి రూ.4,321 కోట్లకు పెరిగింది. * వెర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో రిలయన్స్ ఇన్ఫ్రా 11.40 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించింది. * దీని నిర్మాణ పనులు 2007లో లాంఛనంగా ప్రారంభమైనా, నిర్దేశిత గడువులు తరచూ వాయిదాపడ్డాయి. * ప్రతి మెట్రోరైలుకు నాలుగు కోచ్‌లు ఉంటాయి. ఒక్కోదాంట్లో 375 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో రైలులో మొత్తం 1,500 మంది దాకా ప్రయాణించవచ్చు. * ప్రతినిత్యం 200-250 ట్రిప్పులు నడపడం ద్వారా 11 లక్షల మందికి సేవలు అందిస్తామని ఎంఎంఓపీఎల్ ప్రకటించింది. * వెర్సోవా నుంచి ఘాట్కోపర్కు రోడ్డు ద్వారా ప్రయాణిస్తే కనీసం గంట పడుతుంది. మెట్రోరైలు ద్వారా కేవలం 21 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. * రైల్వే తదితర సంస్థల నుంచి అనుమతులు రాకపోవడం, భూసేకరణ సమస్య, పరిహారం చెల్లింపు తదితర సమస్యల వల్ల మెట్రోమార్గం నిర్మాణంలో జాప్యం తప్పలేదు. * ఈ మార్గంలో మొదట రోజుకు ఏడు లక్షల మంది వరకు ప్రయాణించవచ్చని, తదనంతరం దీనిని 11 లక్షలకు పెంచుతామని ఎంఎంఓపీఎల్ అంటోంది. * సాధారణ కౌంటర్లతోపాటు స్మార్ట్‌కార్డులు, టోకెన్ల ద్వారా కూడా టికెట్లు కొనవచ్చు. అన్ని స్టేషన్లలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. * మెట్రోరైలు ప్రారంభం వల్ల వెర్సోవా-అంధేరీ ప్రాంతాల్లో స్థిరాస్తిరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తుల కన్సల్టింగ్ సంస్థ జోన్స్లంగ్ లాజెలే ప్రకటించింది. * ఈ సంస్థ చెప్పినట్టే మెట్రో వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు గత ఎనిమిది సం వత్సరాల్లో 400 శాతం పెరిగాయి. భవిష్యత్‌లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. * మెట్రోరైలు సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కొత్తగా సంస్థలు, దుకాణాలు పెద్ద ఎత్తున వెలుస్తాయని అంచనా * రైల్వేశాఖ ముంబై మెట్రోరైలు ప్రారంభించడానికి గురువారం తుది అనుమతులు మంజూరు చేసింది. -
ముహూర్తం ఖరారు
నేడు ప్రారంభం కానున్న ముంబెమైట్రో సేవలు సాక్షి, ముంబై: నగరవాసులకు అత్యాధునిక ప్రయాణసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని గంటలే మిగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముంబై మెట్రోరైలు సేవలు ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10.30 గంటలకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణికులను అనుమతిస్తారని మెట్రోప్రాజెక్టు సీఈవో అభయ్ మిశ్రా తెలిపారు. భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అత్యాధునిక సదుపాయాలతో సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో అన్నివిధాలా సిద్ధంగా ఉందన్నారు. ఈ సేవలు ప్రారంభమైతే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనని చెప్పారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో సుమారు 45 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రయాణ సమయంతోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఆగుతూ వస్తే కనీసం రెండున్నర గంటలకుపైగానే సమయం అవసరమవుతోంది. మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే 90 నుంచి 120 సమయం ఆదా అవుతుంది. దీంతోపాటు బస్సు, ఆటో, ట్యాక్సీ చార్జీలతో పోలిస్తే మెట్రో చార్జీలు చాలా తక్కువ. దీంతో ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ఉదయం 5.30 గంటల నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయి. రాత్రి 12.00 వరకు కొనసాగుతాయి. ప్రతి 15 నిమిషాలకో రైలు చొప్పున మొత్తం 16 రైళ్లు సేవలందిస్తాయి. ఒక్కో బోగీలో 350 మంది కూర్చుండే సామర్థ్యం ఉండగా ఒక రైలుకు నాలుగు బోగీలుంటాయి. దీంతో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే అవకాశముంది. ఇలా 16 రైళ్లు రోజుకు లక్షల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ముఖ్యాంశాలు పేరు: ముంబై మెట్రోలైన్ ఏ-1 మార్గం ప్రారంభం: ఉదయం 10.30 గంటలకు వాణిజ్య సేవలు: మధ్యాహ్నం 12.00 గంటల నుంచి దూరం: వర్సోవా నుంచి ఘాట్కోపర్ వరకు 11.40 కిలోమీటర్లు స్టేషన్లు: వర్సోవా, డీఎన్ నగర్, ఆజాద్‌నగర్, అంధేరి, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, చకాల, ఎయిర్‌పోర్టు రోడ్, మరోల్, సకినాకా, అసల్ఫా, జాగృతినగర్, ఘాట్కోపర్ సేవలు: ఉయదం 5.30 గంట నుంచి రాత్రి 12.00 వరకు వేగం: గంటకు 80 కిలోమీటర్ల వేగంతో.. ప్రయాణికుల సామర్థ్యం: సేవలందించనున్న 16 రైళ్లలో ఒక్కో రైలులో 1,500 మంది ప్రయాణించే సామర్థ్యముంది. ఫ్రీక్వెన్సీ: ప్రతి 15 నిమిషాలకో రైలు -
కాంగ్రెస్ కోటా భర్తీ
ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించిన చవాన్ సాక్షి, ముంబై: ఎట్టకేలకు కాంగ్రెస్ కోటాలోని మంత్రి పదవులు భర్తీ అయ్యియి. శనివారం రాత్రి ముగ్గురు మంత్రులకు శాఖలు కే టాయించారు. అబ్దుల్ సత్తార్ కు పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖ, మధుకర్ చవాన్‌కు రవాణ, అమిత్ దేశ్‌ముఖ్‌కు ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరిలో అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్‌ముఖ్ గత సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో తేరుకున్న ఎన్సీపీ ఇటీవల మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీచేసి చేతులు దులుపేసుకుంది. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులను కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీంతో ఎవరికి? ఏ శాఖ? కేటాయిస్తారనే విషయమై సర్వత్రా నెలకొన్ని ఉత్కంఠకు పృథ్వీరాజ్ చవాన్ శనివారం రాత్రి తెరదించారు. అయితే ఇంత ఆదరాబాదరగా శాఖలు కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే సమయమున్నందున గెలుపుదిశగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులోభాగంగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీ కాస్త ముందున్నా కాంగ్రెస్ మాత్రం దూకుడుగా వ్యవహరించినట్లు కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులు భర్తీ కావడం జరగని పనే అనుకున్నారంతా. అయితే అకస్మాత్తుగా శనివారం రాత్రి భర్తీ చేయడంతో పార్టీ నేతలు సైతం నివ్వెరపోయారు. -
తగ్గిస్తేనే వస్తా!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రా నిర్ణయించిన మెట్రో చార్జీలు ఆమోదయోగ్యంగా లేవని, నిర్హేతుకమైన చార్జీల పెంపుదల విషయంలో వెనక్కు తగ్గకపోతే ప్రారంభోత్సవానికి తాను వచ్చేదిలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంకేతాలిచ్చారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పరుగు తీయడానికి సిద్ధమైన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చవాన్ ఇచ్చిన ఈ సంకేతాలు ఇప్పుడు నగరంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. 11.40 కిలోమీటర్ల మేర రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ మార్గంలో కనీస చార్జీ రూ. 9 గరిష్ట చార్జీ రూ. 13గా వసూలు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కనీస చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్జీల పెంపుదల నిర్హేతుకమైనదని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ ఇన్ఫ్రా కట్టుబడి ఉండాలని, లేదంటే తాను ప్రారంభోత్సవానికి రాననే సంకేతాలనిచ్చారు. బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య, గోపాల్‌శెట్టి అండదండలు, ప్రోత్సాహంతోనే రిలయన్స్ ఇన్ఫ్రా చార్జీలను పెంచే సాహసం చేస్తోందని చవాన్ ఆరోపించారు. చార్జీల పెంపుదలపై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చవాన్ డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే పెంపుదల విషయమై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలన్నారు. ఇదిలాఉండగా ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి అభయ్ మిశ్రా మాట్లాడుతూ.... ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై నగరంలో మెట్రో సేవలను జూన్ 8, మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలను లక్షలాదిమంది నగరవాసులకు అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మెట్రో ప్రయాణంపై చేసే ప్రచారంలో భాగంగా మొదటి నెల రోజులు కేవలం రూ. 10 మాత్రమే చార్జీగా వసూలు చేస్తాం. ఈ చార్జీతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీలోని ఏ స్టేషన్ వరకైనా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం నిర్ణయించిన చార్జీ మాత్రమే. ఆ తర్వాత మెట్రో చార్జీలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తామ’న్నారు. -
మరో ఐదేళ్లూ మేమే!.
* మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం చవాన్ ధీమా * ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగం * గత పదిహేనేళ్ల అభివృద్ధి పనుల ఏకరువు ముంబై: మరోసారి తామే అధికారంలోకి వస్తామని, మరో ఐదేళ్లూ రాష్ట్రాన్ని తామే పాలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉభయసభల సంయుక్త సమావేశంలో చవాన్ ప్రసంగించారు. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలే చిట్టచివరివి కావడంతో సీఎం చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత పదిహేనేళ్లలో ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. తాము చేసిన అభివృద్ధే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినంతమాత్రాన కేంద్రం నుంచి నిధులు తరలిరావని, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత పదిహేనేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తాము సాధ్యమైనన్ని ఎక్కువ నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఆలోచన కూడా గత బీజేపీ-శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం చేయలేదని ఎద్దేవా చేశారు. అయితే ప్రకృతి విపత్తులు, అకాశ వర్షాలు, వడగండ్లు వ్యవసాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, గత రెండేళ్లలో రైతులకు పరిహారం,వారికి లబ్ధి చేకూర్చే పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పరి హారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చే యడం ద్వారా పూర్తి పారదర్శకతను పాటించామని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, ఇచ్చిన పరిహారం కూడా రైతుల చేతుకు అందలేదని, తమ హయాంలో రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని లక్ష రూపాయల వరకు పెంచామని, వ్యాపార, పారిశ్రామిక రంగాాలను అభివృద్ధి చేసేందుకు ముంబై-ఢిల్లీ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి పూర్తి చొరవ తీసుకున్నామని చెప్పారు. -
ముండే అమర్ రహే..!
సాక్షి, ముంబై: ‘మహా’నేత గోపీనాథ్ ముండే మరణంతో శోకసంద్రమైన రాష్ట్రం బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీడ్ జిల్లా, పర్లీ గ్రామానికి తరలివచ్చింది. ‘ముండే అమర్ రహే’ అంటూ ఆయన మద్దతుదారులు చేసిన నినాదాలతో పర్లీ గ్రామం మార్మోగింది. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ తదితర అన్ని ప్రాంతాలనుంచి వేలాదిగా ముండే అభిమానులు తరలిరావడంతో పర్లీ గ్రామం జనసంద్రమైంది. కేవలం పర్లి గ్రామంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకాల్లోని బీజేపీ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు ముండే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ మౌనం పాటించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... వేలాదిమంది అభిమానుల సమక్షంలో గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పర్లీ గ్రామంలో అధికార లాంఛనాలతో జరిగాయి. ఆయన పెద్దకూతురు పంకజ, ముండే చితికి నిప్పంటించారు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు, ప్రమోద్ మహాజన్ కుటుంబ సభ్యులు ముండే కుటుంబ సభ్యులతోపాటే ఉన్నారు. పూర్ణా బంగ్లాలో ప్రముఖుల నివాళులు... వర్లీలోని సీ-ఫేస్ ప్రాంతంలోగల పూర్లా బంగ్లాకు మంగళవారం రాత్రంతా ప్రముఖులు తరలి వచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి 7.30 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకున్న ముండే మృతదేహాన్ని నారిమన్ పాయింట్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో నగరవాసులతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చి ముండే భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. అర్ధరాత్రి వరకు ప్రముఖుల రాక కొనసాగింది. ఆ తర్వాత బుధవారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో ముండే భౌతికకాయాన్ని లాతూర్కు తరలించారు. పర్లీ బయలుదేరిన ముండే భౌతికకాయం... సుమారు 7.30 గంటలకు లాతూర్ విమానాశ్రయానికి ముండే భౌతికకాయం చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లో బీడ్ జిల్లా పర్లీ గ్రామానికి తరలించారు. అప్పటికే వేలాది మంది గ్రామస్తులు, సన్నిహితులు, అభిమానులు తమ ప్రియతమ నాయకుని కడసారి చూసేందుకు బారులు తీరారు. దుఃఖంతో మంగళవారం రోజంతా భోజనం లేకుండా, రాత్రంతా జాగారం చేసిన గ్రామస్తులు ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా పర్లి గ్రామం ‘ముండే అమర్ రహే’ అంటూ నినాదాలతో మార్మోగింది. శవ పేటిక గ్రామానికి చేరుకోగానే వారి రోదనలు మిన్నంటాయి. తమ నాయకున్ని కడసారి తనివితీరా చూసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. భారీగా జనం రావడంతో అక్కడ తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. పక్కకు తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రామంలో ర్యాలీగా బయలుదేరిన అంతిమయాత్ర ఎంతసేపటికీ ముందుకు కదలలేదు. ముండే భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అంబులెన్స్ ముందు జనం అడ్డుపడడంతో చివరకు దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ జోక్యం చేసుకొని పక్కకు తప్పుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. సంయమనం పాటించాలని పోలీసులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో అంతిమ యాత్ర మెల్లమెల్లగా ముందుకు కదిలింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ముండే అంత్యక్రియలు పర్లీ గ్రామంలోని వైద్యనాథ్ సహకార చక్కెర కర్మాగార మైదానంలో జరిగాయి. అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు తెలియగానే మంగళవారం ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ప్రముఖుల కోసం, సామాన్య జనం కోసం వేర్వేరుగా స్థలం కేటాయించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. చితిని పేర్చేందుకు ప్రత్యేకంగా గద్దె నిర్మించారు. మధ్యాహ్నం రెండు గంటలకు బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య ముండే బౌతికకాయానికి కూతురు పంకక నిప్పంటించారు. అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు... బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావ్దేకర్, రావ్‌సాహెబ్ దనవే, కిరీట్ సోమయ్య, రాజీవ్ ప్రతాప్ రుడి, ఉదయన్ రాజే బోంస్లే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఉద్ధవ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే, జితేంద్ర అవ్హాడ్, రాందాస్ ఆఠవలే, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికార్, రాష్ట్రానికి చెందిన 127 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రుల ఘెరావ్.. అంత్యక్రియలకు హాజరైన హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్, మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వాహనాలను ప్రజలు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ పక్కకు తప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన జనం ఉరుకులు పరుగులు తీశారు. బారికేడ్లు చెల్లాచెదురయ్యాయి. ఆగ్రహానికి గురైన జనం అక్కడున్న ఓ నాయకుని వాహనాన్ని బోల్తాపడేసి నిప్పంటించారు. దీంతో కొద్ది సేపు ఆ ప్రాంతమంత రణరణంగా మారింది. ముండే ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హర్షవర్ధన్ పాటిల్, మరికొందరు మంత్రులు కలుగజేసుకుని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు, ఆయన అభిమానులు శాంతించారు. ప్రమాదంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలంటే అందుకు సీబీఐ ద్వారా ఈ కేసు దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉద్ధవ్ ఠాక్రే కూడా అభిప్రాయపడ్డారు. నివాళులర్పించిన డబ్బావాలు.. నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి ఉద్యోగుల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లను చేరవేస్తున్న డబ్బావాలాలు బుధవారం ఉదయం 11.30 గంటలకు లోయర్‌పరేల్ స్టేషన్లో రెండు నిమిషాలు మౌనం పాటించి ముండేకు శ్రద్ధాంజలి ఘటించారు. -
నేటి నుంచి అసెంబ్లీ
ముంబై: శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదుర్కొన్న అధికారపక్షాలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి విపక్షాలు సిద్ధమయ్యాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలను నెరవేర్చని పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని మహాకూటమి ఆదివారం విమర్శించింది. సమావేశాల ప్రారంభానికి సూచికగా ముఖ్యమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన తేనిటి విం దును బహిష్కరించామని సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ప్రకటించారు. చవాన్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల రాష్ట్రం రూ.మూడు లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చవాన్ 500 ఎకరాల భూమిని బిల్డర్లకు కట్టబెట్టారని శివసేన నాయకుడు సుభాష్ దేశాయ్ మండిపడ్డారు. ఆదర్శ్ కుంభకోణంతో ప్రమేయమున్న ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవాడ్‌కు మంత్రిపదవి కట్టబెట్టడం సరికాదని తావ్డే స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎఫ్ కూటమికి ఓటమి తప్పదని చెప్పారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును శాసనసభ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాబట్టుకోవాలనే కసితో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బరిలోకి దిగిన 26 మంది అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. గెలిచే సత్తా ఉన్నప్పటికీ నలుగురు మంత్రులు గెలవలేకపోయారు. దీంతో ఆ నలుగురు మంత్రులను పదవుల్లోంచి తొలగించి పార్టీ పనులు చూసుకునే బాధ్యతలు అప్పగించాలని సోనియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారి స్థానంలో ఒకరు పాత, మూడు కొత్త, యువముఖాలకు అవకాశమివ్వాలని ఆమె యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదివరకే మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మార్పులు చేయడం ప్రారంభించింది. తమ కోటాలో ఖాళీగా ఉన్న పదవులను భర్తి చేయడం మొదలుపెట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచి ఉరుకులు పరుగులు ప్రారంభించింది. అయితే వేటు పడనున్న ఆ నలుగురు మంత్రులు ఎవరు..?, వారి స్థానంలో నియమితులయ్యే కొత్త ముఖాలు ఎవరివి...? అనేది గోప్యంగా ఉంచారు. దీంతో పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సోనియాను కలసిన చవాన్, మాణిక్‌రావ్ న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని శుక్రవారం కలిశారు. త్వరలో విధాన మండలికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయమై వీరిరువురు సోనియాతో సమావేశమయ్యారని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ తదితర సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారని చెప్పారు. పుణే, అమరావతిలో ఉపాధ్యాయుల నియోజకవర్గం, నాగపూర్‌లో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఈ ఉప-ఎన్నికల్లో పోటీ చేస్తోంది. -
నేడే విస్తరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్బల్లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే... అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పాత ముఖాలే.. మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం. -
కుంభమేళా పనులకు నిధుల కొరత
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి జిల్లాలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ఎంసీకి కేటాయించిన నిధులు తగిన రీతిలో అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కుం భమేళా నిమిత్తం జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్రం నిర్ణయించింది. జిల్లాకు రూ.2,378.71 కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కమిటీ నిర్ణయించింది. వీటిలో ఎంఎంసీకీ రూ.1,052.61 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్ఎంసీకి కేవలం రూ.222.17 కోట్లు అందజేసింది. కేంద్రం నుంచి ఎన్ఎంసీకి ఇంతవరకు నిధులు ఏమాత్రం అందలేదు. ఇదే సమయంలో, పనుల్లో తన వంతు నిధులను సకాలంలో విడుదల చేయాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు డివిజనల్ రెవెన్యూ కమిషనర్(నాసిక్ డివిజన్) ఏక్నాథ్ దావ్లే లేఖ రాశారు. ‘అత్యున్నత కమిటీ, హై-పవర్ కమిటీ సమావేశాల సమయంలో కుంభమేళాకు సంబంధించిన పనులకు కేటాయించిన నిధుల్లో 33 శాతం అంటే రూ.350 కోట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మిగిలిన సొమ్ము (సుమారు రూ.700 కోట్లు)ను నాసిక్ మున్సిపల్ కార్పొరేషనే సమకూర్చుకోవాలని చెప్పింది. అయితే ఈ నెల మొదటి వారంలో జరిగిన కుంభమేళా సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.350 కోట్లు, లోన్ల ద్వారా రూ.350 కోట్ల పైనే నివేదిక సమర్పించింది. మిగిలిన రూ. 352.61 కోట్ల నిధుల గురించి ఎటువంటి ప్రణాళిక రూపొం దించలేదు. కుంభమేళాకు ఇంకా ఎంతో సమయం లేదు. సాధుగ్రాం, తాత్కాలిక నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, తాత్కాలిక పార్కింగ్ స్థలాల ఏర్పా టు వంటి పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు చూస్తే సకాలంలో అందడంలేదు.. ఇలా అయితే కుంభమేళా సమయానికి నిర్దేశించిన పనులు పూర్తిచేయడం కష్టమే..’ అని ఆ లేఖలో ఏక్నాథ్ స్పష్టం చేశారు. కాగా నగర మేయర్ యతిన్ వాఘ్‌ను ఈ విషయమై సంప్రదించగా..‘కుంభమేళా పనుల పూర్తిలో ఎన్ఎంసీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సమాన బాధ్యత ఉంది. అలహాబాద్, ఇతర నగరాలకు కేంద్ర నిధులు అందాయి. మాకు కూడా కేంద్ర నిధులు విడుదల కావాల్సి ఉంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తాం. ప్రస్తు తం మేము ఎన్ఎంసీ తరఫున నిధుల సమీకరణలో తలమునకలై ఉన్నాం..’ అని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో కుంభమేళా జరగనుంది. ఎన్ఎంసీ కి కేటాయించిన 96 పనుల్లో రూ.529.55 కోట్ల విలువ చేసే 29 పనులను ఇప్పటికే ప్రారంభించా రు. వీటిలో రూ.432.49 కోట్ల ఖర్చు ప్రతిపాదనతో 17 రోడ్డు పనులు, గోదావరిపై రూ.16.97 కోట్ల అంచనాతో మూడు వంతెనలు, రూ.65.01 కోట్ల అంచనా ఖర్చుతో ఐదు నీటి సరఫరా పనులు, అలాగే రూ.15.08 కోట్ల అంచనా ఖర్చుతో నాలుగు మురికినీటి ప్రక్షాళన పనులు ఉన్నాయి. -
ఏళ్లుగా నామినేటెడ్ పోస్టులు ఖాళీ
ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సొంత మంత్రివర్గం నుంచే వ్యతిరేకతవ్యక్తమవుతోంది. వివిధ కార్పొరేషన్స్‌లో, కమిటీల్లో ఖాళీగా ఉన్న పదవుల్లో సీనియర్ నాయకులను నామినేట్ చేయకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసినవారిని స్పెష ల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌గా నియమించుకుండా ఎన్నో ఏళ్లుగా జాప్యం చేస్తున్నారంటూ మంత్రులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాదీ శాఖ, మహిలా ఆర్థిక్ వికాస్ మహామండల్, రాష్ట్ర గనుల శాఖ ఇలా 55 చట్టబద్ధమైన సంస్థలు, బోర్డులు ఉన్నాయని, వాటి లో ఐదారు మినహా మిగిలిన అన్నింటికి అధికారులే నేతృత్వం వహిస్తున్నారని సీనియర్ మంత్రి ఒకరు అన్నారు. గత ఐదు నుంచి పదేళ్లుగా ఇది రాష్ట్ర వ్యవహారమని ఆయన మండిపడ్డారు. ఇలా రాష్ట్ర సారధ్యంలో నడిచే కార్పొరేషన్లు, బోర్డులకు మంత్రివర్గ హోదా ఉంటుందని, వీటిని సాధారణంగా రాజకీయ నాయకులు నేతృత్వం వహించాల్సి ఉండగా, అన్ని అధికారాలు అధికారులకే ఇచ్చారన్నారు. మాడాకు చివరి పొలిటికల్ ఛైర్మన్ మధు చవాన్ అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్ప్రకాష్కి మధ్య ఉన్న విభేదాల వల్ల నియామకాల్లో జాప్యం జరుగుతోందని మంత్రి అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి కమి టీ విభాగాలకు అధిపతులను ముఖ్యమంత్రి నియమించలేదు. పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు నిధులు పంపిణీ చేయడం కోసం దాదాపు 120 కమిటీలున్నాయని, ఇవన్నీ ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయని ఆయన తెలి పారు. సంబంధిత దస్తావేజులన్నింటినీ అప్పగించినా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌ను ముఖ్యమంత్రి నియమించలేకపోయారని ఆయన విమర్శించారు. ఎంపీఎస్సీ ఛైర్మన్ సుధీర ఠాక్రే మే 18న పదవీ విరమణ పొందారని, అయినా ఇప్పటివరకూ ఆ స్థానానికి కొత్తవారిని ఎంపిక చేయలేదన్నారు. మొత్తం ఐదుగురు సభ్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్కరితోనే కమిషన్ నడుస్తోందని, దీని వల్ల పదివేల ఇంటర్వ్యూలు ఆగిపోయాయని మంత్రి తెలిపారు. -
పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. కొంత మంది ముఖ్య నేతలతో పాటు కింది స్థాయి కార్యకర్తలు కూడా కెప్టెన్ మారితే మంచి రోజులు వస్తాయని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి దారుణంగా చతికిలబడిపోవడంపై లోలోన మధన పడుతున్నారు. బీహర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ చెత్త ప్రదర్శన కనబరచడంతో ఆ పార్టీకి చెందిన సీఎం నితీశ్ పదవికి రాజీనామా చేసినట్టుగానే ఇక్కడ కూడా పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటు సొంతపార్టీలోని నేతలతో పాటు ప్రతిపక్ష నాయకు లు సీఎం రాజీనామా చేయాలనే పట్టుబడుతున్నా రు. అయితే చవాన్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తొందర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను మార్చకపోవచ్చనే ధీమా లో పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. ఎన్నాడూ లేని ఓటమి... గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఓడిపోలేదు. ఆగస్టు ఆఖరు, లేకుంటే సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజా పరి ణామాలను పరిగణనలోకి తీసుకోని ముఖ్య నేతను మార్చాలనే పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నా రు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయా న్ని తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఓటమిపై సమీక్షించనున్న అగ్రనేతలు పనిలోపనిగా రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో అంత తొందరగా చవాన్‌ను మారుస్తారా? అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్పులకు పట్టు... లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి కాంగ్రెస్‌లో పెను మార్పులు చేయాల్సిన అసరముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొంకణ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి పదవీకి రాజీనామా చేసిన నారాయణ్ రాణే శనివారం సాయంత్రం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ అయి దాదాపు అర గంటసేపు చర్చించారు. తమకు లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించని అధిష్టానం ఈసారైనా అసెంబ్లీకి ఆ అవకాశమివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. నాందేడ్ లోక్‌సభ నుంచి గెలిచి న మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా అసెంబ్లీ ప్రచా ర బాధ్యతలు తీసుకోవాలని ఉవ్విళూరుతున్నారు. సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెళితే మొదటికే మోసం వస్తుం దనే వాదనను వినిపిస్తున్నారు. ఇలా పార్టీలోని నేతలంతా ఒకేబాటన ఉండకపోవడం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరింత దెబ్బతీసే అవకాశముం టుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్య మార్పులు చేసినా, అది ప్రజల్లోకి ఎలాం టి సంకేతాలు తీసుకెళుతుందన్న అంతర్మథనంలో అధిష్టానం ఉంది. దీంతో సీఎం చవాన్‌ను మార్చే అవకాశం ఉం డకపోవచ్చని వాదన వినవస్తున్నా... ఏ సమయం లో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఏమై నా జరగవచ్చన్న ఆశలో సీఎం ప్రత్యర్థులు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో మిగతా 6వ పేజీలో ఠసీఎంకుసెగ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజీనామా కోరే హక్కు లేదు: పీసీసీ లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలన్న నైతిక హక్కు బీజేపీకి లేదని పీసీసీ అధికార ప్రతినిధి బస్వరాజ్ పాటిల్ నగ్రల్కర్ అన్నారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవసరం ఆ పార్టీకి లేదని తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు తమల్ని ఎన్నుకున్నారని, అలాం టప్పుడు వాళ్లను అవమానించేలా మేం ఎందుకు వ్యవహరిస్తామని బీజేపీని నిలదీశారు. -
త్వరలో విస్తరణ
సాక్షి, ముంబై: త్వరలో రాష్ట్ర మంత్రిమండలిని విస్తరించనున్నట్లు ముఖ్యంత్రి చవాన్ పరోక్షంగా వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రమంత్రులు గెలుపొందినట్లయితే ఖాళీ అయిన వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో ఉండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉన్నా కాంగ్రె స్, ఎన్సీపీ నేతల్లో మంత్రిపదవులను దక్కించుకునే పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. కొత్తవారికి అవకాశం దక్కడంతోపాటు ఉన్నవారి శాఖలు కూడా మార్చే అవకాశముందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు రాష్ట్ర మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. కాంగ్రెస్‌లో.... లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో అయిదుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా తమ కోటాలోని మూడు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘే, పర్యావరణశాఖ మంత్రి సంజయ్ దేవ్తలేలు లోకసభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిద్దరు విజయం సాధించి నట్టయితే మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ ఐదు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు దక్కనున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మంత్రిపదవుల రేసులో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే తదితర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు కూడా మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఇప్పటినుంచే ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఎన్సీపీలో... లోక్‌సభ ఫలితాల అనంతరం మంత్రి మండలి విస్తరించనున్నట్టు సంకేతాలు వెలువడంతో ఎన్సీపీ నేతల్లో ఆశలో చిగురించాయి. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, జలవనరులశాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు సురేష్ దస్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా విజయం సాధించినట్టయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ కానున్న వీరి స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తే మరికొందరికి అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నాయకులలో జితేంద్ర అవాడ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనతోపాటు ప్రకాశ్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్‌బల్ తదితరులు కూడా మంత్రిపదవుల రేసులో ఉన్నారని చెబుతున్నారు. -
ముఖ్యమంత్రి చవాన్‌తో అమెరికా రాయబారి భేటీ
సాక్షి ముంబైః భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. సహ్యాద్రి అతిథిగృహంలో మంగళవారం వీళ్లు పలు విషయాలపై చర్చించారు. ఈనెల చివరివారంలో నాన్సీ పావెల్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చవాన్ ఆమెకు అజంతా గుహల పెయింటింగ్‌ను బహూకరించారు. పారిశ్రామికరంగల్లో రాష్ట్రం అగ్రగామిగా ముందుకు దూసుకెళ్తున్నదంటూ నాన్సీ చవాన్‌ను అభినందించారు. దౌత్యపరంగా మహారాష్ట్ర ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరించిందని, మున్ముందుకూడా ఇలాంటి సహకారమే లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి చవాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలు భారత విద్యార్థుల కోసం ముంబై వంటి నగరాల్లో ప్రత్యేక క్యాంపస్‌లు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఓట్లకు గాలం పథకాలకు ప్రాధాన్యం
సాక్షి, ముంబై: త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు అధికార పక్షం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. ఓట్లు తెచ్చిపెట్టే ప్రాజెక్టులు, పథకాలపై మంత్రిమండలి దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారం వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి కాంగ్రెస్ 288 మంది సమన్వయకర్తలను నియమించింది. దాదర్‌లోని తిలక్‌భవన్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షులు, ఆఫీసు బేరర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని చర్చించడానికే కాంగ్రెస్ శనివారం ఈ భేటీని ఏర్పాటు చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మంజూరు చేయించుకుని ప్రజలను ఆకట్టుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు యోచిస్తున్నారు. అన్ని కీలక ప్రాజెక్టులకు వెంటనే మంజూరు తెలపాలని ముఖ్యమంత్రికి సూచించారు. తమ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు సత్వరం అనుమతులు మంజూరు చేయాలంటూ కొందరు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో జరగబోయే మంత్రి మండలి సమావేశాల్లో అనేక కీలక ప్రాజెక్టులకు మోక్షం లభించవచ్చు. ప్రజలకు తెలియకపోవడం వల్లే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా, ప్రజాస్వామ్య కూటమికి ఇవేవీ ఓట్లు రాల్చలేదని సమాచారం. వీటి గురించి ప్రజలకు తెలియకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రెండు వేల మురికివాడల క్రమబద్ధీకరణ, ఠాణే, నవీముంబైలో ‘క్లస్టర్ యోజన’, విద్యుత్‌బిల్లులపై 20 శాతం రాయితీ తదితర అనేక జనాకర్షణ పథకాలను లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించారు.అయినా రాజకీయంగా పెద్దగా ప్రయోజనం కలగలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధిష్టానానికి పంపించిన నివేదికలో తెలిపినట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ ఎన్నికల కోసం మరిన్ని జనాకర్షణ పథకాలను రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే వీటి గురించి ముందస్తుగానే ప్రజలందరికీ తెలియజేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులన్నింటిపై నిర్ణయాలు తీసుకోవాలని మంత్రిమండలి కోరుకుంటోంది. మూడున్నరేళ్ల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చవాన్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. అధిష్టానం ఒత్తిడి కారణంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలుకు ముందుగానే మురికివాడల క్రమబద్ధీకరణ, క్లస్టర్ యోజనను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు విద్యుత్ బిల్లులపై 20 శాతం రాయితీలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఆహార భద్రతతోపాటు పలు పథకాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం కలగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా...? పెండింగ్ ప్రాజెక్టుల్లో ఏవి కీలకమైనవో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సీఎం, మంత్రులు తరచూ భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలను వెంటనే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ పరిస్థితిని గమనిస్తే అనేక కీలక ప్రాజెక్టులకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయి. -
గెలుపుపై గుబులు
సాక్షి ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మంత్రుల్లో ఆందోళన ప్రారంభమయింది. అధికారంలో ఉన్న ప్రజాసామ్య కూటమికి ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కాంగ్రెస్‌లో నెలకొందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన మంత్రి మండలి సమావేశాలతో ఈ విషయం బహిర్గత మయిందని చెప్పవచ్చు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రయత్నించడంతోపాటు దీర్ఘకాలంగా జాప్యమవుతున్న అనేక ప్రాజెక్టులు, పథకాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రిమండలి సమావేశంలో పలువురు కేబినెట్ సభ్యులు సూచించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్షం మంత్రి మండలిలో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇలా రాబోయే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కేబినెట్ సమావేశంలో కన్పించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయమైనా తొందరగా తీసుకోవాలని దాదాపు అందరు మంత్రులూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడాల్సి వచ్చిందని మరికొందరు మంత్రులు వాపోయారు. అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కూటమి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు నిర్ణయాలూ త్వరగా తీసుకోవాలని మంత్రులందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చోపచర్చలు నడిచినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల అమలు, ఫైళ్ల ఆమోదంపై తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. మంత్రులు ఆర్.ఆర్.పాటిల్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, నసీంఖాన్, అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని సూచించినట్టు తెలిసింది. మరోవైపు ఓబీసీ విద్యార్థుల సమస్యను కూడా పరిష్కరించాలని, లేదంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కన్పించే అవకాశాలున్నాయని పృథ్వీరాజ్ చవాన్ కొందరు హెచ్చరించారు. దీంతో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
ఊపందుకున్న ‘ గోసీఖుర్ద్ ’ పనులు
నాగపూర్: విదర్భ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల హెక్టార్ల పంటభూములకు సాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రారంభించిన గోసీఖుర్ద్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఇప్పటికి ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికిగాను నాగపూర్ జిల్లా నుంచి 51 గ్రామాలు, విదర్భకు చెందిన 13 గ్రామాల ప్రజలను తరలించాల్సి వచ్చింది. బాలాఘాట్(ఎంపీ) నుంచి ప్రాణహితా నది(గడ్చిరోలీ) వరకు ప్రవహించే వైన్‌గంగా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు 1983లో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు 1988 ఏప్రిల్ 22న అప్పటి చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భండారాలో ఉన్న గోసీఖుర్ద్ గ్రామంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. దీనిద్వారా విదర్భ ప్రాంతంలోని నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల్లో సుమారు 2,50,800 హెక్టార్ల భూములకు సాగునీరందించేందుకు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 36,894 హెక్టార్లకే నీరందించగలుగుతున్నారు. 26 యేళ్లపాటు నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. వచ్చే వర్షాకాలానికల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్మాణం వల్ల నష్టపోయేవారి సంక్షేమం కోసం ఏడాది కిందట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రూ.1,199 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది మేలో రూ.684.18 కోట్లు విడుదల చేశారు. అందులో రూ. 324.92 కోట్లను నాగపూర్, భాంద్రా జిల్లాల్లో బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే నాగపూర్ జిల్లా లో 51 గ్రామాలు, భాంద్రా జిల్లాలో 13 గ్రామాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కాగా, జీవన్‌పూర్, సిర్సి, ఖర్దా,పంజ్రేపార్ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తెలిపారు. గతవారం ఆయన ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా, మొదటి విడతలో, భాంద్రా జిల్లాలోని ఐదు గ్రామాల్లోని మూడు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆయా గ్రామాల్లో ఉన్న 14,948 గ్రామీణ కుటుంబాల్లో 5,715 కుటుంబాలకు సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటుచేసినట్లు నాగపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్(పునరావాసం) రాజ్‌లక్ష్మి షా తెలిపారు. భండారా జిల్లా మీదుగా ప్రవహించే వైన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల రైతులకు సాగునీటి సమస్య తీరినట్లే.. -
ప్రచారం పరిసమాప్తం
చివరిరోజు ప్రధాన నేతల ఎన్నికల ర్యాలీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన వాతావరణం 19 లోక్‌సభ స్థానాల బరిలో 339 మంది అభ్యర్థులు సీఎం చవాన్‌పై మోడీ ఫైర్ సాక్షి, ముంబై: గుజరాత్‌ను మించి మహారాష్ర్టనే ప్రగతి పథంలో ముందుందన్న సీఎం పృథ్వీరాజ్ చవాన్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మండిపడ్డారు. అలాగైతే రాష్ట్రంలోని రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మహా కూటమి అభ్యర్థులకు మద్ధతుగా నరేంద్ర మోడీ ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బార్, ధులేలలో జరిగిన ప్రచార సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తు సమయం వృధాచేసే బదులుగా రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తే మంచిదన్నారు. రాష్ట్రంలోని రైతులు ఉపాధి కోసం గుజరాత్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో పృథ్వీరాజ్ చవాన్ సమాధానమివ్వాలన్నారు. గుజరాత్లో పంటకు మద్దతు ధర లబిస్తుందనే నమ్మకంతోనే ఇక్కడి రైతులు గుజరాత్‌కు వస్తున్నారని తెలిపారు. అంతా అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న సీఎం, ధులే, నందుర్బార్, జల్గావ్ జిల్లాలు ఎందుకు అభివృద్దికి నోచుకోలేదో చెప్పాలన్నారు. సాక్షి, ముంబై: లోక్‌సభ మూడో దశ ప్రచారానికి తెరపడింది. ఇన్నిరోజులు వాడివేడిగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పరిసమాప్తి అయింది. మూడో దశలో భాగంగా 19 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే చివరి రోజైన మంగళవారం వివిధ ప్రాంతాల్లో ప్రముఖ నాయకుల ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. చివరి రోజు వరకు వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలతోపాటు పాదయాత్రలు, రోడ్ షోలు, ర్యాలీలు, వీధి సభలను అభ్యర్థులు నిర్వహించారు. చివరి రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, గోపీనాథ్ ముండే, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రచారాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు ముఖ్య నేతలతో కూడిన హోర్డింగ్‌లను తొలగించారు. బరిలో 339 మంది... తుది దశలో జరగనున్న మొత్తం 19 లోకసభ నియోజకవర్గాల్లో 339 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మిలింద్ దేవరా, గురుదాస్ కామత్, మేధాపాట్కర్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే, మాణిక్‌రావ్ గావిత్, బాలా నాందగావ్కర్, మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కూతురు హీనా గావిత్, సంజీవ్ నాయక్, శివసేన నాయకుడు అనంత్ గీతే తదితరులు ఉన్నారు. ఈసారి కూడా ప్రధాన పోటీ ప్రధానపార్టీలైన కాంగ్రెస్-ఎన్సీపీల ప్రజాసామ్య కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి పార్టీల మహాకూటమిల మధ్య జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చేఅవకాశాలు కన్పిస్తున్నాయి. ముంబై, ఠాణే జిల్లాల్లోనే పది లోక్‌సభ నియోజకవర్గాలుండడంతో ప్రముఖ పార్టీలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. కాగా, గత ఎన్నికల్లో ముంబైలోని ఆరు స్థానాలను గెలుచున్న డీఎఫ్ కూటమి ఈసారి కూడా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ఈసారి మహాకూటమి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికితోడు ఎమ్మెన్నెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీలు బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోతాయన్న భయం ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కనబడుతోంది. ఠాణే జిల్లా పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ ఈసారి డీఎఫ్ కూటమి, మహా కూటమిల మధ్యే ప్రధాన పోరు జరిగే అవకాశముంది. ఎమ్మెన్నెస్ కూడా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఠాణే జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మిగతా పార్టీల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో కనబడటం లేదు. ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, రాయ్‌గఢ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ఉన్నా, ఎమ్మెన్నెస్, ఇతర పార్టీల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ కన్పిస్తోంది. నందుర్బార్లో గావిత్ కుటంబీకుల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున మాణిక్‌రావ్ గావిత్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఎన్సీపీ నేత, మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ కూతురు హీనా గావిత్ బరిలోకి దిగారు. రాయ్‌గఢ్‌లో ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తట్కరే, శివసేన అభ్యర్థి అనంత్ గీతేల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. నాసిక్‌లో ఎన్సీపీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, శివసేన అభ్యర్థి హేమంత్ గోడ్సే, ఎమ్మెన్నెస్ నుంచి ప్రదీప్ పవార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆప్ తరఫున విజయ్ పాండరే బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఉత్తర ముంబై 21, వాయవ్య ముంబై 15, ఈశాన్య ముంబై 19, నార్త్ సెంట్రల్ ముంబై 21, దక్షిణ ముంబై 21, దక్షిణ మద్య ముంబై 10, ఠాణే 26, కళ్యాణ్ 18, భివండీ 10, పాల్ఘర్ 10, రాయ్‌గఢ్ 10, నందుర్బార్ 9, ధులే 19, జల్గావ్ 20, రావేర్ 23, జాల్నా 22, ఔరంగాబాద్ 27, దిండోరి 10, నాసిక్ 15. -
మహారాష్ట్ర సీఎంకు స్వల్పగాయాలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెళుతున్న కాన్వాయ్ శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం చవాన్‌తోపాటు ఆయన కార్యదర్శి, మరో పోలీసు అధికారికి స్వల్పగాయాలయ్యాయి. మీరారోడ్‌లో జరగనున్న ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు వెళుతుండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రెస్ సమీపంలోని సిగ్నల్వద్ద కాన్వాయ్‌లోని పైలట్ కారును.. అదుపుతప్పి వచ్చిన ఓ వాహనం ఢీకొంది. దీంతో పైలట్ వాహనం వెనుక వస్తున్న మిగతా వాహనాల డ్రైవర్లందరూ సడన్‌బ్రేక్ వేశారు. ఫలితంగా కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఇందులో చవాన్ వాహనమూ ఉంది. ఈ ఘటనలో కారులో కూర్చున్న చవాన్, ఆయన కార్యదర్శి స్వల్పంగా గాయపడ్డారు -
మోడీ హైజాకర్
ముంబై: బీజేపీని నరేంద్ర మోడీ హైజాక్ చేశారని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. కాషాయ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పగ్గాలు ఇస్తే పార్టీ పాలన ఉండదని, అంతా వన్ మాన్ షో కనబడుతుందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. నిరంకుశ ధోరణి పాలనతో ప్రమాదకారిగా కనబడే మోడీ గురించి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికే బీజేపీని పూర్తిగా చెప్పుచేతుల్లోకి తీసుకున్న మోడీ, పార్టీ అగ్రనేతలను పక్కకుబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తాను, అమిత్ షా పర్యవేక్షణలోనే పార్టీ నడవాలనే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పార్టీలోనే ప్రమాదకారిగా వ్యవహరిస్తున్న మోడీ, రేపొద్దున ప్రభుత్వ పాలన చేస్తే మోనార్క్ ముద్ర స్పష్టంగా కనబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో నిరంకుశంగా వ్యవహరించడంతో పాటు వ్యక్తిగత పనులకు పోలీ సు విభాగాన్ని వాడుకున్న మోడీని ఎన్నుకోవద్దని దేశ ప్రజలకు చవాన్ పిలుపునిచ్చారు. గుజరాత్ మోడల్ విధానం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎలా ప్రభావం చూపుతాయో తనకైతే అర్థం కావడం లేదన్నారు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలన ఎలా సాగిస్తుందో వాళ్లకే స్పష్టత లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని, అయితే తన పాలనలోనే అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళుతోందనే ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. మాధవ్‌సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలోనే గుజరాత్ వృద్ధి రేటు పెరిగిందని చవాన్ తెలిపారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందితే అభినందనలు తెలుపుతామన్నారు. అయితే దాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడానికి తాము విరుద్ధమని తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో మాదిరిగా రాష్ర్ట వృద్ధి రేటు గురించి రాజకీయ సవాళ్లు విసురుకోమని చవా న్ వివరించారు. గుజరాత్ అభివృద్ధి తప్ప మోడీ ప్రచారంలో ఇతర విషయాల గురించి మాట్లాడటం లేదన్నారు. గత పదేళ్లలో గుజరాత్ కన్నా ఎక్కువగా పదకొండుసార్లు రాష్ట్రానికి ఎఫ్‌డీఐలు వచ్చాయని వివరించారు. వ్యవసాయ రంగంలో గుజరాత్ కొంచెం ఫర్వాలేదన్నారు. రాష్ట్రంలో వరుస ప్రకృతి వైపరీత్యాలు, కరువు తాండవించడం వల్ల వ్యవసాయ సాగులో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేకపోయామని తెలిపారు. గుజరాత్ అభివృద్ధి అంతా తన ఒక్కడి వల్లే సాధ్యమైందం టూ మోడీ కలరింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని, అదంతా ప్రతి ఒక్క గుజరాతీయుడిదని చెప్పారు. కాంగ్రెస్ సాధించిన అభివృద్ధి ప్రజ ల్లోకి వెళ్లకుండా ఇతర విషయాలను లేవనెత్తుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని చవాన్ మండిపడ్డారు. రాహుల్ ప్రజాదరణ నేత కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని సీఎం చవాన్ తెలిపారు. ‘ఇప్పటికే అనేక ర్యాలీల్లో రాహు ల్ పాల్గొన్నారు. మరికొన్ని ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. రాహుల్ ప్రజాదరణ నేత. ఆయన సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నార’ని ఆయన చెప్పారు. ప్రతి దేశం లో యువ నాయకత్వమే పగ్గాలు చేపడుతోందని, ఇక్కడ కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని చవాన్ ధీమా వ్యక్తం చేశా రు. కాగా, ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే సమస్యలను తెలుసుకోవడంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపై అవగాహన ఉంటుందని, ఇతర అధికారుల నుంచి కూడా సహా యం అందుతుందని చవాన్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో లేకుంటే నిర్ణయాత్మక విధానంపై అవగాహన ఉండదన్నారు. అయితే రాహుల్ ఎప్పుడు పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి కేంద్రీకరిం చారని, ఈ అనుభవం మరోలా ఉంటుందని చవాన్ అన్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మెరుగైనది అన్నది తాను చెప్పలేనని తెలిపారు. లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వంలో పొర్ట్ఫోలియో లేకుండానే ఇందిరా గాంధీ పనిచేసిందని, రాజీవ్ గాంధీ నేరుగా పీఎం అయ్యారని గుర్తు చేశారు. -
నరేంద్ర మోడీ ప్రమాదకారి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రమాదకారి అని, బీజేపీని హైజాక్ చేశారని చవాన్ ఆరోపించారు. మోడీ నిరంకుశ ధోరణులను అవలంభిస్తున్న మోడీ ప్రమాదకారి అని, అందుకే ఆయన గురించి కాంగ్రెస్ మాట్లాడాల్సివస్తోందని అన్నారు. బీజేపీ సీనియర్ నేతలను పక్కకు తప్పించి పార్టీని పూర్తిగా తన గుప్పిట్లలోకీ తీసుకున్నారని విమర్శించారు. బీజేపీలో మోడీ వన్ మ్యాన్ షోగా మారిపోయారని, భారత రాజకీయాలను కూడా ఒకే వ్యక్తి శాసించే దిశగా మోడీ ప్రయత్నిస్తుండటం ప్రమాదకరమని చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలను హెచ్చరిస్తున్నామని చెప్పారు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా మోడీ వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ, ఇలాంటి వ్యక్తికి అత్యున్నత పదవి కట్టబెడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించుకోవచ్చని చవాన్ పేర్కొన్నారు. -
మోడీ ఓ మోనార్క్
ముంబై: మోడీది మోనార్క్ పాలన అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరి మాట వినరని, ఆయన నియంతృత్వ వైఖరి వల్ల అసమ్మతి ఉండదని, అలాంటప్పుడు చర్చకు స్థానమెక్కడిదని చవాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మోడీ నాయకత్వం గురించి దేశ ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారని సీఎం చవాన్ తెలిపారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే సాధారణ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు మధ్య యుద్ధం జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. ఒకవేళ మోడీ దారిలో వెళ్లాలనుకుంటే బీజేపీకి మేనిఫెస్టోతోనే పనిలేదని చెప్పారు. పార్టీ నేనే, మేనిఫెస్టో నేనే, చర్చలు, ఆలోచనలకు తావు లేదన్నది మోడీ సిద్ధాంతమని ఆయన విమర్శించారు. బీజేపీలోనే ఒక వర్గం అభివృద్ధి విషయాలతో పాటు ఉమ్మడి పౌరస్మృతి, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దులపై దృష్టి పెడితే, మరో వర్గం తమను తాము ప్రజల్లో ఎలా గుర్తింపు పొందాలన్న దానిపై దృష్టి కేంద్రీకరించారన్నారు. బీజేపీ ప్రాచుర్యం కోసం టీవీ, సామాజిక అనుసంధాన వేదికలను ఉపయోగించుకుంటోందని, వారి మేనిఫెస్టో, విధానాల్లో విలువలేమీ లేవని మండిపడ్డారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే యూపీఏ పథకాలను రద్దు చేస్తామా లేదా? మరింత సమర్థవంతంగా అమలు చేస్తామా? అన్న దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే వరకు వేచిచూసిన బీజేపీ దాన్నే కాపీ, పేస్ట్ చేసిందని ఆరోపించారు. స్పందన బాగుంది... గురువారం తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ స్థానాల్లో అధికార ప్రజాస్వామ్య (డీఎఫ్) కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని సీఎం చవాన్ తెలిపారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శివసేన పార్టీని పతనం చేసేందుకు బీజేపీ, ఎమ్మెన్నెస్ రహస్య అవగాహనకు వచ్చాయని తెలిపారు. లౌకిక ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే పాల్ఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర గవిత్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. రాయ్‌గఢ్ స్థానం విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆర్.అంతులేతో ఇప్పటికే మాట్లాడామని చెప్పారు. -
కాంగ్రెస్, ఎన్సీపీ
దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వల్ల ఈ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలూ తప్పేట్టులేదు. మిత్రపక్షమైన ఎన్సీపీని దూరంగా ఉంచాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి విన్పిస్తోంది. శరద్ పవార్ ఆయన పరివారంపై వస్తున్న అవినీతి ఆరోపణలు తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. స్థానిక సమస్యలు.. ముఖ్యంగా ఇటీవల మళ్లీ పెరిగిన రైతుల ఆత్మహత్యలు, జలవనరుల ప్రాజెక్టుల కుంభకోణాలు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మొదలైనవి కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్గత కలహాలు, అసంతృప్త నాయకుల కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయితే, రాష్ట్రంలో 48 శాతం ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఇవి సానుకూలం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధానంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు చూస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్గజాల్లో సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ సీఎం అశోక్ చవాన్(నాందేడ్), మిలింద్ దేవరా(దక్షిణ ముంబై), ప్రియాదత్(ముంబై నార్త్ సెంట్రల్), గురుదాస్ కామత్(ముంబై నార్త్‌వెస్ట్)లు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న సురేష్ కల్మాడీకి పూణె టికెట్ ఇవ్వకపోవడంపై అక్కడ మంచి పట్టున్న కల్మాడీ అసంతృప్తితో ఉన్నారు. ఆదర్శ్ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్‌ను బరిలోకి దింపడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలోకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్సీపీ కొందరు రాష్ట్ర సీనియర్ మంత్రులను కూడా బరిలోకి దింపింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే, సోదరుని కుమారుడు అజిత్ పవార్లు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో పార్టీకి పట్టుండడంతో ఆ ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇటీవల శివసేన సిట్టింగ్ ఎంపీలు పలువురు ఎన్సీపీలో చేరారు. -
‘ఆహార భద్రత’ ఘనత మాదే
భివండీ, న్యూస్‌లైన్: ఇతర దే శాలపై ఆధారపకుండా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఉద్ఘాటించారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గంలోని అంజూర్ఫాటా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చవాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రత పథ కం వల్ల రూ.2 లక్షల 40 వేల కోట్ల విలువచేసే ధాన్యాన్ని మనమే ఎగుమతి చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేద కుటుంబాలు బాగుపడుతున్నాయన్నారు. ‘మహిళలు, దళితులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కొందరు గిట్టనివారు మా పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నారు’అని తెలిపారు. బాలికలకు వసతి గృహాలు, సాంకేతిక, ఇతర కళాశాలు నిర్మించడంవల్ల విద్యార్థినుల సంఖ్య బాగాపెరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీల నేత త్వంలోని తమ పాటుపడుతోందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం అందరితో మమేకమై అభివృద్ధి బాటలో దూసుకెళుతుందని చవాన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఫిరాయింపుల బెడద పెరిగిపోవడంతో కార్యకర్తలు ఆందోళనలో పడిపోయారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలి? ఎవరికి అండగా నిలబడాలి? తదితర విషయాలను తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేయడానికే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి గణేశ్ నాయిక్ ప్రసంగిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. అక్కడి నుంచి వేలాదిసంఖ్యలో పశువులు గడ్డి కోసం ఈ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి గుజరాత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనే విషయాన్ని తేలికగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి చవాన్ నిర్ధేశించిన సమయానికంటే సుమారు మూడు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడంతో కార్యకర్తలు కొంత అసహనానికి గురయ్యారు. సురేష్ టావ్రేకి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్‌చేస్తూ చవాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విశ్వనాథ్ పాటిల్‌ని అభ్యర్థిగా ఖరారు చేశారు. కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి చవాన్ అభ్యర్థిని మారుస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు మాజీ ఎమ్మెల్యే యోగేష్ పాటిల్, ఎమ్మెల్యేలు ఆనంద్బాయి ఠాకూర్, ఇర్ఫాన్ బురే, మహాదేవ్ చౌగులే, సహాయ మంత్రి సతేజ్ పాటిల్, కాంగ్రెస్ ప్రతినిధి మహాదేవ్ శేలార్, వేలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు. -
జాతీయ విపత్తే
ముంబై: రాష్ట్రంలో ఇటీవల వడగళ్ల వాన ధాటికి పంటలు, ఆస్తులు, జీవితాలు నాశనమయ్యాయని, ఇది నిజమైన జాతీయ విపత్తు అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. పంటలు కోల్పోయిన రైతులకు సాధ్యమైనంత మేర చేయూతనిస్తామని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. దీన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో చూడొద్దని, నైరాశ్యంలో ఉన్న రైతాంగానికి సహకరించాలనే ధృక్పథంతో ఆలోచిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో వచ్చిన వడగాళ్ల వానను జాతీయ విపత్తుగా పరిగణించాలని బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల ప్రధానమంత్రిని కలిసి రూ.ఐదువేల కోట్లు పునరావాసం కింద మంజూరు చేయాలని కోరానని చవాన్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కోరారు. ఆదివారం నుంచి ఇప్పటివరకు 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాలవర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతుల బాధలు తమకు తెలుసని, రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 28 ప్రాంతాల్లో భారీగా పంట నష్టం సంభవించిందని వివరించారు. ‘ప్రతి రైతన్నకు చేదోడువాదోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాం. భావోద్వేగాలు, నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకోవద్దని అభ్యర్థిస్తున్నా. సాధ్యమైన మేర ఆదుకునే ప్రయత్నం చేస్తామ’ని చవాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియ ఆలస్యమవుతోందని గుర్తు చేశారు. ఇప్పటికే పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఓ అత్యున్నత స్థాయి కమిటీని పీఎం నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. సుశీల్ కుమార్ షిండే, పి.చిదంబరం, జైరాం రమేశ్, ఎంఎస్ అతుల్వాలియాలతో కూడిన ఈ బృందం బుధవారం సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించిందన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులను కలసి, ఇటీవల రాష్ట్రంలో వడగళ్ల వాన సృష్టించిన ప్రళయాన్ని వివరించామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు నిబంధనాల్లో సడలింపులు ఇవ్వాలని కోరామన్నారు. ఏప్రిల్ 10వ తేదీలోపు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు (నోటా)ను నొక్కుతామని విదర్భ రైతులు హెచ్చరించిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పార్లమెంట్లో రైతుల వాణి వినిపించేందుకు పది శాతం ప్రాతినిధ్యం కల్పించాలని వార్ధాలో గురువారం పర్యటించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విదర్భ రైతులు కోరారు. ‘పంట నష్టంతో కొంత మంది అన్నదాతలు గ్రామంలో బహిరంగ ప్రాంతంలోనే ఉరి వేసుకుంటున్నారు. వారికి స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు కౌన్సెలింగ్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. తమ సమస్యలను వినిపించే రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఎవరూ లేరన్న నిరాశానిస్పృహల్లో ఉన్నార’ని విదర్భ జనాందోళన సమితి (వీజేఏఎస్) అధ్యక్షుడు కిశోర్ తివారి బుధవారం పేర్కొన్నారు. ప్యాకేజీ ప్రకటనపై ఈసీని కలుస్తాం: పవార్ న్యూఢిల్లీ: గత నెలలో కురిసిన అకాల వర్షాలకు భారీ స్థాయిలో పంటలు ధ్వంసమైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు పునరావాస ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్రం గురువారం ఎన్నికల కమిషన్ అనుమతి కోరనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం బుధవారం సమావేశమై ఈ రెండు రాష్ట్రాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై తమకు ఎలాంటి సమాచారం లేదని పవార్ మీడియాకు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పునరావాస ప్యాకేజీ ఎంత అనేది ఇప్పుడే చెప్పలేనని వివరించారు. ఈ ప్యాకేజీ ప్రకటనపై గురువారం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంటామన్నారు. తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలు, వడగళ్ల వానలకు పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు రూ.20వేల కోట్ల నష్టపరిహారం ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. షోలాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు గోరఖ్ ఆనంద్ గాడ్డే, విఠల్‌రావ్ పవార్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, జస్టిస్ ఎం.ఎస్.సంక్లేచా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించనుంది. -
‘12 లక్షల హెక్టార్లలో పంట నష్టం’
నాగపూర్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ముంబైలో గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పరిస్థితిపై సమీక్షించి తీసుకోవల్సిన పునరావాల్సిన చర్యల గురించి చర్చిస్తామని చెప్పారు. నాగపూర్ జిల్లా నార్కేడ్ తాలూకాలోని మోహ్‌గావ్ భటడేలో ధ్వంసమైన గోధుమ, ఆరెంజ్ తోటలను సందర్శించి రైతులను పరామర్శించారు. ఆయన వెంట రాష్ర్ట పునరావాస మంత్రి పతంగ్‌రావ్ కదమ్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, ఆర్థిక సహాయ మంత్రి రాజేంద్ర ములాక్ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నాగపూర్ డివిజిన్లో ఆరుగురు మృతి చెందగా, 47 పశువుల మృతి చెందాయని జిల్లా యంత్రాంగ అధికారిక ప్రకటనలో పేర్కొంది. 10,261 ఇళ్లు ధ్వంసమయ్యాని తెలిపింది. నాగపూర్ జిల్లాలో కాంప్టీ, హింగానా, సావ్నర్, కటోల్, కలమేశ్వర్, నార్కేడ్, రాంటెక్, పర్సివోని, మౌడా, భివపూర్, కుహిలలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. చంద్రపూర్ జిల్లాలోని భండారా, పవోని, సకోలి, లకంద్పూర్, గోరేగావ్, గోండియా, వరోరాలలోనూ పంటలు, తోటలు నాశనమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలావుండగా విదర్భలోని యావత్మల్, వాషీమ్ జిల్లాలోనూ సీఎం చవాన్ పర్యటించారు. పంటనష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ధాటికి 28 మంది మృతి గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాల వల్ల 28 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ అకాల వర్షాల ప్రభావం 29 జిల్లాలపై ఉందన్నారు. 18,200కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. తొమ్మిది వేలకు పైగా పశువులు మృతి చెందాయని తెలిపారు. నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం నాసిక్: అకాల వర్షాలతో పాటు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, దానిమ్మ తోటల నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. నిపడ్, చంద్వాడ్, దేవ్లా, సతానా, మాలేగావ్‌లో ఈ బృందం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలి పాయి. ఆ తర్వాత ధులేకు వెళుతుందన్నారు. -
బాధితులకు సీఎం పరామర్శ
షోలాపూర్, న్యూస్‌లైన్: దక్షిణ షోలాపూర్ తాలూకాలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురిసి పంటలు కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ఓదార్చారు. ఎడ్లబండిపై చవాన్ తాలూకాలోని హోటగి, పతాటె వాడి, కాజికణబసు గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాలలో వడగండ్ల వానవల్ల పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ద్రాక్ష తోటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. పశువులు, గొర్రెలు అధిక సంఖ్యలో మృతి చెందాయి. స్థానిక ఇళ్లలో గోడలు కూలి, పైకప్పులు పడిపోవడంతో కొంతమంది నిరాశ్రయులయ్యారు. సీఎం చవాన్ ఉదయం విమానం ద్వారా పట్టణ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే స్వాగతాలను పక్కనపెట్టి వెంటనే వడగండ్ల వానకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, పునరావాస శాఖ సహాయ మంత్రి పతంగ్‌రావు కదంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. నష ్టనివారణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనేకమంది ముఖ్యమంత్రికి తమ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు అందజేశారు. మధ్యాహ్నం సీఎం తన పర్యటనను ముగించుకొని ఉస్మానాబాద్‌కు వెళ్లారు. -
కళ తప్పిన మంత్రాలయ
సాక్షి, ముంబై: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన మంత్రాలయ బోసిపోయింది. రాష్ర్టంలో 48 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంత్రాలయవైపు మంత్రులు రావడం మానేశారు. గురువారం మంత్రాలయ పరిసరాలు బోసిపోయి కనిపించాయి. ఎన్నికల షెడ్యూల్ప్రకటించే అవకాశాలున్నాయని తెలుసుకున్న మంత్రులు ఇప్పటికే తమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నా రద్దు చేశారు. దీనికితోడు రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఔరంగాబాద్‌కు రావడంతో అక్కడికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కీలక శాఖల మంత్రులు కూడావెళ్లారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకుని మంత్రాలయకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు వెలువడేంత వరకు మంత్రాలయలో పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. బోసిపోయిన సందర్శకుల పాస్ కౌంటర్లు... వివిధ పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది మంత్రులతో భేటీ అయ్యేందుకు మంత్రాలయానికి వస్తుంటారు. అయితే ఎన్నికల కోడ్ కూయడంతో గురువారం మంత్రాలయ భవనం ప్రధాన ప్రవేశద్వారం వద్ద విజిటర్స్ పాస్‌లు జారీచేసే కౌంటర్లు బోసిపోయి కనిపించాయి. నిత్యం జనం రాకపోకలతో కిటకిటలాడే మంత్రాలయ పరిసరాల్లో గురువారం ఏమాత్రం రద్దీ కనిపించలేదు. తనిఖీ, భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. మంత్రులు లేక క్యాబిన్లు, చాంబర్లు, బయట కుర్చీలన్నీ వెలవెలబోయాయి. మంత్రాలయ భవన్‌లోని ఆరు అంతస్తుల్లో ఉద్యోగులు, గేట్ల వద్ద పోలీసులు కనిపించారు. బుగ్గ కారుతో జాగ్రత్త! ప్రభుత్వ అధికారులతోపాటు బీఎంసీ ఉన్నతాధికారులపై ఎన్నికల కోడ్ ప్రభావం కనబడుతోంది. బుగ్గ (బెకాన్) కారులు కేవలం ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లడానికి మాత్రమే వినియోగించాలని అధికారులకి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనుంది. తమ వ్యక్తిగత పనులకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు వెళ్లేందుకు బుగ్గవాహనాలను వాడరాదని హెచ్చరించనుంది. లేనిపక్షంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద వారిపై కేసులు నమోదుచేసే ప్రమాదం ఉంది. కోడ్ అమలులో ఉన్నంత కాలం వ్యక్తిగత పనులకు బుగ్గ వాహనాలు వినియోగించకూడదని మేయర్, సభాగృహం నాయకుడు, బీఎంసీ ప్రతిపక్షనాయకుడు, న్యాయ శాఖ, ప్రత్యేక కమిటీ అధ్యక్షులకి సూచించనున్నట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. దీనిపై మేయర్ సునీల్ ప్రభు మాట్లాడుతూ మేయర్ బంగ్లా నుంచి బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు బుగ్గ వాహనాన్ని వాడతానని స్పష్టం చేశారు. సొంత పనులకు, రాజకీయ, ఇతర కార్యక్రమాలకు బెస్ట్ బస్సు, లోకల్ రైలులాంటి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తానని స్పష్టం చేశారు. బీఎంసీకి చెందిన వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఉద్యోగులందరూ సాధ్యమైనంత వరకు బుగ్గ వాహనాలకు దూరంగా ఉండాలని సూచించారు. -
మూడేశారు
సాక్షి, ముంబై: మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్ల ధరలు ప్రభుత్వం ఏకంగా మూడు రెట్లు పెంచేసి పేద కార్మికుల నడ్డి విరిచింది. ఇంతకు ముందు తక్కువ మొత్తంలో లభించిన ఇళ్లు ఇప్పుడు ఏకంగా మూడింతలు అవ్వడంతో ఏమి చేయాలో కార్మికులకు తోచడం లేదు. ఇటు ఇల్లును వదులుకోలేక, అటు ఆ మొత్తాన్ని చెల్లించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లోని మిల్లు స్థలాల్లో మాడా నిర్మించిన 6,925 ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలు కేటాయించింది. అర్హులైన కార్మికులను ఎంపిక చేసి లాటరీలో పేరు వచ్చిన వారికి విక్రయించింది. ఇప్పుడు తాజాగా నిర్మించబోయే ఇళ్ల ధరలు ఏకంగా రూ.20 లక్షలుగా నిర్ణయించింది. దీంతో మిల్లు కార్మికులు, వారి వారసులు ఈ మొత్తాన్ని ఎలా చెల్లించేదని ఆందోళన చెందుతున్నారు. గత శనివారం సాయంత్రం వర్లీలోని సెంచురీ మిల్లులో కార్మికుల ఇళ్ల ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భూమిపూజ చేసిన సంగతి విదితమే. కేవలం రెండేళ్ల కాలంలోనే ఏకంగా మూడు రేట్లు పెంచేయడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పాత ధరకే ఇళ్లు అందజేయడం గిట్టుబాటు కాదని మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఉపాధ్యక్షుడు సతీష్ గవయి స్పష్టం చేశారు. ప్రస్తుతం మాడా వాటి ధరలను పెంచినా, మార్కెట్‌తో పోలిస్తే ఈ ఇళ్ల ధరలు చాలా చౌకేనని ఆయన అన్నారు. ‘ఈ ఇళ్ల కోసం బ్యాంకుల ద్వారా 90 శాతం రుణాలు సమకూరుస్తున్నాం. వీటిని కొనుగోలు చేయడానికి మిల్లు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావ’ని గవయి స్పష్టం చేశారు. కానీ మాడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిల్లు కార్మికుల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం మిల్లు యజమానులు మాడాకు ఉచితంగా స్థలం అందజేశారు. దీంతో మార్కెట్ చదరపు అడుగుల ధరలు ఇక్కడ వర్తించవని సంఘాలు అంటున్నాయి. కేవలం నిర్మాణ ఖర్చులు తీసుకోవాలని కోరుతున్నాయి. మొదటి విడతలో నిర్మించిన ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలు ఉండగా, రెండో విడతలో నిర్మించే ఇళ్ల ధరలు రూ.12.50 లక్షలుగా ఉంటాయని మాడా గత సంవత్సరం ప్రకటించింది. పైగా ఈ పథకంలో నిర్మించే ఒక్కో ఇల్లుకు కేంద్రం రూ.రెండు లక్షలు రాయితీ కూడా ప్రకటించింది. వివిధ పన్నులు మాఫీ చేసి కార్మికులకు రూ.7.50 లక్షలకే ఇల్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. అయితే ఇలా మూడు రెట్లు ధరలు పెంచడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిల్లులు మూతపడడంతో అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. రూ.20 లక్షలు కాదుగదా ముందుగా నిర్ణయించిన రూ.12.50 లక్షలు కూడా చెల్లించే స్థితిలో లేరని నాయకులు వాదిస్తున్నారు. ధరలపై సీఎం చవాన్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు కార్మిక నాయకుడు దత్తా ఇస్వాల్కర్ చెప్పారు. తెలుగు కార్మికుల అసంతృప్తి మాడా ఒక్కసారే మిల్ల స్థలాల్లో నిర్మించే ఇళ్ల ధరలను మూడింతలు చేయడంపై తెలుగు కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో నిరర్మించిన ఇళ్లను రూ.7.50 లక్షలకు చెల్లించిన మాడా అధికారులు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో ఏకంగా రూ.20 లక్షలకు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో చెల్లించాలంటే కార్మికులందరికీ ఇబ్బంది కలిగించే అంశమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాడా తీరుపై వారు మండిపడుతున్నారు. -
డీఎంఐసీ వల్ల ‘మహా’ గుర్తింపు
ముంబై: ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్(డీఎంఐసీ) వల్ల పారిశ్రామిక ఉత్పాదకతలో ప్రపంచస్థాయిలో మహారాష్ట్రకు గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. వీటివల్ల 38 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, 2042 వరకు రూ.20 లక్షల కోట్లు అదనంగా పారిశ్రామిక ఉత్పత్తి వస్తుందని తెలిపారు. ఈ మేరకు పెట్టుడిదారులతో, రాష్ట్ర మద్దతు ఒప్పందాలపై ఆయన అధికారిక సంతకాలు చేసి తొలి దశ ప్రాజెక్ట్‌ను సోమవారం ప్రారంభించారు. తొలి దశలో అభివృద్ధి చేయనున్న షెంద్రే-బిదికిన్ పారిశ్రామిక నగరం కోసం రూ.17,319 కోట్లు పెట్టుబడి పెడతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంఐసీ ట్రస్టు సంయుక్త భాగస్వామిగా ఏర్పడ్డాయన్నారు. ఇందులో 51 శాతం రాష్ట్రం భరిస్తుండగా, మిగిలిన 49 శాతాన్ని డీఎంఐసీ వెచ్చిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించి ఇస్తామని, కేంద్రం ఇచ్చే ఆర్థిక సహకారంతో ఒక్కో టౌన్‌షిప్‌కు రూ.3,000 కోట్లు వెచ్చించనున్నామని ఆయన వివరించారు. మిగతా డబ్బును తమ భాగస్వామి అయిన జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ భరిస్తుందని తెలిపారు. షెంద్రే-బిదికిన్ ప్రాజెక్ట్ వల్ల ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు. రాష్ట్రంలో సుమారు 29 శాతం భూమి పరిధిలో, 18 శాతం ప్రాజెక్ట్ ప్రభావ ప్రాంతంలో డీఎంఐసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయన్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో ఉండే ఈ కారిడార్ కింద రాష్ట్ర జనాభాలో 26 శాతం మంది ఉంటారని తెలిపారు. వీటిలో ఠాణే, రాయ్‌గఢ్, పుణే, ధులే, నందూర్బార్, నాసిక్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్ జిల్లాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. కాగా, తొలి దశలో షెంద్రే-బిదికిన్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఔరంగాబాద్‌లో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌ను, కర్మద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, షెంద్రేలో నీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. రెండో దశలో ఢిల్లీ పోర్ట్ పారిశ్రామిక ప్రాంతం, ధులే మెగా పారిశ్రామిక పార్క్, నాసిక్-సిన్నార్-ఇగత్పురి పెట్టుబడి ప్రాం తం, అహ్మద్‌నగర్‌లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్, గ్రీన్‌ఫీల్డ్ మెగా నగరంగా అభివృద్ధి చేయనున్నారు. పనిచేస్తేనే పార్టీలో భవిష్యత్ పింప్రి, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కలసి పనిచేసేవారికి రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, పదవులను ఆశించకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. పుణేలోని బాలేవాడి క్రీడా మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన రాజ్యసభ ఎంపీ సంజయ్ కాకడే సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చవాన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ అధిష్టానం, నేతలతో స్నేహసంబంధాలు కలిగి ఉంటే రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు. ఇందుకు మన ముందున్న కాకడేనే ఉదాహరణ అని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా కృషిచేయడం వల్లే ఆయనకు పార్టీలో గుర్తింపు వచ్చిందని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ పాటిల్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, సామాజిక కార్యకర్త బాబా ఆడల్, సింబయోసిస్ సంస్థాపకులు మజుందార్, ఎమ్మెల్యేలు వినాయక్ నిమాణే, బచ్చు కడు, కమల వ్యవహారే, సూర్యకాంత్ కాకడే, నగరాధ్యక్షుడు అభయ్ ఛజేడ్, సత్కార సమితి అధ్యక్షుడు బాలాసాహెబ్ లాండ్గే తదితరులు హాజరయ్యారు. -
ఇళ్లు ఇస్తాం.. ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులందరికీ తప్పక ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై కార్మికులుగాని, వారి వారసులుగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు శనివారం సాయంత్రం సీఎం చవాన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చవాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా, ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, దత్తా ఇస్వాల్కర్, ప్రవీణ్ ఘాగ్, జయశ్రీ ఖాడిల్కర్, గన్నారపు శంకర్ తదితరులు హాజరయ్యారు. తొలుత సెంచురీ మిల్లులో భూమి పూజ చేశారు. అనంతరం జాంబోరి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చవాన్ కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఆధీనంలోకి వచ్చిన 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. తొలి విడతలో కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లో నిర్మించిన 6,925 ఇళ్లను 2012 జూన్‌లో లాటరీ ద్వారా అర్హులకు అందజేశామని గుర్తు చేశారు. సెంచురీ మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లతోపాటు మాడా, ఎమ్మెమ్మార్డీయే ప్రస్తుతం నిర్మిస్తున్న, భవిష్యత్‌లో నిర్మించబోయే వాటిలో కూడా మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సెంచురీ మిల్లులో తొలి విడతలో 1,430 ఇళ్లు నిర్మించనున్నారు. అందులో 651 ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుందని చవాన్ తెలిపారు. రూబీ మిల్లులో నిర్మిం చనున్న 23 ఇళ్లలో ఎనిమిది ట్రాన్సిట్ క్యాంపులు, పశ్చిమ మిల్లులో 250 ఇళ్లకు 124 ట్రాన్సిట్ క్యాం పులు, ప్రకాశ్ కాటన్ మిల్లో నిర్మించనున్న 562 ఇళ్లల్లో 281 ట్రాన్సిట్ క్యాంపులు, భారత్ మిల్లోని 188 ఇళ్లలో 93, జూబిలీ మిల్లోని 157 ఇళ్లలో 78 ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయిస్తున్నామని సీఎం చవాన్ వివరించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగం కొనసాగుతుండగానే 1.42 లక్షల కార్మికులకి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కరీరోడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అధికారులే దోషులా?
ముంబై: మహారాష్ట్రలో చోటుచేసుకున్న కోట్లాది రూపాయల ఇరిగేషన్ (నీటిపారుదల ప్రాజెక్టుల) కుంభకోణంపై విచారణ జరిపిన మాధవ్ చితాలే కమిటీ శనివారం నాడు తన నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సమర్పించింది. దాదాపు 14 నెలల పాటు వేలాది పత్రాలను పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 1,361 పేజీల నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవకతవకలకు నీటిపారుదల విభాగం అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన పలు ఆమోదాలకు, అవకతవకలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ సహా పలువురు రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పటికీ చితాలే అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలిసింది. ఈ నివేదికను సంక్షిప్తంగా ప్రజలకు అర్ధమయ్యే భాషలో 15 రోజుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి చవాన్ ఔరంగాబాద్‌లోని జలవనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఆదేశించారు. ముందుగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నివేదికను పరిశీలించి ఆ తరువాత దానిని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచనున్నారు. అయితే అది ఎప్పుడు అన్న విషయాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు నిరాకరించారు. జలవనరుల విభాగంలో చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించేందుకు నీటి నిర్వహణ నిపుడైన చితాలేను ప్రభుత్వం 2012 డిసెంబర్లో నియమించింది. జల వనరుల విభాగం ఎన్సీపీ నియంత్రణలో ఉన్న సంగతి తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు జలవనరుల శాఖకు మంత్రిగా పని చేసిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇరిగేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 2012లో రాజీనామా చేశారు. నిబంధనలను అతిక్రమిస్తూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని కొన్ని రెట్లు పెంపు చేశారని అప్పట్లో మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్పుడు పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్ తిరిగి డిసెంబర్ నెలలోనే మంత్రివర్గంలో చేరారు. 1999-2009 మధ్య కాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఏకపక్షంగా కట్టబెట్టారని ఆరోపణలు వెలువడ్డాయి. 38 ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.20,050.66 కోట్ల నుంచి 26,722.33 కోట్లకు పెంచారు. వీటిలో 30 ప్రాజెక్టులకు ఆదరాబాదరాగా కేవలం నాలుగు రోజుల్లో మంజూరు చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఒకరోజు తరువాత చితాలే కమిటీ తన నివేదికను సమర్పించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ముంగిట జరిగిన ఈ పరిణామం రాజకీయంగా ఎన్సీపీకి నష్టం కలిగించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరిగేషన్ కుంభకోణంలో సుమారు 70వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ నిధులను నిష్ర్పయోజనమైన ప్రాజెక్టులపై ఖర్చు చేశారని లేదా గల్లంతు చేశారని విమర్శించాయి. చితాలే కమిటీ నివేదికను బహిర్గతం చేసి, దోషులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దోషులు రాజకీయ నాయకులైనా, అధికారులైనా శిక్షించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. ఆదర్శ్ కమిషన్ నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించినట్టుగానే ప్రభుత్వం చితాలే నివేదికను కూడా దాచిపెడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టుల కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై చితాలే కమిటీకి అనేక సాక్ష్యాధారాలు సమర్పించామని ఫడ్నవిస్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవచ్చని ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ చీఫ్ ఇంజనీర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ పంధారే అభిప్రాయపడ్డారు. -
మిల్లు స్థలాల్లో కార్మికులకు ఇళ్లు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. మూతపడిన మిల్లు స్థలాల్లో రెండో విడతలో నిర్మించనున్న ఇళ్లు త్వరలో కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర హౌసింగ్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (మాడా) అధీనంలో ఉన్న 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో శనివారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజా చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే చవాన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో జాంబోరి మైదానంలో కార్మికుల విజయోత్సవ ర్యాలీ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెంచురీ మిల్లు స్థలంలో జరగనున్న ఈ ర్యాలీకి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా తదితరులు హాజరవుతారని గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఘాగ్ తెలిపారు. నాలుగు మిల్లుల కార్మికుల యూనియన్ ప్రతినిధులు నిర్వహించనున్న ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యే అవకాశాలుండడంతో నాయకులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకు మాడా అధీనంలోకి వచ్చిన 19 మిల్లు స్థలాల్లో దాదాపు 10వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో కార్మికులు, వారి వారసులకు 6,925 ఇళ్లు కేటాయించింది. మిగతా ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయించింది. ఆ ఇళ్లను 2012 జూన్ 28న లాటరీ నిర్వహించి అర్హులైన కార్మికులకు అందజేసింది. ఇంకా 16 మిల్లుల స్థలాలు మాడా అదీనంలో ఉన్నా, అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభించలేదు. దీంతో గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి, రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్, మహారాష్ట్ర గిరిణి కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ ఏక్తా మంచ్ తదితర యూనియన్లు తరచూ ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు రెండో విడతలో మాడా ద్వారా కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని భవనాల నిర్మాణ పనుల ప్రణాళికను బీఎంసీకి ఇప్పటికే పంపించారు. మంజూరు లభించగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయి. 16 మిల్లు స్థలాల్లో మాడా సుమారు 11,503 ఇళ్లు నిర్మించనుంది. ఇందులో 7,697 ఇళ్లు కార్మికులు, వారి వారసులకు కేటాయించనుంది. మిగతా ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించనుంది. -
అసెంబ్లీకి ‘అకాల’ దెబ్బ
ముంబై: వడగండ్ల వాన అసెంబ్లీని బుధవారం తాకింది. అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు. శివసేన, బీజేపీ నాయకులు వెల్‌లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో నాసిక్, ధులే, జల్గావ్, పుణే, అహ్మద్‌నగర్, భండారా, నాగపూర్, అమరావతి, యావత్మల్లో భారీ వర్షం, వడగండ్ల వాన వల్ల ఉల్లిగడ్డ, పత్తి, చెరకు, అరటి పండ్ల తోటలకు నష్టం కలిగిందన్నారు. వారిని వెంటనే ఆదుకునేందుకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు కోల్పోయిన రైతులను త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీని ఇచ్చారు. వడగండ్ల వాన కురిసేందుకు కారణం భూతాపమేనా అనేది తెలుసుకునేందుకు భారత వాతావరణ శాఖ అధికారులను సంప్రదిస్తున్నామని ఆయన వివరించారు. 13 జిల్లాలోని 94 తాలూకాల్లో 1,36,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందన్నారు. వీటిలో నాగపూర్, యావత్మల్, అమరావతి, వార్ధా, నాందేడ్, ధులేలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్ర విపత్తు పునరావాస నిధి కొత్త మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహరం అందిస్తామని తెలిపారు. పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాక కేబినెట్ సమావేశంలో చర్చించి అదనపు సహాయంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లా సహకార బ్యాంక్‌లు క్రియారహితంగా ఉండటంతో బ్యాంక్‌ల ద్వారా రైతులకు ఎలా సహాయం చేయాలన్న దానిపై కూడా దృష్టి కేంద్రీకరించామన్నారు. పంట నష్టాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. వడగండ్ల వర్షం కురిసిన పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో గురువారం మంత్రులు పర్యటిస్తారని తెలిపారు. వాతావరణం అంతా అనుకూలించి పంట చేతికందింది అని అనుకున్న దశలో వడగండ్ల వాన మళ్లీ రైతులని శోకసంద్రంలోకి నెట్టిందని అన్నారు. శాంతి భద్రతలో సర్కార్ విఫలం: ఖడ్సే ముంబై: రాష్ర్టంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్ పదవికి సత్యపాల్ సింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలియని పాటిల్ ఇక ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అంచనా వేయడంలో ఎలా వ్యవహరిస్తారోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో జరగుతున్న బదిలీలు, పదోన్నతుల వల్ల పోలీసు శాఖలో అసంతృప్తి నెలకొందని ఆయన వివరించారు. త్వరలోనే ఇద్దరు అదనపు డీజీ ర్యాంక్ పోలీసు అధికారులు పదవికి రాజీనామా చేస్తారన్నారు. విజయ్ కాంబ్లీ, అహ్మద్ జావదేలను ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించడం వెనుక కులం, ప్రాంతం ఉన్నాయని విమర్శించారు. సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్‌ను హత్య చేసిన నేరస్తులను ఇప్పటివరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు. మహిళలపై నేరాలు, నక్సల్స్ ఆగడాలు పెరగడంపై ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. -
తన కేబిన్‌లోకి సీఎం
సాక్షి, ముంబై: సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంత్రాయలోని ఆరో అంతస్తులోగల తన కేబిన్‌లోకి మారారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా మారిపోయారు. కేవలం గుమ్మానికి పూలదండవేశారు. 2012 జూన్ 21న మంత్రాయల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాలుగు, ఐదు, ఆరో అంతస్తులు పూర్తిగా కాలిబూడిదైన విషయం తెలిసిందే. దీంతో మంత్రుల కేబిన్లన్నీ ఇతర అంతస్తుల్లోకి మార్చారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగించారు. ఆధునిక హంగులతో ఈ అంతస్తులన్నింటినీ కొత్తగా తీర్చిదిద్దారు. ఆరో అంతస్తులోని 21,200 చదరపుటడుగుల స్థలంలో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 40 మంది ఉన్నతాధికారులు, 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి మొదలుకుని ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, ప్రత్యేక కార్యనిర్వాహక అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులు, ప్రజా సంబంధాల అధికారులున్నారు. వీరితోపాటు ఇంటర్వ్యూలు నిర్వహణ, సమావేశాలు, ఫైళ్లను భద్రపరిచేందుకు కేబిన్లు ఉన్నాయి. సందర్శకుల కోసం ప్రత్యేకంగా కేబిన్లను నిర్మించారు. -
ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి
ముంబై: నగరవాసుల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన బుధవారం ఎలివేటెడ్ రోడ్డును ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘ ఈ 2.2 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇకపై పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హై వే నుంచి నేరుగా అంధేరీలోని ఛత్రపతి శివాజీ (సహార్) అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-2కు ముంబైకర్లు నేరుగా చేరుకోవచ్చు’నని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేను, తర్వాత టెర్మినల్-2ను ప్రారంభించిందని, ఇప్పుడు ఎలివేటెడ్ రోడ్డు సేవలను అందజేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వల్ల సుమారు 30 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుందని ఆయన వివరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) సంయుక్తంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాయని సీఎం చెప్పారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ పనులను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. అలాగే శాంతాక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డుపై మరో రెండు, మూడు వారాల్లో వాహనాల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కొలాబా-సీప్జ్ మధ్య మూడో మెట్రో పనులను సైతం త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. -
‘మోనో’ల్లాసం
సాక్షి, ముంబై: మోనో రైల్లో ప్రయాణించేందుకు ముంబైకర్లు ఆసక్తి చూపుతున్నారు. ఊహించిన దానికంటే వారినుంచి ఎక్కువ స్పందన వస్తోంది.దేశ ఆర్థిక రాజధానిలో ప్రజలకు ఆధునిక సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మోనో రైలును ప్రారంభించిన విషయం విధితమే. ఈ రైలు సేవలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించినప్పటికీ ప్రత్యక్షంగా రెండో తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. గడచిన వారం రోజుల్లో ఏకంగా 1.36 లక్షలకు పైగానే ప్రయాణికులు మోనో రైలు సేవలను ఆస్వాధించినట్లు జారీ చేసిన టికెట్లను బట్టి వెల్లడైంది. నగర ప్రజలకు సేవలు అందిస్తున్న లోకల్ రైళ్లు, బెస్ట్ బస్సులతో పోలిస్తే మోనోరైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంది. పైగా చార్జీలు కూడా తక్కువే కావడంతో అత్యధిక శాతం ఇందులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అన్ని స్టేషన్లలో విపరీతంగా రద్దీ కనిపించింది. ప్రారంభంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని గంటన్నర వరకు సేవలను పొడగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పరిస్థితి రాలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో నెరవేరనున్న లక్ష్యం వ్యాపారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ సేవలను ప్రారంభించినా చాలామంది జాయ్ రైడ్ చేసేందుకు ప్రయాణించినట్లు అంచనా వేశారు. ఈ రద్దీ మరికొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఏ లక్ష్యం కోసం ఈ సేవలు ప్రారంభించామో అది నెరవేరనుందని అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ప్రారంభించిన చెంబూర్-వడాల టర్మినస్ల మధ్య వారం రోజుల్లో మొత్తం 592 ట్రిప్పులు నడవగా అందులో సుమారు 1.36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 1,400 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోగా 1,32,523 టోక న్లు, 1,33,932 టికెట్లు విక్రయాలు జరిగాయి. అయితే వీరంత కేవలం మోనో రైలు ప్రయాణాన్ని ఆస్వాధించేందుకు అందులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
తడిసి మోపెడు
సాక్షి, ముంబై: ‘అనుకున్నది ఒకటి అయినది మరొకటి’ అన్నట్లుగా తయారైంది ప్రాజెక్టుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్లక్ష్య వైఖరివల్ల నగరం, శివారు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రతిపాదనలు, అధ్యయనం, స్థలాంతరం, పరిహారం, టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పనులు ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. ఫలితంగా సకాలంలో పనులు పూర్తి కావడంలేదు. దీంతో నిర్దేశించిన వ్యయం కంటే రెట్టింపు అవుతోంది. ఇటీవల ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చిన మోనో రైలు 11 సార్లు వాయిదా పడింది. దీంతో తొలుత నిర్దేశించిన వ్యయం సుమారు రూ.1,400 కోట్లు ఉండగా పనులు పూర్తయ్యే సరికి అది రూ.2,460 కోట్లకు చేరుకుంది. ఇదే తరహాలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎమ్మెమ్మార్డీయే 8 సార్లు విధించిన డెడ్లైన్లు వాయిదా పడ్డాయి. దీంతో అప్పట్లో రూ.2,356 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడదిరూ.4,800 కోట్లకు చేరుకుంది. అదేబాటలో ఎలివేటెడ్ రైల్వే మార్గం వీటి తరహాలోనే ఓవల్ మైదాన్ (చర్చిగేట్)- విరార్‌ల మధ్య చేపట్టనున్న ఎలివేటెడ్ రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం తడిసి మోపె డు కావడంతో రైల్వే పరిపాలన విభాగానికి తలనొప్పిగా మారింది. అంతేగాక ఈ ప్రాజెక్టు పనులు ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తికాని పక్షంలో భవిష్యత్తులో ఈ వ్యయం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం రైల్వే పరిపాలన విభాగం ఎదురుచూస్తోంది. 64 కి.మీ. దూరంతో కూడిన ఈ ప్రాజెక్టు 2020 వరకు పూర్తి చేయాల్సి ఉంది. 2012 జనవరిలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.19,513 కోట్లు ఉండగా రెండేళ్లలో అదనంగా రూ.2,487 కోట్ల మేర పెరిగింది. అంతేకాక ఈ ప్రాజెక్టు అధ్యయనం పనులకు సుమారు రూ.19 కోట్లు అదనంగా ఖర్చయ్యాయని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేం దుకు రైల్వే నడుంబిగించింది. అందుకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2013 నవంబర్ 13న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆఖరు సారి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ప్రాజె క్టు విషయంపై ప్రభుత్వం, రైల్వే మధ్య ఇంతవరకు ఎలాంటి సమావేశంగానీ, చర్చలుగానీ జరగలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇలా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయి వాటి వ్యయం తడిసి మోపెడవుతోంది. -
ఎమ్మెన్నెస్‌పై డేగకన్ను
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ నాకాల అంశంపై బుధవారం రాస్తారోకో, ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పుణేలోని ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో రాజ్ ఠాక్రే ప్రసంగిస్తూ టోల్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంతోపాటు పారదర్శకత తేవాలని, ముఖ్యంగా ఈ విషయంపై అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసింది. టోల్ అంశంపై అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిపేంతవరకు తాము ఆందోళన చేస్తామన్నారు. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ఆందోళన చేపట్టనున్నామని ధైర్యం ఉంటే ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరిన సంగతి విధితమే. ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు నోటీసులు ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ కార్యకర్తలను ముందే అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకటి రెండు ప్రాంతాల్లో కొందరు ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. అందిన వివరాల మేరకు ఉస్మానాబాద్ జిల్లాలో పోలీసులు ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు సోమవారం ఉదయం నోటీసులు పంపించారు. రాస్తారోకో సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలా చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు తమదైన పద్ధతిలో ముందుగా కొందరు ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడం, అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని కొందరు పేర్కొంటున్నారు. యేణేగురా టోల్‌నాకా మూసివేత ఉస్మానాబాద్ జిల్లాలోని యేణేగురా టోల్నాకాను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు సోమవారంమూసివేయించారు. పుణేలో ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ విధానంలో మార్పులు చేయడంతోపాటు అక్రమంగా వసూళ్లు చేస్తున్న టోల్నాకాలకు వ్యతిరేకంగా రాస్తారోకోలు చేయనున్నట్టు ప్రకటించారు. ఉస్మానాబాద్ జిల్లాలోని యేణేగురా టోల్‌నాకా వద్ద 2011 వరకు టోల్ వసూలు చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ ఇంకా వసూలు చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు సోమవారం ఆ టోల్నాకాను మూసివేయించారు. -
‘కోడ్’కూయకముందే..
సాక్షి, ముంబై: శివారు ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆరాటపడుతోంది. మే లేదా జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఎప్పుడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల మోనో రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో సాధ్యమైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఆ లోపే ప్రారంభించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆరాటపడుతున్నారు. తుది మెరుగులు ఇప్పటికి అనేక స్టేషన్లలో ప్లాట్ఫారం పనులు పూర్తికాలేదు. ప్రయాణికులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. దాదాపు అన్ని స్టేషన్లలో 5-10 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ పనులు పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. అయినా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎనిమిది సార్లు వాయిదా 2006 జూన్ 29వ తేదీన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం 2008 జనవరి 29న ప్రారంభమయ్యాయి. ఇదివరకు ఎనిమిది సార్లు ప్రకటించిన డెడ్లైన్లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు తుది మెరుగులు దిద్దే పనులు మాత్రమే మిగిలిపోయాయి. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో ప్రాజెక్టు మొత్తం పొడవు 11.40 కిలో మీటర్లు ఉంది. అందుకు అప్పట్లో రూ.2,356 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు. కానీ ఈ ప్రాజెక్టు అనేక పర్యాయాలు వాయిదా పడటంతో అది కాస్తా తడిసి మోపెడై రూ.4,800 కోట్లకు చేరుకుంది. 2013 డిసెంబర్ ఆఖరు వరకు మొత్తం 12 స్టేషన్లలో ఏ స్టేషన్ పనులు కూడా 100 శాతం పూర్తికాలేదు. ముఖ్యంగా రైలు ప్రారంభమయ్యేఘాట్కోపర్ స్టేషన్లోనే పనులు 90 శాతం పూర్తయ్యాయి. వర్సోవా స్టేషన్లో 99 శాతం పనులు పూర్తికాగా అసల్ఫా స్టేషన్లో 85 శాతం పనులు పూర్తయ్యాయి. సరాసరిగా మొత్తం 94.66 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల తుది మెరుగులు దిద్దే పనులు మాత్రమే మిగిలిపోయాయి. ఏదేమైనా ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే మెట్రో సేవలను ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
అంతా వట్టిదే
ముంబై: పొవాయిలో చౌక ఇళ్ల పథకం అంతా బోగసేనని తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదంతా వట్టిదేనని స్పష్టం చేయడం పొవాయి వాసులను నిర్వేదంలోకి నెట్టేసింది. ఆర్థికంగా వెనుకబడిన తమకు ప్రభుత్వం రూ.54 వేలకే సొంత ఫ్లాట్ ఇస్తుందన్న ఆశతో మంత్రాలయలో రోజంతా నిలబడి చేసుకున్న దరఖాస్తుకు విలువ లేదని తెలుసుకున్న స్థానికులు నిరాశ చెందారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన అతి తక్కువ ధరకే ఇళ్ల పథకం కింద రూ.54 వేలకే పొవాయిలో ఫ్లాట్లు లభిస్తుందన్న గంపెడాశతో మంత్రాలయానికి మంగళవారం వచ్చిన వందలాదిమంది దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించారు. దీని గురించి తెలుసుకున్న సీఎం కార్యాలయ వర్గం ప్రభుత్వం అటువంటి పథకాన్ని మంజూరుచేయలేదని వివరణ ఇచ్చింది. ఎవరో తప్పుదారి పట్టించడంతో ఇదంతా జరిగిందని పేర్కొంది. అటువంటి పథకం మనుగడలో లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రెండోరోజు బుధవారం కూడా అనేకమంది వచ్చి దరఖాస్తు చేసేందుకు ఎగబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో కార్యాలయం లేని పథకాన్ని ఉన్నట్టుగా చెప్పి పొవాయి వాసులను తప్పుదారి పట్టించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ‘1987 పొవాయి అభివృద్ధి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని తెలుసుకున్నాం. ఈ పథకం కింద హీరాంనందాని బిల్డర్స్ అభివృద్ధి చేసిన 400 చదరపు అడుగుల మేర నిర్మించిన మూడు వేల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నామ’ని సదరు ఫారమ్ పేర్కొంది. హీరానందని కాంప్లెక్స్‌లో అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుసుకున్న పేదలు అతి చౌక ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని కార్మిక నాయకుడు మిలింద్ రణడే తెలిపారు. ‘1986లో పట్టణ భూపరిమితి చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పొవాయిలో 240 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిని అభివృద్ధి చేసేందుకు ఎకరాకు రూ.40 పైసల చొప్పున డెవలపర్‌కు సర్కార్ లీజుకిచ్చింది. 400 చదరపు అడుగులు, 800 చదరపు అడుగుల పరిధిలో ఆధునిక ఫ్లాట్‌ను డెవలపర్ నిర్మించారు. వీటిలోనే 70 శాతం రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లను సంపన్నవర్గాల కోసం 1,200 నుంచి 5,000 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మించడం వివాదాస్పదమైంది. దీంతో రూ.135లకే చదరపు అడుగుల ధరకు 15 శాతం ఫ్లాట్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింద’న్నారు. దీనినే ఆధారంగా చేసుకొని 400 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.54వేల ధర సదరు ఫారమ్‌లపై ప్రచురణ అయి ఉందని రణడే వివరించారు. అయితే కొందరి చేతుల్లోనే భూమి, ఇళ్లు ఉండకుండా నిరోధించేందుకు 2007లో యూఎల్సీఏ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేసిందని రణడే గుర్తు చేశారు. -
నాగపూర్ మెట్రోకు ఆమోదం
సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడు వస్తుందా అని నాగపూర్ వాసులు ఆశగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాదాపు 40 కి.మీ. పొడవున చేపట్టే ఈ ప్రాజెక్ట్‌కు రూ.8,680 కోట్లు మంజూరుచేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అప్పట్లో రూ.9,007 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత వ్యయం పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా 2019లోపు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకరావాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం 2012 ఫిబ్రవరి 22న ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌తో అధికారులకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అధ్యయనం పనులు పూర్తిచేశారు. అయితే నాగపూర్వాసులందరికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావాలనే ఉద్ధేశంతో కామ్టీ మార్గంలో ఆటోమోటివ్ చౌక్ నుంచి మిహాన్ (ఉత్తర-దక్షిణ) మార్గాలను ఎంపికచేశారు. అందరికీ ఉపయోగపడే విధంగా మెట్రో రైళ్లు పరుగులు తీసేలా రూపకల్పన చేశారు. ‘మిహాన్‌లో మెట్రో రైలు డిపో ఉంటుంది. హింగణ మార్గంలో మరో డిపో ఉంటుంది. అక్కడ డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలానికి సైనిక, విమానయాన శాఖలు అనుమతినిచ్చాయి. దీంతో కార్ డిపోలు ఏర్పాటు ఏర్పాటుచేసేందుకు మార్గం సుగమమైంద’ని సంబంధిత అధికారులు తెలిపారు. మెటో రైలు మార్గం, స్టేషన్లు.... ఉత్తర-దక్షిణ మార్గం (21.60 కి.మీ.)లో అటోమోటివ్ చౌక్, నారీ రోడ్, ఇందోర్ కడ్బీ చౌక్, గడ్డి గోదాం, కస్తూర్చంద్ పార్క్, జీరో మైల్, సీతా బర్డీ, కాంగ్రెస్ నగర్, రహాటే కాలని, నిరీ, దేవ్‌నగర్, మథురేష్ అపార్ట్మెంట్, శంకర్‌నగర్, జునా విమానాశ్రయం, నయా మిమానాశ్రయం, మిహాన్ సిటీ, మెట్రో సిటీ స్టేషన్లు ఉంటాయి. తూర్పు-పశ్చిమ మార్గం (18.20 కి.మీ.)లో ప్రజాపతి నగర్, వైష్ణోదేవి చౌక్, అంబేద్కర్ చౌక్, టెలిఫోన్ ఎక్ఛేంజ్, చితార్ ఓళ్, అగ్రసేన్ చౌక్, మేయో హాస్పిటల్, నాగపూర్ రైల్వే స్టేషన్, నేతాజీ మార్కెట్, ఝాన్సీరాణి చౌక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (శంకర్‌నగర్), లాడ్ అపార్ట్ట్‌మెంట్, ధరంపేట్ సైన్స్ కాలేజీ చౌక్, సుభాష్ నగర్, రచనా అపార్ట్మెంట్, వాసుదేవ్ నగర్, బన్సీనగర్, లోక్మాన్య నగర్ స్టేషన్లు ఉంటాయి. -
టోల్ లేకపోతే రోడ్ల నిర్మాణం ఆగినట్టే :పృథ్వీరాజ్ చవాన్
ముంబై: టోల్ రుసుం వసూలు నిలిపివేస్తే కొత్త రోడ్ల నిర్మాణం నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. బిడ్డింగ్ విధానం, టోల్ నగదు లెక్కింపుల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న సీఎం రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. టోల్ ప్రక్రియ పారదర్శకంగా లేదని, దీనిపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేని ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఒకవేళ టోల్ పన్ను వసూలుచేయకపోతే హైవేలను నిర్మించడం సాధ్యం కాదని చెప్పారు. దీనికోసం రెగ్యులేటరీ ఆథారిటీని నెలకొల్పుతామని వివరించారు. నగర శివారుల్లో ప్రవేశ ద్వారాల వద్ద టోల్ రుసుం కట్టేందుకు కొల్హాపూర్ వాసులు నిరాకరిస్తుండటంపై ఆయన స్పందించారు. ఒప్పందం ప్రకారం టోల్ రుసుం వసూళ్లలో కంపెనీకి ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం సర్కార్ వద్ద డబ్బు లేదని వివరించారు. టోల్రుసుంను చెల్లించవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మా సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఆదేశాల మేరకు ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లోని టోల్‌నాకాల వద్ద సోమవారం హాల్చల్ సృష్టించారు. ధ్వంసం చేశారు. ‘రాజ్‌ఠాక్రేపై చర్యలు తీసుకోండి’ సాక్షి, ముంబై: టోల్ వసూళ్లపై ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. టోల్ చెల్లించకండి, డబ్బులు అడిగినవారిని ఉతికి ఆరే యండని రాజ్ రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్ల సోమవారం వివిధ ప్రాంతాల్లో వారి పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారని అన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన రాజ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. టోల్‌ప్లాజాలను ఎత్తేయండి: శివసేన, బీజేపీ షోలాపూర్, న్యూస్‌లైన్: రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శివసేన, బీజేపీ సోమవారం ఆందోళనకు దిగాయి. అక్కల్కోట్ రహదారిపై ఉన్న టోల్‌నాకా వద్ద కాషాయకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను పెద్ద మొత్తంలో మోహరించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టోల్‌నాకా సిబ్బంది ఉదయం నుంచి కౌంటర్లను మూసివేశారు. దీంతో ఆస్తులకు నష్టం వాటిల్లలేదు. అయితే ఇరుపార్టీల నాయకులు టోల్ ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆందోళన విరమించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ దేశ్‌ముఖ్, సిద్రామప్ప పాటిల్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్, విష్ణు కారంపూరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పాల్గొనలేదు. ఆందోళనకారులు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ టోల్ వసూళ్లు యథాతధంగా కొనసాగించారు. -
హామీ ఇచ్చాం..తగ్గించాం
ముంబై: గత ఏడాది నవంబర్ 19వ తేదీన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ను 20 శాతం తగ్గించామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గించిందని ఇప్పుడు మా ప్రభుత్వం చార్జీలు తగ్గించిందనే విపక్షాల విమర్శలు అవాస్తవం. మేం గతంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే తగ్గించాం. ఈ నిర్ణయంపై ఎవరి ప్రభావం లేదు. ప్రతిపక్షాలు దీనిపై ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల భారం పడుతుంది..’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌పార్టీ విఫలమైందన్న బీజేపీ నేత వినేద్ తావ్డే విమర్శలకు చవాన్ స్పందించారు.‘ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసి పోటీ చేస్తుంది..’ అని స్పష్టం చేశారు. -
బాంద్రా-వర్సోవా సీలింక్‌కు కేబినెట్ ఆమోదం
సాక్షి, ముంబై: ప్రతిపాదిత బాంద్రా-వర్సోవా సీలింక్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బాంద్రా నుంచి వర్సోవా వరకు 9.89 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహలు చేస్తున్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటే పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి నేరుగా దక్షిణ ముంబై వరకు చేరుకునేందుకు సీ లింక్ వంతెనను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు బాంద్రా-వర్సోవా సీ లింక్ వంతెన నిర్మించే పనుల బాధ్యతలు 2009 డిసెంబర్లో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ (ఎమ్మెస్సార్డీసీ)కు అప్పగించింది. ఎట్టకేలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముంబైకర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించే పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెస్సార్డీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్మించిన బాంద్రా-వర్లీ సీలింక్ వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్య కొంతమేర పరిష్కారమైంది. దీంతో ఇదే తరహాలో వర్లీ-హజీ అలీ, బాంద్రా-వర్సోవా సీలింక్ వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అయితే అనేక ఆటంకాల కారణంగా ఈ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదు. చివరకు రాష్ట్ర కేబినెట్లోని మౌలికసదుపాయాల ఉప సమితి అనుమతివ్వడంతో బాంద్రా-వర్సోవా ప్రాజెక్టుకు మోక్షం లభించింది. సుమారు 10 కి.మీ పొడవు, 3+3 లేన్లుగల ఈ సీలింక్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వర్లీ-హజీ అలీ సీలింక్ పనులు చేపట్టేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా, హుండయ్ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ దాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం కేబినెట్లోని ఉప సమితి వద్ద సుమారు అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా సమావేశాలు జరగకపోవడంతో ఎప్పటికప్పుడు వీటిపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. కాగా బుధ వారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో బాంద్రా-వర్సోవా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఈ వంతెనను వినియోగించే వాహనదారులు కూడా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాంద్రా-వర్లీ సీలింక్‌పై ఇదే విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా పుణేలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్‌రోడ్ ప్రాజెక్టు కూడా ఉప సమితి ఆమోదం తెలిపింది. పింప్రి-చించ్వాడ్ పరిసరాల నుంచి 170 కి.మీ. పొడవైన రింగ్ రోడ్ నిర్మించేందుకు రూ.10వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కదిలిన బదిలీల ఫైలు.. కొద్ది సంవత్సరాలుగా పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతులపై నెలకొన్న ప్రతిష్టంభనకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు తెరదించారు. 2005లో రూపొదించిన నియమాల జాబితాలో కొన్ని మార్పులు చేసి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేసేందుకు మార్గం సుగమం చేశారు. అంతేకాకుండా ఎవరిని బదిలీ చేసే అధికారం ఎవరి పరిధిలో ఉందనే విషయమై రూపొందించిన విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దీన్ని రెండేళ్లకు కుదించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు కల్పించే సమయంలో పైరవీలు, బంధుప్రీతి అనే విమర్శలు రాకుండా నియమాల్లో పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం... 223 ఐపీఎస్ స్థాయి అధికారులను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి, 991 డిప్యూటీ సూపరింటెండెంట్లు, అప్పర్ పోలీసు సూపరింటెండెంట్లను బదిలీ చేసే అధికారం హోంశాఖకు ఉంటుంది. ఇక మిగతా 2,06,679 పోలీసు ఇన్స్పెక్టర్లు, ఆ కింది స్థాయి ఉద్యోగుల బదిలీలు డీజీపీ అధీనంలో ఉంటాయి. -
‘రైతులకు స్వేచ్ఛ’ అమలయ్యేనా?
ముంబై: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని, పండ్లు, కూరగాయలు రైతులు తమకిష్టం వచ్చినచోట విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అయోమయంలో పడ్డారు. ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, సంబంధిత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత వారి సమస్యలు విని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము తీసుకునే నిర్ణయం రైతులకు ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పారు. వ్యవసాయదారుల కుంభమేళాగా చెప్పుకునే ‘కృషి వసంత్’ మేళా ప్రారంభించే విషయమై ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘కృషి వసంత్’ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగపూర్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో రైతులకు ప్రయోజన ం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారని, పండ్లు, కూరగయాలను తమకు అనుకూలమైన చోట విక్రయించుకునే అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆదేశించారని, అందుకోసం ఏపీఎంసీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ఆయన సూచించారన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా రైతులకు కొంత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఏపీఎంసీలోనే తమ పంటలను విక్రయించాలనే ఒత్తిడి నుంచి వారికి విముక్తి లభిస్తుందన్నారు. ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ తమ పంటలను విక్రయించుకునే అవకాశం లభిస్తుందన్నారు. -
‘ఆదర్శ్’పై సీఎంకు మాజీ లేఖ
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై నియమించిన విచారణ కమిషన్ వల్ల తనకు న్యాయం జరగలేదని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ప్రభుత్వ కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. ద్విసభ్య కమిషన్ నివేదిక సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘నివేదిక సరిగా లేదు. నాకు బాగా అన్యాయం జరిగింది. నా వాదనను ఆలకిస్తానంటూ ఇచ్చిన హామీని ఈ కమిషన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది’ అని చవాన్ తన లేఖలో రాశారని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. అభియోగం మోపాలని భావించినప్పుడు తన వాదనను వినిపించుకోవాల్సిందని ఆ లేఖద్వారా అశోక్ చవాన్... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక కారణంగా ఒకరి ప్రతిష్టకు భంగం వాటిల్లేఅవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి వాదనను వినాల్సిందన్నారు. ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆదర్శ్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్చ వాన్ రాసిన లేఖను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రాలయకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఆదర్శ్ సొసైటీలో పౌరులకు సభ్యత్వం కల్పించారని, అం దువల్ల తాను ఆ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించలేదంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పలేరని అశోక్ చెప్పలేరని ద్విసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అదనపు ఎఫ్ఎస్ఐ కేటాయింపు అమాయక చర్యగా భావించలేమంది. ఆ చర్య చట్టబద్ధమా కాదా అనే విషయంలో తమకు ఎటువంటి బాధా లేదని, అయితే ఈ నిర్ణయంద్వారా తన సన్నిహితులైన బంధువులకు ఫ్లాట్లు మంజూరయ్యేవిధంగా చేశారని, అది క్విడ్ ప్రోకోనే అవుతుందని పేర్కొంది. -
రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లడ్ ఆన్ కాల్’ పథకం ప్రారంభం
ముంబై: ఫోన్ చేసిన గంట వ్యవధిలోగానే అవసరమైన వారికి ఇకపై రక్తం అందనుంది. బ్లడ్ ఆన్ కాల్ (జీవన్ అమృత్ సేవ) పథకాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని గత ఏడాది సాతారా, సింధుదుర్గ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఆ రెండు జిల్లాల్లో ఈ పథకం విజయవంతమైన సంగతి విదితమే. నగరంలోని సర్ జే జే ఆస్పత్రిలో మంగళవార మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్‌శెట్టి మాట్లాడుతూ ఏ గ్రూపు రక్తం కావాల్సిన వారికి ఆ గ్రూపు రక్తం సత్వరమే అందుతుందన్నారు. రక్తం కావాల్సినవారు 104 నంబరులో సంప్రదించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రక్తం లభిస్తుందన్నారు. సేకరించిన రక్తానికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత వాటిని ప్యాకింగ్ చేసి అత్యంత భద్రంగా ఉంచుతామని, అవసరమైన వారికి సీల్ వేసిన కంటైనర్లలో ఉంచి సరఫరా చేస్తామని అన్నారు. ప్రస్తుతం పుణేలో 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నాలుగు నెలలలోగా రాష్ర్టంలోని పది ప్రధాన నగరాల్లో కాల్ సెంటర్లను ప్రారంభిస్తామని అన్నారు. రవాణాచార్జీలను కొనుగోలుదారుడే భరిం చాల్సి ఉంటుందన్నారు. తొలి పది కిలోమీటర్లకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా రాష్ర్టంలో అనుమతి పొందిన రక్తనిధి కేంద్రాలు 250 దాకా ఉన్నాయన్నారు. -
ఆమోదం కొన్నింటికే
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై విచారణ కోసం నియమించిన ద్విసభ్య సంఘం సమర్పించిన నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నివేదిక పేర్లు ఉన్న బడా రాజకీయ నాయకులపై చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం తిరస్కరించింది. ‘నివేదికలో కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు ఉన్నప్పటికీ వారు నేరాలకు పాల్పడ్డట్టు కమిటీ నిర్ధారించలేదు. ఈ కుంభకోణంలో సీబీఐ ఇది వరకే అధికారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మేం వారిపై కొత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అనుమతుల జారీలో నిబంధనలను ఉల్లంఘించిన కొందరు అధికారులపై మాత్రం చర్యలు తీసుకుంటాం. నివేదికలోని మిగతా అంశాలపైనా మరికొన్ని రోజులపై నిర్ణయం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆదర్శ్ నివేదికపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నివేదికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినేట్ సమావేశాల్లో ఆదర్శ్ అంశం చర్చకు వచ్చింది. ఆదర్శ్ వ్యవహారంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి పాటిల్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కమిటీ నివేదికలో 13 అంశాలపై సిఫార్సులు ఇచ్చింది. వీటిలో కొన్ని అంశాలను మాత్రమే స్వీకరిస్తూ మిగతావాటిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయింది. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని ఆరుగురు రాజకీయ నాయకుల పేర్లను కమిటీ ప్రస్తావించింది. అయినప్పటికీ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే, దివంగత సీఎం విలాస్‌రావ్ దేశ్ముఖ్లతోపాటు శివాజీరావ్ నిలంగేకర్ పాటిల్, రాజేష్ టోపే, సునీల్ తట్కరేకు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆదర్శ్ భవనానికి అనుమతులు ఇప్పించే సమయంలో 12 మంది అధికారులు నియమాలను ఉల్లంఘించారని చవాన్ అన్నారు. వారిపై మాత్రం చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీరందరిపై ఇప్పటికే 2011 జనవరి 29న సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అనర్హులుగా గుర్తించిన 25 మంది సభ్వత్వాన్ని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి తొలగిస్తామని చవాన్ ప్రకటించారు. నకిలీ పేర్లతో ఫ్లాట్లు పొందిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించడం : తావ్డే ఆదర్శ్ కుంభకోణంలో పలువురు మాజీ ముఖ్యమంత్రులకు ప్రమేయం ఉన్నట్టు పాటిల్ నివేదిక వెల్లడించినందున, దీనిపై చర్చ కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని సభలో విపక్ష నాయకుడు వినోద్ తావ్డే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మేరకు తాను గవర్నర్‌కు లేఖ రాశానని ఈ బీజేపీ నాయకుడు విలేకరులకు తెలిపారు. దీనిపై ఏ నిర్ణయమైనా అసెంబ్లీలోనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. హర్షం వ్యక్తం చేసిన ఎన్సీపీ ఆదర్శ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటిచింది. నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, మొత్తం 13 అంశాలనూ స్వీకరించిందని పేర్కొంది. మరోవైపు ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది కార్యాచరణ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిపింది. -
ముఖ్యమంత్రికి ‘పక్షవాతం’
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య విబేదాలు ఇప్పటికీ సమసిపోలేదని మరోసారి వెల్లడయింది. నాగపూర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరుపై తీవ్రంగా పవార్ మండిపడ్డారు. పృథ్వీరాజ్ చవాన్‌కు పక్షవాతం (నిర్లక్ష్య ధోరణి) అధికమయిందని విమర్శించారు. ఫైళ్లపై తుదినిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడుతున్నారని పేర్కొంటూ పైవ్యాఖ్యలు చేశారు. ‘ఫైళ్లపై సంతకాల చేసే సమయంలోనే ఆయనకు ఏవో సమస్యలు వసాయి. దీంతో అనేక ఫైళ్లు టేబుళ్లపైనే పడి ఉంటున్నాయి’ అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ముఖ్యమంత్రి గతంలోనే విమర్శించిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై అజిత్ పవార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సోకిన పక్షవాతం తగ్గక పోగా, ఇంకా పెరిగినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. 48 స్థానాల్లో కాంగ్రెస్‌ను పోటీ చేయమనండి... మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై పలు ప్రతిపాదనలు తేవడంపైనా పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందంటూ ఆయన గతంలోనే ప్రతిపాదించం తెలిసిందే. ఈ ఫార్ములాపైనా అజిత్‌పవార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ‘29 ఎందుకు..ఏకంగా 48 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ను పోటీ చేయమనండి. మా సంగతి మేం చూసుకుంటాం’ అన్నారు. పార్టీ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీ చేస్తా... ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఆదేశిస్తే లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు అజిత్ పవార్ పేర్కొన్నారు. బారామతి, మాఢా అని కాకుండా రాష్ట్రంలోని ఏ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కట్టడాల క్రమబద్ధీకరణకు నో
నాగపూర్: క్లస్టర్ అభివృద్ధి విధానంలో ముంబైలోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే ఆలోచనేదీ లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ముంబైలోని పాత కట్టడాల పునర్నిర్మాణ ం, క్రమబద్ధీకరించని వాటి కోసం ఉద్దేశించిన క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని సోమవారం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కొత్త విధానం వల్ల పునరాభివృద్ధి విధానానికి ఎటువంటి హానీ కలగబోదన్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల అభివృద్ధికి సంబంధించిన క్లస్టర్ విధానంపై విధానసభలో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ సీఎం పైవిషయాలు చెప్పారు. ఠాణే, ఇతర నగరాల్లో క్లస్టర్ల అభివృద్ధికి విధానం ప్రకటించాలన్న బీజేపీ, శివసేన సభ్యుల డిమాండ్‌పై స్పందిస్తూ ముంబై క్లస్టర్ అభివృద్ధి విధానాన్ని వచ్చేవారం ప్రకటిస్తామని, ఇతర నగరాల వాటిని మాత్రం నెల రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందుల వల్లే నెల రోజుల సమయం తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ‘సింగిల్-ప్లాట్, పెన్సిల్ రీడెవెలప్మెంట్ భవనాల అభివృద్ధి పథకానికి మంచి స్పందన ఉంది. క్లస్టర్ విధానానికి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. అందుకే క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని రూపొందించడం కష్టమే అయినా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’ అని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు. క్లస్టర్ విధానం తయారీ కోసం నియమించిన కమిటీ ఇది వరకే తన సిఫార్సులు అందజేసిందని ఆయన తెలిపారు. -
క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యమేల ?
సాక్షి, ముంబై: అక్రమకట్టడాలను క్రమబద్ధీకరించే విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వైఖరీపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. నాగపూర్‌లో జరగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ముంబై, ఠాణే, పుణే, నాసిక్ ఇలా అనేక నగరాల్లోని మూడు కోట్ల ప్రజలకు మేలు జరిగే కట్టడాల క్రమబద్ధీకరణ అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత ప్రజలందరికీ న్యాయం చేయాలని, అందుకుగా అవసరమైతే చట్టంలో సవరణ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలు కోరడం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై ఎలాంటి వైఖరీ చెప్పకుండా దాటవేస్తున్నారని మాలిక్ ఆరోపించారు. ఇటీవలే పింప్రి-చించ్వాడ్, పుణేలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం నలుగురు ఎమ్మెల్యేలతోపాటు అనేక మంది ఎన్సీపీ కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎన్సీపీ హెచ్చరించింది. -
నలుగురి రాజీనామా
సాక్షి, ముంబై: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పుణే, పింప్రి-చించ్వడ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నాగపూర్‌లో సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్సీపీకి చెందిన బాపూ పటారే, అన్నా బన్సోడేలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు లక్ష్మణ్ జగ్తాప్, విలాస్ లాండేలు రాజీనామా చేశారు. పింప్రి-చించ్వడ్, వడ్గావ్, శేరి, బోసరీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నివసించే ఇళ్లను క్రమబద్దీకరించాలని ఎన్నో రోజులుగా కోరుతున్నా, ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు విన్నవించుకున్న స్పందన కరువైందని, అందుకు నిరసనగానే తాము రాజీనామా చేస్తున్నామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. పింప్రి-చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన గ్రామాల్లోని గ్రామపంచాయితీలు అనుమతించిన నిర్మాణాలను అక్రమకట్టడాలుగా కార్పొరేషన్ పేర్కొంది. ఈ నిర్మాణాలను క్రమబద్దీకరించాలని స్థానిక ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయితీ అనుమతించిన కట్టడాలను అవసరమైతే నామమాత్ర జరిమానాతో లేదా ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ తరహాలో ఈ కట్డాలను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తెచ్చినా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందుకు నిరసనగానే చివరికి ఇలా రాజీనామాలు చేయాల్సివచ్చిందన్నారు. మమ్మల్ని అడ్డుకునేందుకే: ప్రతిపక్షాలు నలుగురి ఎమ్మెల్యేల రాజీనామాలను ప్రతిపక్షాలు రాజకీయ స్టంట్‌గా అభివర్ణిస్తున్నాయి. పింప్రి-చించ్వడ్ చుట్టుపక్కల పరిసరాల్లోని అక్రమంగా పేర్కొనే కట్టడాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ సుమారు గత నాలుగేళ్లుగా ఉందని, ఈ విషయంపై నాగపూర్ అసెంబ్లీ హాల్ ఎదుట మంగళవారం తాము ధర్నా చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించామని, అయితే తమకు ఎక్కడ గుర్తింపు దక్కుతుందోనన్న ఆందోళనతో ఇలా ఎన్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని ప్రతిపక్ష బీజేపీ, శివసేన నేతలు ఆరోపించారు. మండేలాకు నివాళి... మానవహక్కుల పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం నివాళులర్పించింది. శీలాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఇరు సభల్లో మండేలాకు నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. విదర్భ కోసం డిమాండ్... గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటైన ప్రత్యేక విదర్భ కూడా సోమవారం సభను కుదిపేసింది. సభలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రత్యేక విదర్భ కోసం పట్టుబట్టారు. అంతటితో ఊరుకోకుండా అసెంబ్లీ బయట ప్లకార్డులు, బ్యానర్లను చేతబట్టుకొని, నినాదాలు చేస్తూ విదర్భ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటారు. రానున్న రోజుల్లో విదర్భ డిమాండ్ సభను మరింతగా కుదిపేసే అవకాశం ఉంది. -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జేఎస్ సహారియా
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా జె.ఎస్.సహారియాకి అవకాశమిచ్చారు. ఇప్పటిదాకా ఉన్న జయంత్‌కుమార్ భాటియా పదవీ విరమణ చేయడంతో సహారియా నియామకానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంగీకరించారు. ఆరు నెలల క్రితమే భాటియా పదవీ కాలం ముగిసినా మరో ఆరు నెలల పాటు సర్కార్ పొడిగించడంతో నవంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ గడువు పొడిగించాలని భాటియా ప్రయత్నాలను చవాన్ పట్టించుకోలేదు. ఈ స్థానంలో రాజన్‌ను నియమించాలని ముందుగా చవాన్ భావించారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో అనవసరంగా ప్రత్యర్థులకు వి మర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. సీని యార్టీ ప్రకారమే సహారియాను నియమించామని చవాన్ స్పష్టం చేశారు. 1978 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ వాసిసహారియా మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన 1992-1995 వరకు ఢిల్లీలో హోంశాఖ డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. పర్భణి కలెక్టర్, నాగపూర్ కార్పొరేషన్ కమిషనర్, నాగపూర్ రీజియన్ కమిషనర్, మంత్రాలయలో వ్యవసాయ, రెవెన్యూ, అటవీ, ఉన్నత సాంకేతిక విద్యా తదితర కీలక శాఖల్లోని పదవుల్లో పనిచేశారు. ఆయన 2014 ఆగస్టులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో ఆయన ఈ పదవిలో కేవలం తొమ్మిది నెలలు మాత్రమే కొనసాగనున్నారు. -
బీడ్ కలెక్టర్ బదిలీపై నిరసనలు
బీడ్: ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించిన జిల్లా కలెక్టర్ సునీల్ కేంద్రేకర్ను బదిలీ చేయడంపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐఏఎస్ అధికారి సునీల్ బదిలీ అయ్యారన్న వార్త ఉదయం దావానంలా వ్యాపించడంతో అనేక మంది కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకున్నారు. ఈ వార్త నిజమేనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ బదిలీని నిరసిస్తూ శివసేన యువజన విభాగ కార్యకర్తలు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సునీల్‌ను పునర్నియమించాలనే డిమాండ్‌తో శివసేన, ఎమ్మెన్నెస్, బ్రాస్తచార్ విరోధి జనాందోళన్, ఇతర సంస్థలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే సునీల్‌ను బదిలీ చేశారని ఆర్టీఐ కార్యకర్త, అడ్వొకేట్ అజిత్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. బీడ్ జిల్లా కలెక్టర్‌గా 17 నెలల కాలంలో అనధికారిక నిర్మాణాలు, నీటి ట్యాంకర్ మాఫియా, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారని తెలిపారు. అయితే తన బదిలీపై వ్యాఖ్యలు చేసేందుకు అందుబాటులో లేని సునీల్‌ను ఔరంగాబాద్‌లోని సిడ్కో ప్రధాన పరిపాలన సంబంధ అధికారిగా బదిలీ చేశారు. అయితే బీడ్ జిల్లా కలెక్టర్‌గా యావత్మల్ డిస్ట్రిక్ జిల్లా పరిషత్ సీఈవో నవల్ కిశోర్ రామ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
శీతాకాల సమావేశాల్లోనే మూఢ నమ్మకాల వ్యతిరేక బిల్లు
నాసిక్: మూఢనమ్మకాల వ్యతిరేక బిలును చట్టరూపంలోకి తేవాల్సిన అవసరముందని దివంగత హేతువాది నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ నొక్కి చెప్పారు. నాగపూర్‌లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ చూడాలని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. తన తండ్రి నరేం ద్ర చనిపోయిన తర్వాత మూఢనమ్మకాలు పాటించడం, చేతబడిపై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని చట్టం రూపంలోకి మార్చాల్సిన సమయమొచ్చిందని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవా న్ హామీని ఇచ్చారని, ఒకవేళ ఈ బిల్లు ఓడితే అది సర్కార్ నైతిక ఓటమి అవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల ముందే దీనిపై ఏకాభిప్రాయం రావల్సిన అవసరముందని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడిపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేసిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20న పుణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాగ్రహం పెల్లుబకడంతో ఆత్మరక్షణలో పడ్డ సర్కార్ మూఢ నమ్మకాల, చేతబడిపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వివిధ ముసాయిదాల ద్వారా 2003లో అసెంబ్లీ ముందుకు వచ్చి న ఈ బిల్లు కోసం గత పదేళ్లుగా 29 సవరణలు చేశారు. మతాలను నమ్మించే పేరిట ప్రజలను మభ్యపెట్టేందు కోసం వినియోగిస్తున్న మూఢ నమ్మకాలను పాటించడం, చేతబడులను నిషేధిస్తూ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని హమీద్ డిమాండ్ చేశారు. -
సీఎం భార్యకు పంట నష్టపరిహారం
ముంబై: సాక్షాత్తు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భార్య సత్వశీల రైతు అవతారమెత్తారు. ఇదేమిటనుకుంటున్నారా? ఇది నిజమే?. 2011-12 కాలంలో పశ్చిమ మహారాష్ట్రలో ఏర్పడిన కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు సర్కార్ పంపిణీ చేసిన నష్టపరిహారం అందుకున్న వారిలో సత్వశీల పేరు కూడా ఉంది. ‘కరువు వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వే చేశాం. కలెక్టర్ నేతృత్వంలోని ఓ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం సత్వశీలకు రూ.మూడు వేల నష్టపరిహారాన్ని చెల్లించాం. అలాగే ఆమె తల్లి సోదరుడికి కూడా చెక్ అందించాం. ఆ ప్రాంతంలో నాలుగువేల మంది పంట కోల్పోయారని అంచనా వేశాం. వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశామ’ని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చవాన్ భార్య సత్వశీలకు సాంగ్లీలోని బేదగ్ గ్రామంలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే నష్టపరిహారానికి సంబంధించి ఆమె నుంచి ఏ దరఖాస్తు రాలేదని చెప్పిన సదరు అధికారి సాధారణంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో డబ్బు డిపాజిట్ అయ్యిందని వివరించారు. అయితే అధికారుల పనితీరుతో రైతులు నివ్వెరపోయారు. -
నరేంద్ర హత్య కేసు కొలిక్కి వచ్చేదెన్నడో?
పుణే: ప్రముఖ సంఘసంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం 22 పోలీసు బృందాలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బృందాలు ఇప్పటిదాకా 1,100 మంది స్థానికులతోపాటు సాక్షులను విచారించారు. దీంతోపాటు ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సైతం పరిశీలించారు. ఇంకా 700 మంది హిస్టరీ షీటర్లను ప్రశ్నించారు. ఈ విషయమై హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటిదాకా ఎటువంటి పురోగతీ లేదని అంగీకరించారు. అయితే దర్యాప్తులో ఎటువంటి లొసుగులు లేవన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ సరైన దిశలోనే కొనసాగుతోందన్నారు. కాగా నరేంద్ర హత్యకు గురైన వెంటనే నగర పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను మీడియాకు విడుదల చేసిన సంగతి విదితమే. అనేకమంది అనుమానితులను ప్రశ్నించారు. అయినప్పటికీ నిర్దిష్ట ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారు. కాగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దభోల్కర్‌ను ఆగస్టు 20వ తేదీ తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి వస్తున్న సమయంలో ఆయన ఇంటికి సమీపంలోనే ఉదయం గం.7.30 ని.లకు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. నరేంద్ర హంతకుల ఆచూకీ తెలియజేసినవారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ అప్పట్లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖకు బాగా ఉపయోగపడింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక నేరాల్లో పాలుపంచుకున్న నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు. -
సచిన్ చివరి మ్యాచ్ కు ప్రముఖుల సందడి
కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న సచిన్ ను చూసేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున్న వాంఖెడే స్టేడియానికి వచ్చారు. చివరి మ్యాచ్ లో సచిన్ ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్, అజిత్ వాడేకర్, హృతిక్ రోషన్, పూనమ్ పాండే, వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడి, శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. సెక్సీ స్టార్ పూనమ్ పాండే తన చేతిపై సచిన్ టాటూ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
చట్టపరమైన అవకాశాల్ని పరిశీలిస్తాం : సీఎం
ముంబై: బాధిత కుటుంబాలపట్ల తమ ప్రభుత్వం ఎంతో సానుభూతితో ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సదరు కుటుంబాలకు న్యాయం జరిగేవిధంగా చేసేందుకు చట్టపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగినందువల్లనే సుప్రీం కోర్టు గతంలో కూల్చివేత ఆదేశాలిచ్చిందన్నారు. కూల్చివేయమనడం దారుణమని, ఇటువంటి అనుమతి లేని నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి తాము ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదంటూ ఆదేశించిందన్నారు. క్యాంపాకోలా వాసులకు కొంత ఊరట లభించిందన్నారు. అటార్నీ జనరల్ వాహనవతితోపాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) న్యాయవాది ఈ విషయంలో తమకు సహకరిస్తారన్నారు. దీంతోపాటు పట్టణాభివృద్ధి శాఖ కూడా సహకరిస్తుందన్నారు. -
వివాదాలు, విజయాలు
సాక్షి, ముంబై: కేంద్ర కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. మిస్టర్క్లీన్గా పేరు న్న ఈ నాయకుడి పాలనకు సోమవారంతో మూడే ళ్లు పూర్తికానున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణంలో చిక్కుకుపోవడంతో ఆయనను తప్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ ఆదేశాలతో పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ అవకాశం ద క్కింది. ఇక్కడి రాజకీయాలను చవాన్ తట్టుకోలేరని, తిరిగి ఢిల్లీ వెళ్తారని వాదనలు విని పించినా ఆయన తన పాలనను కొనసాగిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అనేక కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు. ఎన్నో విషయాల్లో ప్రతిపక్షాలు, మిత్రపక్షమైన ఎన్సీపీ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. బిల్డర్ల అక్రమా లు, జలవనరుల కుంభకోణం, రైతుల ఆత్మహత్య లు, చక్కెర పరిశ్రమల కుంభకోణం తదితర ఆరోపణలతో చవాన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా ఆయనకు మద్దతు పెద్దగా లభించలేదు. ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తూ మూడేళ్ల పదవి కాలాన్ని ఆయన పూర్తి చేశారు. రాబోయే లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. ఎన్సీపీకి చురకలు... వారసత్వ రాజకీయాలను నిర్మూలిస్తామని చెప్పిన ఎన్సీపీ, లక్ష్యసాధనలో విఫలమయింది. ఈ విషయంలో దానిని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. మా కూటమి అధికారంలోకి వచ్చినా, దాని వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రెండు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులుగా మారడం నిజమే. ఎన్సీపీ వ్యవహారాలు గందరగోళంగా మారాయి. అయినా దానిని మా పార్టీలో విలీనం చేయాలని నేను కోరుకోవడం లేదు. అప్పట్లో చాలా మంది నాయకులు (ఎన్సీపీని ఉద్దేశించి) వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. ఇప్పుడు వారి వారసులే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనేది బిహ రంగ రహస్యం. పాలనలో జాప్యంపైనా ఆయన స్పందిం చారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. యశ్వంత్రావ్ చవాన్, వసంత్‌రావ్ నాయ క్ హయాంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం గా ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీల ఆలోచనలు ఒకటే. కానీ గ్రామపంచాయతీ మొదలుకొని సాధారణ ఎన్నికల్లోనూ ఇవి పరస్పరం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం... ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికే అగ్రప్రాధాన్యం. నియమాల ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండే నాకు ముఖ్యం. స్వార్థప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తాను. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి అవసరమైన పనుల్లో జాప్యాన్ని నివారిస్తాం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగను. అసెంబ్లీ ఎన్నికల్లోనే.... రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని కోరుకుంటున్నా. మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లోకి వె ళ్లనున్నారా లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పైసమాధానం చెప్పారు. కరాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించాను. అయితే 1999 లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రజల కోసం ఎంతో చేసినా, పరాజయం పాలవడం కొంత బాధ కలిగించింది. మా అధ్యక్షురాలు సోనియాగాంధీ నన్ను రాజ్యసభకు పంపించింది. అనంతరం కరాడ్తోపాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో కొంత దూరం పెరిగింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక ఆ దూరాన్ని తగ్గిం చుకున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నా నేతృత్వంలోనే జరుగుతాయి. -
ఆమోదయోగ్యంగా ప్యాకేజీ
సాక్షి, ముంబై: నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నిరాశ్రయులవుతున్నవారికి పరిహారంగా ఇచ్చే ప్యాకేజీ వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని సీఎం పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. నవీముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చవాన్ విమానాశ్రయ నిర్మాణ పనుల విషయమై మాట్లాడారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటవుతుండడంతో పది గ్రామాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, అయితే వారు కోల్పోయిన స్థలాలకంటే ఎక్కువ స్థలాన్ని మరో చోట ఇస్తామన్నారు. నగదు పరిహారం కూడా వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని చవాన్ చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల నుంచి అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. దీంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుందన్నారు. నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు నవంబరు 13వ తేదీన ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని చవాన్ చెప్పారు. ప్రతిపాదిత నవీముంైబె విమానాశ్రయం, వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు, శివ్డీ-నవాశేవా సీ లింకు తదితర కీలక ప్రాజెక్టుల కారణంగా ముంబైలోని ఆర్థిక కేంద్రాలన్నీ నవీముంబైకి స్థలాంతరం అవుతాయని, దీంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రాజధానిగా నవీముంబైకి గుర్తింపు దక్కుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆర్థిక, వ్యాపార కేంద్రాలన్నీ నవీముంబైకి తరలిపోవడంవల్ల ముంబైలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టులన్ని కార్యరూపం దాలిస్తే నవీముంబైలోని ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణంతో నవీముంబై మెట్రోపాలిటన్ సిటీగా అవతరిస్తుందన్నారు. -
గాంధీ నిర్ణయం తప్పా?
ముంబై: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి మొదటి ప్రధాన మంత్రి కావాల్సిందని మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ తప్పుబట్టారు. నెహ్రూను ప్రధానిగా మహాత్మా గాంధీ ఎంపిక చేశారని, నెహ్రూ ప్రధాని కావడం సరికాదంటే మహాత్ముడి నిర్ణయం తప్పా? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మరోసారి చరిత్రను విశ్లేషించుకోవాలన్నారు. శుక్రవారం తన నివాసమైన వర్షభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మహాత్ముడు సరైన నిర్ణయమే తీసుకున్నారని, తప్పుగా భావించేవారు చరిత్రను మరోసారి విశ్లేషించుకోవాలన్నారు. ఇక ఎన్సీపీ ప్రతినిధి త్రిపాఠీ మూడో కూటమి సభకు హాజరు కావడంపై స్పందిస్తూ ఎవరికైనా లౌకికవాదానికి అనుకూలంగా పోరాడే స్వేచ్ఛ ఉందన్నారు. -
తనకు మాలిన ధర్మం
ముంబై : నగరంలో ఘాటెక్కిస్తున్న ఉల్లిధరను నియంత్రించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించని ముఖ్యమంత్రి చవాన్, ఢిల్లీలో ఉల్లిధరలను తగ్గించేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 లు పలుకుతోంది. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం నామమాత్ర ప్రయత్నం కూడా చేయడంలేదు కానీ ఢిల్లీలో వాటి ధర తగ్గుముఖం పట్టించేందుకు నాసిక్ నుంచి నేరుగా ఉల్లిని కొనుగోలు చేయాలని స్వయానా అక్కడి సీఎం షీలాకి ఫోన్ చేసి మరీ కోరడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తనకు మాలిన ధర్మం చేస్తున్న సీఎం చవాన్ రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఢిల్లీ సర్కార్‌కి కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని నాసిక్ నుంచి కొనుగోలు చేసి అక్కడికి రవాణా చేసేందుకు కొన్ని రోజుల క్రితం ఒక బృందాన్ని పంపించమని అక్కడి సీఎం షీలా దీక్షిత్‌ను కోరానని శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. దీనివల్ల అక్కడి మార్కెట్లలో ఉల్లి కొంత మేర తగ్గి రూ.50లకు కేజీ లభించే అవకాశముంటుందని తెలిపారు. ఇప్పటికే షీలా సర్కార్ ముగ్గురు అధికారులను నాసిక్ పంపిందన్నారు. నాసిక్ మార్కెట్లలో ఉల్లిగడ్డ ధరలు నాణ్యతను బట్టి కేజీకి రూ.38 నుంచి 55 మధ్య పలుకుతోందన్నారు. అత్యవసర చర్యల కింద మార్కెట్ నుంచి ఉల్లిని నేరుగా కొనుగోలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించిందన్నారు. 12 నుంచి 13 టన్నుల ఉల్లిని ఢిల్లీకి రవాణా చేసేందుకు ట్రక్కుకు అయ్యే ఖర్చు రూ.12వేలు ఉంటుందన్నారు. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో ఉల్లి కేజీని రే.50లకు విక్రయించొచ్చని తెలిపారు. ఉల్లిగడ్డ నిల్వదారులపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవాలన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రాష్ట్రంలో ఉల్లి నిల్వలు ఎక్కడా లేవని తెలిపారు. ఇప్పటికే కూరగాయాలను అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారులపై రాష్ట్ర సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. నవంబర్ ఒకటిన భారీ స్థాయిలో ఉల్లి పంట మార్కెట్లకు వచ్చే అవకాశముందని తెలిపారు. వీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తామన్నారు. -
వారానికి ఐదు రోజులే విధులు
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను తగ్గించేందుకు పరిపాలన విభాగం సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహించేలా రూపొందించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కార్యాలయానికి పంపింది. అయితే ఒక్క రోజు పనిదినాన్ని తగ్గించి ఐదు రోజుల పనిదినాలలో ఒక గంట ఎక్కువ పనిచేసేలా సర్దుబాటును చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం రెండో, నాలుగో శనివారం సెలవు ఉంది. మొదటి, మూడో, ఆ నెలలో ఐదో శనివారం వస్తే కార్యాలయాలు తెరిచే ఉంటాయి. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులతో జీవనం సాగించే ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ఉండాలని కొన్ని సంవత్సరాలుగా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారానికి రెండు రోజులు కార్యాలయానికి సెలవు ఉంటే ఇంధనం, విద్యుత్, నీరు, అధికారుల పర్యటన కోసం వాహనాలకయ్యే ఖర్చులు ఇలా అనేక రకాల పొదుపు ఉంటాయని పేర్కొన్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయని అన్నారు సదరు ప్రతిపాదన ముఖ్యమంత్రి చవాన్‌కు పంపించినట్లు సామాన్య పరిపాలన విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎస్.మీనా అంగీకరించారు. అయితే అంతకుముందు 1986, 87లో ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేశారు. అపుడు అదనంగా గంట పనిచేయాలనే నిబంధన విధించారు. తర్వాత వారానికి ఆరు రోజులు పని దినాలు చేసినప్పటికీ అదనంగా పెంచిన గంట మాత్రం తగ్గించలేదు. ఆ నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు ఇప్పటికీ ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రూపొందించిన ప్రతిపాదనలో వారానికి ఐదు రోజుల పనిదినాలు చేయాలంటే రోజుకు అదనంగా ఒక గంట పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటలు కార్యాలయాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించిన తరువాత మంజూరు కోసం కేబినెట్ ముందుకు రానుంది. బహుశా ఈ ప్రతిపాదనను 2014 జనవరి నుంచి అమలుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది దూర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే ఉద్యోగులకు ఊరట కలిగించనుంది. కనీసం వారానికి రెండు రోజులు కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుకలగనుంది. నగరంలో ఇళ్ల ధరలు చుక్కలను తాకడంతో సామాన్య ఉద్యోగులు అత్యధిక శాతం శివారు ప్రాంతాలకు తరలిపోయారు. వారు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగించాలంటే రోజు కనీసం నాలుగైదు గంటలు వృథా అవుతోంది. పైగా ట్రాఫిక్ జాంలో సమయానికి కార్యాలయానికి చేరుకోవడం ఉద్యోగులకు ఒక అగ్నిపరీక్షగా మారింది. కానీ కొత్త ప్రతిపాదన అమలైతే పనివేళల్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 9.50 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉదయం 9.20 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఎంత ఆలస్యంగా వస్తే అంత ఎక్కువ సేపు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అత్యవసరం కోసం నెలకు కేవలం గంట మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు మినహాయింపు ఇవ్వనున్నారు. -
మంత్రుల విమానయాన చార్జీలు రూ. 6 కోట్లు
ముంబై: దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర మంత్రులకు అదేమీ పట్టినట్టు కనిపించడం లేదు. గడచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు రూ. 6.28 కోట్లను విమానచార్జీల కింద ప్రభుత్వ నిధులను వెచ్చించారు. దీంతో నిరాడ ంబరంగా ఉండాలంటూ కేంద్రం వీరికి గౌరవపూర్వక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం సంగతి ఏవిధంగా ఉన్నా ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలంటూ యాధృచ్ఛికంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను ఆదేశించడం గమనార్హం. అనేక పర్యాయాలు విమానయానం మంత్రుల జాబితాలో పతంగ్‌రావ్ కదమ్ ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో పతంగ్‌రావ్ విమానబిల్లు రూ. 43 లక్షలు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటిదాకా అయిన బిల్లు మొత్తం రూ. 6.32 లక్షలు. ఇక ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ బిల్లు 10.23, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బిల్లు రూ. 14.35, ఛగన్ భుజ్‌బల్ బిల్లు రూ. 18. రాజేంద్ర ములక్ రూ. 19.29, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ బిల్లు రూ. 1.46 లక్షలు. ప్రముఖ సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా పే అండ్ ఎకౌంట్స్ విభాగం ఈ వివరాలను అందజేసింది. ఇవన్నీ 2009, నవంబర్ నుంచి 2013, జనవరి మధ్యకాలంలో చేసిన విమాన ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల వివరాలు. -
కుంభమేళాకు ముమ్మర ఏర్పాట్లు
ముంబై : నగరానికి ఉత్తరాన ఉన్న నాసిక్-త్రయంబకేశ్వర్ పట్టణాల్లో 2015లో జరిగే కుంభమేళాకు సుమారు కోటి మంది హాజరు కావచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. ఆ మేరకు కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తోంది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళా సందర్భంగా ‘సాహీ స్నాన్’కు హాజరయ్యే యాత్రికులకు అవసరమైన భోజన, నివాస వసతులు, మరుగుదొడ్లు, రోడ్లు, రవాణా సదుపాయాలు, బ్రిడ్జీలు వంటి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించాం. దీనికోసం రూ.2,380 కోట్ల అంచనా బడ్జెట్‌ను ఆమోదించాం. మేళాకు హాజరయ్యే సుమారు రెండు లక్షల మంది సాధు సంతుల వసతి నిమిత్తం ‘సాధుగ్రామ్’ నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని నిర్ణయించామ’ని తెలిపారు. దీని కోసం తగినన్ని కేంద్ర నిధుల సమీకరణకు శనివారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి కోరనున్నట్లు చవాన్ తెలిపారు. 2015లో కుంభమేళా జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుగుతుంది. ఆగస్టు 29 , సెప్టెంబర్ 13, 18 తేదీల్లో సాహీ స్నానాలను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి మన దేశంలో నాసిక్, త్రయంబకేశ్వర్ సహా ఉజ్జయిన్, అలహాబాద్, హరిద్వార్‌లలో కుంభమేళాను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 2003లో జరిగిన కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 60 లక్షలమంది హాజరయ్యారు. ఈ మేళా సమయంలో గోదావరి నదిపై రామ్‌కుంద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మహామేళాకు తగిన ఏర్పాట్లు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖలు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి.‘సాధారణంగా కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులు, తర్వాత దగ్గరలోనున్న షిర్డీ, శని-సింగణాపూర్, భీమశంకర్ వంటి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన రక్షణ ఏర్పాట్లతోపాటు మిగతా సదుపాయాలను కూడా సమకూరుస్తున్నాం..’ అని రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు.కుంభమేళా ప్రారంభ సమయానికి నాసిక్, సమీప ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర టూరిజం, ప్రజాపనుల శాఖ మంత్రి చగన్ భుజ్‌బల్ వివరించారు. -
విదర్భను అభివృద్ధి చేస్తాం
అమరావతి: విదర్భ, మరాఠ్వాడాలో వెనుకబాటుతనాన్ని తొలగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం డాక్టర్ విజయ్ కేల్కర్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేల్కర్ అందజేయబోయే నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్యలు నిర్వహించి, దాని సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరాఠ్వాడా, విదర్భలో ప్రస్తుత వెనుకబాటుతనాన్ని కేల్కర్ కమిటీ మదింపు చేసి నివేదిక అందజేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వసంత్‌రావ్ నాయక్ శతజయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన, సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పైవిషయం తెలిపారు. కేల్కర్ నివేదిక నెల రోజుల్లోపు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. అయితే చవాన్ మాట్లాడడం ప్రారంభించగానే సభలోనే ఉన్న విదర్భ ఉద్యమ కార్యకర్తలు పలువురు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మావల సంఘటన అధ్యక్షుడు బాలాసాహెచ్ కొరాటే విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి వివరించి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు. విదర్భలో పారిశ్రామిక అభివృద్ధి కొరవడడంపైనా చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పారిశ్రామిక విధానంలో ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. విదర్భ వ్యవసాయ అభివృద్ధికి తగిన నీటిపారుదల వ్యవస్థను నిర్మించాల్సి ఉందన్నారు. చెరకు రైతులు భారీగా నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కాబట్టి వాళ్లు బిందుసేద్య విధానాన్ని అనుసరించాలని కోరారు. ‘ప్రత్యేక’మైతే ఆత్మహత్యలుండవు నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో నాగపూర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అశిష్ దేశ్‌ముఖ్ ప్రారంభించిన ఐదురోజుల పాదయాత్ర బుధవారానికి సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకోనుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు కుటీర్ ఆశ్రమం వద్ద ఇది ముగియనుంది. అశిష్ దేశ్‌ముఖ్ వెంట వేలాది మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. సేవాగ్రామ్ ఆశ్రమానికి చేరుకునేందుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ పాదయాత్ర ఉంది. ఈ సందర్భంగా అశిష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడతాయన్నారు. పంటలు పండక అప్పుల పాలైన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన పనిచేస్తుందన్నారు. విదర్భ ప్రాంతంలో జరిగే వేలాది ఆత్మహత్యలు మహారాష్ట్రకు అపకీర్తిని తేవడమే కాకుండా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది మనకు స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. విదర్భ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అభివృద్ధిబాట పడుతుందన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగానికి చెందిన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంటుందని వివరించారు. ఈ ప్రాంతం వెనుకబాటుతనం వల్ల నక్సలిజం పెరుగుతోందని, అయితే రాష్ట్ర సర్కార్ దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూపెడుతుందన్నారు. ప్రాంతీయస్థాయిలో ప్రథమ ప్రాధాన్యతగా ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సమర్థవంతంగా నక్సలిజాన్ని ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని 75 శాతం మంది గ్రామీణులు వ్యవసాయంపై ఆధారపడే బతుకుతున్నారని తెలిపారు. 55 లక్షల హెక్టార్ల భూమి ఉండగా 10 లక్షల హెక్టార్లలో మాత్రమే కొద్దిగా వ్యవసాయం సాగుతోంది. వర్షంపైనే ఆధారపడే రైతులు మాత్రం అన్ని విధాలా నష్టపోతున్నారని చెప్పారు. ఏటా ఒక పంటను మాత్రమే పండించగలుగుతున్నారని తెలిపారు. గత 53 ఏళ్ల నుంచి నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. పత్తి, నారింజ, వరి, సోయాబిన్ ప్రధాన పంటలుగా ఉన్నా వాటి వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని వాపోయారు. ఇక్కడ పంటల నాణ్యత, మార్కెటింగ్, గిడ్డంగులు అభివృద్ధిపై సర్కార్ సరిగా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం చొరవ తీసుకుంటున్న యూపీఏ ప్రత్యే విదర్భ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అశీష్ డిమాండ్ చేశారు. -
ముంబై భవనం కూలిన ఘటనలో బీఎంసీ అధికారులు అరెస్ట్
ముంబై నగరంలో మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 33 ఏళ్ల క్రితం కట్టిన ఆ భవనం శిథిలావస్థలో ఉందని, నివాసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించి ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించాలని ఇటీవల తనిఖీలకు వెళ్లిన బీఎంసీ అధికారులు ఆ భవన యజమానిని ఆదేశించించారు. అయితే యజమాని బీఎంసీ అధికారుల ఆదేశాలను భేఖాతరు చేశాడు. అదికాక భవన కింద సెల్లార్లో ఓ సంస్థకు యజమాని అద్దెకు ఇచ్చాడు. దాంతో సెల్లారులో మరమత్తులు నిర్వహించాడు. ప్రమాదం జరిగేందుకు అవి కూడా కారణమని మున్సిఫల్ అధికారులు భావిస్తున్నారు. అయితే భవనం కూలడానికి బీఎంసీ అధికారుల ఉదాసీనతే కారణమని ప్రభుత్వం భావించింది. దాంతో ముగ్గురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పరిహారాన్ని మహారాష్ట్ర సీఎం పృద్దీరాజ్ చవాన్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఒకొక్క మృతుని కుటుంబానికి రూ.2 ఇస్తున్నట్లు ముంబై నగర మేయర్ సునీల్ ప్రభు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో మరిన్ని ప్రజారోగ్య కేంద్రాలు
పింప్రి, న్యూస్‌లైన్: ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో మరో 1,500 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. పుణేలో రూబీ హాల్ ఆస్పత్రి మరో శాఖను గురువారం వాన్వాడి ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించేందుకు లక్ష రూపాయల సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్నవారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ‘వీరికి రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ద్వారా వైద్యసేవలు అంది స్తామన్నారు. ‘‘ఈ సంక్షేమ పథకం వలన రాష్ట్రంలో 95 శాతం ప్రజలు లబ్ధి పొందుతారు. లక్ష నుంచి లక్షన్నర రూపాయల ఖర్చయ్యే గుండె, క్యాన్సర్ శస్త్ర చికిత్సల ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నాం. గుండెపోటు, ప్రమాదాల వంటివి సంభవించినప్పుడు రోగులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీటిని ఉపయోగిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందక మృత్యువాతపడుతున్న ఘటనలు ఉంటున్నాయి. అవసరమైన చోటికి వెనువెంటనే రక్తాన్ని తరలించడానికి మోటార్ సైకిల్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాము’’ అని ఆయన ప్రకటించారు. ఎక్స్‌రే-సీటీస్కాన్, ఎం.ఆర్.ఐ. లాంటి పరీక్షలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో తక్కువ ధరలకే ప్రజలకు అందించే మరో కొత్త పథకం ముఖ్యమంత్రి ప్రకటించారు. క్యాన్సర్ రోగుల కోసం ముంబైలో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని టాటా క్యాన్సర్ సెంటర్‌కు చెందిన ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చవాన్ తెలిపారు. ఈ క్యాన్సర్ చికిత్స కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించనుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి డాక్టర్ పతంగ్‌రావ్ కదమ్, రూబీ హాల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పర్వేజ్ గ్రేట్, వ్యాపారవేత్త సంజీవ్ బజాజ్, పీఎంపీ డెరైక్టర్ ప్రశాంత్ జగతాప్, కార్పొరేటర్ నందా లోన్కర్, సీఐవో బోమి బోట్ ఇతరులు హాజరయ్యారు. -
ముందుకు కదలని నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్ట్
సాక్షి, ముంబై: నవీముంబైలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముందుకు కదిలేలాలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నతస్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేశాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు హాజరు కావల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంవల్ల ఎటూ తేలలేదు. దీంతో ఎంతోకాలంగా పెండింగులో ఉండిపోయిన ప్రతిపాదిత విమానాశ్రయం పనులు మరింత జాప్యం జరిగే అవకాశం ఏర్పడింది. 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మించాలనే అంశం తెరమీదకు వచ్చింది. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.నాలుగు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడది తడిసి మోపెడైంది. దాదాపు వ్యయం నాలుగు రెట్లు పెరిగిపోయింది. అంటే రూ.15 వేల కోట్లకుపైగా చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) 4,500 ఎకరాల స్థలం కావాలని సర్కార్‌ను డిమాండ్ చేసింది. అయితే స్థలం కోల్పోతున్న రైతులు నష్టపరిహారంగా అదనంగా 20 శాతం మంచి భూమి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకారం రైతులకు స్థలం అందజేయాలంటే 290 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అప్పుడే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశం ఆకస్మాత్తుగా రద్దు కావడంతో మరింత జాప్యానికి దారి తీసింది. ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ స్థలంపై రైతులు చేస్తున్న డిమాండ్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచే విధంగా ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంటున్నారు. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించే విషయమై ఈ నెల 20న రైతులతో చవాన్ చర్చలు జరిపారు. అయినా సఫలం కాలేదు. కాగా, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చుట్టుపక్క గ్రామస్తులు, రైతులు తమ స్థలాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో ఇప్పుడు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలంటే రైతులు చేస్తున్న డిమాండ్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఉంది. -
అమరవీరులకు నివాళి
నాందేడ్, న్యూస్‌లైన్: నాందేడ్‌లో మంగళవారం 65వ ‘మరాఠ్వాడా ముక్తిసంగ్రామ్ దివస్’ను పురస్కరించుకొని నాందేడ్-వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్వీఎంసీ) ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ అబ్దుల్ సత్తార్ ఉదయం 8.05 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాపరిషత్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్, డిప్యూటీ మేయర్ ఆనంద్ చవాన్, స్థాయి సమితి సభాపతి గణపత్ ధబాలే, సభాగృహ నేత వీరేంద్రసింగ్ గాడీవాలే, మహిళా-శిశు సంక్షేమ సమితి సభాపతి డాక్టర్ శీలా కదమ్, కార్పొరేటర్ రామ్‌నారాయణ్ కాబరా తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. -
చవాన్‌తో రాజన్ భేటీ
ముంబై: రిజర్వుబ్యాంకు నూతన గవర్నర్ రఘురామ్ రాజన్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థ అభివృద్ధికి బ్యాంకుల నుంచి సాయం అందేలా చూడాల్సిందిగా సీఎం ఆర్బీఐ అధిపతిని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆర్థికమాంద్యం ఫలితంగా సహకార వ్యవస్థ నీరసించిందని, బ్యాంకులు సాయమందిస్తే గ్రామాల్లో సూక్ష్మ,మాధ్యమికస్థాయి పరిశ్రమలు, ఉపాధి వృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. రాజన్ మర్యాదపూర్వకంగానే సీఎంతో భేటీ అయ్యారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా బ్యాంకింగ్రంగం తగిన సాయం అందిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ ఆశాభావం ప్రకటించారు. రాష్ట్రంలో కరువు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సందర్భంగా ఆయన రఘురామ్ రాజన్‌కు వివరించారు. జల వనరుల వికేంద్రకరణ, నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.