ముంబై: బీజేపీని నరేంద్ర మోడీ హైజాక్ చేశారని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. కాషాయ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పగ్గాలు ఇస్తే పార్టీ పాలన ఉండదని, అంతా వన్ మాన్ షో కనబడుతుందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. నిరంకుశ ధోరణి పాలనతో ప్రమాదకారిగా కనబడే మోడీ గురించి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికే బీజేపీని పూర్తిగా చెప్పుచేతుల్లోకి తీసుకున్న మోడీ, పార్టీ అగ్రనేతలను పక్కకుబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తాను, అమిత్ షా పర్యవేక్షణలోనే పార్టీ నడవాలనే ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
పార్టీలోనే ప్రమాదకారిగా వ్యవహరిస్తున్న మోడీ, రేపొద్దున ప్రభుత్వ పాలన చేస్తే మోనార్క్ ముద్ర స్పష్టంగా కనబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో నిరంకుశంగా వ్యవహరించడంతో పాటు వ్యక్తిగత పనులకు పోలీ సు విభాగాన్ని వాడుకున్న మోడీని ఎన్నుకోవద్దని దేశ ప్రజలకు చవాన్ పిలుపునిచ్చారు. గుజరాత్ మోడల్ విధానం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎలా ప్రభావం చూపుతాయో తనకైతే అర్థం కావడం లేదన్నారు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలన ఎలా సాగిస్తుందో వాళ్లకే స్పష్టత లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని, అయితే తన పాలనలోనే అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళుతోందనే ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు.
మాధవ్‌సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలోనే గుజరాత్ వృద్ధి రేటు పెరిగిందని చవాన్ తెలిపారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందితే అభినందనలు తెలుపుతామన్నారు. అయితే దాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడానికి తాము విరుద్ధమని తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో మాదిరిగా రాష్ర్ట వృద్ధి రేటు గురించి రాజకీయ సవాళ్లు విసురుకోమని చవా న్ వివరించారు. గుజరాత్ అభివృద్ధి తప్ప మోడీ ప్రచారంలో ఇతర విషయాల గురించి మాట్లాడటం లేదన్నారు. గత పదేళ్లలో గుజరాత్ కన్నా ఎక్కువగా పదకొండుసార్లు రాష్ట్రానికి ఎఫ్‌డీఐలు వచ్చాయని వివరించారు.
వ్యవసాయ రంగంలో గుజరాత్ కొంచెం ఫర్వాలేదన్నారు. రాష్ట్రంలో వరుస ప్రకృతి వైపరీత్యాలు, కరువు తాండవించడం వల్ల వ్యవసాయ సాగులో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేకపోయామని తెలిపారు.
గుజరాత్ అభివృద్ధి అంతా తన ఒక్కడి వల్లే సాధ్యమైందం టూ మోడీ కలరింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని, అదంతా ప్రతి ఒక్క గుజరాతీయుడిదని చెప్పారు. కాంగ్రెస్ సాధించిన అభివృద్ధి ప్రజ ల్లోకి వెళ్లకుండా ఇతర విషయాలను లేవనెత్తుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని చవాన్ మండిపడ్డారు.
రాహుల్ ప్రజాదరణ నేత
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని సీఎం చవాన్ తెలిపారు. ‘ఇప్పటికే అనేక ర్యాలీల్లో రాహు ల్ పాల్గొన్నారు. మరికొన్ని ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. రాహుల్ ప్రజాదరణ నేత. ఆయన సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నార’ని ఆయన చెప్పారు. ప్రతి దేశం లో యువ నాయకత్వమే పగ్గాలు చేపడుతోందని, ఇక్కడ కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని చవాన్ ధీమా వ్యక్తం చేశా రు.
కాగా, ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే సమస్యలను తెలుసుకోవడంతో పాటు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపై అవగాహన ఉంటుందని, ఇతర అధికారుల నుంచి కూడా సహా యం అందుతుందని చవాన్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో లేకుంటే నిర్ణయాత్మక విధానంపై అవగాహన ఉండదన్నారు. అయితే రాహుల్ ఎప్పుడు పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి కేంద్రీకరిం చారని, ఈ అనుభవం మరోలా ఉంటుందని చవాన్ అన్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మెరుగైనది అన్నది తాను చెప్పలేనని తెలిపారు. లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వంలో పొర్ట్‌ఫోలియో లేకుండానే ఇందిరా గాంధీ పనిచేసిందని, రాజీవ్ గాంధీ నేరుగా పీఎం అయ్యారని గుర్తు చేశారు.
మోడీ హైజాకర్
Published Sun, Apr 13 2014 10:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement