సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై నియమించిన విచారణ కమిషన్ వల్ల తనకు న్యాయం జరగలేదని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ప్రభుత్వ కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు.
ద్విసభ్య కమిషన్ నివేదిక సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘నివేదిక సరిగా లేదు. నాకు బాగా అన్యాయం జరిగింది. నా వాదనను ఆలకిస్తానంటూ ఇచ్చిన హామీని ఈ కమిషన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది’ అని చవాన్ తన లేఖలో రాశారని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. అభియోగం మోపాలని భావించినప్పుడు తన వాదనను వినిపించుకోవాల్సిందని ఆ లేఖద్వారా అశోక్ చవాన్... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక కారణంగా ఒకరి ప్రతిష్టకు భంగం వాటిల్లేఅవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి వాదనను వినాల్సిందన్నారు.
ప్రభుత్వం పరిశీలిస్తుంది
ఆదర్శ్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చ వాన్ రాసిన లేఖను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రాలయకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఆదర్శ్ సొసైటీలో పౌరులకు సభ్యత్వం కల్పించారని, అం దువల్ల తాను ఆ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించలేదంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పలేరని అశోక్ చెప్పలేరని ద్విసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అదనపు ఎఫ్‌ఎస్‌ఐ కేటాయింపు అమాయక చర్యగా భావించలేమంది. ఆ చర్య చట్టబద్ధమా కాదా అనే విషయంలో తమకు ఎటువంటి బాధా లేదని, అయితే ఈ నిర్ణయంద్వారా తన సన్నిహితులైన బంధువులకు ఫ్లాట్లు మంజూరయ్యేవిధంగా చేశారని, అది క్విడ్ ప్రోకోనే అవుతుందని పేర్కొంది.
‘ఆదర్శ్’పై సీఎంకు మాజీ లేఖ
Published Tue, Jan 7 2014 10:54 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
Advertisement